దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది
…గురు దేవో భవ ….!
… మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు
రాయికల్, సెప్టెంబర్ 5, నేటి ధాత్రి:
దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని ఆ భవిష్యత్తు ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు.శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10 మంది ఉపాధ్యాయులను సాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించారు.భారతరత్న అవార్డు గ్రహీత,మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చి దిద్దేది గురువులేనని అలాంటి ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించడం అభినందనీయమన్నారు.ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించే పాఠాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయన్నారు.తల్లిదండ్రుల కన్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతోనే విద్యార్థులు భవిష్యత్తులో సరైన మార్గాన్ని ఎంచుకుంటారన్నారు.ఉపాధ్యాయులు గ్రామంలోని బాలబాలికలకు విద్య అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు పాటుపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొత్తపెళ్లి రంజిత్,డిసి బత్తిని భూమయ్య,కోశాధికారి బెక్కెం తిరుపతి,లయన్స్ క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్,దాసరి గంగాధర్,ఆడెపు రాంప్రసాద్,ఎర్ర సుమన్,జిల్లాల సూర్యం రెడ్డి,సాంబారు శ్రీనివాస్,ఉపాధ్యాయులు కుంభాల శ్రీనివాస్,రాపర్తి నర్సయ్య,కడకుంట్ల అభయ్ రాజ్,బెజ్జంకి హరికృష్ణ,ఆడెపు సుజాత,మచ్చ చంద్రకళ,ధ్యావన పెళ్లి సురేందర్, పుర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు.