శాయంపేటలో ఉచిత సన్న బియ్యం పంపిణీ చేసిన.

శాయంపేటలో ఉచిత సన్న బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రాష్ట్రంలోని పేద ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

శాయంపేట నేటి ధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని సింగరకొండ రమేష్ గుప్తకు చెందిన రేషన్ షాపు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ఆహార భద్రతకార్డు ఉన్న లబ్దిదారులకు భూపాల పల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారం భించి పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ రాష్ట్రంలో ఈ సంవ త్సరం ఉగాది పండుగ చరిత్ర పుటల్లో లిఖించదగ్గ రోజుగా నిల్వనున్నదని ,దేశంలోనే తొలిసారిగా పేద ప్రజల ఆహార భద్రతకు మన ముఖ్య మంత్రి ఎనుములరేవంత్ రెడ్డి సారథ్యంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిందని దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఆహార భద్రత కల్పిం చాలన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని అన్నారు.

Congress

 

ఈ పథకం కింద రాష్ట్ర జనాభాలో సుమారు 80% ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం లబ్ది చేకూరుతుందని,రాష్ట్రంలోని పేద ప్రజల ఆహారభద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.

దొడ్డు బియ్యం తినేందుకు ప్రజలు అనాసక్తత కనపరచడంతో పాటు దళారులకు అమ్ముకోవ డం వలన పక్కదారి పడు తున్నాయని అన్నారు.

వీటన్నింటిని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకానికి నిర్ణయం తీసుకుం దని అన్నారు అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.

పేద ప్రజలకు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.

Congress

అనంతరం 32 మంది సిఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ. 10,63,500/- విలువ గల చెక్కులను అందజేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది.

లక్షలు ఖర్చుచేసి ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశా లల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలుస్తుంద న్నారు.

ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ,శాయంపేట ఎమ్మార్వో మండలములోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని గ్రామాల కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్.

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్.

 

 జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహిరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా మాజీమంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పట్టణం లోని ఈద్గా లో రంజాన్ వేడుకల్లో పాల్గోన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఈద్ ముబారాక్ అంటు శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు ఉగ్గేల్లి రాములు పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు ,యుత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ.

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ….

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల ఈద్గా ప్రాంతంలో సోమవారం పవిత్ర రంజాన్ పర్వదినంలో భాగంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో ఎమ్మెల్యే ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ…

Muslim

రంజాన్ పండుగ మతసామరస్యానికి,సుహృ ద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, ధాతృత్వానికి ప్రతీక అన్నారు. అల్లాహ్ దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.ప్రార్థనలో భాగంగా ముస్లింలు అందరు ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 కి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలో భాగంగా నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈద్గాల వద్దకు చేరుకొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు. రంజాన్ మాసంలో 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలలో ఉంటారని తెలిపారు. చక్కగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈద్గా ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ముస్లిం మత పెద్దలు, యాకుబ్ ఆలీ,డాక్టర్ సలీం, లాడెన్, ఎం డి పాషా, ఖలీం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, నాయకులు రఘునాథ్ రెడ్డి, గాండ్ల సమ్మయ్య, ధీకొండ శ్యాం గౌడ్,శ్రీనివాస్, గోపతి భానేశ్, సత్యపాల్, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

శ్రీ వేంకటేశ్వర దేవాలయం పంచాంగం శ్రావణములో.

శ్రీ వేంకటేశ్వర దేవాలయం పంచాంగం శ్రావణములో

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి

సన్మానం చేసిన ఆలయ అయ్యలూరి రగునాథం శర్మ

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పంచాంగం శ్రవణం కార్యక్రమంలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి పాల్గొన్నారు .

Temple

 

సందర్భంగా ఆలయ ఆలయ చైర్మన్ అయ్యలు రఘునాథ శర్మ చిన్నారెడ్డిని శాలువతో సన్మానించారు ఆలయ పూజారులు ఆశీర్వదించారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు గంధం నాగరాజ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి పంచాగ కర్త నాగరాజు సిద్దాoతి ని ఆలయ చైర్మన్ అర్చకులను శా లువతో సన్మానించారు

లైబ్రరీ సెక్రెటరీగా వడ్లకొండ రంజిత్ గౌడ్.

లైబ్రరీ సెక్రెటరీగా వడ్లకొండ రంజిత్ గౌడ్

 

మందమర్రి నేటి ధాత్రి

 

మంచిర్యాల జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికల్లో లైబ్రరీ సెక్రెటరీగా వడ్లకొండ రంజిత్ గౌడ్ విజయం సాధించారు..ఈ సందర్బంగా ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో &వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థానిక తిరుమల ఫోటో స్టూడియో మందమర్రి పాత బస్టాండ్ లో శాలువా తో సన్మానించి పూలుబొకే అందించడమైనది
కార్యక్రమంలో. రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్. మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకట స్వామి. ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్. కోశాధికారి బద్రి సతీష్. ఉపాధ్యక్షులు లక్కీరెడ్డి అనిధర్ రెడ్డి. గౌరవ సలహాదారులు. నక్క తిరుపతి. పట్టి సతీష్ బాబు జాడి ముకుందo కార్యదర్శి పసుల రవి. మాజీ ఉపాధ్యక్షులు విక్టరీ అశోక్. తాళ్లపల్లి రమేష్ చింతకింది రవి తదితరులు పాల్గొన్నారు

నిజాంపేట మండలంలో రంజాన్ వేడుకలు.

— నిజాంపేట మండలంలో రంజాన్ వేడుకలు

• ఈద్ శుభాకాంక్షలతో అలింగనం

నిజాంపేట: నేటి ధాత్రి

మండల కేంద్రంలో రంజాన్ పండగను పురస్కరించుకొని ఈద్గాలో ముస్లిం మత పెద్ద జనాబ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు నిర్వహించి సోమవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అలైయి, బలైయి చేపట్టడం జరిగిందన్నారు. మతసామరస్యానికి ప్రతీక గా రంజాన్ పండుగను కొలుస్తామన్నారు. సమానత్వం, పరమత సహనం, సహాయగుణం, దయాగుణం వంటి విషయాలపై వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య.

— పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య

 

నిజాంపేట: నేటి ధాత్రి

పనిచేసుకొని బ్రతుకుమంటే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరి నరసింహ చారి (20) తన తల్లి చిన్నప్పుడే చనిపోవడం తో నానమ్మ కమ్మరి కమలమ్మతో ఉంటున్నాడు. నానమ్మ కూలి నాలి చేసి సాదుతుండేది. రోజురోజు ఆరోగ్యం క్షీణించడంతో పనిచేయడం వీలుకాక ఇకనుండి ఏదైనా పని చేసుకుని బ్రతకమని నరసింహ చారిని మందలించగా మనస్థాపానికి గురై క్షణికావేశంలో రాత్రి ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని నానమ్మ కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

రాచన్న స్వామి ఆలయంలో అభిషేకాలు.

రాచన్న స్వామి ఆలయంలో అభిషేకాలు.

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

కోహిర్ మండలం బడంపేటలోని రాచన్న స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. స్వామివారికి బిల్వదళాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేశారు. రాచన్న స్వామిని దర్శించుకునేందుకు సంగారెడ్డి తో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

ఏఐసిడబ్ల్యూఎఫ్ ఆఫీస్ బేరర్ గా అల్లి రాజేందర్.

ఏఐసిడబ్ల్యూఎఫ్ ఆఫీస్ బేరర్ గా అల్లి రాజేందర్

మందమర్రి నేటి దాత్రి

 

ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసిడబ్ల్యూఎఫ్) ఆఫీస్ బేరర్ గా పట్టణానికి చెందిన సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ నియమితులయ్యారు. గత మూడు రోజులుగా జార్ఖండ్ రాష్ట్రం రాంచీ లో నిర్వహించిన మహాసభలకు సింగరేణి నుండి 30 మంది సిఐటియు యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మహా సభలలో ఆఫీస్ బేరర్ లను ఎన్నుకోగా, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ని ఉపాధ్యక్షుడిగా, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేజ్ బోర్డు కమిటీ సభ్యుడు మంద నరసింహారావు ను కార్యదర్శిగా, యూనియన్ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ ను ఆఫీస్ బేరర్ గా నియమితులయ్యారు. వీరితోపాటు మరో ఎనిమిది మందికి సైతం వర్కింగ్ కమిటీలో స్థానం కల్పించారు. ఈసందర్భంగా యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో వీరి నాయకత్వం లో యూనియన్ నిర్మాణం పెంచే విధంగా కమిటీ పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మందమర్రి బ్రాంచ్ నుండి అల్లి రాజేందర్ ను ఏఐసిడబ్ల్యూఎఫ్ ఆఫీస్ బేరర్ గా ఎన్నుకున్నందుకు ఫెడరేషన్ కమిటీకి, సిఐటియు రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బ్రాంచ్ నుంచి ప్రతినిధికి ఫెడరేషన్ లో మంచి అవకాశం కల్పించడం హర్షనీయమని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రాజేందర్ మరింత ఉన్నత స్థానానికి ఎదిగి, యూనియన్ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అల్లి రాజేందర్ కు బ్రాంచ్ తరపున శుభాకాంక్షలు తెలిపారు.

మసీదుల్లో ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

రంజాన్‌.. మసీదుల్లో ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

పరోపకారానికి, సహనానికి ప్రతీకగా నిలిచే రంజాన్‌ పర్వదినాన్ని జహీరాబాద్ ఝరాసంగం మొగుడంపల్లి న్యాల్కల్ కోహిర్ మండలంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ శుభాకాంక్షలు జరుపుకున్నారు ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్‌ను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆయా గ్రామాలలో ఆవరణలో ఉన్న మసీదులో ఈద్గా లో ఉన్న ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.రంజాన్‌ పురస్కరించుకుని గ్రామాలలోని మసీదులు కొత్త కలను సంతరించుకున్నాయి. కాగా, రంజాన్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.

Ramadan

మహ్మద్‌ ప్రవక్త ద్వారా అల్లాహ్‌ తరపున ఖురాన్‌ గ్రంథం లిఖించినందుకు కృతజ్ఞతగా ముస్లింలు నెల రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తూ. జీవన గ్రంథమైన ఖురాన్‌కు అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు దేవుడు నెల రోజులపాటు ఉపవాసాలు నిర్ణయించాన్నది ముస్లింల నమ్మకం. కోపం, మదం, మోహం, అవినీతి, అహంకారం, దౌర్జన్యం లాంటి దుర్గుణాలను త్యజించాలని బోధించేదే రంజాన్‌ మాసం.అల్లా దీవెనలతో మన భారతదేశ ప్రజలందరూ జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ.

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ……

మనలో సోదర భావాన్ని పెంపొందించే ఇఫ్తార్ విందు దోహదం చేస్తుంది…

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముస్లింలకు పెద్దపీట వేస్తుంది…

యావత్ తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు తెలియజేశారు….

రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్ -గా-గుల్షన్ ఈద్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …

వరంగల్ (నేటిదాత్రి ):

 

ఈరోజు రంజాన్ పర్వదినం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్ పరిధిలోని మామునూర్ లక్ష్మిపురం గ్రామంలోని ఈద్ -గా – గుల్షన్ ఈద్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ముఖ్య అతిధిలుగా పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి *శ్రీ కేఆర్ నాగరాజుఅనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ అని తెలిపారు. రంజాన్ మాసంలో ఆచరించి ప్రార్థనలు, ఉపవాసం క్రమశిక్షణను ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు తమ పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అలాగే నేను ఈ ప్రాంతం నుంచి పెరిగి ఉన్నత విద్యలను అభ్యసించి నా చిన్నతనం నుంచి ఎన్నో క్రీడలో పాల్గొన్ని ఒక హకీ ప్లేయర్ గా అంతర్జాతీయ స్థాయిలో వెళ్లడం నాకు చాలా ఆనందకరమని మరియు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వడం నాకు చాలా సంతోషకరమని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన తెలియజేయడం జరిగింది..

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా, దేశంలోనే అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ పర్వదినం రోజున ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సోదరులకు కోరారు….

ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చెవ్వు శివరామకృష్ణ, ముస్లిం పెద్దలు బాబా భాయ్, జమీర్, సిధిక్,అఫ్జల్, ఎం.డి సర్వర్, ఎం.డి నయీముద్దీన్ ముస్లిం సోదరులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు….

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన.

