న్యాల్కల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ, క్రీడల్లో సత్తా చాటారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహిరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల కేంద్రంలో జరిగిన మండల స్థాయి అండర్ 14, 17 క్రీడల్లో న్యాల్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వాలీబాల్ సీనియర్స్ విభాగంలో బాలుర, బాలికల జట్లు ప్రథమ బహుమతిని గెలుచుకున్నాయి. జూనియర్ కోకోలో కూడా పాఠశాల ప్రథమ స్థానం సాధించింది. సీనియర్ కోకో, కబడ్డీ పోటీల్లో ద్వితీయ బహుమతులు దక్కించుకున్నారు. ఈ విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.
నిరుపేదలకు రానన్న దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలి
◆:- జాగో తెలంగాణ ప్రధాన కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ అంటేనే తెలంగాణ పండుగ అంతటి ప్రాధాన్యత ఉన్న పండుగకు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ నిరుపేద ప్రజలకు కెసిఆర్ గారి మంచి ఆలోచనతో తెలంగాణలో దసరా పండుగ అందరు జరుపుకోవాలని ప్రజలు ఆనందంగా సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతున్న బతుకమ్మ చీరలు బందు చేశారు నిరుపేద తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారికి బియ్యంతో పాటు పప్పు ధాన్యాలు మంచి నూనె సబ్బులు సరఫరా చేయాలి రాష్ట్రంలో నిరుపేద ప్రజలు లక్షలాదిగా ఉన్నారు అందరూ ఉన్నవాళ్లే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వము అని గొప్పలు చెప్పుకోవడం కాదు పేదలకు కడుపునిండా అన్నం పెట్టడం వారికి దసరా పండుగ జరుపుకోవడానికి అన్ని సదుపాయాలు చేయడం అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రజలు నిర్ణయిస్తారు జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములు నేత మొహమ్మద్ ఇమ్రాన్ ప్రధాన కార్యవర్గ సభ్యులు, మరియు, మాదినం శివప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్యార్ల దశరథ్ జహీరాబాద్ కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేయడం జరిగింది,
న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్ గ్రామా మాజి సర్పంచ్ వీర్శెట్టి పాటిల్ మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు వారి నివాసానికి చేరుకుని నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు అండగా ఉంటామని మనోధైర్యని కలగజేశారు ఎమ్మెల్యే గారితో పాటుగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి ,మాజి సర్పంచ్ మాజి ఎంపీటీసీలు చంద్రన్న పటేల్, వెంకట్ శశి వర్ధన్ రెడ్డి,నాగన్న సయీద్ ఆనంద్ తదితరులు ఉన్నారు.
ఉపాధ్యాయులకు సన్మానించిన సిద్దు పటేల్ మరియు చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
మేదపల్లి పాఠశాలలో ఎస్ఎంసి చైర్మన్ లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సిద్దు పటేల్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయుల బృందానికి శాలువా పూలమాలలతో సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామపెద్దలు అభిలాష్ రెడ్డి గాలయ్య డాక్టర్ శ్రీకాంత్ నాగరాజు పటేల్ రఫిక్ పటేల్ హరి వంశీ మజర్ బంటు శేఖర్ బంటు శ్రీనివాస్ సంగమేశ్వర్ పాటిల్ వీరన్న మరియు ఇట్టి కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు,
ఉపాధ్యాయులకు సన్మానించిన సిద్దు పటేల్ మరియు చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
మేదపల్లి పాఠశాలలో ఎస్ఎంసి చైర్మన్ లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సిద్దు పటేల్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయుల బృందానికి శాలువా పూలమాలలతో సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామపెద్దలు అభిలాష్ రెడ్డి గాలయ్య డాక్టర్ శ్రీకాంత్ నాగరాజు పటేల్ రఫిక్ పటేల్
హరి వంశీ మజర్ బంటు శేఖర్ బంటు శ్రీనివాస్ సంగమేశ్వర్ పాటిల్ వీరన్న మరియు ఇట్టి కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు,
ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు భేటీ బచావో బేటి పడావో పై అవగాహన కార్యక్రమం.
