శివాజీ జయంతి వేడుకల్లో గజవాడ లావణ్య సత్కారం..

శివాజీ జయంతి వేడుకల్లో గజవాడ లావణ్య సత్కారం..

రామాయంపేట ఫిబ్రవరి 19 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు చత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్యకు నిర్వాహకులు సత్కారం నిర్వహించారు.
జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ నవనీతతో పాటు పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, పరిపాలనా నైపుణ్యం నేటి తరానికి ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. సమాజంలో స్వాభిమానం, స్వాతంత్ర్య భావాలు పెంపొందించడంలో శివాజీ పాత్ర చిరస్మరణీయమని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా గజవాడ లావణ్య మాట్లాడుతూ, శివాజీ చూపిన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పట్టణాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మున్సిపాలిటీ కృషి చేస్తోందని తెలిపారు. యువత శివాజీ ఆదర్శాలను ఆచరణలో పెట్టాలని సూచించారు.
కార్యక్రమం ముగింపులో శివాజీ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సి లర్లు గజవాడ నాగరాజు. దేవుని రంజిత్. రవి.డాకి స్వామి. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి. చింతల యాదగిరి. ఎనీశెట్టి అశోక్. రాధా కిషన్ బొందుగుల రాజు. తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి..

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి..

బీసీలకు రూ.20,000 కోట్ల కేటాయింపే న్యాయం..

మెట్టు గంగారాం డిమాండ్..

రామాయంపేట ఫిబ్రవరి 19 నేటి ధాత్రి (మెదక్)

వచ్చే ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ బడ్జెట్‌లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీల సంక్షేమానికి రూ.20,000 కోట్లు కేటాయించి చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా మహాత్మా జ్యోతిబా పూలే పేరుతో చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని, కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, బీసీ ఉపాధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.9,200 కోట్లు, 2025-26 బడ్జెట్‌లో రూ.11,405 కోట్లు కేటాయించినప్పటికీ, వాస్తవంగా ప్రతి ఏడాది సుమారు రూ.300 కోట్లు మాత్రమే వినియోగించబడుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో సుమారు 60 శాతం జనాభా బీసీలే ఉన్నప్పటికీ, కేవలం మూడు శాతం నిధులు మాత్రమే కేటాయించడం, అందులోనూ ఒక్క శాతం కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధికి వినియోగించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
ప్రభుత్వం బీసీ సంఘాలతో చర్చించి, రానున్న బడ్జెట్‌లో కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా రూ.20,000 కోట్లు కేటాయించి, చట్టబద్ధమైన బీసీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయాలని కోరారు. కేటాయించిన ప్రతి రూపాయి కూడా బీసీల అభివృద్ధికే ఖర్చు అయ్యేలా పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించి, వాస్తవ ఖర్చుల్లో వెనుకబడటం సరికాదని, ఇప్పటికైనా బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మెట్టు గంగారాం ప్రభుత్వాన్ని కోరారు.

పేటకాంగ్రెస్ విజయం వెనుక త్యాగధనులు…

పేటకాంగ్రెస్ విజయం వెనుక త్యాగధనులు,

,,,, రెబల్గా పార్టీకి అన్యాయం కన్నా గెలుపు కోసం త్యాగం,,,,

,,,, ఐక్యమత్యానికి వారీ సహకారం,,,,,,

ఒక్కొక్క గడ్డిపరక ఏనుగుని బంధించినట్టు,,,,,,

విజయానికి వీ రు కూడా భాగస్తులే,,,,

,, అధినాయకుని గౌరవించి మాటకు విలువ ఇచ్చారు,,,,,,

రామాయంపేట ఫిబ్రవరి 18 నేటి ధాత్రి (మెదక్)

 