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

పవిత్ర రంజాన్ పండుగని పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణంలోని ఈద్గాలో పార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి పవిత్ర రంజాన్ పండుగ ను పురస్కరించుకుని వారు మాట్లాడుతూ నెలరోజులు కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. మతసామరస్యానికి తెలంగాణ రాష్ట్రం నిలువెత్తు నిదర్శనం అన్నారు.రంజాన్ మాసం సందర్భంగా నెలరోజుల కఠిన ఉపవాస దీక్షతో క్రమశిక్షణ,ఆధ్యాత్మిక చింతన,దాతృత్వం,ప్రేమ,దయ,సోదర భావం ఐక్యతను పెంపొందిస్తాయి అన్నారు.ఈకార్యక్రమంలో టిజిఐడిసి మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్ గారు,మైనార్టీ సోదరులు, మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర,జిల్లా,అసెంబ్లీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలుగా.!

హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలుగా జ్యోతి రమణ నియామకం

వనపర్తి నేటిదాత్రి :

 

హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలుగా వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన నారాయణదాసు జ్యోతి రమణ నియామకం అయ్యారు ఈ మేరకు ఢిల్లీ నుండి హిందూ సభ జాతీయ అధ్యక్షులు స్వామి సౌ పర్ణిక విజయేంద్రపురి నియామక పత్రం పంపారని జ్యోతి రమణ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ పాండి చ్చేరి 5 రాష్ట్రాలకు హిందూ సభ ఇన్చార్జిగా నియమించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ చిన్నయ్య నంద్ సరస్వతి నిర్మల్ వైడ్ సి గాయత్రి దేవేంద్ర కుమార్ చౌదరి బిజెపి జాతీయ రాష్ట్ర నాయకులకు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన మాజీ కౌన్సిలర్ జ్యోతి రమణ హిందూ సభ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమకమైనందుకు వనపర్తి జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఏర్పుల సుమిత్రమ్మ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు

వైద్య ఖర్చుల నిమిత్తం L.O.C మంజూరు.

వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్. ఓ. సి మంజూరు

– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి కృషితో

సిరిసిల్ల టౌన్(నేటి ధాత్రి):

 

సిరిసిల్లలోని స్థానిక పోచమ వీధి లో నివాసం ఉంటున్న పెంటమ్ కవిత భర్త నర్సింగ్ అనారోగ్యరిత్య నిమ్స్ లో చేర్చడం జరిగింది. వారియొక్క అనారోగ్య పరిస్థితిని సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకవెళ్లారు. వారు వెంటనే స్పందించి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆది శ్రీనివాస్ నిమ్స్ లో వైద్యఖర్చుల నిమిత్తం 2,50,000 రూపాయిల ఎల్. ఓ. సి ని మంజూరు చెయ్యడం జరిగిందని తెలిపారు. 2,50,000 రూపాయలు ఎల్. ఓ. సి ని మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డికి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెల్ముల స్వరూప తిరుపతి రెడ్డికి పెంటమ్ కవిత భర్త నర్సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

గందె సత్యానందం ఉదయలక్ష్మి ఆధ్వర్యంలో.

గందె సత్యానందం ఉదయలక్ష్మి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

 

పరకాల నేటిధాత్రి:

పరకాల పట్టణంలోని గందె సీతారాములు కంపెనీ యజమాని గందె సత్యానందం ఉదయలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదినం రోజున వేసవికాలంలో మండుటెండలో బాటసారిలకు వివిధ గ్రామాల నుంచి పనులకు పరకాలకు వస్తున్న రైతు సోదరులకు ప్రజలకు దాహార్తిని తీర్చుటలో తన వంతు సహాయం చేసే సదుద్దేశంతో ఉచిత చలివేంద్రమును ప్రారంభించడం జరిగింది.గత కొన్ని సంవత్సరాలుగా ఈ చలివేంద్రమును నిర్వహిస్తూ బాటసారిలకు చల్లని నీటిని అందిస్తున్నామని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల పరిసర గ్రామ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందచాహలతో సంతోషంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీ కుంకుమేశ్వర స్వామిదేవస్థానం మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు శిరీష దంపతులు పాల్గొన్నారు.

కష్టం మా వంతు…పదవులు మీ వంతు!

కష్టం మా వంతు…పదవులు మీ వంతు!

`ఎన్నికలలో గెలపు కోసం అహర్నిశలు పని చేసేది కార్యకర్తలు

 

`పార్టీని బలోపేతం చేసేది కార్యకర్తలు

`జెండాలు మోసేది కార్యకర్తలు

 

`పార్టీ ప్రచారంలో పాలు పంచుకునేది కార్యకర్తలు

`ఎన్నికలలో గెలుపు కోసం సర్వం త్యాగం చేసేది కార్యకర్తలు

`పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూటలు తెచ్చే వారే ఆప్తులు

`పార్టీలు మారిన వారికి పదవులు

`కష్టపడిన వాళ్లకు ఇంకోసారి చూద్దామని భుజ్జగింపులు

`కార్యకర్తల మనోవేధన పట్టించుకోరు

`ప్రతిపక్షంలో వున్నప్పుడు కార్యకర్తలు కావాలి

`అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను దూరం పెట్టాలి

`అన్ని పార్టీలు అనుసరిస్తున్నదిదే

`కార్యకర్తల సంక్షేమం పట్టించుకోవంతే.కష్టం మా వంతు…పదవులు మీ వంతు!

