గణేష్ మండపాలను దర్శించిన చల్ల నారాయణ రెడ్డి…

మహాదేవపూర్ లో పలు గణేష్ మండపలను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ గారు*

** మహాదేవపూర్ సెప్టెంబర్ 5 నేటి ధాత్రి * *

 

మహాదేవపూర్ మండల కేంద్రంలోని గణేష్ నవరాత్రుల సందర్బంగా పలు గణపతి మండపాలను దర్శించుకొని,ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ అనంతరం మాట్లాడుతూ ప్రజలంతా సుఖశాంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిoచాలని,పాడి పంటలు సమృద్ధిగా పండాలని,ప్రజలందరికి గణేష్షుడు తోడై,నీడై ఉండాలని కోరడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్,మాజీ మండల అధ్యక్షులు సిరిపురం శ్రీమన్నారాయణ,మండల ప్రధాన కార్యదర్శులు బల్ల శ్రావణ్, లింగంపల్లి వంశీ, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య యాదవ్,కొక్కు శ్రీనివాస్, దాడిగేలా వెంకటేష్,కొక్కు రాకేష్ పాల్గొన్నారు

చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి

 

చౌటుప్పల్: చౌటుప్పల్ పట్టణం లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ల్ హాల్ లో ఆర్కే హాస్పిటల్ మరియు కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో పల్లె పల్లె కి వైద్య కార్యక్రమం లో భాగంగా చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 123వ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మునుగోడ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే వ్యక్తులకు వైద్య శిబిరం నిర్వహించినందుకు చావా ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వమే అన్ని చేయాలంటే కాదు, ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ తోటి సామాజిక కార్యక్రమాలు చేయాలి. మా తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే  ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న చావా ఫౌండేషన్ కి మా ఫౌండేషన్ తరపున మా ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుంది. నేను ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక స్నేహితుడు లాగా ,వ్యక్తిగా సహాయం చేస్తా పదవి అనేది శాశ్వతం కాదు, కానీ మన వ్యక్తిత్వం సేవ చెయ్యాలని గుణం పుట్టిన నాటి నుండి మరణించే వరకు ఉంటుంది కానీ పదవి ఉండదు అన్నారు.

చెరువు నిండితేనే… పంటలు పండేది…

చెరువు నిండితేనే… పంటలు పండేది

చూస్తే వానలే.. చెరువు పూర్తిగా నిండలే

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం కేంద్రంలోని దేవుని చెరువు నిండితేనే పంటలు పండు తాయి దేవుని చెరువు క్రింద ఉన్న పంట పొలాల దుస్థితి చెరువు వర్షం నీటి ఆధారంగా నిండుతుంది కానీ ప్రస్తుత చెరువు సగం మాత్రమే నిండింది. చెరువు నిండక పోతే భవిష్యత్తులో పంటల పరిస్థితి ఏమిటన్న బెంగ! దీంతో పంట పొలాలకు నీరు సరఫరా చేసేందుకు చాలా ఇబ్బందిక రంగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.వాతా వరణ మార్పుల ద్వారా వర్షం పడితే నిండిన సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ దేవుని చెరువుకు వర్షపు నీరు చెరువు లోకి రాక నిడటం లేదు.

 

వర్షా లు కురవడంతో మండలం లోని చాలా చెరువులు మత్తడి పోస్తున్నాయి కానీ దేవుని చెరువుకు ఆధారం లేక నిడటంలేదు. చెరువుకు వచ్చే వరద రాక ఎస్సారెస్పీలో నీరు పడి వృధాగా పోతున్న వర్షపు నీరు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ తీసుకొని చెరువు మత్తడి పోసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పాలకులు ఆ వైపుకు దృష్టి సాధించడం లేదు. దీంతో పొలాల రైతులు నీటి కొరత ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు

అధికారులు స్పందించాలి

శాయంపేట మండల రైతు ముసికే అశోక్

మండలంలోని దేవుని చెరువు కింద పంట పొలాలు సుమా రుగా 600 ఎకరాలు సాగుతు న్నాయి. చెరువుకు ఏటా నీటి రావడం కోసం తిప్పలు పడు తున్నాం. వర్షపు నీరు చెరువు లోకి రాకుండా ఎస్సారెస్పీ కాలువలో పడి వృధాగా పోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టించుకోని పని పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

— యురియా కోసం క్యూ కట్టిన రైతులు…

 

— యురియా కోసం క్యూ కట్టిన రైతులు
• అందుబాటులో యూరియా..
అధైర్యపడొద్దు..
తహసిల్దార్ శ్రీనివాస్..

