వైద్య సిబ్బందికి ఘన సన్మానం.

వైద్య సిబ్బందికి ఘన సన్మానం

రామడుగు, నేటిధాత్రి:

 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం భారత రాష్ట్ర సమితి యూత్ రామడుగు మండల ఉపాధ్యక్షులు బుదారపు కార్తీక్ ఆధ్వర్యంలో గోపాలరావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య రంగ నిపుణులకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈసందర్భంగా బుదారపు కార్తీక్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వ్యాయామ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుద్ధత పాటించాలని డాక్టర్ల సూచనలేని అనవసరమైన మందులను ఎట్టి పరిస్థితుల్లో వాడ రాదని తమ ఆరోగ్యాల పట్ల ఎవరికి వారు శ్రద్ధ వహించాలని కోరారు. ఈసందర్భంగా ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న వైద్య సిబ్బందిని సన్మానిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారి వెంకట గ్రీష్మన్య, వెంకటేశ్వర్లు, కొలిపాక కమలాకర్, స్వామి, పురాణం రమేష్, తిరుపతి, నరేందర్, శ్రీధర్, కొమురయ్య, శివశంకర్, నాగరాజు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పదోన్నతి పొందిన కానిస్టేబుల్ లకు శుభాకాంక్షలు.!

పదోన్నతి పొందిన కానిస్టేబుల్ లకు శుభాకాంక్షలు తెలిపిన సిఐ.  

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పరశురాములు, రవీందర్ లు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందారు. చొప్పదండి సిఐ ప్రకాష్‌గౌడ్, చొప్పదండి ఎస్‌ఐ సురేందర్ చేతుల మీదుగా పదోన్నతి తీసుకోని పరశురాములు మెదక్ జిల్లాకి, రవీందర్ కామారెడ్డి జిల్లాకి పదోన్నతిపై బదిలి అయ్యారు. పదోన్నతి పొందిన ఇరువురిని సిఐ ప్రకాష్ గౌడ్, ఎస్‌ఐ సురేందర్, సిబ్బంది, తదితరులు శుభకాంక్షలు తెలియజేశారు.

జీతం చిల్లి గవ్వతో సమానం.. లంచం లక్షలతో తులా భారం!

-రోజు లక్షలు మూట కనిపిస్తుంటే జీతం తాలుతో సమాతూకం

-ఇక అధికారులు మారమంటే ఎందకు మారుతారు?

-లంచాలు వద్దంటే అధికారులెందుకూరుకుంటారు?

-పట్టుబడతామని భయమెందుకు పడతారు?

-ఏ అధికారి జీతం కోసం ఎదురు చూడడం లేదు!

-రోజూ సూట్‌కేస్‌ల తూకం చూసుకుంటున్నారు.

-జనాన్ని పీడిరచుకు తింటున్నారు!

-పట్టుబడినా రెండేళ్ల వరకు కేసు తేలకుండా చూసుకుంటున్నారు.

-దర్జాగా మళ్ళీ కొలువులు తెచ్చుకొని అదే సీట్లో కూర్చుంటున్నారు.

-పెట్టిన పెట్టుబడికి మళ్ళీ పదింతలు వసూలు చేసుకుంటున్నారు.

-సస్పెండ్‌ అయిన కాలాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు.

-విందులు, వినోదాలతో కాలం గడుపుతున్నారు.

-సస్పెన్షన్‌ కాలానికి కూడా తర్వాత జీతాలు అందుకుంటున్నారు.

-జీవితాంతం కష్టపడినా రాని సంపాదన లంచాల రూపంలో పదేళ్లలో పోగేసుకుంటున్నారు.