`ఎన్నికలలో గెలపు కోసం అహర్నిశలు పని చేసేది కార్యకర్తలు

`పార్టీని బలోపేతం చేసేది కార్యకర్తలు

`జెండాలు మోసేది కార్యకర్తలు

`పార్టీ ప్రచారంలో పాలు పంచుకునేది కార్యకర్తలు

`ఎన్నికలలో గెలుపు కోసం సర్వం త్యాగం చేసేది కార్యకర్తలు

`పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూటలు తెచ్చే వారే ఆప్తులు

`పార్టీలు మారిన వారికి పదవులు

`కష్టపడిన వాళ్లకు ఇంకోసారి చూద్దామని భుజ్జగింపులు

`కార్యకర్తల మనోవేధన పట్టించుకోరు

`ప్రతిపక్షంలో వున్నప్పుడు కార్యకర్తలు కావాలి

`అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను దూరం పెట్టాలి

`అన్ని పార్టీలు అనుసరిస్తున్నదిదే

`కార్యకర్తల సంక్షేమం పట్టించుకోవంతే

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాను రాను రాజకీయాలంటే యువతలో నిరాసక్తత ఎదురౌతోంది. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు రాజకీయాల వైపు ఆకర్షితులు కావడం లేదు. రాజకీయాలపై అందిరకీ ఆసక్తి వుండదు. ఒక ఊరులో వెయ్యి మంది వుంటే రాజకీయాలు చేసే వారు పట్టుమని పది మంది కూడా వుండరు. కాని రాజకీయ పార్టీల అభిమానులు చాలామంది వుంటారు. గతంలో రాజకీయాలంటే ఒక యజ్ఞంగా వుండేది. రాజకీయాలు చేస్తే పదవులు వస్తాయన్న ఆశ వుండేది. కాని ఇప్పటి రోజుల్లో పదవులు ఎవరికి వస్తాయో? ఎప్పుడు వస్తాయో? ఎలా వస్తాయో? ఎవరికి రావాల్సిన పదవులు ఎవరు పొందుతారో? ఎందుకు పొందుతారో? ఎలా పొందుతున్నారో కూడా తెలియనంత సీక్రెట్‌గా పదువులు పొందుతున్నవారున్నారు. దాంతో జెండా మోసిన కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంటోంది . రాజకీయాలంటేనే నిరాసక్తత ప్రదర్శిస్తోంది. అంతే కాకుండా అదికారంలో వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ద పదవులు పూర్తిగా భర్తీ చేయక వాటిని చూపించి, ఐదేళ్లు నాయకులను రాజకీయ పార్టీలు వంచిస్తున్నాయి. ఆ పదవి నీకే నీకే అంటూ పుణ్యకాలం పూర్తి చేస్తున్నాయి. ప్రశ్నిస్తే వచ్చేది మన ప్రభుత్వమే అప్పడు మొదటి విడతలో పదవి నీకే అంటారు. ఇలా ఇప్పుడు కాదు, గత కొన్ని దశాబ్ధాలుగా సాగుతూనే వుంది. కాకపోతే ఇప్పుడు మరో రాజకీయం సాగుతోంది. గతంలో పార్టీ మారే నాయకులు పెద్దగా వుండేవారు కాదు. సిద్దాంతాలు వదలి, మరో పార్టీలో చేరేవారు తక్కువగా వుండేవారు. పదవులు రాకపోయినా సరే, అదే పార్టీలో వుంటూ వచ్చేవారు. కాని ఇప్పుడు నాయకులు, కార్యకర్తల పరిస్ధితి మారిపోయింది. ఎవరు ప్రాదాన్యతనిస్తే వారి పార్టీలోకి వెళ్తున్నారు. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీలోకి వెళ్తున్నారు. మళ్లీ అధికారం మారగానే మళ్లీ నిస్సిగ్గుగా సొంత గూటికి అని చెప్పి చేరిపోతున్నారు. మళ్లీ పదవులు పొందుతున్నారు. ఇలా ఏ ఎండకాగొడుడు పట్టే నాయకులు అంతో ఇ ంతో బాగుపడుతున్నారు. పదవులు పొందుతున్నారు. నాయకులుగా వెలుగుతున్నారు. అంతే కాని ఆది నుంచి జెండా మోసిన కార్యకర్త అడుగడుగునా మోసపోతున్నాడు. రాజకీయాల్లో ఆగమౌతున్నాడు. జీవితం నాశనం చేసుకుంటున్నాడు. బైట గొప్పలు చెప్పుకోవడానికి అలవాటు పడి రాజకీయాలు వదులుకోలేకపోతున్నారు. అప్పులు చేసి నాయకుడుగా చెలామణి కావడం మానుకోవడంలేకుండా వున్నారు. నిత్యం తెల్లబట్టలేసుకోవాలి. ఉదయమే రాచ కార్యం వెలగబెట్టినట్లు ఇంట్లోనుంచి వెల్లాలి. అ ంతే ఇంట్లో వున్న వాళ్లు తింటున్నారా? తినడం లేదా? తన కోసం ఎదురుచూస్తున్నారా? లేదా? అన్న ఆలోచన వుండదు. రాత్రి దాకా నాయకులకు భజన చేసుకుంటూ వుండి రాత్రికి ఇంటికి చేరుకోవడం, మళ్లీ తెల్లారిందంటే వెళ్లిపోవడం ఇ ంతకన్నా కార్యకర్తలు చేసేదేమీ లేకుండాపోయింది. పదవులు పొంది నాలుగు రూపాయలు సంపాదిం చుకున్నది లేదు. గతంలో గ్రామ స్దాయి నుంచి, మండల,జిల్లా స్దాయి వరకు నాయకులకు ఏవో పనులు వుండేది. అభివృద్ది పేరిట విడుదలయ్యే నిధులతో చిన్నా చితకపనులు చేసేవారు. కాని ఇప్పుడు ఆపని కూడా లేదు. ఆదాయం రూపాయి రాదు. అయినా పార్టీ జెండా మోస్తూనే వుంటున్నారు. గతంలో లేని, ఇప్పుడు కొత్తగా కార్యకర్తలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో పోలీసులు కేసులు అదనం. ఇప్పటి రాజకీయాల్లో ఇది ఒక నూతన పోకడ. రాజకీయపార్టీల కార్యకర్త ఎప్పుడు కేసులు ఎదుర్కొంటాడో తెలియదు. అదికార పార్టీపై ఏం మాట్లాడినాసరే కేసులు ఎ దుర్కొవాల్సిందే. ఏం మాట్లాకుండా వున్నా, మాట్లాడిన నాయకుడి పక్కన వున్నా చాలు కేసుల్లో ఇరుక్కోవాల్సిందే. ప్రతిపక్షాలకు చెందిన కాస్తో, కూస్తో బలమైన నాయకుడైతే చాలు. కేసులు వి పరీతం. అది గ్రామ నాయకుడైనా