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

గత కొన్ని రోజులుగా యూరియా కొరత ఏర్పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఎవరు అధైర్యపడొద్దు అని అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని ఎలాంటి అపోహలను నమ్మవద్దన్నారు. ఈనెల యూరియా ఆ నెలలోనే వస్తుందని సెప్టెంబర్ నెల యూరియా ఆగస్టులో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. శుక్రవారం నస్కల్ గ్రామానికి 20 మెట్రిక్ టన్నుల యూరియాను చల్మెడ, రాంపూర్, నస్కల్, నగరం గ్రామాలకు సంబంధించిన రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. యూరియాను అధిక మొత్తంలో చల్లకుండా 3 దాఫాలుగా చల్లడం వల్ల కర్ర ఎదుగుదల పెరుగుతుందన్నారు.

ప్యాలవారం లో దంచికొట్టిన వాన..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-23-2.wav?_=1

ప్యాలవారం లో దంచికొట్టిన వాన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని ప్యాలవారం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి, రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. నెలరోజుల తర్వాత కురిసిన వర్షానికి పంట చేనులో నీరు చేరడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షం పంటలను దెబ్బతీస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల అవగాహన కార్యక్ర మం.

ఆయిల్ పామ్, బహువార్షిక పండ్ల తోటల్లో అంతర పంటలుగా కూరగాయల సాగు ప్రభుత్వ ప్రోత్సాహకా లు
ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల అవగాహన కార్యక్ర మం
వరి నుండి పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు & మల్బరీ సాగు చేయాలి.

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

గురువారం తొర్రూరు మండలంలోని వెంకటాపురం, మాటేడు, హరిపిరాల, తదితర గ్రామాలలో సాగులో ఉన్న ఆయిల్ పామ్, పండ్ల తోటలు, కూరగాయ పంటలను జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న పరిశీలించారు.

ఈ సందర్బంగా రైతులకు సాగుపై పలు సాంకేతిక సలహాలు అందజేస్తూ రైతులు నికర ఆదాయం ఇచ్చే కూరగాయల పంటలను సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యాన శాఖ ద్వారా టమాట, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవవర్, తదితర మార్కెట్ డిమాండ్ ఉన్న కూరగాయల నారు మొక్కలను ఎకరానికి 8000 మొక్కలను ములుగు, సిద్ధిపేట జిల్లా నుండి రాయితీ పై సరఫరా సౌకర్యం ఉన్నదని తెలిపినారు. అలాగే తీగ జాతి కూరగాయల సాగుని శాశ్వత పందిరిని నూతనంగా నిర్మించి సాగు చేసే రైతులకు అర ఎకరానికి రూ. 50,000/- రాయితీని రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద కల్పించబడునని తెలిపారు. పామాయిల్ తోటలలో మొదటి నాలుగు సంవత్సరాలలో అంతరపంటల కింద కూరగాయలు సాగు చేసే ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 2,100/- అందించబడునని తెలిపారు.

ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి అవసరాల నిమిత్తం అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకోవాలి. కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రోట్రేస్లలో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు సర్వేశ్వర రావు, యాకయ్య, టి. జి. ఆయిల్ ఫెడ్ జిల్లా అధికారి సి.హెచ్. రాములు, క్షేత్ర సిబ్బంది వెంకట్, అఖిల్, రంజిత్, ప్రకాష్, బిందు సేద్య ప్రతినిధులు జి. ప్రసాద్ బాబు, జి. శరత్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ ఆయా మండలాలలో ఎండిన మొక్కజొన్న పత్తి పంటలు.

జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాలలో ఎండిన మొక్కజొన్న పత్తి పంటలు

ఖరీఫ్ కన్నీరు పెట్టిస్తోంది.. ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు..వరుణుడు మొఖం చాటేశాడు.. పంటలన్నీ ఎండిపోతున్నాయి.