చిట్యాల ,నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున జిల్లా మహిళా సాధికారత ఆధ్వర్యంలో డ్రగ్స్ పై మరియు బాల్య వివాహాల పైన బేటి బచావో బేటి పడావో కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి అధ్యక్షతన విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించినారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద పాల్గొని మాట్లాడుతూ విద్యార్థినిలు బాల్యవివాహాలను చేసుకోవద్దని బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని అన్నారు, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతుందని అమ్మాయిల పైన వివక్షత చూపిస్తున్నారని కాబట్టి అమ్మాయిలు బాగా చదువుకొని సమాజంలో మంచి గుర్తింపు పొందాలని వారికి ఈ సమాజంలో ఎన్నో రక్షణ చట్టాలు వచ్చాయని వాటిని ఉపయోగించుకోవాలన్నారు అలాగే ఏదైనా సమస్య వస్తే 1098కి ఫోన్ చేసి తెలపాలన్నారు, ఈ కార్యక్రమంలో లెక్చరర్ యుగంధర్ కళావతి అనూష మమత మరియు అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
లక్కి డ్రాలో పది కిలోల లడ్డు కైవసం చేసుకున్న నల్లగోని ప్రణయ్ కుమార్ గౌడ్..
ఓదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి:
ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామంలో లక్కీ డ్రా ద్వారా గణపతి లడ్డూను ఓ భక్తుడు సొంతం చేసుకున్నాడు. పోత్కపల్లి శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ కొత్త గుడిసెల్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నల్లగోని భవాని-వెంకటేష్ గౌడ్ తన కుమారుడు ప్రణయ్ కుమార్(చిన్నా) పేరుపై రూ.101 రూపాయలకు లక్కీ డ్రా వేశాడు. నవరాత్రులు పూజలు అందుకున్న స్వామివారి పది కిలో ల లడ్డును లక్కి డ్రా లో సొంతం చేసుకున్నాడు.విఘ్నేశ్వర యూత్ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. లడ్డు రావడం పట్ల వెంకటేష్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ ఎల్లవేళలా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
గణేష్ ని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున గ్రీన్ వుడ్ హై స్కూల్ లోని వినాయకునికి ఘనంగా వీడ్కోలు తెలిపారు. మండల కేంద్రంలో గణేశుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అంతిమ కార్యక్రమం అయినా నిమర్జన కార్యక్రమాన్ని గ్రీన్ వుడ్ హై స్కూల్ విద్యాసంస్థ ఉదయాన్నే పూజా కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ఆటపాటలతో భక్తి గీతాలతో, కోలాటాలతో అంగరంగ వైభవంగా విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలిసి శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, ఉపాధ్యాయులు రాజకుమార్ తో పాటు తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు, విద్యాపకేతర బృందం పాల్గొన్నారు.
వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం గణపతి పూజలో ఎమ్మెల్యే వనపర్తి నేటిదాత్రి .
శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ఆర్యవైశ్య యూవజన సంగం అద్యరములో ఏర్పాటు చేసిన గణపతి పూజలో శుక్రవారం రాత్రి పాల్గొన్నారు పూజలో మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు బచ్చు రాము వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్, జిల్లా అధ్యక్షులు పూరి బాల్ రాజు శెట్టి మహిళ సంగం అధ్యక్షురాలు పిన్నం వసంత నరేందర్,కాంగ్రెస్ పార్టీ నేత రాజు కుమార్ శెట్టి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్, కొండ కిషోర్, కొండ మహేష్,భక్త్తులు పాల్గొన్నారు
ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ యువనాయకులు అశ్విన్ పటేల్ , వినాయక నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పదకొండవ రోజుల పాటు ఆనందం, ఉత్సాహం, ఐక్యతను నింపిన గణనాథుడికి నిమజ్జనోత్సవం ద్వారా ఘనంగా వీడ్కోలు పలుకుతున్నామని, ఆయన జీవితంలోని విఘ్నాలను తొలగించి, సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సిరిసంపదలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఝరాసంగం మండల ఆయా గ్రామ ప్రాంతంలో ఈ ఉత్సవాలు జరిగాయి.