సరే, మండల స్దాయి నాయకుడైనా సరే ఎప్పుడూ ఏదో ఒక కేసు ఎదుర్కొవాల్సిందే. ఇక జిల్లాలకు,మండలాలకు మంత్రులు పర్యటనలకు వస్తే చాలు ప్రత్యర్ది పార్టీల నాయకులను ముందస్తు అరెస్టులు చేయాల్సిందే. బైండోవర్లు చేసి రోజుల తరబడి స్టేషన్‌లో వుంచాల్సిందే. మంత్రుల పర్యటనలు పూర్తయిన తర్వాత గాని వదిలే అవకాశం లేకుండాపోయింది. ఇన్ని నిర్భందాల మద్య రాజకీయం చేసినా, కేసులు ఎదుర్కొన్నా, పోలీసు దెబ్బలు తిన్నా, కేసులకు ఎన్ని డబ్బులు ఖర్చైనా, పార్టీ అదికారంలోకి వచ్చాక పదవి వస్తుందా? రాదా? అన్నది మళ్లీ నాయకుల చేతుల్లోవుండదు. నాకే పదవి అని చెప్పుకునే పరిస్దితి నాయకులు వుండదు. పైగా నాకు పదవి ఎందుకు ఇవ్వవని నిలదీసే హక్కు కూడా వుండదు. ఒక వేళ సంబంధిత ఎమ్మెల్యేనో, మంత్రినో గట్టిగా నిలదీస్తే అదికార పార్టీలో వున్నా సరే కేసులు ఎదుర్కొవాల్సిందే. లేకుంటే అంతకు ముందుకన్నా ఎక్కువ నిర్భందం చూడాల్సిందే.ఎందుకంటే అదికార పార్టీలో వున్నప్పుడు పదవులు అడుక్కొవాలి. ఇచ్చేదా ఎదురుచూడాలి. రాకుంటే ప్రశ్నించకూడదు. ఒకవేళ నమ్మకంలేకపోతే పార్టీ మారిపోవచ్చు. ఓ స్ధాయిన నాయకులకు తప్ప, ద్వితీయ శ్రేణి నాయకులకు తప్పని తిప్పలివి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, కేంద్రంలోనూ ఇదే పరిస్దితి వుంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర కాలమౌతోంది. కాని ఇంకా పూర్తి స్ధాయిలో పంపకాలు జరగడం లేదు. ఆ పదవులేమీ ఐదేళ్లు వుండవు. కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికే ఏడాదిన్న కాలం పూర్తయిపోయింది. వాటికి ఎవరినో ఒకరిని భర్తీ చేస్తే, మరో ఆరు నెలల్లో కొత్త వాళ్లకు అవకాశమిస్తే చాల మంది నాయకులను సంతృప్తిపర్చినట్లు వుండేది. కాని ఇప్పటికే మొదటి దఫా పదవులు అందలేదు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి పదవులు కూడా ఇంకా పావు వంతు కూడా భర్తీ కాలేదు. ఇంకా స్ధానిక సంస్ధల ఎన్నికలు రావాల్సి వుంది. వాటి కోసం కూడా చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఇలా గతంలో కూడా రాజకీయ పార్టీలు చేశాయి. కొన్నిసార్లు ఎన్నికలకు ఓ ఏడెనమిది నెలల ముందు పదువులు ఇవ్వడం అలవాటు చేసుకుంటున్నారు. పార్టీ మళ్లీ అదికారంలోకి వస్తేనే ఆ పదవి వుంటుంది. లేకుంటే పోతుంది. ఇలా కూడా నాయకులను పార్టీలు మోసం చేస్తున్నాయి. గత ప్రభుత్వం కూడా తెలంగాణలో ఇదే చేసింది. ఇచ్చిన నాయకులకే మళ్లీ మళ్లీ పదవులు పంచింది. పదేళ్లలలో కూడా పదవులు అందని వారు ఎంతో మంది వున్నారు. పద్నాలుగేళ్లపాటు ఉద్యమంలో పాలు పంచుకొని, పోరాటం చేసి, ఎన్నికలప్పుడు పార్టీని గెలిపించుకుంటూ ఆస్ధులు పోగొట్టుకున్న వాళ్లు బిఆర్‌ఎస్‌లో కొన్ని వేల మంది వున్నారు. బిఆర్‌ఎస్‌ పదేళ్లపాటు అదికారంలో వున్నా, పదవులు రాకుండా పోయిన వారు కొన్ని వేల మంది వున్నారు. తెలంగాణ తెర్లు కావొద్దన్న ముచ్చట చెప్పి, ఇతర పార్టీలనుంచి వచ్చిన, తెచ్చుకున్న నాయకులకు ప్రాధాన్యతలనిస్తూ, అసలు ఉద్యమకారులను పక్కన పెట్టి పదవులు పంచిన సందర్భం వుంది. ఇప్పుడు ఏపిలో కూడా అదే పరిస్ధితి మళ్లీ కనిపిస్తోంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు కూడా పూర్తి స్ధాయిలో పదవులు పంచిన సందర్భం ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా జరుగుతుందన్న నమ్మకం నాయకుల్లో లేకుండాపోతోంది. గత ప్రభుత్వ హాయాంలో నిర్భంధాలను ఎదుర్కొని, కేసుల్లో ఇరుక్కొని, పోలీసుల చేతిలో కౌకు దెబ్బలు తిని, ఆస్ధులు పోగొట్టుకున్న వాళ్లు కొన్ని వేలమంది వున్నారు. వాళ్లలో చాలా మందికి పదవులు అందడం లేన్న విమర్శలున్నాయి. కూటమిగా జట్టు కట్టి ఎలాంటి పోరాటాలు చేయని జనసేనకు పదవులు పోతుంటే తెలుగు తమ్ముళ్లు నోరు మూసుకొని వుండాల్సి వస్తుంది. తమకు రావాల్సిన పదవులు జనసేన నాయకులు ఇస్తుంటే వారికి జేజేలు కొట్టాల్సి వస్తుంది. ఏ పార్టీలో వున్న కార్యకర్తలకైనా ఇలాంటి పరిస్ధితులు రావొద్దు. ఇక జనసేనలో మరో విచిత్రం వుంది. పదవులు కోసం ఆశించి ఎవరూ రావొద్దంటూ జనసేనాని చెప్పడం విడ్డూరం. జనసేన కోసం తమ జీవితాలను త్యాగంచేయాలి కాని, పదవులు ఆశించకూడదని అనడం వల్ల ఆ పార్టీ నాయకుడి ఆలోచన ఏమిటో ఇప్పటికే జనసైనికులకు అర్ధమౌతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా, పదవులు ఎవరు పంచుకుంటున్నారో చూస్తూనే వున్నారు. ఇలా కార్యకర్తల జీవితాల్లో విషాలు నింపుతున్నారు. అందుకే కార్యకర్తలో నిస్తేజం ఆవహించుకుంటోంది. పదవుల పంపకాల కాడ మీరు..జెండాలు మోసే కాడ మేమా? అని ప్రశ్నిస్తున్నారు.

