ఎంపీ వద్దిరాజు ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు
Date 05/09/2025
నేటిధాత్రి:
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగుల గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసం వద్ద వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు గణనాథుడిని ప్రతిష్ఠించి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు.నిమజ్జనానికి బయలుదేరడానికి ముందు వినాయకుడికి శుక్రవారం విజయలక్ష్మీ, నిఖిల్ చంద్రలు పూలమాల వేసి,హారతినిచ్చి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా గంగాభవాని తన కుమారులు సౌరవ్,సనవ్ లతో కలిసి గణనాథుడికి కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు వారికి ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు ముడ్డంగుల కృష్ణ,గగులోతు నవీన్ నాయక్,యరగాని పృథ్వీ గౌడ్,ముకుంద అనిల్ పటేల్,అనంతుల శ్రీనివాస్ గౌడ్, మల్యాల శేఖర్, నాగిరెడ్డి, ముకరా దుర్గాప్రసాద్, దండు రాజు ధూదిగామ సాత్విక్,జ్యోతి, సంతోష్ తదితరులు విజయలక్ష్మీ, గంగాభవాని, నిఖిల్ చంద్ర, స్థానిక ప్రముఖులను శాలువాలతో సత్కరించి వినాయకుడి చిత్రపటాలను బహుకరించారు.
వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు అందజేసిన విఘ్నేశ్వరుడి లడ్డూ ప్రసాదాన్ని నిఖిల్ చంద్ర భక్తిప్రపత్తులతో స్వీకరించి తలపై పెట్టుకుని తన నివాసంలోకి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు”జై గణేశ జైజై గణేశ” అంటూ నినాదాలు చేశారు.