-ఏసిబి ఎంత కష్టపడి పట్టుకున్నా కేసులు నిలబడక కొలువుకెక్కుతున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఉగాది పండుగ రోజు ఎవరైనా తప్పుడు పని చేయాలనుకుంటారా? తొలి పండుగ రోజు ఆత్మ వంచన చేసుకోవాలని ఎవరైనా చూస్తారా? అంటే కొంత మంది వుంటారు. మానవత్వం మర్చినవారు, మంచితనం లేని వారు వుంటారు. ఉగాది పండుగ రోజు లంచం తీసుకుంటే సంవత్సరమంతా లంచాల సంపాదన మూడు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుందని ఆశించే దౌర్భాగ్యులు కూడా కొంత మంది వుంటారని తేలింది. ఓ అదికారి ఏకంగా ఉగాది నాడు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారంటే పరిస్దితి ఎంత దారుణంగా వుందో అర్దం చేసుకోవచ్చు. అంతే కాదు ఆ లంచంకూడా ఉగాది పండుగ రోజు కావాలని పట్టుబట్టి మరీ తీసుకున్నాడు. ఏసిబికి పట్టుబడ్డాడు. ఇక మరో ఇరిగేషన్‌ ఉద్యోగి ఓ వ్యక్తి భూమి ఎఫ్‌టీఎల్‌, భఫర్‌ జోన్‌లో లేదని ఎన్‌వోసి ఇవ్వడానికి శ్రీరారమ నవమి పండుగ రోజు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నిజానికి ఈ రెండు రోజులు ప్రభుత్వ సెలవు రోజులు. అయినా ఆ లంచాల వతారులకు పండగ, పబ్బం, నీతి, నిజాయితీ, మంచి తనం అనేది మచ్చుకు కూడా లేదని తేలిపోయినట్లైంది. ఇలాంటి అధికారులు తెలంగాణలో ఎంతో మంది వున్నారు. పట్టుబడుతూనే వున్నారు. ఎందుకంటే కొంత మంది ఉన్నతోద్యోగులకు జీతం చిల్లిగవ్వతో సమానమైపోయింది. దాన్యంలో తాలుతో సమానమైపోయింది. జీతం అన్నది లెక్కలేకుండాపోయింది. ఎందుకంటే లంచాల ద్వారా జీతానికి పదుల రెట్లు నెలనెల సంపాదన అందుతోంది. అక్రమ సంపాదనకు పూర్తిగా అలవాటుపడిన కొంత మంది ఉద్యోగులు ఈ విధంగా లంచం లేనిదే పూట గడపడం లేదు. ఇది ఈ శాఖ, శాఖ అని తేడాలేదు. ఏశాఖలో చూసినా లంచావతారులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రజలను పీడిరచుకు తింటున్నారు. ఒకప్పుడు నెల జీతగాళ్లమని చెప్పుకునే అదికారులు ఇప్పుడు జీతం కోసం ఆలోచించే రోజులు ఎప్పుడో పోయాయి. లంచాల పేరుతో నెలకు లక్షలకు లక్షలు సంపాదిస్తూ, కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. అలా లంచాలు తీసుకుంటూ దొరుకుతున్న వారు కేవలం ఒక్క శాతమే.. ఇంతగా ఏసిబి దృష్టిపెట్టినా అధికారులు లంచాలు తీసుకోవడం ఎందుకు మానుకోవడం లేదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కళ్లమందు లక్షలకు లంచాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంటే ఊరికే పనులు ఎందుకు చేయాలన్న ఆలోచన అధికారుల్లో మొదలైంది. సంతకం పెట్టాలంటే, పెన్ను కదలాంటే లంచం అందాల్సిందే..లేకుంటే అదికారుకు కనికరం అనేది లేకుండా పోతోంది. వ్యవస్ధలన్నీ దిగిజారిపోతున్నాయి. ఏ శాఖలో చూసినా లంచమే కనిపిస్తోది. ఈ మధ్య పట్టుబడుతున్న వారిలో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికులు వున్నారు. గత వారం రోజుల్లోనే వైద్య, రెవిన్యూ, ఇరిగేషన్‌, విద్యుత్‌, ఆఖరుకు విద్యాశాఖకు చెందిన ఉన్నతోద్యోగులు పట్టుబడ్డారంటే ఎంతగా భరితెగించారో అర్దం చేసుకోవచ్చు. ఎందుకంటే వారికి జీతం మీద లెక్కలేదు. జీతం ఆగిపోతుందన్న భయం లేదు. ఉద్యోగం పోతుందన్న భయం అసలే లేదు. ఎందుకంటే ఒక వేళ ఏసిబికి పట్టుబడినా, ఆ కేసును రెండు సంవత్సరాల పాటు కొనసాగేలా చేసుకంటే సరిపోతుంది. అప్పుడు న్యాయస్ధానమే ప్రభుత్వానిది తప్పని తేల్చి, లంచావతారులకు మళ్లీ పోస్టింగ్‌ ఇస్తుంది. చట్టంలో వున్న లొసుగులను అడ్డం పెట్టుకొని, ప్రజల జీవితాలతో కొంత మంది లంచగొండులు ఆడుకుంటున్నారు. లంచం తీసుకున్నాడని తెలిస్తే వెంటనే ఉద్యోగం పోతుందన్న భయం లేదు. ఉద్యోగులు ఇంతలా దిగజారిపోతారని చట్టంచేసినప్పుడు ప్రభుత్వాలు అనుకోలేదు. రాజ్యాంగంలో పొందుపర్చినప్పుడు ఉద్యోగులకు హక్కులు కల్పించబడినప్పుడు పెద్దలు ఆలోచించలేదు. అది ఇప్పుడు ఉద్యోగులకు వరమైంది. ఉద్యోగులు ఎంత పెద్ద తప్పు చేసినా కాపాడుతోంది. వారి కొలువకు భరోసా కల్పిస్తోంది. అందుకే ఉద్యోగులు ప్రభుత్వాల ఆదేశాలను లెక్క చేయడం లేదు. ప్రభుత్వాలను కూడా లెక్క చేయడం లేదు. లంచాలకు మరిగి..మానవత్వం మరిచి! దిగజారిపోతున్న రెవిన్యూ వ్యవస్ధ. లంచాలు లేనిదే కొలువు చేయలేకపోతున్న ఉద్యోగులు. తహసిల్ధారుల మితిమీరుతున్న ఆగడాలు. రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారు. రైతులు భూములు అమ్ముకున్నా కష్టమే? కొనుక్కున్నా లంచం ఇవ్వాల్సిందే. ఆఖరుకు తమ భూమి తమ పేరు మీద మార్చుకున్నా లంచమే. తహసిల్ధార్‌ సంతకం పెట్టాలంటే కూడా లంచమే. రైతుల రక్తం తాగుతున్నారు.. ఏసిబికి ఎంత మంది చిక్కుతున్నా భయపడడం లేదు. కేసులు పెడతారన్న ఆందోళన లేదు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయం అసలే లేదు. తప్పు చేస్తున్నామన్న భావన అసలే లేదు. లక్షల్లో జీతాలు తీసుకుంటూనే లంచాలకు కక్కుర్తి పడుతున్నారు. చిన్నా, చితకా పని ఏదైనా సరే..లంచం ఇవ్వాల్సిందే. రైతులను అరిగోస పెడుతున్నారు. అయినా పట్టింపు ఎవరికీ లేదు. కొంత మంది తహసిల్ధార్‌లలో కనీసం మానవత్వం కరువైపోతోంది. ఎక్కడికక్కడ కొంత మంది తహసిల్ధార్‌లు ఏసిబికి పట్టుబడుతున్నా, మిగతా వాళ్లు భయపడం లేదు. కాసుల కక్కుర్తికి బాగా అలవాటు పడ్డారు. లంచాలు తీసుకోకుండా వుండలేకపోతున్నారు. లంచం తమ హక్కు అకునే స్ధాయికి దిగిజారిపోతున్నారు. అవినీతి చేసినప్పుడు దొరికితే మహా అయితే పట్టుబడతాము? జైలుకెళ్తాము..ఇంతకన్నా జరిగేదేముంది? మా కొలువులు పోయేది వుందా? పరువు మర్యాదల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే కోట్లు కూడబెట్టుకోవడం కుదుతుందా? అనుకుంటున్నట్లున్నారు. అందుకే అందిన కాడికి ఎక్కడైనా సరే దండుకోవడమే మాకు తెలుసు అన్నట్లుగా కొంత మంది తహసిల్ధార్‌లు వ్యవహరిస్తున్నారు. ఆరోపణలు నీటి మీద రాతలు. విమర్శలు గాలికి కొట్టుకువచ్చే దుమ్మురేణువులు అనుకుంటున్నారు. ఆరోపణలు నాలుగురోజులైతే చెరిగిపోతాయి. విమర్శలు దులిపేసుకుంటే రాలిపోతాయి. కోట్లు కూడబెట్టుకుంటే తరతరాలకు పనికి వస్తాయి. వచ్చే తరాలు హాయిగా బతుకుతాయి. ఇదే కొందరు అధికారులు కోరుకుంటున్నారు. అందుకే విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు. దొరికితే దొంగ..లేకుంటే దొర..అంతే ఇక్కడ పెద్ద తేడాలేదు. తహసిల్ధార్‌లు అడిగింది ఇవ్వాల్సిందే..లేకుంటే జీవిత కాలం చెప్పులరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే..ఎమ్మార్వో కాళ్లునిత్యం మొక్కాల్సిందే..అయినా ఆఖరుకు ఎమ్మార్వోలు అడిగింది ఇస్తే తప్ప న్యాయం జరగదు. ఇలాంటి దుర్భరమైన పరిస్ధితులు రాష్ట్రంలో వున్నాయంటేనే సిగ్గు చేటు. రోజుకు లక్షల రూపాయల్లో లంచాలు వస్తుంటే, వారి ఆగడాలకు అడ్డూ అదుపేముంటుంది. రైతుల బలహీనతలను ఆసరా చేసుకొని వారికి మేలు చేస్తామని స్దానిక నాయకులు చెబుతుంటారు. నిజానికి ఏ సమస్య వచ్చినా నేరుగా తహసిల్ధార్‌ వద్దకు వెళ్లొచ్చు. కాని ఇప్పటికీ అధికార యంత్రాంగం అంటే ప్రజలకు కూడా భయమే వుంటుంది. ప్రభుత్వ కార్యాలయంలో అడుగుపెట్టడానికి సామాన్యుడు ముందూ వెనుక ఆలోచిస్తూనే వుంటాడు. తమ సమస్యచెప్పుకుందామని వెళ్లినా ముందుగా అటెండర్ల నుంచే చిన్న చూపు ఎదురౌతుంది. సార్‌ లేడంటూ..లేదంటే పక్కన నిలబడంటూ…రేపు రాపో అంటూ అటెండర్లే రైతులను, ఇతర పనులపై వచ్చిన ప్రజలను గద్దిస్తుంటారు. దాంతో ప్రజలకు తమ పనులకోసం ఆ గ్రామంలోవున్న నాయకులను తీసుకొని వెళ్తుంటారు. నాయకులు మధ్య వర్తిత్వం వహిస్తుంటారు. సంబంధిత అధికారులతో బేర సారాలు చేసుకుంటారు. అప్పుడుగాని ప్రజలకు మోక్షం దొరకదు. ఇలా నిత్యం డబ్బుల మూటలు అందుతుంటే అదికారులు మారమంటే ఎందుకు మారుతారు? లంచాలు తీసుకోవద్దంటే ఎందుకు ఊరుకుంటారు? పట్టుబడతామని ఎందుకు భయపడతారు? పట్టుబడినా ఫరవాలేదని చాలా మంది అదికారులు తెగించేశారు. మహా అయితే ఓ నాలుగు రోజులు జైలుకెళ్తారు. అక్కడ ఇతర క్రిమినల్స్‌ వుంటే ట్రీట్‌ మెంటు వుండదు. అందువల్ల జైలు జీవితం అంటే పెద్దగా భయం కూడా వుండడంలేదు. రోజూ సూట్‌కేసుల తూకం కళ్లముందు కనిపిస్తుంటే, పట్టుబడితే కదా? అన్న ఆలోచన తప్ప, భయం వుండడడం లేదు. ఒక వేళ పట్టుబడి సస్పెండ్‌ అయినా ఎలాంటి బాధ వుండదు. ఎందుకంటే ఇవ్వాల కాకపోయినా రేపు తన ఉద్యోగం తనకు వస్తుందన్న బలమైన నమ్మకం. ఆ సస్పెన్షన్‌ కాలంలో హాయిగా విందులు, వినోదాలు, విహారయాత్రలు, వ్యాపారాలు చూసుకుంటున్నారు. మొత్తానికి చాలా మంది ఉన్నతోద్యోగులు తెగిస్తున్నారు. అందుకే నిత్యం ఎక్కడో అక్కడ పట్టుబడుతున్నారు. అందులో కూడా నిస్సిగ్గుగానే వ్యవహరిస్తున్నారు.

