ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ
ఈవీఎంలను పరిశీలించిన సీఈఓ సుదర్శన్ రెడ్డి, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల గోడౌన్ ను ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసేందుకు ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి సీఈఓ సుదర్శన్ రెడ్డి చేరుకోగా, జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఈఓ.. ఇంచార్జి కలెక్టర్ తో పలు అంశాలపై చర్చించారు. అక్కడి నుంచి సీ ఈ ఓ నేరుగా సర్దాపూర్ లోని ఈవీఎం గోడౌన్, ఈవీఎంలను ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.
కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేష్ కుమార్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