◆ జాడలేని వానలు…

◆ ఎండుతున్న పంటలు.. ఆశల్లేని రైతులు…

◆ అడ్డాపై కూలీగా పనుల కోసం పరుగులు…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఖరీఫ్ కన్నీరు పెట్టిస్తోంది ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు వరుణుడు మొఖం చాటేశాడు పంటలన్నీ ఎండిపోతున్నాయి.

పెట్టుబడులు రాని దుస్థితి అప్పులు మీదపడ్డాయి బతుకు కష్టమవుతోంది మళ్లీ పొట్టచేతపట్టుకుని రైతన్న వలసబాట పడుతున్నాడు.

అన్నదాతను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి సరైన వర్షాలు కురవక ఖరీఫ్ సాగక రైతన్న ఆందోళనకు గురవుతున్నాడు.

వర్షాకాలం ప్రారంభంలో కురిసిన అడపాదడపా వర్షాలకు సాగుచేసిన ఆరుతడి పంటలు కూడా ఎండిపోతున్నాయి.

20 రోజులుగా వేసవిని తలపిస్తున్న ఎండలకు పంటలన్నీ చేతికందకుండా పోతున్నాయి.

బోర్ల ఆధారంగా వేసిన వరిపంటలకూ నీరందక నెర్రలు బారాయి కనీసం పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది.

దీంతో దిక్కుతోచని స్థితిలో మళ్లీ పొట్టచేతపట్టుకుని వలస బాటపడుతున్నాడు రెండేళ్లుగా కరువు తాండవం చేయడంతో పల్లెలను వదిలి పట్టణాలకు వలస వెళ్లిన అన్నదాతలు ఎంతో ఆశతోఈసారి ఖరీఫ్కు సన్నద్ధమయ్యారు.

ఈయేడు వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయన్న ఆశతో పల్లెలకు తిరిగి చేరుకున్నారు.

వేలాది రూపాయల అప్పులుచేసి పంటలు సాగుచేస్తే వర్షాలు లేక సాగుచేసిన ఆరుతడి పంటలన్నీ ఎండిపోయాయి.

కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి పల్లెల్లో కానరావడం లేదు.

పల్లెల్లో చేసేందుకు పనులు దొరకక సంగారెడ్డి పట్టణంలోని కూలీల అడ్డమీదకు పల్లెల నుంచి తరలివస్తున్నారు. మాకు పనులు చూపాలని వేడుకుంటున్నారు. ఒక్కరిని కూలికి పిలిస్తే నలుగురు ఎగబడుతున్నారజిల్లా అంతటా కరువు పరిస్థితులే కనిపిస్తున్నాయి మురిపించిన వర్షాల ఆధారంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, మినుములు, పెసర్లు, కందులు, జొన్న పత్తి పంటలను 1.20లక్షల హెక్టార్లలో రైతులు వేసుకున్నారు.

కొద్దోగొప్పో నీరు వచ్చే బోర్ల ఆధారంగా జిల్లా వ్యాప్తంగ పత్తి మినుములు, పెసర్లు, కందులు, పంటను సాగుచేశారు. వర్షాలు పడకపోవడంతో చేతికందే దశలో ఉన్న ఆరుతడి పంటలన్నీ ఎండిపోయ బోరుబావుల్లో సైతం నీటి ఊటలు అడుగంటిపోయి వరి పొలాలు నెర్రలు బారాయి. ఇక చేసేదిలేక అడ్డా మీదకు కూలీ పనులకోసం పరుగులు తీస్తున్నారు.

జహీరాబాద్ కోహిర్ మొగుడంపల్లి న్యాల్కల్ ఝరాసంగం మండలాల నుంచి నిత్యం వెయ్యి మందికిపైగా రైతులు కూలి పనులకు వస్తున్నారు. ఇక్కడ కూడా వారికి పనులు చెప్పేవారు లేకపోవడంతో నిరాశతో వెనక్కి తిరిగిపోతున్నారు.

ఆటో, బస్సుచార్జీలు పెట్టుకొని దూర ప్రాంతాల నుంచి పనికోసం వస్తే పనులు దొరకక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మక్క ఎండిపోయింది సారూ.

రెండెకరాల పొలం ఉంది అందులో రూ. 20వేల అప్పు చేసి పత్తి కందులు పంట వేశాను.

తీరా కంకి దశకు చేరుకున్న దశలో వర్షాలు పడకపోవడంతో పంటంతా ఎండిపోయింది.

దీంతో అడ్డామీదకు కూలీపని కోసం వచ్చినా ఇక్కడ కూడా పనిదొరకడం లేదు ఎట్లా బతకాల్లో అర్థమైతలేదు బొరేగౌ మొహమ్మద్ నవాబ్

రెండెకరాల పత్తి పోయినట్టే

నాకు రెండెకరాల పొలం ఉంది అందులో రెండు బోర్లున్నాయి వాటిల్లో కొద్దిపాటి నీరు వస్తుండటంతో రూ.30వేల అప్పు చేసి పత్తి పంట సాగుచేశాను.

వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీటి ఊటలు అడుగంటాయి పంట ఎండిపోతోంది అడ్డమీద పనికొచ్చినా పనిచెప్పేవారే లేరురైతు మాచునూర్ ఖలీల్.

పనులు చూపించాలి

మళ్లీ కరువు మొదలైంది పంటలుఎండిపోయాయి ప్రభుత్వం స్పందించి పల్లెల్లో పనులు చూపించి ఆదుకోవాలి.

బుక్కెడు కూడు కోసం అడ్డమీద పడిగాపులే వారానికి రెండు రోజులైన పని దొరకడం లేదు పల్లెల్లోనే ఉపాధి పనులు చేపట్టి ఆదుకోవాలి.  మేదపల్లి పరమేశ్వర్ పటేల్

పోషణ భారమైంది.

నాకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పత్తి పంట వేసిన. వర్షాలు కురవక ఎండిపోయింది అందుకోసం చేసిన అప్పులు మీద పడ్డాయి.

బతుకు దెరువుకోసం అడ్డామీద కూలీవస్తే పని దొరకుతలేదు.

కన్నబిడ్డలను పోషించుకునేందుకు ఆదేరువులేదు ప్రభుత్వమే పనులు చూపించి తుమ్మనపల్లి మొహమ్మద్ రోషన్.

హామీ మేరకు రైతులకు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి.

ఎన్నికల హామీ మేరకు రైతులకు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి,

ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు ఇవ్వాలి,

యూరియా సరఫరా లో ప్రభుత్వం విఫలం

గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో వడ్లు పండించిన ప్రతి రైతుకు ఎన్నికల హామీ మేరకు బోనస్ ఇవ్వాలని గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు హామీల అమలు విషయంలో కాలయాపన చేస్తున్నారని అన్నారు, ఇప్పటికైనా రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, ప్రతి రైతుకు రైతు బంధు పథకం అమలు చేయాలని, లేని పక్షంలో రైతుల పక్షాన ధర్నా చేపడతామని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో అనేక కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టారని, కొందరు రైతులకు ఇప్పటికీ ధాన్యం డబ్బులు పడలేదని, జిల్లా యంత్రాంగం రైతులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వానకాలం పంట సాగు సమీపిస్తున్న ఇప్పటికీ యూరియా అందుబాటులో లేదని, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి.

పంట నష్టపరిహారంపై స్పందించని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు…

బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులకు అండగా నిలబడాలి..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి, గాలి బీభత్సానికి కోతకు వచ్చిన వరి,ఇతర పంటలు నేలమట్టం కావడంతో రైతులకు తీవ్రనష్టం జరిగిందని మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి
అవేదన వ్యక్తం చేశారు.పంట కోత సమయంలో జరిగిన నష్టం రైతును మానసికంగా కృంగదీసిందని ఆయన పేర్కొన్నారు.గాలి బీభత్సం,అకాల వర్షం వలన నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా పలు రకాల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
డివిజన్ పరిధిలో కొన్నిచోట్ల కోతలు పూర్తి చేసుకుని అమ్మకానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్న రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దైందన్నారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని,పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు చెల్లించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఖానాపురం మండలంలో గత పది రోజుల క్రితం కురిసిన వర్షానికి పంట నష్టపోయిన రైతులను క్షేత్రస్థాయిలో స్థానిక రైతులుబిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తాను పరిశీలించి అధికారులకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదని ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు,అధికారులు రైతులను పట్టించుకునే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు.ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తుండగా పోలీసులతో అరెస్టు చేయించారే తప్ప రైతులకు మాత్రం భరోసా ఇవ్వలేకపోయారని ఆరోపించారు.నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో జరిగిన పంట నష్టాన్ని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.