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.!

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.శేఖర్ పాటిల్ శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సోమవారం నాడు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.శేఖర్ పాటిల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇదిలాపల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ నాయకులు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ ఏర్పడడంతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సత్కరించారు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికుల డిమాండ్.

ట్రేడ్ యూనియన్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనను కేంద్రం మానుకోవాలి

హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికుల డిమాండ్

జైపూర్,నేటి ధాత్రి:

 

పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రం ప్రభుత్వం హరిస్తుందని హెచ్ఎంఎస్ కార్మిక నేతలు ఆరోపించారు.ట్రేడ్ యూనియన్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సోమవారం హెచ్ఎంఎస్ కార్మిక నేతలు హెచ్చరింఛచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చేనెల 20న దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడు లుగా కుదించిందన్నారు.గత మార్చి నెల 18 నాడు ఢిల్లీలో హెచ్ఎంఎస్ యూనియన్ తో సహా అన్ని జాతీయ కార్మిక సంఘాలు,అసంఘటిత కార్మిక సంఘాలు ఉమ్మడిగా దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలలో సమ్మె చేయుటకు నిర్ణయించారని పేర్కొన్నారు.దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా కార్మికులంతా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేశారు.సింగరేణిలో సమ్మె విజయవంతం చేయడానికి అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా పనిచేసి, సమ్మెను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమై కార్మిక చట్టాలను కాపాడుకోవాలని కోరారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టడం మానుకోవాలని కార్మిక సంఘాల పక్షాన డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ యూనియన్ కార్మిక నేతలు పాల్గొన్నారు.

కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన.!

కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన చిలువేరు సమ్మయ్య గౌడ్. 