జిల్లాలో రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకున్నట్టు కాకుండా విజయం చాలాచోట్ల దోబూచులాడింది. అధికారం ఉన్న నాయకులు ఉన్న ప్రజల్లో సంశయమైన దోబూచులాట కాంగ్రెస్ ఓటమికి చాలాచోట్ల ఆటంకాలు ఏర్పడ్డాయి మెదక్ జిల్లాలో కూడా బి ఆర్ఎస్ బిజెపి పార్టీలు మెదక్ జిల్లాలోని కాక రాష్ట్రంలో తీవ్రమైన పోటీని బలమైన అభ్యర్థులను మాజీ అధికార పార్టీ అయితే డబ్బులను పెద్ద ఎత్తు న పెట్టి కాంగ్రెస్కు పెద్ద సవాలే విసిరింది రామాయంపేట మున్సిపల్ కు వస్తే అధికారం ఉన్న ఎమ్మెల్యే పదవి ఉన్నా స్థానిక ఎన్నికల్లో గతం నుండి పది సంవత్సరాలుగా అన్ని స్థానిక సంస్థల పదవులను ఏకపక్షంగా సాధించి కాంగ్రెస్ ను పంజరంలో వేసిన ఘనత విఆర్ఎస్ పార్టీ దే గతంలో అనైక్యత పార్టీలో నుండి కోవట్లు టిఆర్ఎస్కు పెద్ద మొత్తంలో ఉండడమే కాకుండా అధినాయకత్వం కూడా లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే ఇక్కడ ఉన్న నాయకులు పోతే పోనీ నాకేంటి మాకు మాత్రం నాయకత్వానికి లోటు లేదు అనే ధోరణిలో గడిచింది కాబట్టి టిఆర్ఎస్ కు పోటీ లేకుండా సాధించాలన్నది పరిశీలిస్తున్న భావన కానీ మైనంపల్లి మంత్రాంగం అందర్నీ ఏకతాటిపై తీసుకువచ్చి నయాన భయాన ఓకే అభ్యర్థికి విజయానికి సహకరించాలని ఆదేశాలు చాలా బాగా పనిచేశాయి. యువజన కార్యకర్తలు సాకేత్ రెడ్డి పుట్టి నికుల్ తమ కు టికెట్టు ఇచ్చే అవకాశం ఉన్న కేటాయించకపోవడం పట్ల ఏమాత్రం కూడా స్వార్థంతో ఆలోచించకుండా నిస్వార్ధంగా అభ్యర్థుల గెలవడానికి కారణమయ్యారు..పార్టీ ఐక్యమత్యంతో పాటు కోవట్లను కూడా జాగ్రత్తగా గమనిస్తూ వారికి ఎన్నికలు దూరంగా ఉంచడం మరొక ఆలోచన ఇకపోతే అధినాయకత్వానికి గెలిచే సస్తావున్న అభ్యర్థులు కూడా పార్టీ ధ్రువీకరించిన అభ్యర్థులకు పూర్తి సహకారం అందించడమే కాక ముందుండి ఓట్లను సంపాదించడం మరొకటి విజయానికి సాధ్యమైంది రెబ్బలు ఒకటి రెండు చోట్ల ఇతర పార్టీల అనుమతితో నిలబడ్డ వారిని పూర్తిగా ఓడించే ప్రయత్నం పూర్తిగా సఫలమైంది 12వ వార్డులో గతంలో షరాబు శ్యామ్ కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బలంగా ఆర్థికంగా గెలిచి సత్తా ఉన్న గతంలో తనతో ఓడిపోయిన పోచమ్మల గణేష్ కు ఛాయిస్ ఇవ్వడం ప్రచారంలో ఉండి కాంగ్రెస్కు బలంగా ఓట్లు తేవడం నిజంగా అతను త్యాగానికి పార్టీ ప్రతిఫలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటో వార్డులో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని సీట్లలో టిఆర్ఎస్ గాలిని అడ్డుకొని గెలిచి నిలిచిన బుర్ర అనిల్ కుమార్ చైర్మన్ కాండిడేట్ నాగరాజు లావణ్య కు పెద్ద విజయాన్ని సాధించి పెట్టాడు పట్టణ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోబడ్డ చింతల స్వామి 11 లో అతనికి అవకాశం ఉన్న కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థికి పూర్తి న్యాయం చేయడం ఏడో వార్డులో గొలుపర్తి 700 ఓట్లు గ్రామంలోని ఉండడం గత కొన్ని సంవత్సరాలుగా పచ్చంటి రాము పోటీ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చేదైన చైర్మన్ భర్త నాగరాజుకు త్యాగం చేసి పార్టీకి లాభం చేకూర్చాడు .అందుకే రామాయంపేట మెదక్ జిల్లాలో వేస్తున్న పోటాపోటీ బిఆర్ఎస్ గారికి ఐకమత్యములు మరియు త్యాగాలతో విజయం చేకూర్చడంలో భాగస్వాములు అయ్యారని చెప్పవచ్చు.

