జిల్లెల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర ర్యాలీ…
తంగళ్ళపల్లి నేటి దాత్రి
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రవీణ్ ఆధ్వర్యంలో పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐసీసీ. పీసీసీ. పిలుపు మేరకు తంగళ్ళపల్లి మండల జిల్లాల గ్రామం లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగిందని. రాజ్యాంగ విలువలను కాపాడాలని ప్రజాస్వామ్య విలువతో కూడిన లౌకిక వాదం వర్ధిల్లాలంటూ వాడ వాడలా నినాదాలతో పాదయాత్ర కొనసాగిందని. బిఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలంటూ చీకటి ఒప్పందంతో చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని .గత పది సంవత్సరాలు చేసిన దోపిడిని అహంకారంతో కొనసాగించిన పాలన ఎండగడుతూ శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడిని స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశలను అమలు చేయాలంటూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అందరూ సిత్త శుద్ధితో అంకితభావంతో కృషి చేయాలని గ్రామ చౌరస్తాలో గ్రామస్తుల అందరి చేత ప్రతిజ్ఞ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వైద్య శివప్రసాద్ జిల్లా కోఆర్డినేటర్ చిలుక రమేష్ కృష్ణారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొనడం జరిగింది
`విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా ఆపాలని సుంకం తగ్గించారు.
`మరింతగా ధర తగ్గనైనా తగ్గాలి.
`బంగారం ధరలు స్థిరంగానైనా వుండాలి.
`అమెరికా దిగుమతి సుంకాలు పెంచడంతో బంగారం ధర తగ్గుతోందనేది నిజమా?
`మనమే టన్నుల కొద్ది బంగారం దిగుమతి చేసుకుంటున్నాం.
`మన దేశం నుంచి అమెరికాకు బంగారం ఎగుమతి చేస్తున్నామా?
`ఈ లెక్కలు నమ్మశక్యంగా వున్నాయా?
`పావలా తగ్గించి రూపాయి పెంచడం అలవాటు చేసుకున్నారు.
`ధరల నియంత్రణ ప్రభుత్వం వదిలేయడంతో ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి.
`2000 సంవత్సరంలో బంగారం తులం ధర. రూ. 4 వేలు.
`2015 వరకు పదిహేళ్లలో పెరిగిన ధర రూ. 24 వేలు.
`ఈ పదేళ్లలో చేరిన ధర సుమారు రూ. 90 వేలు.
`పదేళ్లలో బంగారం ధర ఎందుకు ఇంత పెరుగింది!
`సామాన్యలకు అందకుండా ఎందుకు పైపైకి వెళ్తోంది.
`ప్రజలలో కొనుగోలు శక్తి లేనప్పుడు ధరలు తగ్గాలి.
`ఎగుమతులు చేసేంత బంగారం మన వద్ద వుంటే మనకు చౌకగా దొరకాలి.
`ఏది నిజం.. ఏది అబద్దం!?
మెరిసేదంతా బంగారం కాదు..బంగారం ధరలు దిగివస్తున్నాయ్న వార్తలో నిజం అసలే లేదు. వ్యాపారులు ఆడుతున్న నాటకాలు. జనం జేబులకు చిల్లు పెట్టే కుట్రలు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు వేస్తున్న ఎత్తులు. ఎందుకంటే గతంలో బంగారం కొనుగోలు, వస్తువుల తయారి అనేది వృత్తిగా మాత్రమేవుండేది. ఇప్పుడు అది వ్యాపారమైపోయింది. వేల కోట్లు పెట్టుబడి పెట్టి, షాపులు ఏర్పాటు చేస్తున్నారు. వాటి నిర్వహణ, లాబాలు ఎప్పటికిప్పుడు రావాలి. ఆ షాపుల్లో పనిచేసే లక్షలాది మందికి జీతాలు చెల్లించాలి. ఇలా ప్రభుత్వాలకు పన్నులు చెల్లించాలి. ఇదంతా జనం మీద మాత్రమే రుద్దాలి. ఇదీ బంగారం మార్కెట్ చరిత్ర. బట్టల షాపులో పనిచేసే వ్యక్తికి, బంగారం షాపులో పనిచేసే కార్మికుడికి ఒకే రకమైన జీతం వుంటుంది. బట్టల వ్యాపారం చేసే వారికి వచ్చే లాభాలకు, బంగారు వ్యాపారులకు వచ్చే లాభాలకు చాలా తేడా వుంటుంది. ఒక నగరంలో వేలాది బట్టల దుకాణాలుంటాయి. కాని బంగారం దునాలు పదులు సంఖ్యలోనే వుంటాయి. కాని బంగారం వ్యాపారం బంగారమే..