బెల్లంపల్లి పట్టణంలోని అన్ని గణపతులకు ఘనంగా వీడ్కోలు పలికిన ప్రజలు .శుక్రవారం మధ్యాహ్నం నిమజ్జన వేడుకలను ప్రారంభించి స్థానిక బెల్లంపల్లి బస్తి చెరువులో నిమజ్జనం చేశారు. గత 9 రోజులుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా చివరి రోజైన శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విభిన్నమైన వివిధ ప్రసాదాలను సమర్పించారు.
అనంతరం. బెల్లంపల్లి లో గల బాబు క్యాంపు బస్తీకి చెందిన సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో విగ్రహ దాతలు.దేవ సత్యనారాయణ రజితలను సన్మానించారు.అనంతరం నిమజ్జన శోభయాత్రలో చిన్నా పెద్ద బేధాలు లేకుండా నృత్యాలు చేస్తూ వచ్చే ఏడాది మళ్లీ రా అంటూ అంగరంగ వైభవంగా గణపతికి వీడ్కోలు పలికారు.నవరాత్రి వేడుకలు విజయవంతం చేశారు. పోలీసు సిబ్బందికి, ప్రభుత్వ ఎలక్ట్రికల్స్ సిబ్బందికి, మీడియా వారికి, భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు.
శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు చున్నం బట్టి తండా భజన మండలి పోరదేవి మరియు సేవాలాల్ మహారాజ్ ఆలయానికి వెళుతున్నారు. మొగుడంపల్లి మండలం నుంచి సేవాలాల్ మహారాజ్ పోరఘడ్ కి ప్రయాణ యాత్రలో బీ లచ్చిరామ్, కాంగ్రెస్ సీనియర్ లీడర్, డైరెక్టర్, చున్నం భట్టి తండా, జహీరాబాద్ నియోజకవర్గ నాయకుడు కూడా ఉన్నారు. శ్రావణమాసంలో శ్రీ ఎల్లమ్మ మాత భజన మండలితో నెల ముగిసింది. 9 రోజుల్లో గణపతి నిమజ్జనం పూర్తి చేసుకుని, పోరదేవి మొహోరగడ్ నుంచి మహారాష్ట్రలో నిర్మించిన శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయానికి బయలుదేరారు. ఈ ప్రయాణంలో రాము రాథోడ్, రాజు రాథోడ్, భీమ్ సింగ్ చవాన్, తుకారం రాథోడ్, రూప్ సింగ్ రాథోడ్, లింబాజీ, సుభాష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ శేఖర్ పాటిల్ జన్మదిన వేడుకలు:
జహీరాబాద్ నేటి ధాత్రి:
బర్ధిపూర్ దేవస్థానంలో శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ శేఖర్ పాటిల్ జన్మదిన వేడుకలు శాలువా పూలమాలలతో సన్మానించి ఘనంగా నిర్వహించారు, ఇట్టి కార్యక్రమములో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ఝరాసంగం మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్,ఆశీర్వాదం తదితరులు పాల్గోని శేఖర్ పాటిల్ గారికి శాలువ పూలమాలతో సన్మానించి జన్మదిన శుభకాంక్షలు తెలియజేసారు.
కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు & బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు స్థానిక పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు ఆ గణనాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే దైవం ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై సంతోషంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మాజి సర్పంచ్ కలిమ్ ,కమిటీ అధ్యక్షులు వినయ్ కుమార్ వార్డ్ మెంబర్ లు యదుల్, వజీద్, నాయకులు విక్రమ్ రెడ్డి సంగమేశ్వర్ మేతరీ సందీప్ గుడ్డు,ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎం. ఆర్. హెచ్. ఎస్ పూర్వ విద్యార్థుల అలుమ్ని ఆత్మీయ సమ్మేళనం
◆:- ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణం అల్లిపూర్ గ్రామంలోని మెథడిస్ట్ రూరల్ హై స్కూల్ లో ఈ రోజు జరిగిన అలుమ్ని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ.చెర్మన్ వై.నరోత్తం పాల్గొనడం జరిగింది,ఈ సందర్భంగా వై.నరోత్తం మాట్లాడుతూ ఎందరో విద్యార్థులు ఈ పాఠశాలలో చదివి ఈ రోజు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు ఎందరో విద్యార్థులకు ఉన్నత స్థాయిలో నిలిపిన ఘనత ఎం. ఆర్. హెచ్. ఎస్ స్కూల్ కె దక్కింది అని అన్నారు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది చదువుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞపకం.మనం జీవితంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మన విద్యార్థి దశను గుర్తు చేసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్న ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలి అన్నారు నేను ఇక్కడ చదువుకోవడం నా అదృష్టంగా భావిస్తున్న అన్నారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మెథడిస్ట్ చర్చ్ జిల్లా అధికారి రేవ.సుకుమార్ ఎం. ఆర్. హెచ్. ఎస్ ప్రిన్సిపల్ టి. సబితా స్వరాజ్ స్వామిదాస్,మరియు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్ హెచ్ ఎస్ పూర్వ విద్యార్థుల అలుమ్ని ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నా
◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్:పట్టణంలోని మెథడిస్ట్ రూరల్ హై స్కూల్ లో జరిగిన అలుమ్ని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది.. ఈ సందర్భంగా మాజీ మంత్రి డా౹౹ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది చదువుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని జ్ఞపకం.
మనం జీవితంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మన విద్యార్థి దశను గుర్తు చేసుకోవడానికి ఎలాంటి అవకాశాలు వచిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలి.. మరియు పట్టణ కేంద్రంగా ఉన్నా ఆర్ హెచ్ ఎస్ రూరల్ హై స్కూల్ ఇక్కడి ప్రాంత విద్యార్థులను ఎంతో మందిని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దింది..
అందులో చదువుకున్నా పూర్వ విద్యార్థులు మళ్ళీ ఇలా కలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇస్తుంది,అని వారు మాట్లాడడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మొగుడంపల్లి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్ జహీరాబాద్ మెథడిస్ట్ చర్చ్ జిల్లా అధికారి రేవ్.సుకుమార్ ఎం ఆర్ హెచ్ ఎస్ ప్రిన్సిపల్ టి. సబితా స్వరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
ఓంకార పట్టణం కోహిర్ గ్రామంలో సార్వజనిక వినాయక మండలి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాగణపతి హోమం, అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే కొల్లాపూర్ మాణిక్ రావు మహాగణపతిని దర్శించుకున్నారు. అనంతరం మహిళలు సామూహిక దీపారాధన చేశారు.
గొర్రెలు, మేకలకు పిపిఆర్ వ్యాక్సిన్ టీకా శిబిరం: రైతులు సద్వినియోగం చేసుకోవాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కుప్పా నగర్ కుడు సంఘం బొప్పనపల్లి ఆయా గ్రామాలలో శనివారము గొర్రెలు, మేకలకు సోకె పురు వ్యాధి నివారణ పిపిఆర్ వ్యాక్సిన్ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా …. గొర్రెలు, మేకలకు టీకాలు వేశారు. ఈ శిబిరం ఈనెల 15వ తేదీ వరకు పలు గ్రామాలలో కొనసాగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది శివకుమార్ స్వామి రాములు. కృష్ణ సులోచన రాణి. వ్యవసాయదారులు గొల్ల రవి. కిష్టయ్య. గోపాల్. అంజన్న ఝరాసంగం గ్రామ రైతులు పాల్గొన్నారు.
`చెదిరిపోని చిరునవ్వుతో ‘‘కేసిఆర్’’ ఆనందానికి కారణం ‘‘సంతోషే’’!