కేరళలో ‘నొక్కు కూలీ’ ప్రహసనం

శ్రామిక కామ్రేడ్ల ధాటికి సామాన్యుల విలవిల

‘చూసినందుకు’ కూలీ చెల్లించకపోతే దాడులు తప్పవు

ఇష్టారాజ్యంగా సామాన్యులను దోచుకుంటున్న శ్రామిక కామ్రేడ్లు

కార్ల్‌ మార్క్స్‌ ఊహించని ‘శ్రామిక స్వర్గం’ కేరళ!

 

రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోవడానికి ఈ ‘శ్రామిక దందా’ కూడా కారణం

ఇక్కడినుంచి వలసలుంటాయి కానీ, ఇక్కడికి వలసలుండవు

ఇల్లుమారాలన్నా, పనులు మొదలుపెట్టాలన్నా బెదిరిపోతున్న సామాన్య జనం

కేరళ సాధించిన విప్లవ విజయానికి అంతా జేజేలు పలకాల్సిందే

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రాచీన కాలంలో వివిధ దేశాల్లో స్థానిక సంస్కృతులు ప్రాధాన్యం వహిస్తే మధ్యయుగాల్లో మత ఛాందస వాదం పెరిగి క్రూసేడ్లు (మతయుద్ధాలకు) ప్రపంచ నాగరికతలను కుదిపేసాయి. ఇం గ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం తర్వాత పెట్టుబడిదారీ విధానం పెరగడం, అందులో శ్రామికుల ను పెట్టుబడిదారుల దోపిడీనుంచి కాపాడే లక్ష్యంతో ఉద్భవించిన కమ్యూనిజం (శ్రామికవాదం),ఇదే సమయంలో పెట్టుబడిదార్లు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రపంచంలో మార్కెట్ల అ న్వేషణ కారణంగా పుట్టికొచ్చిన వలసవాదం, ఇందుకోసం దేశాల ఆక్రమణ, ఆధిపత్య యుద్ధాలతో సామ్రాజ్యవాదం పెచ్చరిల్లి 19, 20 శతాబ్దాల్లో ప్రపంచం అట్టుడికిపోయింది. నిజం చెప్పా లంటే ప్రపంచ సమాజం నిరంతర గతిశీలతతో ఎప్పటికప్పుడు పరిణామాలకు లోనవుతూ రావడం చరిత్రగతిలో గమనిస్తాం. ప్రస్తుతం మనం సృజనాత్మక పెట్టుబడిదారీ విధానంలో వున్నాం. ఈ సృజనాత్మకతకు బీజాలు 17 నుంచి 19వ శతాబ్దాల మధ్యకాలంలోనే పడ్డాయనేది సుస్ప ష్టం. ఈ మధ్యకాలంలో జరిగినన్ని శాస్త్రీయ నూతన ఆవిష్కరణలు గతంలో ఎప్పుడూ జరగ లే దు. అయితే ఈ పరిణామక్రమంలో అనుకూల పరిస్థితులు లేకనో లేక తాము లేవనెత్తిన సమస్యలు పరిష్కారమవడంవల్లనో కొన్ని వాదాలు కనుమరుగైపోయాయి.
నేడు మనం చూస్తున్న పెట్టుబడిదారీ విధానం, 19వ శతాబ్దంనాటి రూపంలో లేదు. తన రూపాన్ని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడం వల్లనే పెట్టుబడిదారీ విధానం కొత్తరూపంలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం అనుసరించడానికి అనుకూలంగా మారింది. మరి పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన కమ్యూనిజం, కాలానుగుణమైన మార్పులను అంగీకరించకపోవడం, 19వ శతాబ్దపు నాటి శ్రామిక స్థితిగతులు నేడు లేకపోవడంతో అర్థం లేకుం డా పోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ సృజనకు ప్రోత్సాహం కల్పిస్తుంటే, కమ్యూనిజం రొడ్డకొట్టుడు సైద్ధాంతిక బూజునే పట్టుకొని వేలాడుతోంది. ఏతావాతా చెప్పాలంటే నేడు కొనసాగుతున్న పెట్టుబడిదారీ విధానానికి, 19వ శతాబ్దపు కమ్యూనిజం సిద్ధాంతాలు పనిచేయవు. మార్పును అంగీకరించలేని వాడు కనుమరుగైపోతాడన్నది ఒక నానుడి. ప్రస్తుతం మనదేశంలో సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టులు కనుమరుగైపోవడానికి ప్రధాన కారణం తమ పద్ధతులు మార్చు కోకపోవడమే. కాలానికి అనుగుణంగా మారకపోవడమే! అన్నింటికంటే విచిత్రమేమంటే ఈ క మ్యూనిజం మిగిల్చిన ఒక భయంకరమైన అవశేషం ‘బాధ్యత లేని హక్కుల పోరాటం’. కేవలం ఈ కారణంగానే 34ఏళ్ల కమ్యూనిస్టుల పాలనలో బెంగాల్‌ వెనకబడిపోయింది. స్వాతంత్య్రానికి ముందు పశ్చిమ బెంగాల్‌లో కనిపించిన సాంస్కృతిక చైతన్యం దేశంలో మరెక్కడా కానరాదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మేధావులు ఇవ్వాళ ఆలోచించిన దాన్ని, బెంగాల్‌ మేధావులు చాలారోజుల ముందే ఆలోచిస్తారన్న నానుడి వుండేది. నాటి బెంగాల్‌ చరిత్ర తెలిసినవారికి, నేడు ఆ రాష్ట్ర దుస్థితిని చూస్తే జాలి, ఒకరకమైన నైరాశ్యం కలుగుతాయి.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే, మన శరీరంలో కొన్ని అవశేష అవయవాల (అపెండిక్స్‌) మాదిరి గానే వ్యవస్థలో కూడా కొన్ని వాదాలు మిగిల్చిన అవశేషాలు ప్రజలను పీడిస్తూనే వుంటాయి. కాకపోతే ఇవి పెద్దగా ప్రచారంలోకి రావు. కమ్యూనిజం తీసుకొచ్చిన ట్రేడ్‌ యూనియన్‌ వ్యవస్థలో భాగంగా ఇప్పుడు కేరళలో ‘నొక్కు కూలీ’ (చూస్తే కూలీ చెల్లించడం) విధానం అనేది ఒక అవవేష అవయవంగా కొనసాగుతూ మధ్య, తిగువ మధ్యతరగతి, సామాన్యులను విపరీతమైన దోపిడీకి గురిచేస్తోంది. ఎవరైనా తమకు అవసరమైన పనులకోసం ట్రేడ్‌ యూనియన్లకుసంబంధం లేని కూలీలను నియమించుకుంటే, ట్రేడ్‌ యూనియన్లకు లంచాల రూపంలో వారు డిమాండ్‌ చేసి నంత సమర్పించుకోవడమే ఈ నొక్కు కూలీ లేదా ‘గాకింగ్‌ వేజెస్‌’ లేదా ‘చూస్తే కూలీ చెల్లించే’ విధానం. విషాదమేంటంటే కేరళలో రాజకీయ పార్టీల మద్దతు వీరికి పుష్కలంగా వుండటం. అంతే కాదు ఈ వ్యవస్థ ఒక క్వాసీ`లీగల్‌ వ్యవస్థగా కొనసాగుతుండటం విచిత్రం! మిగిలిన రా ష్ట్రాల్లో ఇది కనిపించదు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్ని చెప్పుకునే కమ్యూనిస్టుల అనుబంధ ట్రేడ్‌ యూనియన్లు ఈవిధంగా మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలను ‘పీడిరచడాన్ని’ ఏవిధంగా నిర్వచించాలి? కోచి పారిశ్రామిక ప్రాంతంలో ‘హెడ్‌ లోడ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ బోర్డ్‌’ ఒక వేతన జాబితాను రూపొందించింది. దీని ప్రకారం ఈ ప్రాంతంలో పనులకు యంత్రాలను ఉపయోగిస్తే, సదరు యంత్రం వినియోగం వల్ల ఎంతమంది శ్రామికులు ఉపాధి కోల్పోతున్నారో లెక్కగట్టి ఆమొత్తం వసూలు చేస్తారు. అంటే ఇక్కడ యంత్రాలలో పనిచేయించుకున్నందుకూ, ఈ నొక్కు కూలీకి కలిపి రెట్టింపు చెల్లించాలి! దీనికి చట్టబద్ధత కల్పించడం…ఇక్కడ అనుసరిస్తున్న న్యాయం!!