యువత పట్ల సమ్మి గౌడ్ సహాయ సహకారాలు ఆదర్శనీయం – డివైఎఫ్ఐ యువజన సంఘం

కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామంలో సోమవారం డి వై ఎఫ్ ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ ను నిర్వహించిన సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సమ్మి గౌడ్ మాట్లాడుతూ క్రీడలు మానవ జీవితంలో అంతర్భాగమని క్రీడలు విద్యార్థుల మానసిక ఎదుగుదలకు సోపానాలని ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని ప్రతి ఒక్క విద్యార్థి క్రీడలలో పాల్గొనాలని పలికారు. అంతేకాదు క్రీడలతోనే ఉజ్వలమైన భవిష్యత్ ను పొందుతారని అన్నారు. క్రీడల వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండడమే కాకుండా మానసిక శారీరక దృఢత్వాన్ని పెంచుకోవచ్చని, అదేవిధంగా డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘం వారు మాట్లాడుతూ క్రీడలు నిర్వహించాలని ఆలోచనతో సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ సమ్మయ్య గౌడ్ వద్దకు వెళ్లి విషయం తెలిపిన వెంటనే వారు సానుకూలంగా స్పందించి యువత చెడు దారి పట్టుతున్న ఈ రోజుల్లో మీలో ఇలాంటి ఆలోచనలు రావడం గర్వించదగ్గ విషయమని మీరు ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా చేస్తున్న మీ కార్యక్రమాలకు నేను ఎల్లవేళలా అండగా ఉంటానని మాకు భరోసా కల్పించి మమ్మల్ని ముందుకు నడిచేలా ప్రోత్సహించి ప్రధమ బహుమతిగా రూ.10,116 లు అందజేస్తూ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అండగా ఉంటానని భరోసా కల్పించి మా ఆహ్వానం మేరకు విచ్చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా ద్వితీయ బహుమతిగా డి.ఈ విజయ్ రూ. 5,015 రూపాయలను అందిస్తున్నారని తెలిపారు..

ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్, కొండేటి కళాధర్, గొడిషాల వెంకన్న, రాచర్ల రాములు, గొర్రె వెంకన్న గౌడ్, కాలేరు వెంకన్న, కందుకూరి దాస్, తీగల సునీత, మేన్పు పద్మ, వల్లాల రాజేందర్, వల్లాల శ్రవణ్, అనిల్, శాల్వా సుమన్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల ఆశయాలను కాపాడుకుందాం.

మహనీయుల ఆశయాలను కాపాడుకుందాం..రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం

-పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మహనీయుల ఆశయాలను కాపాడుకోవడంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా జై-బాపు, జై-భీమ్, జై-సంవిధాన్ అభియాన్ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు జై-బాపు, జై-భీమ్, జై-సంవిధాన్ అభియాన్, కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలినేని లింగారావు మాట్లాడారు. భారతదేశం నేడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుందని, గత 10 ఏళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి పాలకులు రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ..రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ..అప్రజాస్వామ్య పాలన సాగిస్తున్నారని, రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతూ..గౌరవిస్తూ..పాలన చేయాల్సిన పాలకులు..నేడు తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్నారన్నారు. భారతదేశం మన కుటుంబమని, మనం అనే భావనే మన జాతీయత అని, జాతీయ భావనతో దృఢమైన సమాజాన్ని నిర్మించి, రాజ్యాంగం చూపిన మార్గంలో పయనిద్దామన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను, మన రాజ్యాంగాన్ని అవమానించే బిజెపి దాని అనుబంధ సంస్థల దాడులను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానించేలా పార్లమెంట్ లో హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తూ కాంగ్రెస్ కేంద్ర పెద్దలు జై-బాపు, జై-భీమ్, జై-సంవిధాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు. జాతి ఐక్యత ముఖ్యమని మహాత్మా గాంధీ పేర్కొన్న మాటలను గుర్తు చేస్తూ..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించుకుందామన్నారు. మహాత్మ గాంధీ చూపిన బాటలో ముందుకు సాగాలని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ..మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలన్నారు.

శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవానికి రావలసిందిగా.

ఎదురు గట్ల శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవానికి రావలసిందిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఆహ్వానం

వేములవాడ రూరల్ నేటిధాత్రి

 

 

వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో వైభవంగా నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను రావాల్సిందిగా కోరుతూ దేవస్థాన కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎదురుగట్ల మాజీ సర్పంచ్ సోయినేని కరుణాకర్, దేవస్థాన కమిటీ ఛైర్మెన్ సంపేట గంగరాజు, వైస్ చైర్మన్లు పొన్నం బాలయ్య, నరేడ్ల రాఘవరెడ్డి, కమిటీ సభ్యులు కోడెం గంగాధర్, పొన్నం మల్లేశం సోయినేని రాజు పొన్నం నాగేందర్ అర్చకులు కార్తీక్, మకులభరణం శ్రీనివాస్ వంగపల్లి మల్లేశం బండ శ్రీనివాస్ సంఘ స్వామి పొన్నం రాజేశం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఎస్టిపిపి లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతం.

ఎస్టిపిపి లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతం.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ ఎస్టిపిపి టౌన్‌షిప్‌లో కరాటే శిక్షణా కేంద్రం 2021లో దారవత్ పంతుల విజన్‌తో, డైరెక్టర్ మరియు జీఎం (ఎస్టిపిపి)ఆమోదంతో స్థాపించబడింది.ఈ శిక్షణా కేంద్రం ద్వారా ఎస్ సి సి ఎల్, పవర్ మెక్ మరియు సి ఆర్ పి ఎఫ్ ఉద్యోగుల పిల్లలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కరాటే శిక్షణ పొందుతున్నారు. శారీరక దృఢతతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది.
ఈ శిక్షణా కేంద్రం అభివృద్ధికి ప్రతిఫలంగా,2025 ఏప్రిల్ 6వ తేదీ,ఆదివారం జైపూర్ ఎస్టిపిపి ఓపెన్ ఆడిటోరియంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్టిపిపి పవర్ ప్లాంట్ సింగరేణి జనరల్ మేనేజర్ కొండారెడ్డి శ్రీనివాసులు హాజరై టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బెల్ట్‌లు మరియు సర్టిఫికెట్లు అందజేశారు.

Karate beltt.

ఈ సందర్భంగా జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌కి ఎంపికైన విద్యార్థిని జనని ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ ఘనత ఎస్టిపిపి కరాటే శిక్షణా కేంద్రానికి గర్వకారణంగా నిలిచింది.కరాటే కోచ్ శివ మహేష్ మాట్లాడుతూ… దారవత్ పంతుల ప్రోత్సాహం వల్లే ఈ కార్యక్రమం ఇవాళ ఈ స్థాయికి ఎదిగింది అని అన్నారు.జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీజీఎంలు దారవత్ పంతుల, రాజేష్, జెంట్స్టోరియో స్టైల్ చీఫ్ కోచ్ రాజనర్స్,జూల శ్రీనివాస్ మరియు కోచ్ శివ మహేష్ పాల్గొన్నారు. 

నిజాంపేట ఎస్సైగా బండి రాజేష్.

నిజాంపేట ఎస్సైగా బండి రాజేష్

నిజాంపేట: నేటి ధాత్రి

 

మండలం నూతన ఎస్సైగా బండి రాజేష్ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై నిజాంపేట మండల కేంద్రానికి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానన్నారు.

