సిరిసిల్లలో ప్రజలలో అవగాహన కోసం బీజేపీ కరపత్రాల పంపిణీ

ప్రజలను తప్పుదారి పట్టించిన విధానాలపై అవగాహన

– ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంచడంలో కీలక పాత్ర పోషించాలి

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

సిరిసిల్ల పట్టణం శాంతినగర్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రజలకు పంపించిన కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారము ఘనంగా ప్రారంభించారు.
ఈ కరపత్రాల ద్వారా కాంగ్రెస్–బిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన దొంగ హామీలు, అమల్లో పెట్టని సంక్షేమ వాగ్దానాలు, ప్రజలను తప్పుదారి పట్టించిన విధానాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ
“ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందించి, ప్రజల నుండి సంతకాలు సేకరించాలని బండి సంజయ్ సూచించారన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంచడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సిరిసిల్లలో ప్రతి కార్యకర్త చురుకగా పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోడం రవి, శేఖర్, అభి రామారావు విజయ్, ప్రవీణ్, మహిళా మోర్చా నాయకురాలు కౌసల్య, లత, రేఖ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

️ ఇంటింటికీ కరపత్రాల పంపిణీ & సంతకాల సేకరణ కార్యక్రమం
ఈ రోజు బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉదయం 8:00 గంటల నుండిఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

జారీ చేసిన వారు:
దుమాల శ్రీకాంత్
పట్టణ అధ్యక్షులు,
భారతీయ జనతా పార్టీ – సిరిసిల్ల

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు.

మౌలిక వసతులు లేని పాఠశాలల పై వెంటనే చర్య తీసుకోవాలి

 

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ

 

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి)

సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న సువర్ణ అనే అమ్మాయి పై కుక్క కాటుదాడి జరిగినందున

సిరిసిల్ల జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ మరియు బిజెపి మహిళ కార్యకర్తలు మొన్నటి రోజున గురుకుల పాఠశాలను చెక్ చేయడానికి వెళ్లడం జరిగినది.

కానీ అక్కడ ఎలాంటి గురుకుల పాఠశాల పిల్లలకు సదుపాయాలు లేకుండా ఉన్నందున ప్రిన్సిపాల్ ని అడగడం జరిగినది.

ఆ పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఉండడం ఇలాంటివి జిల్లాలో ఎన్ని ఉన్నాయో, అవన్నీ గురుకుల పాఠశాలలను గుర్తించి వెంటనే కలెక్టర్ చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరిగినది.

అంతేకాకుండా ఇలాంటి సిరిసిల్ల జిల్లాలో సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు ప్రెస్ మీట్ సందర్భంగా మహిళ బీజేపీ పక్షాన కోరడం జరిగినది.

అంతేకాకుండా హాస్టల్ లోనికి రాకుండా చాలా సేపు బయట వెయిట్ చేయించడం జరిగిందని అన్నారు.

హాస్టల్ యొక్క పరిస్థితులు బాగా లేవని ఎక్కడ బయట పడుతుందో అని మమ్మల్ని లోనికి రాకుండా చేయడం ఇబ్బందికరంగా అనిపించిందని తెలిపారు.

ఒక మహిళా విలేఖరిని కూడా లోనికి రానివ్వలేదని తెలిపారు.

సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని పత్రికా ముఖంగా కలెక్టర్ కి విన్నవిస్తున్నామని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ,జిల్లా ఉపాధ్యక్షురాలు పండుగ మాధవి,జిల్లా కార్యదర్శి దుంపెన స్రవంతి, పట్టణ అధ్యక్షురాలు వేముల వైశాలి, ఎల్లారెడ్డిపేట అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, కోనరావుపేట అధ్యక్షురాలు తీగల జయశ్రీ, వేములవాడ టౌన్ అధ్యక్షురాలు వెల్డి రాధిక, ఎల్లారెడ్డిపేట సీనియర్ నాయకురాలు బర్కం సంగీత, బిజెపి మహిళా నాయకురాలు కర్నే హరీష తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version