కాని జనం కొంటేనే అది నిజమైన బంగారం వ్యాపారం. సహజంగా ధర పెరిగిందంటే ప్రజల వద్ద కొనుగోలు శక్తి తగ్గుతుంది. వారి కోరికలను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటుంటారు. ధర తగ్గకపోతుందా? అని ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి కోసం అప్పుడప్పుడు బంగారు వ్యాపారులు ఇలాంటి వార్తలు సృష్టిస్తారు. పావలా తగ్గించి, బంగారం ధరలు ఢమాల్ అని ప్రచారం సాగిస్తుంటారు. కాని బంగారం ధరలు పెరిగినప్పుడు మాత్రం స్పల్ప పెరుగుదల అని వార్తలు రాయిస్తారు. తగ్గినప్పుడు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అంటారు. బంగారు వార్తలన్నీ గిల్టువే..జనాలను మోసం చేయడానికి వేస్తున్న ఎత్తులే.. ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడమే. ఆరు నెలల్లో బంగారం ధర విపరీతంగా ఎందుకు పెరిగింది. అంతగా డిమాండ్ ఏర్పడితే పెంచారా లేక, మార్కెట్లు పెంచుకునేందుకు లేని లెక్కలు చూపించారా? సగటు వ్యక్తి రోజు తినడానికే సంపాదించింది చాలడం లేదు. రోజంతా కష్టం చేసినా వెయ్యి రూపాయలు రావడం లేదు. పట్టణ ప్రజల జీవితాలు మరీ దుర్భరంగా మారుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే లివింగ్ కాస్ట్ చాలా తక్కువ అనే పేరుండేది. ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో నుంచి వెళ్లే వారు ఎవరూ హైదరాబాద్‌లో బతికే పరిస్దితి లేదు. చేసే పనులకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు. నివాసముందామంటే అందుబాటులో ఇళ్ల కిరాయలు లేవు. పూట ఎట్లా గడుస్తుందిరా దేవుడా? అని బాధపడే సగటు వ్యక్తికి బంగారం ఆకాశమంత ఎత్తుగా కనిపిస్తుంది. అలాంటి బంగారాన్ని అందుకోవాలన్న ఆశ కూడా ఎప్పుడో చంపుకున్నారు. సగటు ఉద్యోగులు కూడా బంగారం కొనుగోలు చేసే శక్తిలో లేరు. మరి ఎవరు కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు? ఇదంతా మార్కెట్ మాయాజాలం అంతే..మొన్నటి వరకు బంగారం ధరలు రాకెట్లలా దూసుకుపోయాయి. సరిగ్గా గత దసరా పండుగ సమయంలో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ.43వేల వరకు వుంది. అదే సమయంలో దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం జరిగింది. దాంతో ఒక్కసారిగా తులం బంగారం ధర రూ.5వేలకు వరకు పడిపోయింది. దానిని కూడా గొప్పగా ప్రచారం చేసుకున్నారు. జనాన్ని నమ్మించారు. ఆలోచించినా ఆశాభంగం అన్నట్లు ప్రచారం సాగించారు. ఒక రకంగా చెప్పాలంటే జనం ఎగబడి కొన్నారు. అంటే వారిలో కొనుగోలు శక్తి వుండి కాదు. సామాన్యుడికి రూ.5వేల ధర తగ్గడం అంటే ఎంతో ఊరట చెందే అంశం. అలా కొంత కాలం కాగానే బంగారం ధర పైపైకి ఎగబాకింది. రూ.90వేలు దాటింది. ఇలా బంగారం ధరలను రూపాయి పెంచడం, పావలా తగ్గించడం జనాన్ని నమ్మించి ముంచడం తప్ప బంగారం వ్యాపారంలో నిజాయితీ లేదు. ఇకతాజాగా అమెరికా సుంకాలను పెంచడం మూలంగా మనదేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయని ప్రచారం సాగిస్తున్నారు. ఏటా మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే బంగారం మనదేశంలోనే అమ్ముకుంటేనే మేలు అని వ్యాపారులు జనం మీద దయతలిచి తగ్గించారని ఓ రకమైన ప్రచారం. అసలు మనదేశమే గత ఏడాది లండన్ నుంచి సుమారు 400 కోట్ల టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మన అవసరాలు తీరేందుకే ఆ బంగారాన్ని కేంద్ర ప్రభుత్వం తెప్పించింది. మరి మన దేశ అవసరాలకే సరిపోకుండా వుంటే, అమెరికాలకు ఎలా ఎగుమతి చేస్తున్నట్లు? ఎందుకు చేస్తున్నట్లు? అదే నిజమైనే తలె అమ్ముకొని చెప్పులు కొనుక్కొవడమే అవుతుంది. మనకు లండన్ నుంచి చౌకగా బంగారం అందితే మన దేశ ప్రజలకు అందించాల్సిన అవసరం వదిలేసి, విదేశీ మారక ద్య్రవ్యంకోసం ఏ ప్రభుత్వమైనా చూస్తుందా? సహజంగా మనకు మిగులు వున్నప్పుడు, ఇతర దేశాలలో వారికి అందుబాటులో లేని వస్తువులను ఎగుమతులు చేస్తే విదేశీ మారక ద్రవ్యం సమృద్దిగా వస్తుంది. మనదేశం కంటే అమెరికాలోనే బంగారం చౌక. అలాంటిది అంతకన్నా చౌకగా అమెరికాకు ఎగుమతి చేస్తేనే ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. అంతే కాని మనదేశం చెప్పిన ధరకు అమెరికానే కాదు, ఏ దేశం కొనుగోలు చేయదు. ఇదంతా మార్కెట్ వర్గాలు ఆడుతున్న వింత నాటకం. గత దసరా సమయంలో రూ.75వేల వరకు పలికిన తులం బంగారం ఎందుకు రూ.90వేల వరకు చేరింది. ఆరునెలల సమయంలో ఇంతగా ధర పెరగడానికి, పెంచడానికి కారణం ఏమిటి? బంగారం వ్యాపారంలో జరుగుతున్న మోసాలపై ప్రభుత్వ నియంత్రణ లేకనా? లేక ప్రభుత్వ ఉదాసీనత? ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారుతోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచే ప్రయత్నాలు చేయాలి. వారికి అన్ని వస్తువులు అందుబాటులో వుండేలా విధానాలు రూపకల్పన చేయాలి. నిజం చెప్పాలంటే మనదేశంలో మధ్య తరగతి లేకుంటే దేశమే ఆగమౌతుంది. అలాంటి మధ్య తరగతిని వ్యాపారులు, ప్రభుత్వాలు చిదిమేస్తున్నాయి. జీవిత కాలం కోలుకోకుండా చేస్తున్నాయి. వారి పొదుపును ద్వంసం చేస్తున్నారు. రూపాయి రాక, పోకల మధ్య సున్నా బ్యాలెన్స్ కనిపించేలా చేస్తోంది. నెల గడవక ముందే అప్పుల పాలయ్యేలా ప్రభుత్వ విధనాలున్నాయి. గతంలో ఇలాంటి పరిస్ధితులు ఎప్పుడూ లేవు. ఎందుకంటే 2000 సంవత్సరంలో బంగారం ధర తులం. రూ.4000. అది ఏడాదికి కొంత పెరుగుతూపెరుగుతూ 2015వరకు రూ.25 వేలకు చేరింది. అంటే బంగారం ధరల్లో స్ధిరత్వమే కనిపించింది కాని, ఉద్దాన పతనాల ప్రభావం ప్రజల్లో పెద్దగా పడలేదు. కాని 2015 నుంచి 2025 వరకు ఆ ధర రూ.90 వేలకు చేరింది. అంటే పదేళ్లలో మూడు రెట్లు పెరిగింది. మరి ప్రజల జీతబత్యాలు పెరుగుతున్నాయా? వారి ఆదాయం పెరిగిందా? లేదు. కాని వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్నంటున్నాయి. అంతే కాకుండా జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ దోడిపీ మరింత పెరిగింది. దేశమంతా ఒకటే పన్ను విధానం అంటే ధరలు తగ్గుతాయని అందరూ ఆశించారు. కాని ఏం జరగింది. రివర్స్‌లో ధరలు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా ఆగడం లేదు. తగ్గడం లేదు. పెరగని