బిసి నిరసన దీక్షను విజయవంతం చేయాలి.

మంచిర్యాల గాంధీ పార్కులో జరిగే బిసి నిరసన దీక్షను విజయవంతం చేయాలి

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ పార్కు స్టేషన్ రోడ్డు మంచిర్యాల నందు ఉదయం10 గంటలకు జరిగే నిరసన దీక్షలో బీసీ ప్రజా సంఘాలు బీసీ సంఘాలు బీసీ నాయకులు విద్యార్థి మేధావులు పాల్గొనాలని కోరుకుంటున్నాం.దేశవ్యాప్తంగా జరిగే జనాభా లెక్కలలో సమగ్ర కులగణన జరిపించాలి.
తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ,స్థానిక సంస్థల్లో 42%కి రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించాలి.ఆమోదించిన తెలంగాణ రాష్ట్ర బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ ఉద్యమకారుడు,బత్తుల సిద్దేశ్వర్ ఢిల్లీ కేంద్రంగా అమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది.ఈ దీక్ష ఏడవ రోజుకు చేరడం జరిగింది.కావున అమరణ దీక్షకు మద్దతుగా రేపు మంచిర్యాల జిల్లాలో నిరసన దీక్షలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని బీసీ సంఘాల నాయకులు,కుల సంఘాల నాయకులు మరియు ప్రతి బీసీ బిడ్డ పాల్గొనలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మనోహర్,
గుమ్ముల శ్రీనివాస్,
మహేష్ వర్మ ,పిట్టల రవీందర్
ఎండి లతీఫ్,ఎల్తాపు రాజశేఖర్,దాస్యపు దీపక్ తదితరులు పాల్గొన్నారు.

కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి.!

కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి మహాసభలను విజయవంతం చేయాలి.

కస్తూర్బా బాలికల వసతి గృహంలో గోడ పత్రాలను విడుదల చేసిన పి డి ఎస్ యు నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఉస్మానియా అరుణతార, యువ మేధావి కామ్రేడ్ జార్జి రెడ్డి స్పూర్తితో విద్యారంగంలో మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కమిటీ పిలుపుమేరకు ఈ నెల 10 నుంచి 14 వరకు చేపట్టనున్న జార్జి రెడ్డి 53 వ వర్ధంతి మహాసభలను విజయవంతం చేయాలని సోమవారం పిలుపునిచ్చారు.జైపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల వసతి గృహం విద్యార్థినిల ఆధ్వర్యంలో గోడపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారం,దుస్తులు,వైద్యం లాంటి కనీస అవసరాలు అందరికీ సంపూర్ణంగా అందాలన్నదే జార్జిరెడ్డి ఆకాంక్ష అన్నారు.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అవినీతి, ర్యాగింగ్,గూండాల దాడులకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి గళం విప్పి పోరాడిన విద్యార్థి నాయకుడన్నారు.మతోన్మాద చీకటి కోణాలను చీల్చి చెండాడి,ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు జార్జిరెడ్డి పలు సభలు,సమావేశాలు నిర్వహించారన్నారు.ఉస్మానియా విద్యార్థి సంఘంతో మొదలైన జార్జిరెడ్డి విప్లవం.పిడిఎస్ గా నిర్మితమై,జార్జిరెడ్డి మరణానంతరం అది పీ డీ ఎస్ యూ గా మారిందని వివరించారు.కామ్రేడ్ జార్జిరెడ్డి ఆశయాల సాధనకై పోరాడాలని,అమరత్వాన్ని స్మరించుకుంటూ,జరుగు వర్ధంతి సభలను జయప్రదం చేయాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో అఖిల,రమ్య,కావ్య, మహేశ్వరి,ప్రసన్న,స్వప్న తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆర్ధిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం.

మహిళల ఆర్ధిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

రూ.11 కోట్ల వడ్డీలేని రుణాలు అందజేత

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

మహిళల ఆర్ధిక అభివృద్దే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు.
సోమవారం నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 11 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు సంబంధించిన చెక్కును అందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అందజేశారు.

అదే విధంగా వరంగల్ జిల్లాలో 9 ఆర్టీసీ బస్సులు మంజూరు కాగా నర్సంపేట నియోజకవర్గంలో మంజూరైన 6 బస్సులకు మండలానికి ఒకటి చొప్పున ప్రతీ మండల సమాఖ్యకు రూ.30 లక్షల రూపాయలు సబ్సిడీ చెక్కు అందించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

MLA

 

చెన్నరావుపేట మండలంలోని అక్షయ మహిళా రైతు ఉత్పత్తి సంఘానికి మరియు ఖానాపురం భారతీయ మహిళ రైతు ఉత్పత్తి సంఘానికి గోదాంల నిర్మాణం కొరకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.30 లక్షల( ఒక్కొకంటి15 లక్షల చొప్పున)చెక్కులను సంఘాల బాధ్యులకు అందిజేసినట్లు పేర్కొన్నారు.2004 లో పావలా వడ్డీ రుణాలు మహిళకు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుండి మహిళల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీర హామీల్లో మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిందని .ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గుర్తుకు చేశారు.ఈకార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి,ఆర్డీవో ఉమారాణి, మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, డీపీఎంలో దయాకర్, సరిత, అనిత, అన్ని మండలాల మహిళ సమాఖ్య అధ్యక్షులు,ఏపీఎంలు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం టియుడబ్ల్యూజే.!

జర్నలిస్టుల సంక్షేమం కోసం టియుడబ్ల్యూజే నిరంతర కృషి.

సభ్యత్వ నమోదు కార్యక్రమం

శాయంపేట నేటిధాత్రి:

 

జాతీయస్థాయిలో జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా టియు డబ్ల్యూజే (ఐజేయు) పనిచే స్తుందని ఆ సంఘ జిల్లా నాయకుడు రాజిరెడ్డి, రాష్ట్ర నాయకుడు మధు, సుధాకర్ అన్నారు. పరకాల కేంద్రంలో నిర్వహించిన సభ్యత కార్యక్ర మంలో పలు మండ లాల్లో ఉన్న జర్నలిస్టులు హాజర య్యారు. ఈ సందర్భంగా నాయకుల ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

TUWJ.