రాష్ట్రంలోని ప్రతి పారిశ్రామిక, నివాస ప్రాంతాలను జోన్లుగా విడగొట్టి అక్కడ శ్రామిక యూనియన్లు ‘లుకౌట్ల’ను ఏర్పాటు చేస్తాయి. వీరికి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ వుంటుంది. వీరు అన్నికూడళ్లలో తిష్టవేసుకొని, సామాన్లను మోసుకెళ్లే వాహనాలను గమనిస్తుంటారు. ఎప్పుడైతే అటువంటి వాహ నాన్ని గుర్తిస్తారో తక్షణమే అందుబాటులో వున్న యూనియన్‌ నాయకులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారు. వెంటనే యూనియన్‌ సభ్యులు సదరు సరుకు ఎక్కడ దిగుమతి అవుతున్నదో అక్కడ ప్రత్యక్షమై ‘పని`హక్కు’ పేరుతో ఆ యజమానిని ఇష్టారాజ్యంగా డబ్బులు డిమాండ్‌ చేస్తారు. జరిగే పనికి వారు డిమాండ్‌ చేసే మొత్తానికి చాలా సందర్భాల్లో అసలు పొంతనే వుండదు. చివరకు సరుకు లేదా ఇల్లు మారడానికి సామాన్లు తెచ్చుకున్న యజమానులు వీరిని బతిమాలి, బామాలి ఎంతోకొంత బేరం కుదర్చుకొని వారు అంగీకరించిన మొత్తాన్ని ‘నొక్కు కూలీ’ కింద సమర్పించుకొని, తాము అంతకుముందు మాట్లాడుకున్న పనివారితో సామాన్లు లేదా సరుకులు దిగుమతి చేసుకుంటారు. ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు మారాలన్నా, బదిలీపై వచ్చినవారికి వీరితో ఇక్కట్లు తప్పవు. అంతెందుకు సామాన్యుడు ఏపని చేపట్టాలన్నా ముందుగా వీరితో పెద్ద తలనొప్పిని ఎదుర్కొనడానికి సిద్ధపడాలి. ఎందుకంటే తాను చేయించుకునే పనికి, రెట్టింపు చెల్లించడానికి సిద్ధపడితేనే ముందుకెళ్లాలి. అంటే తాను మాట్లాడుకున్న కూలీలకు, ఈ ‘నొక్కు కూలీల’కు చూసినందుకు సమర్పించుకుంటేగాని పనికాదు! ఈ యూనియన్లు ఎంతటి శక్తివంతమైనవంటే, 2021 సెప్టెంబర్‌లో ఇస్రోకు చెందిన అతి పెద్ద యంత్రపరికరాన్ని కూడా దిగుమతి కానివ్వకుండా నిలి పేశారు. సంబంధిత అధికార్లు ఈ సమస్య నుంచి బయటపడటానికి నానా తిప్పలుపడాల్సి వచ్చింది. ప్రస్తుతం కేరళలో కొత్త వ్యాపారాలులేదా కొత్త పరిశ్రమలు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఎందుకంటే ఈ శ్రామిక యూనియన్ల భయమే. ఇందువల్లనే కేరళనుంచి వలసలు వుంటాయి కానీ, ఆ రాష్ట్రానికి వలసలు వెళ్లే వారెవరూ వుండరు.
ఒకదశలో హైకోర్టు కూడా ఈవిధానం చట్టవిరుద్ధమని దీన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకో వాలని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కోరినా ప్రయోజనం లేదు. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటామని చెబుతుంది కానీ, శ్రామిక యూనియన్లు తమకు అనుబంధ సంస్థలు కనుక చూసీచూడనట్టు వ్యవహరిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు ఓట్లు ముఖ్యం కనుక వీరివైపు కన్నెత్తి కూడా చూడరు. ఎవరైనా ఈ సమస్యలను శ్రామిక యూనియన్ల దృష్టికి తీసుకెళితే, ‘‘మేం ఇటువంటి కార్యకలాపాలను ప్రోత్సహించం. ఒకవేళ అటువంటి సమస్య వస్తే తక్షణం లేబర్‌ కమిషనర్‌ కు ఫిర్యాదు చేయండి’’ అని చెబుతారు. ఇంటి ముందు సరుకులు పెట్టుకొని, ఆ యజమాని లేబర్‌ కమిషనర్‌ చుట్టూ తిరగాలా? ఎంతటి దారుణ పరిస్థితి!!
పౌల్‌ జఛారియా అనే ఒక మళయాళం రచయిత ఈ నొక్కు కూలీ గురించి ఈవిధంగా రాశారు.
‘‘ఒకవేళ మీరు ఇల్లు మారాలనుకున్నారనుకుందాం. అప్పుడు ఈ శ్రామిక కామ్రేడ్‌లు సామాన్లు ఎగుమతి/దిగుమతి కూలీని చెల్లించాలంటూ ఆక్కడ ప్రత్యక్షమవుతారు. ఒకవేళ మీరు ఆ మొత్తాన్ని చెల్లించలేకనో లేక ఇష్టంలేకనో మీ స్నేహితులు, బంధువులతో కలిసి ఆ సామాన్లను దించు కున్నారనుకోండి. అప్పుడు దూరంగా ఈ వ్యవహారమంతా చూసిన శ్రామిక కామ్రేడ్‌లు ఆ శ్రమను తాము చూసినందుకు కూలీ చెల్లించాలని డిమాండ్‌ చేస్తారు. ఇదెక్కడి న్యాయమని మీరు ప్రశ్నించారనుకోండి, మీపై దాడి తప్పదు. కేరళలో విప్లవం ఏస్థాయిలో వున్నదంటే ‘ఒక శ్రామికు డు పనిచేయకపోయినా అతనికి చెల్లింపులు జరపాల్సిందే’. బహుశా ఇటువంటి శ్రామిక స్వర్గా న్ని కార్ల్‌ మార్క్స్‌ కూడా ఊహించి వుండడు!!’’
2018, మే 1న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాట్లాడుతూ ‘‘ట్రేడ్‌ యూనియన్లు కూడా ఈ నొక్కుకూలీని రద్దుచేసేందుకు పూర్తి మద్దతునిస్తున్నాయి’’ అని చెప్పారు. కానీ ప్రస్తుతం త్రిరువనంతపురంలో ఇది యదేచ్ఛగా కొనసాగుతోంది. కేరళ ప్రభుత్వం ఎగుమతి/దిగుమతి చార్జీలను నిర్ణయించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కూర్‌ ద్వారా నొక్కు కూలీలకు చెల్లింపులు జరపా లంటూ ఒక చట్టం తెచ్చింది. ఆవిధంగా వేధింపులు తగ్గుతాయన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఆ మొత్తాలను నొక్కు కూలీకింద శ్రామిక కామ్రేడ్‌లకు చెల్లించి, ప్రైవేటు వర్కర్లచేత సామాన్లు దిం పించుకోవడం ప్రస్తుతం జరుగుతోంది. ఎందుకంటే ‘పని హక్కు’ కింద పనిచేసే కామ్రేడ్‌ సోద రుల నిర్లక్ష్యానికి ఎన్ని విలువైన వస్తువులు ధ్వంసమవుతాయోనన్న భయం సామాన్యులను అను క్షణం వెన్నాడుతుంది. అందుకనే ఎక్కువ మొత్తం చెల్లించి ప్రైవేటు వర్కర్లచేత తమ పనులు కానిచ్చేసుకుంటున్నారు. ఇదీ ఘనత వహించిన కేరళ సాధించిన విప్లవ విజయం!!