`పాతిక సంవత్సరాలకు పైగా ‘‘కేసీఆర్’’ కు సేవ చేస్తున్నాడు.
BRS MP SANTOSH RAO
`అనుక్షణం ఆసరాగా వుంటున్నాడు.
`కుడి భుజమై కాపాడుకుంటున్నాడు.
`సహాయకుడుగా నిరంతర సేవలందిస్తున్నాడు.
`నిరంతరం ‘‘కేసీఆర్’’ వెన్నంటే వుంటాడు.
BRS MP SANTOSH RAO
`ఉద్యమ సమయంలో ప్రతి సందర్భంలోనూ ‘‘సంతోష్’’ కనిపిస్తారు.
`కన్న తండ్రికి మించి సపర్యలు చేస్తూ వుంటాడు.
`సంతోషమైనా, ఆపదైనా ‘‘కేసీఆర్’’ వెనకాలే వుంటాడు.
`ఆసుపత్రిలో వున్నా కన్నపిల్లలకన్నా ఎక్కువగా ‘‘కేసీఆర్’’ను చూసుకుంటాడు.
`అలాంటి ‘‘సంతోష్’’ సేవలను శంకించడం తగదు.
`అనుక్షణం ‘‘కేసీఆర్’’ తన వద్ద ‘‘సంతోషే’’ వుండాలని కోరుకుంటాడు.
`‘‘కేసీఆర్’’ నిద్ర లేవక ముందే అక్కడుంటాడు.
`‘‘కేసీఆర్’’ నిద్రపోయిన తర్వాత ఇంటికెళ్తాడు.
`‘‘కేసీఆర్’’ ను దైవం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు.
`జీతం కోసం పని చేసే వారు జీవితం త్యాగం చేయరు.
`తన వ్యక్తిగత జీవితమంతా ‘‘కేసీఆర్’’ కోసం త్యాగం చేస్తున్నాడు.
`ప్రతి వ్యక్తికి కుటుంబం వుంటుంది.
`జీవితంలో ప్రతి వ్యక్తి రాణించాలనే అనుకుంటాడు.
`ఆస్థులు, అంతస్తులు కోరుకోని వారుండరు.
`‘‘సంతోష్’’ స్థానంలో ఎవరూ ఒక్క రోజు కూడా వుండలేరు.
`‘‘సంతోష్’’ లాగా ‘‘కేసీఆర్’’ ను కంటికి రెప్పలా ఎవరూ చూసుకోలేరు.
`కన్న పిల్లల కన్నా ‘‘సంతోష్’’ ను ‘‘కేసీఆర్’’ చూసుకోవడానికి కారణం అదే.
`అయినా రాజకీయ వారసత్వం ‘‘కేటీఆర్’’ దే.
`కూతురుగా కుటుంబంలో కీలక స్థానం ‘‘కవిత’’దే.
`ఎంతగా ‘‘కేసీఆర్’’ కు సేవ చేసినా ‘‘సంతోష్ ఎప్పటికీ చుట్టమే’’!