మాట్లాడుతూ జిల్లా,మండలంలోగాని జర్నలిస్టుల సమస్యల కోసం వారి హక్కుల కోసం నిరంతర పోరాటాలను నిర్వహిస్తూ విధానాలు సాధిస్తున్న సంఘం టీయూడబ్ల్యూజే సంఘం మాత్రమే అన్నారు ఆ సంఘం ద్వారా అనేక విజయాలు సాధించామని గుర్తు చేశారు ముఖ్యంగా జర్నలిస్టు ఇండ్లు ఇళ్ల స్థలాల కోసం అనేక పోరాటాలను నిర్వహించి అందులో విజయం సాధించామని తెలియజేశారు ఆర్టీసీ బస్సులో జర్నలిస్టులకు సౌకర్యం కల్పించి ఘనత, జర్నలిస్ట్ హెల్త్ విషయంలో కార్పొరేట్ వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించడం కోసం కృషి చేస్తున్న సంఘం టి యు డబ్ల్యూ జే (ఐజేయు) అన్నారు. మండలంలో ఉన్న జర్నలిస్టుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు

ఉత్సాహంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఉత్సాహంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శాయంపేట, దామెర, నడి కూడ,పరకాల మండలాల్లో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు టియుడబ్ల్యూ జే (ఐజేయు) నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం.

రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం.

కల్వకుర్తి /నేటి దాత్రి :

 

రైస్ మిల్లు అసోసియేషన్ ఎలక్షన్ ద్వారా ఎన్నికైన బీచని బాలకృష్ణ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం సోమవారం చేయడం జరిగినది. కార్యదర్శిగా పోల విజయకుమార్ కోశాధికారిగా యనుమగండ్ల రవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రైస్మిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాబాలకృష్ణమాట్లాడుతూ డివిజన్ రైస్ మిల్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం.

వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ ఆంజనేయ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా దేవాలయం ప్రాంగణంలో మహాగణపతి హోమాన్ని నిర్వహించారు.దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల సందర్భంగా గ్రామంలోని పలువురి ఇండ్ల నుండి హైందవ ధర్మం, సాంప్రదాయ పద్ధతిలో సీతమ్మ రాములోరు, లక్ష్మణుడు, ఆంజనేయుని పంచలోహ విగ్రహాలను డప్పు చప్పుళ్ళు,మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుతో దేవాలయానికి తీసుకొచ్చే క్రమంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.కళ్యాణ మహోత్సవ నిర్వాహకులు కందుల కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగాయి.

Wedding.

సీతారాముల కళ్యాణాన్ని పేద పండితులు గణేష్ శర్మ నిర్వహిస్తున్న క్రమంలో భక్తులు గ్రామస్తులు మహిళలు భక్తిశ్రద్ధలతో తిలకించారు. సీతమ్మతల్లికి గత 12 సంవత్సరాలుగా 1 గ్రాము బంగారం చొప్పున పుస్తెలను తాళ్ల రవీందర్ బహుకరించారు. నూనె పూర్ణచందర్ రూ.15 వేలు విరాళం అందించగా మరో రూ.5 వేలు ఉప్పునూతల పుల్లాచారి అందజేశారు. అలాగే ఆవాల రవీందర్ రెడ్డి దంపతులు బంగారాన్ని బహూకరిస్తున్నట్లు తెలిపారు.

ఘనంగా అన్నదాన కార్యక్రమం..

Wedding.

 

శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన కక్కెర్ల మమత నరేష్ గౌడ్ దంపతులు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు టు పల్లాటి భవానికేశవరెడ్డి, ఆరేల్లి వీరేశం గౌడ్,నూనె రాములు,బొమ్మినేని సాంబారెడ్డి,బొమ్మినేని సుధాకర్ రెడ్డి, ఈర్ల నరేష్, కక్కెర్ల ఆనందం గౌడ్, కామెడీ మల్లారెడ్డి, పల్లాటి చిన్న సంజీవరెడ్డి,మాజీ ఉపసర్పంచ్ మొద్దు రాఘవులు,కందుల శ్రీనివాస్ గౌడ్,గడ్డమీద బిక్షపతి,సురేష్,ముంజ శరత్, కొమ్ముక శ్రీరామ్,ములుగు బిక్షపతి, కొమ్ముక అశోక్,కట్టయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

ఒక్క” ఝాట్కా,1.25″ క్వింటాళ్ల మట్కా.

ఒక్క” ఝాట్కా,1.25″ క్వింటాళ్ల మట్కా.

అక్రమ ఇసుక రవాణాలో కొత్త పాలసీ శ్రీకారం చుట్టిన ఈ క్వారీలు.

అందుకే నో కాంటా,లోడింగ్ ,సీరియల్, వేబిల్ వద్ద వసూళ్లు.

లోడింగ్ వద్ద, వసూళ్ల సాక్షాలు చూపించిన నో యాక్షన్.

గుత్తేదారుకు గుమస్తాగా, మారిన మైనింగ్ సిబ్బంది అధికారి.

బొమ్మపూర్, ఎలేకేశ్వరం, ఇసుక రీచ్ లలో ప్రభుత్వ సాండ్ పాలసీ నిబంధనలు డోంట్ కేర్.

సమాచారం బయటకు పోక్క కుండా, ఈ క్వారీల్లో లోకల్ యువకులకు నో ఛాన్స్.

వసూళ్ల పర్వం, కొత్తరకం అక్రమ ఇసుక రవాణా చేపడుతున్న, ఈ క్వారీలపై మైనింగ్ ఎండి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బొమ్మ పూర్ ఎలికేశ్వరం పేర్లతో నిర్వహించబడుతున్న రెండు ఇసుక క్వారీలు, ప్రభుత్వ సాండ్ పాలసీకి విరుద్ధంగా ఒక కొత్త రకమైన అక్రమ ఇసుక రవాణా, వసూళ్ల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. లోడింగ్ వద్ద 300 రూపాయలు, సీరియల్ వద్ద 200, వే బిల్ వద్ద 300 వసూళ్లను కొనసాగిస్తుంది, లోడ్ అయిన ఇసుక లారీలు కాంటా చేయకుండా” రైట్” అని పంపిస్తుంది. మైనింగ్ అధికారులు సిబ్బంది అందరూ, కాంట్రాక్టర్ గుడిసెలో రెస్ట్ తీసుకుంటూ వ్యవహారం అంతా చూస్తూ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు ఇసుక క్వారీలు అధికారులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ కి అ అమలు చేస్తున్నట్లుగా నటిస్తూ, ఒక కొత్త రకమైన ఇసుక అక్రమ రవాణాకు శ్రీకారం చుట్టింది, “అదే ‘ఒక్క ఝాట్కా 1.25 కింటల్ ఇలా మట్కా”, వింటేనే విచిత్రంగా ఉంది కదా, కానీ ఎవరికి అర్థం కాకుండా, గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్న, ఈ రెండు క్వారీల అక్రమ ఇసుక రవాణా భాగోతం ఇది.