108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి

108 సేవలు సద్వినియోగం చేసుకోవాలి

నిజాంపేట: నేటి ధాత్రి

ప్రజలు 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ 108 కో ఆర్డినేటర్ రవి కుమార్ నిజాంపేట లో గల అంబులెన్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్ లో గల పరికరాలు, మందు నిల్వలను పరిశీలించారు. రోడ్డు ప్రమాద సమయం లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఏదైనా అత్యవసర సమయంలో ప్రజలు 108 సేవలను వినియోగించుకోవాలన్నారు. సిబ్బంది పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈఎంటీ స్వామి, పైలెట్ సురేష్ ఉన్నారు.

అంగన్వాడి కేంద్రంలో జాతీయ బాలికల దినోత్సవం

జాతీయ బాలికల దినోత్సవం

నిజాంపేట, నేటి ధాత్రి

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో జాతీయ బాలికల దినోత్సవం ను జరుపుకోవడం జరిగింది అనంతరం అంగన్వాడి పర్యవేక్షణ , సహాయ కమిటీ కార్యక్రమం ఏర్పాటు చేసి గర్భిణి స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంతంపల్లి సుశీల, కార్యదర్శి మహమ్మద్ హరీఫ్, స్వప్న, ఉమారాణి, నిర్మల ,సౌజన్య తదితరులు పాల్గొన్నారు

లాల్సబ్ గడ్డలో బిసి ఉద్యమానికి భారీ బలం

*లాల్సబ్ గడ్డ, సంగారెడ్డి జిల్లా లో భారీగా చేరిన మైనారిటీ సోదరులు.*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

 

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరుస చేరికలతో ఊపందుకున్న బిసి నినాదం – జ్యోతి పండాల్
లాల్సాబ్ గడ్డ మున్సిపల్ ఏరియా, సంగారెడ్డి నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా నుండి బారి ఎత్తున్న మైనారిటీ సోదరులు చేరడం జరిగింది.
ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్ కడువ వేసి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది, అలాగే మొహమ్మద్ నవాజ్ గారిని మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది.
ఈ సందర్భంగా జ్యోతి పండాల్ మాట్లాడుతూ ప్రతి గ్రామ స్థాయిలో తీన్మార్ మల్లన్న గారి పోరాటం ప్రజలకు చేరుతుందని అన్నారు. మా బిసి ఉద్యమాన్ని “టీఆర్పీ చైతన్య బాట” ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నాము అని మరియు మా వాటాని మేము ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అని మేము మాకున్న అక్కుతో సాధించుకుంటాము అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. తర్వాత మైనారిటీ సోదరులు టీఆర్పీ నాయకులని (జ్యోతి పండాల్, రమేష్ యాదవ్ మరియు అనిల్ కుమార్) సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు నవాజ్, మీడియా మిత్రులు యదాన్న, మైనారిటీ సోదరులు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా పారిశుద్ధ పనులు…

శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా పారిశుద్ధ పనులు

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామంలో గ్రామ సర్పంచ్ సుశీల కార్యదర్శి హరిఫ్ ఆధ్వర్యంలో స్పెషల్ శానిటేషన్ పారిశుద్ధ పనులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని మురికి కాలువలను క్లీన్ చేయడం, రోడ్లను ఊడ్చడం, డ్రైడే ఫ్రైడే లో భాగంగా ఇంటింటికి వెళ్లి నీటి ట్యాంకులు, నీటి తొట్టిలను అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ స్వప్న ,ఆశా వర్కర్ స్వప్న గ్రామ సిబ్బంది పాల్గొన్నారు

అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు..