హైదరాబాద్, నేటిధాత్రి:
జోగిన పల్లి సంతోష్‌రావు. ఈ పేరు పన్నెండేళ్ల క్రితం వరకు తెలంగాణ ప్రజలకు పెద్దగా పరిచయం లేని పేరు. తెలంగాణ కీలక ఉద్యమకారులకు, బిఆర్‌ఎస్ నాయకులకు, మీడియాలో కూడా కీలకమైన జర్నలిస్టులకు తప్ప పేరు తెలియని నాయకుడు. అలాంటి నాయకుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ సిఎం. అయ్యాక సంతోష్ పేరు నిత్యం వినిపిస్తూ వచ్చింది. సంతోష్ గురించి కేసిఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన సమయంలో చాలా మందికి పరిచయం అయ్యారు. కేసిఆర్ ఆమరణ దీక్ష చేపట్టి నిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ దీక్ష చేస్తున్న సమయంలో సంతోష్ ఏమిటో? ఆయనకు పార్టీలో వున్న ప్రాదాన్యత ఏమిటో? ఆయన ఎవరో? ఆయనకు కేసిఆర్ కు వున్న బంధుత్వం గురించి తెలంగాణ ఉద్యమకారులకు తెలిసింది. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత కేసిఆర్ తెలంగాణ ప్రజలకు అభివాదం చేస్తూ, ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సమయంలో కేసిఆర్ వెనుకే నిలబడిన వ్యక్తి సంతోష్ అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుంచి ముఖ్యంగా బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉన్నతోద్యోగులు సంతోష్ గురించి చర్చించుకోవడం అందరం విన్నదే. ఎప్పుడైతే సంతోష్ రాజ్యసభ అయిన తర్వాత తెలంగాణ ప్రజలకు కూడా ఆయనెవరో పూర్తిగా తెలిసింది. అప్పటి వరకు కల్వకుంట్ల కుటుంబానికి చెందిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్, కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్‌రావుల తర్వాత నాలుగో వ్యక్తిగా రాజకీయాల్లో సంతోష్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఒక దశలో సంతోష్ పేరే రాజకీయ, ఉద్యోగ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. అంతలా సంతోష్ గొప్పదనమేముంది? అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. బిఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి రావడానికి ముందు సంతోష్‌కు అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ రాజ్యసభకు ఎంపిక చేశారు. అందరూ అవాక్కయ్యారు. ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అసలు సంతోష్‌కు రాజకీయాలకు ఏం సంబంధం అంటూ అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. అప్పుడు కేసిఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంతోష్ గురించి చెప్పడం జరిగింది. సంతోష్ కూడా ఆదినుంచి ఉద్యమంలోనే వున్నారనే విషయం వెల్లడిరచారు. అంతే కాకుండా ఉద్యమ నాయకుడుగా తనను కాపాడుకునే బాద్యత తీసుకున్నాడు కేసిఆర్ చెప్పారు. కేసిఆర్‌ను తెలంగాణ ఉద్యమం మొదలై, 2004 ఎన్నికల సమయం నుంచి సంతోష్ డిల్లీలో కేసిఆర్‌కు తోడుగా వుండడం మొదలు పెట్టారు. తెలంగాణలో హరీష్‌రావు, డిల్లీలో కేసిఆర్ వున్నప్పుడు సంతోష్ చూసుకుంటూ వచ్చారు. ఇలా ఇరవై ఐదు సంతవ్సరాలుగా కేసిఆర్ యోగ క్షేమాలు చూసుకుంటూ వస్తున్నారు. కేసిఆర్ ఎప్పుడు ఎవరిని కలవాలి. ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి. కేసిఆర్ ఎప్పుడు ఏం తినాలి. మందులు వేసుకోవాలి. అని ప్రతిపతి క్షణం కనిపెట్టుకుంటూ, కేసిఆర్‌ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. కేసిఆర్ తనకు ఎప్పుడు ఏ మందులు కావాలో, ఇవ్వాలో చూసుకుంటాడు. అని చెప్పినప్పటినుంచి ప్రతిపక్షాలు సంతోష్‌ను అనేక రకాలుగా ఎగతాళి చేస్తూ వచ్చారు. వివాదాలు సృష్టిస్తూ వచ్చారు. అయితే బిఆర్‌ఎస్ రెండోసారి అదికారంలోకి వచ్చిన తర్వాత సంతోష్ మీద కుట్రలు చేసిన వారు కూడా చాల మంది వున్నారు. కవిత లాంటి వారు కూడా తమకు కేసిఆర్ అప్పాయింటు మెంటు ఇవ్వకుండా సంతోష్‌ను అడ్డుకుంటున్నాడంటూ కూడా సన్నిహితుల వద్ద చెప్పిన సందర్భాలున్నాయి. ఇలా అనేక విమర్శలు కూడా సంతోష్ ఎదుర్కొన్నారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే సంతోష్ ఇక్కడ ఆస్ధులు సంపాదించాడు. అక్కడ ఆస్ధులు కొనుగోలు చేశాడంటూ కూడా అనేక వర్తాలు వచ్చేవి. వాటిని ఎవరు లీక్ చేసేవారో ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే కవిత నేరుగా సంతోష్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతోంది. సంతోష్‌ను వేలెత్తి చూపిస్తోంది. కాని తన తండ్రి ఇప్పటికీ ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఆరోగ్యంగా వుండడానికి కారణం సంతోష్ అని తెలియదా? సంతోషంగా వున్నప్పుడు ఎవరి గురించి తెలియదు. కాని బాదల్లో వున్నప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. బిఆర్‌ఎస్ అదికారంలో వున్న పదేళ్లకాలంలో సంతోష్ రావు తన కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లినట్లు గాని, కుటుంబంతో కలిసి ఏవైనా ఫంక్షన్లకు వెళ్లినట్లు గాని ఒక్క ఫోటో బైటకు రాలేదు. కాని కవిత కుటుంబం గురించి అనేక వార్తలు వచ్చాయి. కేసిఆర్ సిఎం. అయిన తర్వాత ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రిలో కనిపించే ఏకైక నాయకుడు సంతోష్. కేసిఆర్ ఎన్ని రోజులు ఆసుపత్రిలో వుంటే అన్ని రోజులు కూడా ఆసుపత్రిలోనే వుంటూ ప్రతి క్షణం కాపాడుకునే నాయకుడు సంతోష్. ఈ మధ్య అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా కేసిఆర్ ఆరోగ్యానికి ఏ ఇబ్బంది ఎదురైనా ఆయనను కన్న తండ్రికన్నా ఎక్కువగా చూసుకుంటున్న ఏకైక వ్యక్తి సంతోష్. తన తండ్రి కేసిఆర్‌ను ఇంత గొప్పగా, ఇంత జాగ్రత్తగా కేటిఆర్, కవితలు కూడా చూసుకునేవారు కాదు. ఎవరికైనా వ్యక్తిగత జీవితం వుంటుంది. పుట్టిందే జీవితాన్ని గొప్పగా అనుభవించడానికి, కాని సంతోష్ లాంటి వ్యక్తికి అన్నీ కళ్లముందు వున్నా అనుభవించలేని జీవితాన్ని గడుపుతున్నాడని ఎంత మందికి తెలుసు. అది అనుభవించేవారికే తెలుస్తుంది. మన కుటుంబ సభ్యులు, కన్న తల్లిదండ్రులైనా సరే ఒక్క రోజు ఆసుపత్రిలో వుంటే చూసుకోవాలంటే చిరాకు పడిపోతాము. అలాంటిది ఒక కేసిఆర్‌ను పట్టుకొని పాతిక సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సంతోష్‌పై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేయడాన్ని తెలంగాణ సమాజం కూడా జీర్ణించుకోలేకపోతోంది. ఇది కవిత గమనించాలి. సంతోష్‌ను విమర్శించి కవిత తప్పు చేసిందని బిఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. కుటుంబ సమస్యను కవిత బజారున పడేయడమే కాకుండా కేసిఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునే సంతోష్‌ను విమర్శిండం సరైంది కాదంటున్నారు. అంటే కేసిఆర్ సంతోషంగా వుండడం కవితకు ఇష్టం లేదా? కేసిఆర్‌కు సంతోష్‌ను దూరుం చేస్తారు? సరే..