కన్నుల పండువ గా అంజనీ పుత్ర గణ నాథుని నవరాత్రుల వేడుకలు….

కన్నుల పండువ గా అంజనీ పుత్ర గణ నాథుని నవరాత్రుల వేడుకలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

వినాయక చవితి వేడుకల సందర్భంగా జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం గా, శాంతి యుతంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని వంద ఫీట్ల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వినాకయ కుని మండపం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీసీపీ నీ అంజనీ పుత్ర ఎస్టేట్స్ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం గా విలసిల్లి శాంతి, ఐక్యత తో పండుగ లో నిర్వహించుకోవాలన్నారు. తెలంగాణ పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం గా ప్రతి పండుగ ను వేడుక గా నిర్వహించుకుని మధుర జ్ఞాపకాలుగా మలచుకోవాలన్నారు. అనంతరం అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ వంద ఫీట్ల రోడ్డు వద్ద వినాయకుని ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, వారి సహకారం, ఆశీర్వాద బలం తో సేవాకార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ విజయవంతంగా దూసుకు వెళ్తున్నామన్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను శాలువాతో సత్కరించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం, డైరెక్టర్ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మైసమ్మ గల్లీలో లడ్డును కైవసం చేసుకున్న మాజీ మండల అధ్యక్షుడు..

మైసమ్మ గల్లీలో లడ్డును కైవసం చేసుకున్న మాజీ మండల అధ్యక్షుడు

నిజాంపేట , నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామంలో మైసమ్మ గల్లీలో వినాయక నవరాత్రులలో పూజలు అందుకున్న లడ్డును మాజీ మండల అధ్యక్షుడు బక్కన గారి మంజుల లింగం గౌడ్ 5018 రూపాయలకు కైవసం చేసుకున్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రుల్లో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అలాగే నిజాంపేట మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మైసమ్మ గల్లి నిర్వాహకులు కాలనీవాసులు పాల్గొన్నారు

శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక…

శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్ సెప్టెంబర్ 5, నేటి ధాత్రి:

 

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రోజున సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షుడుగా రాయిల్ల జనార్థన్,ముఖ్య సలహాదారుడుగా గంగాధరి సురేష్, నూతన అధ్యక్షుడుగా శ్రీగద్దె సుమన్ ,ఉపాధ్యక్షులుగా కొయల్ కర్ వినోద్,తొగిటి రవితేజ, ప్రధాన కార్యదర్శి మోర శశికాంత్,కోశాధికారిగా గట్టు నవీన్ కుమార్ , సంయుక్త కార్యదర్శిలుగా దువ్వాక కృష్ణ చైతన్య,శ్రీ గద్దె శ్రావణ్ కుమార్,కార్యవర్గ సభ్యులు పారిపెల్లి శివ ప్రసాద్,కటుకం శివ కుమార్,గట్ల తరుణ్,కొరల్ కర్ ప్రవన్,కుంబలకర్ వెంకటేష్,కట్టెకొల అకిలేష్ లను ఏకగ్రీవంగా శ్రీ భవానీ సేవా సమితి సభ్యులు అందరు ఎన్నుకున్నారు.

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది..

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది
…గురు దేవో భవ ….!
… మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు

రాయికల్, సెప్టెంబర్ 5, నేటి ధాత్రి:

 

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని ఆ భవిష్యత్తు ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు.శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10 మంది ఉపాధ్యాయులను సాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించారు.భారతరత్న అవార్డు గ్రహీత,మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చి దిద్దేది గురువులేనని అలాంటి ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించడం అభినందనీయమన్నారు.ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించే పాఠాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయన్నారు.తల్లిదండ్రుల కన్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతోనే విద్యార్థులు భవిష్యత్తులో సరైన మార్గాన్ని ఎంచుకుంటారన్నారు.ఉపాధ్యాయులు గ్రామంలోని బాలబాలికలకు విద్య అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు పాటుపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొత్తపెళ్లి రంజిత్,డిసి బత్తిని భూమయ్య,కోశాధికారి బెక్కెం తిరుపతి,లయన్స్ క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్,దాసరి గంగాధర్,ఆడెపు రాంప్రసాద్,ఎర్ర సుమన్,జిల్లాల సూర్యం రెడ్డి,సాంబారు శ్రీనివాస్,ఉపాధ్యాయులు కుంభాల శ్రీనివాస్,రాపర్తి నర్సయ్య,కడకుంట్ల అభయ్ రాజ్,బెజ్జంకి హరికృష్ణ,ఆడెపు సుజాత,మచ్చ చంద్రకళ,ధ్యావన పెళ్లి సురేందర్, పుర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పత్రికా కథన రూపంలో…

రాష్ట్ర స్థాయి పత్రికా కథన రూపంలో

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..