పంట నష్టపోయిన రైతులకు.!

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25000/- నష్ట పరిహారం అందించాలి –

మాజీ పి ఎ సి ఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

మిల్లర్లు రైతులకు సహకరించాలి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలంలో అకాల వర్షం కారణంగా మండలంలో వరి పంట పూర్తిగా దెబ్బతిందని , పంట చేతికచ్చే సమయానికి రైతులపై పకృతి విలయతాండవం చేసిందని, రెండు రోజులుగా కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం ఇ పరిస్థితులను విపత్తుగా పరిగణలోకి తీసుకొని నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ 25000/- అందించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా అధికారులు, జిల్లా మంత్రి చొరవ తీసుకుని రైతులను ఆదుకోవాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు
మిల్లర్లు రైతులకు సహకరించాలని, సివిల్ సప్లై అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ రైతులకు భరోసా కల్పించాలని పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు.

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది.

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గాలివానకు దెబ్బతిన్న వరి,మామిడి,మిర్చి ఇతర నేలకొరిగిన పంటలను సర్వే చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు.క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటలను పరిశీలించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.అలాగే రైతుల పక్షపతి కాంగ్రెస్ ప్రభుత్వం అని,ప్రజలు అధైర్య పడొద్దని,ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా కల్పించారు.

అకాల వర్షం కు దెబ్బతిన్న పంటలు పరిశీలించిన.!

అకాల వర్షం కు దెబ్బతిన్న పంటలు పరిశీలించిన ఎంపీ ధర్మపురి

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

మండలంలోని కోజన్ కొత్తూరు గ్రామంలో గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వడగండ్ల వర్షాలకి నష్టపోయిన పంటలను పరిశీలించిన నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పంట నష్టం పై సత్వరమే సర్వే నిర్వహించి, నష్టపోయిన పంటకి ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహారం అందజేయాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నివేదిక పంపాలి అని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటే పంటకు జరిగిన నష్టం పరిహారం అందెదని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాని అమలు చేయకుండా ఇప్పుడు రైతులకు నష్టం జరిగిదని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు, సుకెందర్ గౌడ్ జిల్లా నాయకులు వాడేపల్లి శ్రీనివాసన్,వెంకట్ రెడ్డి,సదశివ్,రుద్ర శ్రీనివాస్,సుదవేణి మహేష్, తుకారాం గౌడ్, తిరుమల వాసు,శ్రీనివాస్,నవీన్,శ్రీధర్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్, మండల నాయకులు సుంచు రణధీర్, పంతగి వెంకటేష్, తిరుమల చారి,రాజారెడ్డి, మహేష్, సురేష్,వెంకట స్వామి, గణేష్, కౌడా రమేష్,ఆనంతు, రవి, అభి,మల్లేష్, రాజేందర్, రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నేల రాలిన పంటలు..అడుగంటిన ఆశలు

నేల రాలిన పంటలు..అడుగంటిన ఆశలు

-అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

-అసత్యపు ప్రచారాలు..వినతి పత్రాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు

-భూపాలపల్లి ఎమ్మెల్యేకు రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్న తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలయ్యేలా ముఖ్యమంత్రిని ఒప్పించండి

-నష్టపోయిన రైతుల పంట పొలాలను పరిశీలిస్తున్న చందుపట్ల కీర్తిరెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