జీతాలు, సంపాదనలతో పెరుగుతున్న ధరలను చూసి జనం విలవిలలాడుతున్నారు. ధరలు చూసి బేంబెలెత్తిపోతున్నారు. అయినా ప్రభుత్వాలు కనికరం చూపడం లేదు. ఇది ఒక్క బంగారానికే కాదు, అన్ని రకాల వస్తువుల ధరలు ఇలాగే ఆరోహన క్రమంలో ఎవరెస్టు శిఖరాన్ని తాకుతున్నాయి. అసలు ప్రజల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు ఏ వస్తువు దరలైనా తగ్గాలి. లేకుంటే కొంత కాలం స్ధిరమైన ధరలే వుండాలి. డిమాండ్ అండ్ సప్లై అనే సూత్రం ఇక్కడ ఎక్కడా వర్తించడం లేదు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ హయాంలో బ్యాంకుల్లో వున్న బంగారం అమ్ముకున్న చరిత్ర వుంది. ఆప్పట్లో దీనిపై పెద్ద వివాదాలు కొనసాగాయి. అంటే ప్రపంచంలోని దేశాలైనా బంగారు బాండ్లను కొనసాగిస్తుంటాయి. టన్నుల కొద్ది బంగారం రిజర్వు బ్యాంకు కొనుగోలు చేసి, అత్యవసర ఆర్ధిక పరిస్ధితుల కోసం నిలువ చేస్తుంది. దేశంలో ద్రోవ్యోల్భనం పెరిగినప్పుడు దాని అసవరం వుంటుంది. కాని కరోనా కాలంలో ప్రపంచ దేశాలన్నీ దివాళా తీసినా, మనదేశంలో ద్రవ్యోల్భనం రాలేదు. ఆకలి కేకలు వినిపించలేదు. అంటే ఇన్ని కోట్ల జనాన్ని ప్రభుత్వాలు ఆదుకున్నాయి. అలాంటప్పుడు ఇలా కళ్లెం లేని గుర్రాల్లా ధరలు పెరిగిపోతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు. బంగారం ధరలు తగ్గుతాయన్న మాటలు నమ్మి, జనం ఎలా, ఎలా అని ఆలోచిస్తున్నారు. కాని నిజానికి బంగారం ధర ఒక్కసారి పెరిగిందంటే తగ్గడం అంటూ వుండదు. కాని హెచ్చు తగ్గుల్లో స్వల్ప తేడాలే గాని, ఉన్న ఫలంగా ధరలు తగ్గించేందుకు ప్రభుత్వాలు కూడా సానుకూలంగా వుండవు.
మండలంలోని గోధుర్ మరియు ఇబ్రహీంపట్నం పశు వైద్యాశాలలను జిల్లా పశువైద్యాధికారి డా, వేణుగోపాల్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా భారత పశు గాణన గురించి పశువైద్య సిబ్బంది కి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో మండల పశు వైద్యాధికారి డా, శైలజ, పశు వైద్య సిబ్బంది జమున, రవితేజ, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డి ఎస్ పి జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్ మహారాజ్.
చిట్యాల, నేటిధాత్రి :
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లో ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ వి శారదన్ మహరాజ్ లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ బీసీ,ఎస్సీ,ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీల సంయుక్ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ను ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున పదివేల కార్లతో అదిలాబాదులో జరగబోయే సభకు భూపాలపల్లి జిల్లా నుండి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్, జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజ్, చిట్యాల మండల అధ్యక్షులు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్, ప్రధాన కార్యదర్శి, నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టే వాడ కుమార్, నవాబ్ పేట గ్రామ అధ్యక్షులు చిలుముల శశి కుమార్,గ్రామ ఉపాధ్యక్షుడు కృష్ణ మరియు బొడ్డు పాల్ చరణ్ పాల్గొన్నారు.