రామాయంపేట, సెప్టెంబర్ 5 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వయికుంట వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం సందర్శించి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ నిమజ్జనం శాంతియుతంగా, సాఫీగా జరిగేలా మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా నిమజ్జనానికి వెళ్లే వినాయక విగ్రహాల ర్యాలీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, రాకపోకలు అంతరాయం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్‌కు తగు సూచనలు ఇస్తూ, సర్వయికుంట చెరువులో జరిగే నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని భద్రతా చర్యలకు సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విభాగాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశించారు.
కలెక్టర్ పర్యటనలో మండల తహసీల్దార్ రజనీకుమారి, మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సైదయ్య, మున్సిపల్ వార్డు అధికారులు, ప్రజాప్రతినిధులు సుప్రభాత రావు. తదితరులు పాల్గొన్నారు.

గణేష్ మండపాలను దర్శించిన చల్ల నారాయణ రెడ్డి…

మహాదేవపూర్ లో పలు గణేష్ మండపలను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ గారు*

** మహాదేవపూర్ సెప్టెంబర్ 5 నేటి ధాత్రి * *

 

మహాదేవపూర్ మండల కేంద్రంలోని గణేష్ నవరాత్రుల సందర్బంగా పలు గణపతి మండపాలను దర్శించుకొని,ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ అనంతరం మాట్లాడుతూ ప్రజలంతా సుఖశాంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిoచాలని,పాడి పంటలు సమృద్ధిగా పండాలని,ప్రజలందరికి గణేష్షుడు తోడై,నీడై ఉండాలని కోరడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్,మాజీ మండల అధ్యక్షులు సిరిపురం శ్రీమన్నారాయణ,మండల ప్రధాన కార్యదర్శులు బల్ల శ్రావణ్, లింగంపల్లి వంశీ, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య యాదవ్,కొక్కు శ్రీనివాస్, దాడిగేలా వెంకటేష్,కొక్కు రాకేష్ పాల్గొన్నారు

21 రకాల నైవేద్యాలతో గణపతికి పూజలు…

21 రకాల నైవేద్యాలతో గణపతికి పూజలు

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని వీర హనుమాన్ గణేష్ మండలి వద్ద గురువారం రాత్రి మహిళలు గణేశునికి పూలతో అలంకరించి 21 రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే స్వస్తిక్ ఆకారంలో దీపాలను వెలిగించి మహిళలు గణపతి దేవుని ఆశీర్వాదం పొందారు.పూజ అనంతరం మహిళలు గ్రామ ప్రజలు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని గణపతి దీవెనలు ఎల్లప్పుడూ తమపై ఉండాలని కోరారు.

మెట్పల్లిలో ప్రత్యేక వినాయక పూజ…

మెట్పల్లిలో ప్రత్యేక వినాయక పూజ

మెట్ పల్లి సెప్టెంబర్ 5 నేటి దాత్రి
మెట్ పల్లి పట్టణ బాలకిషన్ నగర్ వినాయక సొసైటీ వారి ఆధ్వర్యంలో పురోహితులు రమణ చారి వేద మంత్రాలతో వినాయక స్వామి వారికి రాత్రి ప్రత్యేక పూజలు అనంతరం 51. ప్రసాదల నైవేద్యం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ తోట ప్రవీణ్ వినాయక కమిటీ అధ్యక్షులు తోట ప్రసాద్ సాంబారు శ్రీనివాస్ చందనగిరి రమేష్ డొల్ల నాగేశ్వర్ తాడూరి యాదగిరి బోయిని ప్రవీణ్ కుమార్ పర్రి శంకర్ మహేష్ చొప్పరి శ్రీనివాస్ కోరే రమేష్ మనోహర్ శ్రీనివాస తులసీదాస్ మర్రి మహేష్ తదితరులు మహిళలు కాలనీవాసులు పాల్గొన్నారు.