మల్లన్న గుట్ట వద్ద
పెద్దపులి కలకలం
అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు

నిజాంపేట: నేటి ధాత్రి

 

కామారెడ్డి సరిహద్దుల్లో సంచరిస్తున్న పెద్దపులి మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడలోని మల్లన్న గుట్ట వద్ద సంచరిస్తున్నట్లు ఓ రైతు అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన రామాయంపేట అటవీ అధికారి విద్యాసాగర్, ఎస్ఐ రాజేష్ ఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో జంతువు పాదముద్రలను పరిశీలించారు. నమూనాలను సేకరించి ల్యాబ్ కి పంపించడం జరుగుతుందన్నారు. జంతువు ఏంటి అనేది కచ్చితంగా నిర్ధారణ కాలేదని, పాదముద్రల ఆధారంగా చిన్నపాటి జంతువు అయ్యి ఉండొచ్చని తెలిపారు. ఆ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తుందని తెలిపారు. అటవీ అధికారులు నిరంతరం గ్రామాలపై పర్యవేక్షణ చేపట్టడం జరిగిందన్నారు.

దర్గా హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ దక్కన్ 767 ఉరోస్ ఉత్సవాలు

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T123721.692.wav?_=2

 

దర్గా హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ దక్కన్ 767 ఉరోస్ ఉత్సవాలు

◆:- టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ మరియు టీఆర్పీ పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండల్ లో ప్రముఖ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ కోహీర్ దక్కన్ 767 దర్గా జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా
బాన్దారి మరియు కాదమెన్ దర్గా కమిటీ వారి ఆహ్వానం మేరకు జ్యోతి పండాల్ దర్గాని సందర్శించి చాదర్ని సమర్పించడం జరిగింది. అలాగే టిఆర్పి పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ హరీష్, హైదరాబాద్ ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ ఆనెగుంట శ్రీకాంత్ మరియు జహీరాబాద్ మండల అధ్యక్షుడు రాకేష్ దర్గా పై చాదర్ని కప్పి పూజలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జ్యోతి పండాల్ మాట్లాడుతూ ఈ ఉరుసు భక్తికి, ఐక్యతకి మరియు సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచిందని అలాగే కమిటీ వారు ఈ జాతరను పార్టీలకి కులమతాలకి అతీతంగా నిర్వహించి అందరిని ఆహ్వానించడం చాలా చాలా సంతోషించదగ్గ విషయమని జ్యోతి పండాల్ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో హరీష్, రాకేష్, శ్రీకాంత్, లోకేష్, షాకిర్ అలీ మరియు దర్గా కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు

దత్త జయంతికి దత్తగిరి ముస్తాబు…

దత్త జయంతికి దత్తగిరి ముస్తాబు

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలోనే దత్తక్షేత్రాలలో ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయతల మధ్య వెలసిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో మార్గశిర పౌర్ణమి ఈ నెల 4న దత్తజయంతి వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దత్తజయంతి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి, సిద్ధేశ్వరానందగిరి మహారాజ్, దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం పర్యవేక్షణలో ఈనెల 2, 3, 4 తేదీల్లో 21 యజ్ఞగుండాలతో దత్తయజ్ఞాలు, శ్రీచండీ హోమం మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు అవధూతగిరి మహారాజ్, సిద్దేశ్వరనందగిరి

పేర్కొన్నారు. యజ్ఞాల కోసం ప్రత్యేక యాగశాల ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తుల తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం పచ్చటి పందిళ్లు, తాగునీరు, భోజన వసతి, భక్తులకు దర్శనం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దత్తాత్రేయ మందిరం, జ్యోతిర్లింగాల మండపం, ఆత్రేయ మహర్షి, అనసూయ, గోమందిరం, రేణుకామాత మందిరాలకు రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరణ చేశారు. వైద్యాధికారి డాక్టర్ రమ్య ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఝరాసంగం ఎస్సై క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

వడ్ల కనుగోలు కేంద్రం ప్రారంభం…

వడ్ల కనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ , రామాయంపేట ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకము క్వింటాలుకు 2389 గాను, గ్రేడ్ బి రకానికి క్వింటాలుకు 2369 gaa అలాగే సన్న రకానికి బోనస్ గా 500 రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుందని సెంటర్ నిర్వాహకులు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్ ,వడ్ల కనుగోలు కేంద్రం నిర్వాహకులు కేతావత్ సురేష్ , పాత్లోత్ శంకర్, మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుగ్లోత్ దేవేందర్, గ్రామస్థులు ఉప్పలయ్య, మోహన్, నాజాం , అనిల్ కుమార్, మరియు రైతులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి..