రెక్కల కష్టాన్ని నమ్ముకొని పంటలు పండించిన రైతన్నకు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్నే మిగిల్చాయని..చేతికొచ్చిన పంట కళ్ళముందే కొట్టుకుపోతుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు కూరుకుపోతున్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈనెల 15న రాత్రి ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల పంటలను శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి, నేతృత్వంలోని బిజెపి బృందంతో పర్యటించి పంటలను పర్యవేక్షించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వానకు వరి, మామిడి, మొక్కజొన్న అరటి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెంటనే స్పందించి అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను సర్వే చేయించి..పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ:50 వేలు ఇప్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించాలని డిమాండ్ చేశారు. అసత్యపు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. అధికారంలో ఉండి వినతి పత్రాలు ఇస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. దేశవ్యాప్తంగా బీమా యోజన అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. దీంతో అకాల వర్షాలకు..ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో తెలంగాణలో ఫసల్ బీమా యోజనను అమలు చేసే విధంగా కృషిచేసి రైతులను ఆదుకోవాలే తప్ప..మీ చేతకానితనాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అన్నమునేని భూమారావు బలుగూరి రాజేశ్వరరావు లోకుల బోయిన తిరుపతి మండల ఉపాధ్యక్షులు బలుగూరి కిషన్ రావు రంగపురం మాజీ ఉప సర్పంచి వైనాల ప్రియాంక శివకుమార్ బలుగూరి తిరుపతిరావు అరికాంతపు కృష్ణారెడ్డి చిలకమర్రి రాజేంద్రప్రసాద్ రంగపురం బూత్ అధ్యక్షులు తక్కలపల్లి విజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు

పంట వేసిన అందని రైతు బందు.

పంట వేసిన అందని రైతు బందు

అధికారుల నిర్లక్ష్యమే కారణం

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

 

 

రైతు బంధు పథకం రైతుల సహాయార్థం కోసం గత ప్రభుత్వం చేపట్టిన ఒక అద్భుతమైన పథకం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం
తాము పంట వేసిన
సంబంధిత మండల వ్యవసాయాదికారులు సర్వే సరిగా చేయక పోవడం మూలంగా మాకు రైతు బందు పథకం కింద పెట్టుబడి సహాయం అందలేదని ఎల్లారెడ్డిపేట లో ఒక మహిళ రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకెళ్తే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన లింగాల బాలమణి అనే మహిళా రైతు కు ఎల్లారెడ్డిపేట లో ఒక ఎకరం 30 గుంటల వ్యవసాయ భూమి కలదు. ఆ వ్యవసాయ భూమి లో వరి పంట వేశారు.వరి పంట వేసిన కానీ రైతు బందు సహాయం పడలేదని మండల వ్యవసాయాధీకారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోలేదని ఆరోపించారు. పంట వేయని రైతులకు కొంతమంది కి రైతు బందు సహాయం అందిస్తున్నారని తమకు రైతు బందు సహాయం కింద పెట్టుబడి సహాయం అందకుండా చేసిన మండల వ్యవసాయాదికారుల పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె కోరారు.

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

 

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో ఇటీవలే అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.పంట నష్టానికి గల కారణాలను రైతుల అడిగి తెలుసుకున్నారు.
నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టితో ప్రతి రైతు యొక్క నష్టపోయిన పంట నష్టంను అంచనా వేయాలని ఆదేశించారు.రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఆరుగాలం కష్టించి రైతు సాగు చేసి,పండించిన పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షం వడగండ్ల వాన వలన రైతులు నష్టపోయి బాధపడుతున్నారని,నష్టపోయిన ప్రతి గింజకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,అధికారులు ప్రజాప్రతినిధులు,రైతులు ఉన్నారు.

గాలి వాన బీభత్సం నేల వాలిన పంటలు.

గాలి వాన బీభత్సం.. నేల వాలిన పంటలు

అకాల వర్షం రైతన్నల పాలిట శాపం

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండల కేంద్రంలో నిన్న రాత్రి సమయంలో అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది.చేతికి వచ్చిన పంట అకాల వర్షాల కారణంగా నేల రాలడంతో తమకు తీవ్రనష్టం వాటిళ్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల పరిధిలో రాత్రి సమయంలో ఊహించని విధంగా తుఫాన్ ను తలపించే లాగా విపరీతమైన ఈదురు గాలులతో వర్షం బీభత్సం సృష్టించింది.

Farmers

 

 

దాదాపు ఒక గంటపాటు తీవ్రమైన ఉరుము లు మెరుపులతో ఎడతెగని గాలి,వాన కురిసింది. పలు గ్రామాల్లో ఈదురుగాలుల కారణంగా రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది కల్లాలలో ఉన్న మొక్కజొన్న, వరి పంటలు తడిచి ముద్దయిన పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావిం చిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం రైతన్నల ఆశలను అడియాశ లు చేసింది. ఏదై ఏమైనా ఈ అకాలవర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు.