లంగాణ లో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్అవుతుంది…

లంగాణ లో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్అవుతుంది

కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము

మొగులపల్లి (నేటిధాత్రి ):

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో నడిగోటి రాము మాట్లాడుతూ. తెలంగాణలో టిఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని ఆయన అన్నారు గంపగుత్తగా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గుంట నక్కల దోచుకొని దాచుకొని అవినీతి, దోపిడీ, దొంగతనాలను పిసి గోష్ కమిషన్ ద్వారా అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక లిక్కర్ రాణిని తెరపైకి తీసుకువచ్చి మళ్ళీ ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి మీ కల్వకుంట్ల కుటుంబం ద్వారా చాలా తీరని అన్యాయం జరిగింది. ఎన్నో అవినీతి అక్రమాలు ఎక్కడ చూసినా కమిషన్లు పదేళ్లు మీకు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తియడమే కాకుండా లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు. మీ కల్వకుంట్ల కుటుంబం బండారం బయట పడేసరికి వాళ్లు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారు. అని నువ్వు అనడం మరునాడు నిన్ను మీ అధినేత సస్పెండ్ చేయడం ఇదంతా సినిమా లా అనిపిస్తుంది. స్క్రిప్ట్ ముందే రాయడం జరిగింది. కేసీఆర్ కాలేశ్వరం స్కామ్ కేటీఆర్ ఫోన్ టాపింగ్, ఈ రేసింగ్ స్కామ్, కవిత ఢిల్లీ లొ లిక్కర్ స్కాం,సంతోష్ కుమార్ హరితహారం లొ స్కామ్ హరీష్ రావు దండాలు సెటిల్మెంట్ ఇరిగేషన్ అక్రమాలు ఇలా ఒక్కొక్కరు ఒక్కో స్కాం ద్వారా ఒక్కో కమిషన్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని నలుమూలల ధ్వంసం చేశారు. బిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లొ బిఆర్ఎస్ పార్టీని నామరూపల్లెకుండా చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
నేడు తెలంగాణ లొ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటుందని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజలకి సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందించడంలో నిరంతరం కృషి చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ కావాలనేయూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని గతంలో కంటే ఎక్కువ యూరియాను జిల్లలో పంపిణి చేయడం జరిగిందణి రైతులకు తప్పుడు సమాచారం ఇస్తూ యూరియా కొరత ఉందంటూ ఆరోపణలు చేయడం తప్పా బి ఆర్ ఎస్ నాయకులు చేసేదేమి లేదని ఆయన అన్నారు. జిల్లా, మండల రైతులకు కావాల్సినంతా యూరియా వస్తుందని ఎవరూ కూడా అధైర్య పడవద్దని రైతులకు నడిగోటి రాము సూచించారు

మెట్పల్లిలో లయన్స్ క్లబ్ ఉపాధ్యాయ దినోత్సవం..

మెట్పల్లిలో లయన్స్ క్లబ్ ఉపాధ్యాయ దినోత్సవం..

మెట్ పల్లి సెప్టెంబర్ 5 నేటి ధాత్రి

 

 

మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మరియు లయన్స్ పి డి జి ఎస్ ఆనంతుల శివ ప్రసాద్ మరియు హన్మాండ్ల రాజారెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని మెట్పల్లి పట్టణంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేల్ముల శ్రీనివాసరావు పిల్లలకు అల్పాహారం వితరణ, బుక్స్ పంపిణి, అనంతరం కేక్ కటింగ్ చేశారు అనంతరం ప్రభుత్వ సీనియర్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేసి మొక్కలు నాటారు .ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేల్ముల శ్రీనివాసరావు కోశాధికారి వేములవాడ చంద్రశేఖర్ ఇల్లెందుల శ్రీనివాస్ మర్రి భాస్కర్ నాంపల్లి వేణుగోపాల్ రఘుపతి రావు ఆల్ రౌండర్ గంగాధర్ లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో సీనియర్ సిటిజన్స్ గురుపూజోత్సవం…

తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ గురుపూజోత్సవం కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం కార్యక్రమం చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన డాక్టర్ జనపాల శంకరయ్య ప్రధాన కార్యదర్శి కార్యనిర్వహణలో పూర్వ ఉపాధ్యాయులు, తాత్వికవేత్త ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భముగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మార్గం విశ్వనాథం ప్రధానోపాధ్యాయులు, పూర్వ ఉపాధ్యాయుడు వికృతి ముత్తయ్య గౌడ్, పుల్లూరు మల్లేశం, బుర్ర నారాయణ గౌడ్ పూర్వకన్సలర్, కౌన్సిలర్స్ పి పద్మ శంకర్, వేణు నాగరాజు, సమక్షంలో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ జనపాల శంకరయ్య , రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ గురువు త్రిమూర్తుల స్వరూపమని పెద్ద లన్నారు అందుకే గురువు లయకారుడు సృష్టికర్త అభివృద్ధి పథకం పై నడిపించగల శక్తి,యుక్తులు ఉన్న సామాజిక బాధ్యత కలిగిన ప్రధాన మైన వ్యక్తిత్వం కలిగిన ఉన్నతత్వం కలిగిన వ్యక్తి గురువు. అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య కోశాధికారి దొంత దేవదాసు, గజవాడ కైలాసం, కార్యదర్శి గౌరిశెట్టి ఆనందం, విద్యాసాగర్, అంకారపు జ్ఞానోబా, లక్ష్మణరావు మెరుగు కిషన్ వెంకటరెడ్డి గంప శంకరయ్య, పత్తిపాక శంకరయ్య తదితర నాయకులు, సభ్యులు పాల్గొన్నారు

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ.

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ.

కల్వకుర్తి/ నేటిదాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు అధ్యక్షతన ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం, ప్రతి రోజూ పూజలు, సంస్కృతిక కార్యక్రమలు, ప్రతి రోజూ భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిలు గుండ్ల రేవంత్ రేవంత్, దాచేపల్లి నితిన్ కూమార్, కోశాధికారులు పోల గిరిబాబు, సoబు తరుణ్,ఆర్యవైశ్య మహాసభ సంఘం, అనుబంధ సంఘాలు వాసవి క్లబ్,ఆవోప సంఘల నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సుపరిపాలనే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

సుపరిపాలనే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

బిజెపి చిట్యాల మండల అధ్యక్షుడు బుర వెంకటేష్ గౌడ్.

చిట్యాల, నేటిధాత్రి ;

 

స్వతంత్రం భారతంలో వచ్చిన విప్లవాత్మక పన్ను సంస్కరణలు నిత్యావసరాలు ఆహార పదార్థాల పై పన్ను 18%,12% నుంచి 5% 0% తగ్గింపు తీసుకురావడం అనేది గొప్ప ఆశించదగ్గ విషయమని చిట్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు, అనంతరం ఆయన మాట్లాడుతూవ్యవసాయ యంత్రాలు , స్ప్రే పార్ట్స్, ఎరువుల పై 18% 12% నుంచి 5% కి తగ్గింపు*ఆరోగ్య భీమా, జీవిత భీమా ప్రీమియం పై పన్ను 18% నుండి 0% కి తగ్గింపు*దేశ ప్రజలకు దసరా దీపావళి కానుకగా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి*
ప్రధానమంత్రి మోదీ ఆగస్ట్ 15 న స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో సూచనప్రాయంగా జి ఎస్ టి సంస్కరణల గురించి మాట్లాడటం జరిగింది. కానీ ప్రజలు ఊహించిన దానికంటే తొందరగా ఊహించిన దానికంటే గొప్పగా జి ఎస్ టి పన్ను తగ్గింపులు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం అని ,ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన ఈ పన్ను తగ్గింపులు స్వతంత్ర భారతంలో వచ్చిన గొప్ప పన్ను సంస్కరణల్లో ఒకటిగా నిలబడుతుంది. గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు కూడా మధ్యతరగతి వేతన జీవులకు ఒక వరం లాంటిదనీ
ఈ పన్ను సంస్కరణల వల్ల వచ్చే 5-6 నెలలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల్లో కొంత కోత పడినా ఆ మొత్తం ప్రజలకు ఆదా అయి ఇతర అవసరాల కోసం వెచ్చించే అవకాశం ఉంటుందనీ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం తద్వారా దేశంలో తయారీ రంగాన్ని , వ్యవసాయ రంగాన్ని, నిర్మాణ రంగాలను బలపరిచే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ పన్ను సంస్కరణలు దేశ ఆర్ధిక వృద్ధికి దోహద పడతాయనడంలో సందేహం లేదనీ,ఈ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ప్రధాని మోడీ గారికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు ,ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గజనాల రవీందర్ మార్తా అశోక్ పెరుమాండ్ల రాజు అనుప మహేష్ చింతల రాజేందర్ కేంసారపుప్రభాకర్ తీగల వంశీ సేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వద్దిరాజు కుటుంబం ప్రత్యేక గణేశ్ పూజ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-61.wav?_=1

ఎంపీ వద్దిరాజు ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు
Date 05/09/2025

నేటిధాత్రి:

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగుల గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసం వద్ద వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు గణనాథుడిని ప్రతిష్ఠించి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు.నిమజ్జనానికి బయలుదేరడానికి ముందు వినాయకుడికి శుక్రవారం విజయలక్ష్మీ, నిఖిల్ చంద్రలు పూలమాల వేసి,హారతినిచ్చి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.