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి..

మిషన్ భగీరథ మంచినీటి పంపిణీ వ్యవస్థలో ఆటంకాలు తొలగించండి..

సింగూర్ డ్యాం మరమ్మత్తు సమయంలో ప్రతి గ్రామానికి మంచినీరు అందించేలా ప్రత్యేక ప్రణాళిక..

త్వరలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

పటాన్చెరు, గుమ్మడిదల మండలాల పరిధిలోని గ్రామపంచాయతీలలో నూతన అభివృద్ధి పనులకు ప్రణాళిక..

సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

పఠాన్ చేరు, నేటి ధాత్రి :

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు..బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు, బండ్లగూడ పరిధిలోని దోషం చెరువులలోకి మురుగనీరు చేరకుండా చేపడుతున్న ప్రత్యేక పైప్ లైన్ పనుల పురోగతిపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పైపులైన్ నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని.. త్వరితగతిన పూర్తిచేసేలా సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించాలని జిహెచ్ఎంసి ఇరిగేషన్ విభాగం ఈఈ మల్లేష్ ను ఆదేశించారు. పటాన్చెరు సాకి చెరువు, రామచంద్రాపురం రాయసముద్రం చెరువుల సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. నిధుల అంశంలో ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకొని రావాలని.. ఉన్నతాధికారులతో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానని అధికారులకు సూచించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం రెవిన్యూ పరిధిలో పాలిటెక్నిక్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు త్వరలోనే భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతుందని తెలిపారు. భవనాల నిర్మాణాలకు సైతం నిధులు కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న మంచినీటి పంపిణీ అంశంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని..ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విభాగం అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంచినీటి పంపిణీ అంశంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ ఎస్ ఈ రఘువీర్ ను ఆదేశించారు. పరిశ్రమలకు మంచినీరు అందించడం ఎంత ముఖ్యమో.. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి అందించడం అంతకంటే ప్రాధాన్యత అంశమని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటు అవుతున్న కాలనీలకు సైతం మంచినీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మంచినీటి పంపిణీ అంశంలో అలసత్వం వహిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు. వచ్చేనెల 10వ తేదీ లోపు పంపిణీ అంశంలో గల ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలగిస్తామని సంబంధిత అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు తెలిపారు.

 

Mission Bhagiratha

డిసెంబర్ నెల నుండి సింగూర్ డ్యాం మరమ్మత్తులు చేపడుతున్న సందర్భంగా సంవత్సరం పాటు మంచినీటి పంపిణీ ఆపివేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సింగూరు ద్వారా పంపిణీ జరుగుతున్న గ్రామాలు, పట్టణాలు, డివిజన్ల పరిధిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే సంబంధిత ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పటాన్చెరు మండల పరిధిలోని భానూరు, క్యాసారం, నందిగామ, గుమ్మడిదల మండల పరిధిలోని అనంతారం, కానుకుంట, కొత్తపల్లి, మంబాపూర్, నాగిరెడ్డిగూడెం, నల్లవల్లి, రామిరెడ్డి బావి, వీరారెడ్డిపల్లి, తదితర గ్రామాల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను సంబంధిత ఎంపీడీవోలు, కార్యదర్శులతో చర్చించారు. గ్రామ పంచాయతీల పరిధిలో నిధులు కొరత మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సంబంధిత కార్యదర్శులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సి ఎస్ ఆర్ నిధులను అభివృద్ధి పనులకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేయాలని కోరారు. గుమ్మడిదల నుండి కానుకుంట మీదుగా నూతనకల్ వరకు రహదారి నిర్మాణ పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. నూతన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేయాలని.. ప్రభుత్వంతో చర్చించి నిధులు కేటాయిస్తానని తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కర్దనూరు, ఘనాపూర్, వెలిమెల, కొల్లూరు, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ పరిధిలో 6 కోట్ల 80 లక్షల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు వచ్చే వారంలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో విలీనమైన గ్రామాలలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
అభివృద్ధి పనుల్లో లసత్వం వహించవద్దని.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అమీన్పూర్ మాజీ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, పటాన్చెరు ఎమ్మార్వో రంగారావు, పటాన్చెరు ఎంపీడీవో యాదగిరి, గుమ్మడిదల ఎంపీడీవో ఉమాదేవి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ విజయ లక్ష్మి, డీఈలు హరీష్, శ్రీనివాస్, ఏఈ మౌనిక, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఆయిల్ ఫామ్ విత్తన సాగు…

ఆయిల్ ఫామ్ విత్తన సాగు
ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారులు..