ప్రభుత్వమే ఆదుకోవాలి రైతన్నల ఆవేదన

మూసికె అశోక్ శాయంపేట రైతు

 

శాంపేట మండలంలో మంగళవారం రాత్రిపూట వర్షానికి రైతులు చాలు చేసిన మొక్కజొన్న పంట అరటి చెట్లు పూర్తిగా నేలకొరిగింది. మండలంలోని ముష్క అశోక్ మూడు ఎకరాల మొక్కజొన్న పంట సాగు చేశారు మంగళవారం రాత్రి కురిసిన గాలివాన బీభత్సానికి పంట అంతా నేలకొరిగింది దీంతో రూపాయల నష్టం జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యానవన పంటలలలో అరటి చెట్లు గాలివాన బీభత్సానికి నెలకు వాలింది. కూతురు రాజు, కోల మల్లయ్య, కోల చక్రపాణి, గాదె చిరంజీవి, కురాకుల ప్రశాంత్ 10 ఎకరాల నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్ష పాలవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Farmers

వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

శాయంపేట మండల వ్యవసాయ అధికారి గంగా జమున ఆదేశాల మేరకు మండల పరిధిలోని మైలారం, పెద్దకోడేపాక, కొప్పుల, పత్తిపాక, హుస్సేన్ పల్లి, శాయంపేట, గట్లకానిపర్తి, తహరాపూర్, కొత్తగట్టు సింగారం గ్రామాలలో మంగళ వారం రాత్రి గాలివానకు దెబ్బతిన్న పంటలను అర్చన, అన్వేషు, రాకేష్ ఏ ఈ ఓ లు ఉబ్ సందర్శించడం జరిగింది. అందులో మొత్తం 245మంది రైతుల వరి చేను 347ఎకరా లు,38మంది రైతుల 57ఎ కరాల మొక్కజొన్న,15మంది రైతుల 30ఎకరాలు అరటి తోట దెబ్బతిన్నాయి.

అకాల వర్షంనీకి దెబ్బతిన్న పంటల పరిశీలన.

అకాల వర్షంనీకి దెబ్బతిన్న పంటల పరిశీలన

కొత్తగూడ, నేటిధాత్రి:

 

ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల రాళ్ల వర్షలతో పంట పొలాలను అతలాకుతలం చేసి రైతులను రోడ్డున పడే పరిస్థితి తెచ్చిన ప్రకృతి…
దెబ్బతిన్న పంట పొలాలను చూసి రైతుల కష్టాలను వారి బాధలను దగ్గరగా చూసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు.ధనసరి సీతక్క
తక్షణమే అకాల వర్షాలతో రాళ్ల వానలతో దెబ్బతిన్న మొక్కజొన్న వరి పొలాలను వ్యవసాయ శాఖ చేత పరిశీలన చేసి నష్టపరిహారం వచ్చే విదంగా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పిన మాట ప్రకారం కొత్తగూడ మండలంలోని జంగంవాని గూడెం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారి వినోద్ ఆధ్వర్యంలో సోమవారం రోజు అకాల వర్షాలు రాళ్ల వానలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు… అకాల వర్షాలు రాళ్లవానతో వరి పంట మొక్కజొన్న దెబ్బతిన్న రైతులు వారి వారి ఆధార్ కార్డులు బ్యాంకు వివరాలతో వ్యవసాయ శాఖ అధికారులను కలిసి వారి పంట పొలాలను సర్వే చేపించారు..పంట నష్టపోయిన రైతులందరు వారి వివరాలు ఇచ్చి నష్టపరిహారం పొందగలరని అని ఆయన అన్నారు…

వడగండ్ల వానతో నష్ట పోయిన పంటలు.!