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” యాత్ర మండల సన్నాహక సమావేశం

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ (మాజీ ఎంపీపీ) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణకై నిర్వహించే “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” యాత్ర మండల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా బిజెపి నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై నిరసనగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈకార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతీ గడపగడపకి ఇట్టి విషయాన్ని తీసుకెళ్లి దేశాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచన బిజెపి నాయకుల ఆలోచన విధానాన్ని, వారు దేశ భద్రతపై చేస్తున్న అంతర్గత దాడిని వివరించాలన్నారు. మండల కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు ఇట్టి పాదయాత్రలో పాల్గొని రాబోవు రోజుల్లో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ (మాజీ ఎంపీపీ), కరీంనగర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ కోల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుపురం పర్శరాంగౌడ్, శ్యాంసుందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు తోట రవి, కర్ణ శీను, లచ్చయ్య, కనకయ్య, స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పౌర హక్కుల దినోత్సవం.

ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

# నెక్కొండ, నేటి ధాత్రి:

 

మండలంలోని వెంకటాపురం గ్రామంలోని గంగాదేవి తండా ఎస్టీ కాలనీ లో పౌరహక్కుల దినోత్సవం ను పంచాయతీ సెక్రటరీ కోట శిరీష ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ తహసిల్దార్ పల్లకొండ రవి హాజరై మాట్లాడుతూ ప్రతి పౌరుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని నిర్మాణం చేయాలని, అంటరానితనం రూపుమాపి సమానత్వం కొరకు సామాజిక చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే అందరూ సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని,ఆర్థిక,రాజకీయ, సామాజిక అభివృద్దిలో ముందుండాలని అన్నారు, ప్రజల వద్ద నుండి వచ్చిన వినతులను స్వీకరించి తగిన పరిష్కారం చేస్తామన్నారు, అనంతరం పౌరహక్కుల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నజ్మా, ఏ ఇ ఓ అరున్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు, జిల్లా విజిలెన్స్ , మానిటరింగ్ కమిటీ సభ్యులు మాంకాల యాదగిరి , సీసీ యాకాంబ్రం, అంగన్వాడీ టీచర్ భాలీ , ఉమాదేవి, సినియర్ అసిస్టెంట్ రాజేష్, ఎంఆర్ పీ స్ మండల అధ్యక్షులు ఈ వెంకన్న, రాష్ట్ర నాయకులు గడ్డం రమేశ్, సిఎ రజిత, గ్రామ పంచాయితీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం.

కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల ప్రభుత్వం

దేవరకద్ర నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు స్ప్రింక్లర్లు, పైపులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులను విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్నారు. అనంతరం కొత్తకోటలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version