నిజాంపేట, నేటిధాత్రి:

 

ఆయిల్ ఫామ్ రిసోర్సెస్, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ విత్తన సాగు నర్సరీ ని ప్రారంభించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో ఆయిల్ ఫామ్ విత్తన సాగును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో రైతులు ఆయిల్ ఫామ్ పంటపై ఆసక్తి చూపడం ఆనందకరంగ ఉందన్నారు. రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా అధిక ఆదాయన్నీ పొందవచ్చని సూచించారు. తక్కువ నీటి వినియోగంతో అధిక లాభాలను ఈ పంట ఇస్తుందన్నారు. జిల్లాలో పంట విస్తరణకు కావాల్సిన నాణ్యమైన మొక్కలను స్థానిక స్థాయిలో పెంచడమే ఈ నర్సరీ లక్ష్యమని పేర్కొన్నారు.జిల్లా ఉద్యాన అధికారి మాట్లాడుతూ.. చల్మెడ గ్రామంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నర్సరీ ద్వారా మెదక్ జిల్లాకు నాలుగు లక్షల నాణ్యమైన మొక్కలను అందించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. మొదటి విడత లక్ష విత్తనాలు నాటుటకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం రైతుల పొలాల్లో నాటేందుకు సిద్ధమవుతాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు వినయ్ విన్సెంట్, రాజ్ నారాయణ, ఏఈఓ లు శ్రీలత, మౌనిక, రమ్య, రైతులు ఉన్నారు.

రక్తదానం మహాదానం,,,,

రక్తదానం మహాదానం,,,,

రక్తం అందక మంది 1,50,000 మృతి,,,,

ప్రతి ఒక్కరు రక్తదానానికి సిద్ధం కావాలి,,,,,,

యు వకులు ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం ఆనందకర విషయం,,,,,

రామాయంపేట అక్టోబర్ 27 నేటి ధాత్రి (మెదక్)

 

 

రక్తదానం మహాదానమని దానివల్ల ఎందరో ప్రాణాపాయ స్థితి నుండి చిరంజీవులు అవుతారని రక్తదానం చేయడానికి అందరు సిద్ధం కావాలని తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ అన్నారు, సర్కిల్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా స్నేహ బందు మరియు పోలీసులు రామాయంపేట పోలీసులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 1,50,000 మంది రక్తం అందగా మరణిస్తున్నారన్నారు అవసరమైన సమయానికి రక్తం ఇస్తే ఎందరో చిరంజీవులుగా మారతారన్నారు అందుకే రక్త దానం అనేది ఎన్నికైన గొప్ప విషయం అన్నారు ప్రమాదాల్లో

 

క్షతగాత్రులైన వారికిరక్తం బాగా సహకరిస్తుందన్నారు సమయానికి రక్తం అందిస్తే వారికి నూతన జీవితం అందించడం జరుగుతుందన్నారు యువత చాలామంది ఈరోజు రక్తదానికి సహకరించడం నూతన జీవితాలను వెలిగించడం జరుగుతుందన్నారు రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ రామాయంపేట ఎస్సై ఆర్ బాలరాజ్ నిజాంపేట్ ఎస్సై రాజేష్ నార్సింగ్ ఎస్ఐ సృజన పోలీసులుతదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు స్నేహబంధు లైన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

పండుగకు చుక్క .ముక్క లేనట్లే…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T124822.069.wav?_=3

 

పండుగకు చుక్క .ముక్క లేనట్లే !

◆-: మద్యం మాంసం విక్రయాలకు అనుమతి లేదు

◆-: ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం

◆-: ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజు రూ .10 కోట్ల వరకు మద్యం అమ్మకాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

దసరా పండుగ అంటే అందరికీ సంబరమే. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన పండుగ వస్తుంది. దీంతో మద్యం. మాంసాహార ప్రియులు ఆలోచనలో పడ్డారు. తెలంగాణలో వివిధ శుభకార్యాలు. పండుగలు. ఫంక్షన్లు ఏదైనా. మాంసం. మద్యం లేనిదే కిక్కు ఉండదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఓ అలవాయితీగా వస్తుంది. ఇక దసరా అంటేనే ఏ పండుగకి లేనంత జోష్ ఉంటుంది. ఇదే రోజు చుక్క.