ఒక్క “ఝాట్కా,1.25′ క్వింటాళ్ల మట్కా.

Policy on illegal

 

 

కొమ్మాపూర్ ఎలికేశ్వరం ఇసుక క్వారీల్లో ” ఒక్క జట్కా1.25 క్వింటాళ్ల మట్కా, ఎవరు పసుగట్టని అక్రమ ఇసుక లోడింగ్ వ్యవహారం ఇది, ప్రస్తుతం ఈ రెండు ఇసుక క్వారీలు, సుమారు ప్రారంభం దశ నుండి 80 లారీల లోడింగ్ మొదలుకొని 175 భారీ ల వరకు రెండు క్వారీలు రోజుకు ఒక కారి లారీలను తమ ఖాతాలో ఇసుక లోడ్ చేయడం జరుగుతుంది, మండలంలో గత మూడు నెలల్లో 13 ఇసుక క్వారీలు కొనసాగగా, సోమవారం నాటికి 9 ఇసుక క్వారీలు ఇసుక రవాణా కొనసాగిస్తున్నాయి, వీటన్నిటిలో ఈ రెండు క్వారీలు ప్రారంభం దశ నుండి పెద్ద మొత్తంలో ఇసుక రవాణా సోమవారం నాటికి ఇలికేశ్వరం క్వారీలో 239 లారీలు, బొమ్మ పూర్ క్వారీలో 102 లారీల ఇసుక రవాణా చేయడం జరిగింది, ఇక “ఝాట్కా” విషయానికొస్తే లారీల సైజులను బట్టి 26 టన్నుల నుండి 36 తన వరకు, ఇసుక తీసుకువెళ్లే కెపాసిటీ కలిగి ఉంటాయి, లోడింగ్ పాయింట్ వద్ద ఏర్పాటుచేసిన పొక్లెన్ బకెట్లో మూడు టన్నుల ఇసుక తోడడం జరుగుతుంది, అదేవిధంగా పెద్ద బకెట్ సైజులో ఐదు టన్నుల ఇసుకను తోడడం జరుగుతుంది, ప్రస్తుతం ఈ రెండు క్వారీల్లో చిన్న సైజు బకెట్లను ఉపయోగిస్తూ లారీల్లో ఇసుక నింపడం జరుగుతుంది. చివరి బకెట్లో నింపే క్రమంలో ఆపరేటర్ ఒక్క జట్కాను ఇవ్వడంతో, చివరి బకెట్ నుండి సుమారు ఒక టన్ను 25 క్వింటాళ్ల ఇసుక లారీలో రావడం జరుగుతుంది. చిన్న పెద్ద లారీల కెపాసిటీ కు మించి ఒక్క అదనపు బకెట్లో ని ఒక్క భాగం ఇసుక నింపడం జరుగుతుంది, కాంట్రాక్టర్ సూపర్వైజర్లతోపాటు, టీఎస్ ఎంబీసీ అధికారులకు సిబ్బందికి, జట్కా విషయం తెలవడంతో, లారీలకు కాంట చేయకుండా, వే బిల్ రెడీ అయిపోయి, డ్రైవర్ లేదా క్లీనర్ కు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు జట్కా పేరుతో వందల టన్నుల ఇసుక అక్రమంగా రవాణా కావడం జరుగుతుంది.

లోడింగ్ వద్ద వసూళ్ల సాక్షాలు చూపించిన నో యాక్షన్.

ఈ రెండు ఇసుక క్వారీలో అంతుచిక్కని అక్రమాలు చేపడుతూ, వసూళ్ల పర్వం అక్రమ ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ పోక్లైన్ లో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్న సాక్షాలు చూపెట్టిన, లోడింగ్ చేసుకున్న డ్రైవర్లు తమ వద్ద ఎనిమిది వందల రూపాయలను చేయడం జరుగుతుంది, అన్న సాక్షాలను కూడా తెలిపినప్పటికీ, మైనింగ్ అధికారులు ఈ రెండు ఇసుక క్వారీలపై కనీసం కన్నెత్తి చూడని దౌర్భాగ్యం పరిస్థితి, నువ్వంటే ఈ రెండు ఇసుక క్వారీల్లో జరుగుతున్న అక్రమాలకు మైనింగ్ అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ, వాటాదారులుగా మారారు అని చెప్పడానికి సందేహ పడాల్సిన అవసరం లేదు. లోడింగ్ పాయింట్ వద్ద టీఎస్ఎండిసి సిబ్బంది లేకుండా, రాత్రి వరకు లోడింగ్ కొనసాగించడం, ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిది తర్వాత కూడా లోడింగ్ కొనసాగడం, కాంటా చేయకుండానే వేబిల్ అందించడం, లోడింగ్ వద్ద చట్కా బకెట్ చివరికి ఎందుకు రియాల్సి వస్తుంది అన్న విషయం, మైనింగ్ అధికారులకు తెలవకుండానే కొనసాగుతుందా, అదనపు బకెట్ల పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో, మైనింగ్ అధికారులతో కాంట్రాక్టర్లు మూలకాతై, టిఎస్ఎండిసి సిబ్బంది అధికారులను కాంట్రాక్టర్లు గుభస్తాలుగా మార్చుకొని, ఎనలేని అక్రమ వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టి, చట్కా తో అదనపు ఇసుకను లారీల్లో నింపి సొమ్ము చేసుకుంటూ, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కడం జరుగుతుంది.