Vigneshwara

ఈ సందర్భంగా గంగాభవాని తన కుమారులు సౌరవ్,సనవ్ లతో కలిసి గణనాథుడికి కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు వారికి ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

 

Vigneshwara

వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు ముడ్డంగుల కృష్ణ,గగులోతు నవీన్ నాయక్,యరగాని పృథ్వీ గౌడ్,ముకుంద అనిల్ పటేల్,అనంతుల శ్రీనివాస్ గౌడ్, మల్యాల శేఖర్, నాగిరెడ్డి, ముకరా దుర్గాప్రసాద్, దండు రాజు ధూదిగామ సాత్విక్,జ్యోతి, సంతోష్ తదితరులు విజయలక్ష్మీ, గంగాభవాని, నిఖిల్ చంద్ర, స్థానిక ప్రముఖులను శాలువాలతో సత్కరించి వినాయకుడి చిత్రపటాలను బహుకరించారు.

Vigneshwara

వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు అందజేసిన విఘ్నేశ్వరుడి లడ్డూ ప్రసాదాన్ని నిఖిల్ చంద్ర భక్తిప్రపత్తులతో స్వీకరించి తలపై పెట్టుకుని తన నివాసంలోకి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు”జై గణేశ జైజై గణేశ” అంటూ నినాదాలు చేశారు.

8న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయండి..

8న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయండి.

చిట్యాల, నేటిధాత్రి ;

 

వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు మరియు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు అన్ని రకాల చేయూత పెన్షన్లు రూ 4 వేలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 8న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ చిట్యాల మండల అధ్యక్షుడు దొడ్డే శంకర్ మాదిగ అన్నారు. శుక్రవారం ఆయన చిట్యాల మండల కేంద్రంలో మాట్లాడుతూ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు పెంచి ఇస్తున్నాడు కానీ తెలంగాణలో రూ 6 వేలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం మోసం చేసింది అన్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాకు మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారులు మహాధర్నకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
పెంచిన పింఛన్లు అమలు చేసేంతవరకు ఎంతటి పోరాటానికైనా ఎమ్మార్పీఎస్ వెనుకాడదని తెలియజేశారు.

వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి…

వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే

సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

సిరిసిల్లలో శనివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే పలు శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. వినాయక మంటపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

 

వినాయక నిమజ్జన స్థలం వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు, ఇతర సౌకర్యాల విషయంలో పక్కా ప్రణాళికతో ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాలు వచ్చే, వెళ్లే దారిలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, స్టేజ్, కూర్చునేందుకు కుర్చీలు వేయించాలని, క్రేన్స్ సిద్ధంగా ఉంచాలని సూచించారు. కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేయించాలని ఆదేశించారు.ఇక్కడ సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, ఆయా శాఖల అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జనానికి ముస్తాబైన మట్టి గణపతి…

నిమజ్జనానికి ముస్తాబైన మట్టి గణపతి

ఆదర్శవంతంగా నిలిచిన మల్టీ వర్కర్ గట్టయ్య

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో మల్టీ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న జల్లంపల్లి గట్టయ్య గణేష్ నవరాత్రి లో భాగంగా తన కుమారుడితో మూడున్నర ఫీట్ల గణపతి విగ్రహం తయారు చేపించి తొమ్మిది రోజులు మట్టి గణపతికి అంగరంగ వైభవంగా పూజలు జరిపించారు.అలాగే గణపతి వద్ద అన్నదాత కార్యక్రమం నిర్వహించారు.అనేక రకాల కెమికల్స్ కలిపి తయారు చేసిన విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం వెదజల్లి పర్యావరణం కలుషితం అవుతుందని అన్నారు.మట్టి గణేష్ విగ్రహాన్ని తయారు చేసుకొని పూజలు చేయడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు.

రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ నాయకులని డిమాండ్..

రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ నాయకులని డిమాండ్

◆:- బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ అంతట కూడా నిమజ్జనం రేపు ఉండడం జరుగుతుంది. అలాగే మన జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా నిమజ్జనం రేపు ఉండడంతో, కాంగ్రెస్ నాయకులు రేపటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జ్యోతి పండాల్ కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆఫీసులో నిద్రపోకుండా ఏర్పాట్లని దగ్గరుండి సమకూర్చాలని పర్యవేక్షించాలని జ్యోతి పండాల్ సూచించడం జరిగింది.

అలాగే మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ని, మహిళా కానిస్టేబుల్స్ ని, మహిళా ఆఫీసర్స్ ని కూడా డిప్లాయ్ చేయాలని పోలీస్ శాఖ వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.

ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం వచ్చిన అమ్మాయిలని పోకిరీలు, ఆకతాయిలు వేధిస్తున్నందుకు, 7 రోజుల వ్యవధిలో 930 మందిని మఫ్టీలో షీ టీం వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ 930 మందిలో మైనర్లు, 20 సంవత్సరాలు ఉన్న అబ్బాయిలు మరియు 50 సంవత్సరాలు వయసు ఉన్న మగవాళ్ళు వేధించడం జరుగుతుందని షీ టీమ్స్ ఇన్చార్జ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 50 సంవత్సరాలు వయసు ఉన్న మగవారు కూడా అమ్మాయిలని ఏడిపిస్తున్నారంటే కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్న వాళ్లు రోజురోజుకీ పెరుగుతిన్నారని మహిళలు గమనించాలి మరియు జాగ్రత్త వహించాలి.

జ్యోతి పండాల్ తప్పు లేకుండా ఎవరిపైన నిరాధారంగా ఆధారాలు లేకుండా విమర్శించదు అన్న విషయం, జహీరాబాద్ లో ఉన్న నాయకులు గాని కాంగ్రెస్ నాయకులు గానీ తెలుసుకోవాలి. వాస్తవాలు మాట్లాడుతుంటే ఇక్కడున్న లీడర్లకి ఎందుకు బాధ అవుతుందో నాకు అర్థం అవడం లేదు. నిన్న అమ్మాయిల భద్రత కోసం మాట్లాడినందుకు లీడర్లకు జీర్ణం అవడం లేదు కానీ ఖైరతాబాద్ లో జరుగుతున్న ఈవిటీజింగ్ కేసులను చూస్తే మీకు అర్థమవుతుందని జ్యోతి పండాల్ అన్నారు.

వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి కుటుంబం..

వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి కుటుంబం

నర్సంపేట,నేటిధాత్రి:

 

గణపతి నవరాత్రుల ఉత్సవాల ముగింపు కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హన్మకొండలోని తన నివాసంలో గణనాథున్ని ప్రతిష్ఠించుకొన్న కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో నవరాత్రులు పూజలు నిర్వహించారు.శుక్రవారం నిమజ్జన కార్యక్రమం చేపట్టగా గణనాథుడికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దంపతులు వీడ్కోలు పలికారు.కాగా ఎమ్మెల్యే దొంతి కుమార్తె అనన్యరెడ్డి హన్మకొండ పద్మాక్షమ్మగుట్ట వద్ద ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు నర్సంపేట నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని వేడుకున్నట్లు తెలిపారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు…

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండి

* సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి

చేవెళ్ల, నేటిధాత్రి:

 

ఈనెల 11 నుండి 17 వరకు జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి అధ్యక్షతన సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుండి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగిన సాయిధ రైతాంగం తిరుగుబాటు చేశారని అన్నారు. ఈ పోరాటంలో దాదాపు 4500 మంది తెలంగాణ రైతులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఈ పోరాటం ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రంలోని భూస్వామ్య వ్యవస్థకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిందని తెలిపారు. నిజాం పాలనను అంతం చేసి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి ఈ పోరాటం దారితీసిందని, భూస్వాముల దోపిడీని నిలిపి రైతుల హక్కుల పరిరక్షణకు ఈ పోరాటం ఎంతో స్ఫూర్తినిచ్చిందనిఅన్నారు. ఈ స్ఫూర్తితోనే ఈనెల 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటవారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాదులోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ముగింపు సభ ఉంటుందని ఈ సభకు పార్టీ శ్రేణులు గ్రామ కార్యదర్శులు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సత్యనారాయణ, ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బుల్, ఎన్ ఎఫ్ ఐ డబ్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version