మరి కేసిఆర్‌ను సంతోష్‌లగా చూసుకునే వ్యక్తిని తేగలరా? రాజకీయాలు వదిలేసి కవిత తండ్రి కేసిఆర్‌ను చూసుకోగలరా? ఇవి ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో జరుగుతున్న చర్చ. కేసిఆర్ ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తున్న సంతోషే అసలైన ఔషదం అని బిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. రోజూ ఎంత పని ఒత్తిడిలో వున్న చెరగని చిరునవ్వుతో కనిపించే సంతోష్ వల్లనే కేసిఆర్ ఆర్యోగంగా ఆనందంగా వుండగలుగుతున్నాడని అంటుంటారు. దేవుడికైనా గుడిలో సేవ చేసే పూజారి కూడ కొంత సమయమే వెచ్చిస్తాడు. కాని కేసిఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునే సంతోష్ ఇరవైనాలుగు గంటుల కేసిఆర్ వెంటే వుంటారు. కేసిఆర్ వెన్నంటే వుంటారు. కేసిఆర్ కోసం జీవితమే త్యాగం చేశారు. తనను కన్న తండ్రిలా చూసుకున్న సంతోష్‌ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా కేసిఆర్ చూసుకుంటూ వస్తున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లుగా కంటేనే అమ్మ అని అంటే ఎలా? అన్నట్లు కేసిఆర్‌ను ఎంతో ప్రేమతో సేవలు చేస్తున్న సంతోష్ అంటే కూడా కేసిఆర్‌కు అంత ప్రేమ వుంటుంది. ప్రతి వ్యక్తికి ఒక జీవితం వుంటుంది. కుటుంబం వుంటుంది. కాని సంతోష్‌కు జీవితం, కుటుంబం కూడా కేసిఆరే అయ్యారు. కేసిఆర్‌ను దేవుడిగా కొలుస్తూ సేవలు చేస్తున్నాడు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక రకంగా రాణించాలనే వుంటుంది. ఎక్కడో జీవితం ఆగిపోవాలని ఎవరూ అనుకోరు. ఆస్ధులు, అంతస్ధులు సంపాదించుకోవాలని అనుకుంటారు. కాని కేసిఆర్‌కు సేవ చేయడమే తన జీవితానికి గొప్ప అనుకోవడం సామాన్యమైన విషయం కాదు. అయినా సంతోష్ ఎప్పుడూ కేసిఆర్‌కు రాజకీయ వారసుడు కాదు. కుటుంబంలో కవిత కన్నా కీలకమైన స్దానం కూడా కాదు. కేసిఆర్‌కుఎంతసేవ చేసినా సంతోష్ ఎప్పటికీ చుట్టమే తప్ప, వారసుడు కాలేడు. ఈ సత్యం సంతోష్‌కు తెలియంది కాదు. కవితకుతెలియంది కాదు. అయినా సంతోష్‌ను వేలెత్తి చూపి ఆయన మనసు గాయపర్చడం అంటే కేసిఆర్ మనసు కష్టపెట్టడమే అవుతుంది. ఇప్పటికైనా కవిత ఈ సంగతి తెలుసుకోకపోవడం విడ్డూరం. ఏది ఏమైనా సంతోష్ లాగా కేసిఆర్‌కు సేవలు చేయడం అనేది ఎవ్వరి వల్ల కాదు. అంత ఓపిక వున్న వారు ఎవరూ వుండరు. ఈ విషయంలో సంతోష్ ఈస్ గ్రేట్ అని అందరూ అనాల్సిందే.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో బస్టాండ్ లో శుక్రవారం ఉదయం 6గంటలకు నర్సంపేట నుండి వేములవాడ బస్సు ముందుగా ఎక్కిన నర్సంపేట టౌన్ ఎన్జీవో కాలనీకి చెందిన కీసర రజిత అనే ప్రయాణికురాలు దిగి వెంటనే హన్మకొండ బస్సు ఎక్కి మనీ పర్సు పోగొట్టుకుంది.బస్సు డ్రైవర్ మహేష్ సహకారంతో బస్టాండు కంట్రోలర్ మల్లికార్జున్ ఆ మనిపర్సు అందజేశారు.కాగా అందులో ఆధార్ కార్డు, రూ.7200 నగదు, రెండు బంగారు ఉంగరాలు ఆ ప్రయాణికురాలకు రజిత అందజేశారు.నిజాయితీ చాటుకున్న సిబ్బంది డ్రైవర్ మహేష్ ను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ అభినందించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.