ముక్క ఉండాల్సిం దే. మద్యంతో పాటు మటన్ .చికెన్ కావాల్సిందే కానీ ఆ రోజు గాంధీ జయంతి ఉండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి. అదే రోజు దసరా పండుగ కూడా వస్తుంది ఈ నేపథ్యంలో మద్యం మాంసం వికలాలపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. సాధారణంగా గాంధీ జయంతి రోజు మద్యం మాంసం దుకాణాలు మూసివేయడం ఆనవాయితీ అయితే అన్ని పండుగలా మాదిరిగా దసరా పండుగ ఉండదు ఆ రోజున చాలామందికి చుక్క లేనిదే ముద్ద దిగదు అందుకోసం పండుగ రోజు ఎట్లా అని మద్యం మాంసం. విక్రయాలపై ప్రజలు తర్జన బార్జన పడుతున్నారు.-: విక్రయాలపై సందిగ్ధం.దసరా పండుగ రోజు మాంసాహారులైన ప్రతి ఇంట్లో ముక్క ఉండాల్సిందే పండుగ వేళ గొర్రె పొట్టేలు.

మేక పోతుల మాంసానికి చాలా డిమాండ్ ఉంటుంది. నాటు కోళ్లు. ఫారం కోళ్లు. చేపలకు కూడా మస్తు గిరాకీ ఉంటుంది.ప్రతిరోజు కోట్లలో మద్యం విక్రయాలు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతిరోజు రూ. 10 కోట్ల వరకు నెలకు సుమారు. 275 కోట్ల వరకు లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. అయితే ఒక్క దసరా రోజే ప్రతి ఏటా సుమారు రూ. 20 కోట్లకు పైగా అమ్మకాలు జరిగి భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అయితే ఈసారి దసరా గాంధీ జయంతి ఒకే రోజు రావడం తో .మద్యందుకాణాలను మూసివేస్తున్నట్లు. ఎక్సెస్ శాఖ అధికారులు ప్రకటించారు దీంతో మద్యం అమ్మకాలపై రాష్ట్ర ఖజానాపై .తీవ్ర ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.మటన్ షాపులకు అనుమతివ్వండి..

ప్రతి సంవత్సరం .దసరా రోజు మటన్ .చికెన్ షాపుల్లో. గిరాకీ ఉంటుంది .పండుగ రోజు విక్రయాలు జరగకపోతే ఆర్థికంగా. నష్టపోతాం .అధికారులు స్పందించి అనుమతులు ఇవ్వాలని. మాంసం దుకాణదారులు అంటున్నారు. పండుగా రోజు వివిధ గ్రామాల మండలాల నుండి .జహీరాబాద్ న్యాల్కల్ ఝరాసంగం మొగడంపల్లి కోహిర్ మండల కేంద్రానికి .వందలాది మంది మార్కెట్ కు మాంసం కోసం వస్తుంటారు. కావున ఆరోజు అనుమతి ఇవ్వాలని మాంసం విక్రయదారులు అంటున్నారు.

మద్యం విక్రయాలు జరగవు ఎక్సైజ్ శాఖ అధికారులు దసరా. గాంధీ జయంతి .ఒకేసారి రావడంతో. వైన్స్ .బార్ షాపులు. ప్రభుత్వ ఆదేశాల మేరకు .బంధు ఉంటాయని ఎక్సైజ్ శాఖ అధికారులు .తెలుపుతున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ. ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. కావున గ్రామాల్లో ఉన్న బెల్టు షాపులపై దాడులు నిర్వహిస్తామని .ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు..

రాష్ట్ర స్థాయి పత్రికా కథన రూపంలో…

రాష్ట్ర స్థాయి పత్రికా కథన రూపంలో

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..