వడగండ్ల వానతో నష్ట పోయిన పంటల ను పరీశీలిస్తున్న కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి :

, వడగండ్ల వానతో వరి పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి తెలిపారు.మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కొత్తకోట మండల సంకిరెడ్డి పల్లి గ్రామంలో వడగండ్ల వానతో నష్టపోయిన వరి పంటలను కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు నాయక్ తో కలిసి పరిశీలించారు.వెంకట్ రాములు అనే వరి రైతు పొలాన్ని సందర్శించి రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సంకిరెడ్డి పల్లి లో మొత్తం ఎన్ని ఎకరాల్లో పంట నష్టం అయిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆరా తీయగా, వ్యవసాయ శాఖ సర్వే చేసిన ప్రకారం 170 ఎకరాల్లో పంట నష్టం అయిందని తెలిపారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వడగండ్లు, వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి పూర్తి వివరాలు నివేదిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబీ తెలిపారు.
జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, హౌసింగ్ పీడీ పర్వతలు, డి ఈ విటోభా, ఉద్యాన శాఖ అధికారి అక్బర్, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

నీళ్లు ఇవ్వలేదు..ఎండిన పంటలకు నష్టపరిహామైన ఇవ్వండి.!

నీళ్లు ఇవ్వలేదు…ఎండిన పంటలకు నష్టపరిహామైన ఇవ్వండి

* యువజన నాయకుడు నిమ్మ నిఖిల్ రెడ్డి

చేర్యాల నేటిధాత్రి…

Water

సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరాని రూ.20 వేల చొప్పున పంట నష్టపరిహారం రైతులకు అందించాలని యువజన నాయకులు నిమ్మ నిఖిల్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఎండిపోయిన పంట పొలాల రైతంగానికి నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వర్ష కాలంలో పంటలు సాగు చేసిన రైతులకు యాసంగి పంటకు అవసరమైన సాగునీరు అందిస్తామని ప్రకటనలు చేశారని, ఇక నీళ్లు వస్తాయని ప్రచారం చేయడంతో రైతులు గంపెడంత ఆశతో పంటలు సాగుచేసుకున్నారని అన్నారు. తీరా సమయానికి ఒక్క చుక్క నీళ్ల అందించడం లేదని, నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే రైతులు కన్నీటి పర్వతమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ఇబ్బందులు ఉండవని చెప్పిన నాయకులు ఇప్పుడు యాసంగికి నీళ్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగానే ఉందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.

నీళ్లు లేవు పంటలు ఎండిపోతున్నాయి.

నీళ్లు లేవు పంటలు ఎండిపోతున్నాయి
• కన్నీరు మున్నిరవుతున్న రైతన్నలు
• కాలువలు లేక తిప్పలు

నిజాంపేట: నేటి ధాత్రి

భూగర్భ జలల్లో నీళ్లు లేక రైతుల పొలాల్లో బోర్ మోటార్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ మేరకు నిజాంపేట మండల వ్యాప్తంగా నందగోకుల్, నస్కల్, చల్మెడ గ్రామాల్లో బోర్ మోటార్లు తగ్గుముఖం పట్టాయి. దింతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరి నాట్ల సమయంలో అధికంగా పోసిన బోరు మోటార్లు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడం తో ఏమి చెయ్యాలో అర్థం కాకా రైతులు తలలు పట్టుకుంటున్నారు. బోరమోటార్ లను నమ్ముకొని వరినాటు భూమి ఉన్నవరకు వేశామని ఇప్పుడు బోర్లు పొయ్యకపోవడం తో చాలా వరకు వరి పంటలు ఎండిపోవడం తో పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఉందని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. చేతికి వచ్చిన పంటలు ఎండ తీవ్రత కు ఎండిపోతుంటే ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. మండలం లో కొన్ని గ్రామాలకు కాళేశ్వరం నీరు కాలువల ద్వారా వస్తున్నాయని తమ గ్రామాలకు కూడా నీరు వచ్చేలా చూడాలని ప్రభుత్వన్ని వేడుకుంటున్నారు. కాళేశ్వరం నీరు కాలువల ద్వారా ప్రతీ గ్రామంలో గల చెరువులలోకి పంపించినట్లయితే భూగర్భ జలలు పెరిగి బోర్లు సంమృద్ధిగా పోస్తాయని అభిప్రాయ పడుతున్నారు.

crops

• మా గ్రామాలకు కాలువలు తీసుకురండి
రైతు చంద్రయ్య
మా గ్రామాలకు కాలువలు లేకపోవడంతో
కాళేశ్వరం నీరు రావడం లేదు. మా పంటలకు కాళేశ్వరం నీరు అందించండి! కాలువల ద్వారా కాళేశ్వరం నీరు గ్రామాలలో చెర్వులోకి వదిలితే భూగర్భ జలాలు పెరుగుతాయి

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version