వసూళ్ల పర్వం, కొత్తరకం అక్రమ ఇసుక రవాణా చేపడుతున్న, ఈ క్వారీలపై మైనింగ్ ఎండి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇసుక క్వారీలో అంతర్గత వ్యవహారాలను బయటకు పొక్కకుండా, అక్రమ ఇసుక రవాణా వ్యవహారం వసూళ్ల పర్వం, కాంట్రాక్టర్ ల వరకే పరిమితంగా ఉండాలని ఈ రెండు ఇసుక క్వారీలో, సూపర్వైజర్లుగా పనిచేసే యువకులు అంతా, ఇతర ప్రాంతాలకు అలాగే కాంట్రాక్టర్ లా సంబంధించిన వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్థానిక యువకులకు సూపర్వైజర్ అవకాశం కల్పించాలని పలుమార్లు ప్రజా ప్రతినిధులు చెప్పిన యజమాన్యం డోంట్ కేర్ అని క్వారీలో నీటికి ఉపాధి కొరకు అవకాశం ఇవ్వక పోవడానికి ప్రధాన కారణం ఇదే, మండలంలో వందల సంఖ్యలో లారీలో ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ నిబంధనలు సాండ్ పాలసీకు విరుద్ధంగా, “ఝాట్కా” పేరుతో అక్రమ ఇసుక రవాణా దర్జాగా వసూళ్లను చేస్తున్నప్పటికీ, టీఎస్ఎండిసి సిబ్బంది అధికారులు కూడా ఈ రెండు ఇసుక క్వారీలకు పరోక్షంగా సహకరించడం జరుగుతుంది. మైనింగ్ శాఖ టీఎస్ఎండిసి ఉన్నత అధికారులు తక్షణమే ఈ రెండు ఇసుక క్వారీలపై అలాగే సిబ్బంది అధికారిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఐజేయూతోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం.

ఐజేయూతోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం.

టీయూడబ్ల్యూజే (ఐజేయు)జిల్లా అద్యక్ష,కార్యదర్శులు రాజిరెడ్డి,సుధాకర్

పరకాల నేటిధాత్రి

ఐజేయూ అనుబంధ టియుడబ్ల్యూజే తోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాధ్యమని టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) హనుమకొండ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్ అన్నారు.సోమవారం పరకాలలో టీయూడబ్ల్యూజేే హనుమకొండ జిల్లా యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

TUWJ.

ఈ సందర్భంగా గడ్డం రాజిరెడ్డి,తోట సుధాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ముందుండి పోరాటం సాగిస్తున్న సంఘం టియుడబ్ల్యూజే (ఐజేయూ) మాత్రమే నని అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు,హెల్త్ కార్డులు,ఇండ్ల స్థలాలు సాధించి పెట్టిన ఘనత ఈ సంఘానికే ఉందన్నారు. రానున్న రోజుల్లో వరంగల్ నగరంతో సహా మండల కేంద్రాలలో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు,ఇండ్లు సాధించేందుకు పోరాడుతామన్నారు.రాష్ట్రంలో వివిధ కారణాలతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేయడం జరుగుతుందని చెప్పారు.భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ సమస్యల సాధనకై జర్నలిస్టులకు అండగా టీయూడబ్ల్యూజేే నిలుస్తుందని, అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల జారీ, ఇతర సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి అమలుపరిచేలా కృషి చేస్తామని చెప్పారు.ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న యూనియన్ పై జర్నలిస్టులకు ఎంతో విశ్వాసం ఉందని,ప్రతి జర్నలిస్టు ఐజేయూ లో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేే రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, జిల్లా కోశాధికారి బచ్చు పురుషోత్తం, జిల్లా సహాయ కార్యదర్శి గన్ను సంతోష్, కార్యవర్గ సభ్యులు గడ్డం బాలరాజు,అల్లె రామారావు,ముదిగిరి ఓదెలు, తాళ్ల రవి, నాయకులు బొజ్జం శ్రీనివాస్ రెడ్డి,భాస్కర్, పాషా, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న అసత్యపు.!

కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న అసత్యపు ఆరోపణలు మానుకోవాలి.

ఎస్సి సేల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు
ఓనపాకాల ప్రసాద్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం పథకాలు, ఓర్వలేక సోషల్ మీడియాలో బిఆర్ఎస్, బిజెపి పార్టీలు అసత్యపు ఆరోపణలు మానుకోవాలని, లేకుంటే ప్రజలు బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు తగిన గుణపాఠం చెప్తారని. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కనులకు కనిపించడం లేదా అని కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో బిఆర్ఎస్, బిజెపి చేస్తున్న విమర్శలకు సోమవారం రోజున అయన స్పందించి మాట్లాడుతూ. గత పాలకులు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మూడు కోట్ల పదిలక్షల మందికి సన్న బియ్యం జరుగుతుంది నిజం కదా. సుమారు 82శాతం మందికి లబ్ది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకు ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, సుమారు 150 కోట్ల మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారని. రైతులకు 500 రూపాయల బోనస్, రైతు రుణమాఫీ రైతుబంధు జరిగింది. యువకులకు 57,వేల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో యువతకు అందించారాని. పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి, పేద ప్రజలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసి, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ పథకం అమలు అవుతుందని ప్రతిపక్షాలకు ఈ పథకాల అవపడుతలేవ. నూటికి నూరు శాతం ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేస్తుందనడంలో. ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో. నేటి యువత. స్వాతంత్ర ఉద్యమం చరిత్ర, రాజ్యాంగం యొక్క చరిత్ర,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చరిత్రను తెలుసుకోవడం అవసరం ఉందని, ఈరోజు జై బాపు జై భీమ్ జై సమిదాన్ కార్యక్రమం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఆదేశాల మేరకు గత నాలుగు రోజులు మొగుళ్లపల్లి మండలంలో పాదయాత్ర నిర్వహించడం జరిగిందని జిల్లా నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి లకు తగిన గుణపాఠం చెపుతామని ఎస్సి సెల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్ అన్నారు. పాల్గొని పై విధంగా పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీకార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం.

కాంగ్రెస్ పార్టీకార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

 

కల్వకుర్తి నియోజక వర్గంలో కర్కల్ పహాడ్ గ్రామానికి చెంది ఎమ్మెల్యే అనుచరుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిలివేరు శ్రీను గత నెల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇవాళ ఉదయం శ్రీను భార్యను పిల్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇంటికి పిలిపించుకుని మీకు మేము పార్టీ అండగా ఉంటుంది ఎవ్వరు అదర్యపడొద్దని భరోసా ఇచ్చి అపద్ధర్మం కింద కొంత రూ. 2 లక్షల ఆర్థిక సహాయ అందించారు . తన పిల్లల మంచి భవిష్యత్తు పై చదువులకోసం సహాకారం చేస్తా అన్నారు శ్రీను తనకోసం చాలా కష్టపడి పనిచేశాడు గుర్తుకు చేసుకుంటూ ఇలాంటి సంఘటనలు దురదృష్టకరం అని కుటుంబ సభ్యులను భరోసానిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version