రామాయంపేట, సెప్టెంబర్ 5 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వయికుంట వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం సందర్శించి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ నిమజ్జనం శాంతియుతంగా, సాఫీగా జరిగేలా మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా నిమజ్జనానికి వెళ్లే వినాయక విగ్రహాల ర్యాలీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, రాకపోకలు అంతరాయం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్‌కు తగు సూచనలు ఇస్తూ, సర్వయికుంట చెరువులో జరిగే నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని భద్రతా చర్యలకు సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విభాగాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశించారు.
కలెక్టర్ పర్యటనలో మండల తహసీల్దార్ రజనీకుమారి, మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సైదయ్య, మున్సిపల్ వార్డు అధికారులు, ప్రజాప్రతినిధులు సుప్రభాత రావు. తదితరులు పాల్గొన్నారు.

మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మహమ్మద్ ఫక్రుద్దీన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T113156.165.wav?_=4

 

మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మహమ్మద్ ఫక్రుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మహమ్మద్ ఫక్రుద్దీన్ ను నియమించడం జరిగింది ఫక్రుద్దీన్ నియమించిన పెద్దలను హృదయపూర్వకంగా ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ చైర్ పర్సన్, పెద్దలు సునితాహన్మంత్ రావు పాటిల్,యువ నాయకులు ఉదయ్ శంకర్ పాటిల్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు, మా తాత ముత్తాతల నుండి కాంగ్రెస్ పార్టీని పనిచేసిన మా కుటుంబం కాంగ్రెస్ పార్టీ నాయకులు నాపై దృష్టి పెట్టి ఈ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అప్పగించారు పార్టీని బలపలించినందుకు నాతో అయినంత కృషి చేస్తామన్నారు,

బాoసేప్ 12వ మహాసభలను విజయవంతం చేయండి

బాoసేప్ 12వ మహాసభలను విజయవంతం చేయండి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో బాంసేఫ్ ప్రచారకులు, బాంసేఫ్ 12వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బాంసేఫ్ అధ్యక్షులు నరేందర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాదారిక జనగణన చేస్తామని ప్రకటించిన కులాదారిక జన గణన చేపట్టకపోవడం ద్వారా ఓబిసి ఎస్సి, ఎస్టీ కులాల ప్రజలను మోసం చేస్తున్నాయని వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ఈవీఎంల విషయంలో మౌనాన్ని పాటించడం ద్వారా అవకతవకలు పాల్పడడం బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఒకదానిని ఒకటి సహకరించుకుంటున్నాయని ఆయన ఎద్దేవ చేశారు. తాము పుట్టిన సమాజ అభివృద్ధి కొరకు తమ బానిసత్వాన్ని వదిలించుకోవడం తమ ధనాన్ని తమ అజ్ఞానాన్ని తమ సమయాన్ని వెచ్చించిన వారు ధన్యులు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, టి ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్,
అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు కొత్తల గంగారం,
భారతీయ యువ మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇల్లిందల ప్రభాకర్,
భారత ముక్తి మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గడ్డం రవి,నర్సింలు నిజాంపేట్ మండల డిబిఎఫ్ ఉపాధ్యక్షులు బ్యాగరి రాజు,వడ్డెర సంఘం మైశయ్య,మల్లయ్య,మైనార్టీ నాయకులు సమీర్, సలీం, హైమద్ తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేటలో కోటి రూపాయల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-30.wav?_=5

రామాయంపేటలో కోటి రూపాయల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన..

రామాయంపేట, నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండల కేంద్రంలోని మూడవ మరియు నాలుగవ వార్డుల్లో రోడ్ల అభివృద్ధి పనులకు రూ. 1 కోటి వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను గురువారం నాడు ప్రారంభించారు.ఈ పనులు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.వార్డుల్లో రోడ్ల పరిస్థితి గత కొంతకాలంగా తీవ్రంగా దెబ్బతినిన నేపథ్యంలో ఈ అభివృద్ధి పనులు ప్రజల్లో హర్షాతిరేకాలు నింపాయి.ఈ సందర్భంగా చౌదరి సుప్రభాత రావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే మా ప్రాధాన్యం.రోడ్డుపనుల ద్వారా ట్రాఫిక్ సౌకర్యం మెరుగవుతుంది.ఇది రామాయంపేట అభివృద్ధిలో మరో ముందడుగు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version