కరీంనగర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన సీపీఐ నేతలు అడ్డుకున్న పోలీసులు
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినా వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం- సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి
కరీంనగర్, నేటిధాత్రి:
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారం మోపడానికి వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని పేదలపై భారం మోపే దేశ ప్రధాని మోడీకి మూడినట్లేనని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. మంగళవారం కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించిన సిపిఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు, సీపీఐ నేతలకు తోపులాట జరగగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు తలకు గాయమై రక్తస్రావం అయ్యింది.కొంతమంది కిందపడగా వారికి దెబ్బలు తగిలాయి. ఆందోళన చేస్తున్నంత సేపు వాహనాలు నిలిచిపోయాయి. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చమరు ధరలను తగ్గించకుండా ఆయిల్ కంపెనీలకు వత్తాసు పలుకుతుందని, అర్ధరాత్రి వంటగ్యాస్ యాభై రూపాయలు పెంచి పెదాలపై భారం మోపి పెట్రోల్, డీజిల్ పై రెండు రూపాయలు పెంచి వీటిని ఆయా కంపెనీలే భరించాలని కేంద్ర మంత్రి ప్రకటించడం దుర్మార్గమని, ఏదో ఒక రోజు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచదనే గ్యారంటీ లేదని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధానిగా పదకొండు సంవత్సరాలు గడిచిపోయిందని పదకొండు సంవత్సరాలలో పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలపై పెను భారం మోపడానికి అనేకసార్లు పెట్రోలు, డీజీలు, వంటగ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా మోడీ పాలన కొనసాగుతుందని, పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చే విధంగా మోడీ ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని అలాంటి విధానాలకు మోడీ స్వస్తి పలకాలని,తక్షణమే వంటగ్యాస్ ధరలను తగ్గించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించక తప్పదని వెంకటస్వామి హెచ్చరించారు. వంటగ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ నాయకులు శాంతియుతంగా కమాన్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించడానికి అక్కడకు చేరుకున్న సీపీఐ నాయకులపై, కార్యకర్తలపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి, దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని, ముఖం కనబడకుండా మాస్కులు వేసుకొని ఆర్ఎస్ఎస్,బిజెపికి తొత్తులుగా కొంతమంది వ్యవహరిస్తూ నాయకులపై, కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించడాన్ని సీపీఐ ఖండిస్తుందని, పేద ప్రజలకు అండగా సీపీఐ నిరంతరం ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తుందని, పోలీసులు ఈవిషయాన్ని గుర్తుంచుకొని వ్యవహరించాలని వెంకటస్వామి అన్నారు. ఈఆందోళన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, సాయవేణి రాయమల్లు, బామండ్లపెల్లి యుగంధర్, న్యాలపట్ల రాజు, బోనగిరి మహేందర్, మచ్చ రమేష్, నాయకులు కొట్టే అంజలి, చెంచల మురళి, తంగెళ్ళ సంపత్, చారి, రాజు, కూన రవి,నల్లగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎండాకాలం ప్రారంభం అయిన తరుణంలో పట్టణంలో ఓ యువకుడు సేంద్రియ చెరుకు రస వాహనాన్ని తిప్పుతూ దానియొక్క పోషక విలవల గురించి వివరిస్తూ తక్కువ దరకే సేంద్రియ చెరుకు రసాన్ని అమ్మకం చేస్తున్నాడు.ఇంతకు మునుపెప్పుడు పట్టణంలో ఇలా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సేంద్రియ చెరుకు రసం విక్రయించింది లేదని సేంద్రియ చెరుకు రసంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వల్ల అన్ని వయసుల వారికి కూడా ఎంతో మంచిదని,కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి చెరుకు రసం మేలు చేస్తు శరీరంలో ప్రొటీన్ లెవెల్స్ ను పెంచుతుంది.లివర్ సమస్యలు ఉన్నవారు అన్ని పోషకాలున్న ఈ డ్రింక్ తాగడం వల్ల అలసట వెంటనే మాయమవుతుంది ఒంట్లో వేడిని చిటికెలో తగ్గిస్తుందని జీర్ణక్రియను సులభతరం చేయడంలోనూ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.చర్మ సమస్యలు, డల్ స్కిన్ ఉన్నవారు చెరుకు రసం తీసుకోవడంలో ఫలితం ఉంటుందని రక్తహీనతతో బాధపడే వ్యక్తులకు ఇది ఎన్నో బెనిఫిట్స్ ను అందిస్తు యాంటీ ఆక్సిడెంట్స్ ను కూడా అందిస్తుందని ఇలాంటి ఉపయోగకర వ్యాపారాన్ని నిర్వరిస్తునందుకు ఆ యువకున్ని ప్రజలు అభినందిస్తున్నారు
మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు భోజనం లేదని ఆవేదన..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి
ఓదెల మండలంలోని పొత్కపల్లి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకంలో విద్యార్థులకు భోజనం పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో సుమారు 50 కి పైగా విద్యార్థులు హాజరు కాగా కేవలం 20 మందికి వంట చేశారని మిగతా 30 మందికి అన్నం లేక ప్లేట్లు పట్టుకొని నిలబడ్డారని తెలిపారు. వాళ్లకు సందర్భంగా హెచ్ఎం వంట మనుషులను అడగగా అందరికీ పెట్టామని సమాధానం బదులిచ్చారు.కానీ విద్యార్థులు మాకు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై స్పందించి అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాలమాజీ ఎంపీపీ ముక్తిసత్యం,గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
మండలంలో సోమవారం రాత్రి గాలి, దుమ్ముతోకురిసిన భారీ వర్షానికి మండలంలో పంటలు, ఇల్లులు, కరెంటు స్తంభాలు కూలిపోయాయని ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులతో సర్వేలు చేపించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని మండల తహసిల్దార్ ఇమ్మానియేల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ మండలంలో వందలాది ఎకరాల్లో పంట నేలమట్టం అయిందని, అనేక చోట్ల ఇల్లు కూలిపోయాయని, విద్యుత్ ట్రాన్స్ఫారాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని అన్నారు. మొక్కజొన్న నష్టపోయిన రైతుకు ఎకరాకు 50 వేలు, మిర్చి ఎకరాకు లక్ష రూపాయలు, వరి పంటకు 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మండలంలో కొడవటంచగ్రామంలో వర్షం కు దెబ్బతిన్న పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు యా సారపు వెంకన్న, పర్శక రవి, మానాల ఉపేందర్, బానోతులాలు, వాగబోయిన సుందర్రావు, వాగబోయిన బుచ్చయ్య, ఎట్టి సుధాకర్, ఇసం రమేష్, ఇసం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
కనివిని ఎరుగని రీతిలో ప్రజాసేవకుడి జన్మదిన వేడుకలు
– దంతాలపల్లి మండలంలో ఘనంగా భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలు. – – ప్రజానీకంలో అశేష ఆధారణ పొందుతున్న యువ నేత భూపాల్ నాయక్.
మరిపెడ/దంతాలపల్లి నేటిధాత్రి.
ప్రజా సేవకుడు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న కిసాన్ పరివార్ సేవా సంస్థ వ్యవస్థాపకులు నానావత్ భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలను మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం గ్రామ అమ్మ ఒడి అనాధ శరణాలయంలో యువ దళపతి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది.. అనంతరం వృద్ధులకు పండ్లను అందజేయడం అందజేసినారు.. అలాగే భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలను ఆగపేట గ్రామ ఉపాధి హామీ కూలీలు,వాల్య తండా లో యువకులు,బిరిశెట్టి గూడెం లో భూపాల్ నాయక్ అభిమానులు,రేఖ్య తండాలో శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు..దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్లకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది…. దంతాలపల్లి మండలంలో బాణసంచాలు కాల్చి భూపాల్ నాయక్ జన్మదిన వేడుకల సంబరాలు జరుపుకున్నారు…పెద్ద ముప్పారం అనాధ ఆశ్రమ ఇంచార్జ్ మాట్లాడుతూ అనాధాశ్రమాలలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని,కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు భూపాల్ నాయక్ కు మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. రైతుల పక్షాన నిలిచిన ప్రజా నాయకుడు,రైతు సంక్షేమం,అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే ప్రజా సేవకుడు భూపాల్ నాయక్ అని అన్నారు..గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పక్షాన నిలబడి మద్దతు తెలిపారని గుర్తు చేశారు.. పల్లెల్లో పలకరింపు కార్యక్రమంలో ఆగపేట ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేసి,ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని పనులు చేయాలని సూచించారన్నారు.ఈ కార్యక్రమంలో మూడవత్ రవి నాయక్,ప్రవీణ్ కుమార్,యాకుబ్ నాయక్,పోలేపక మధు,ధర్మారపు సందీప్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలు ప్రారంభమై 9 నెలలు గడిచిన రూపాయి రాని పరిస్థితి
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ వర్కర్లకు 9 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు ఉన్నాయని వాటిని వెంటనే ఇవ్వాలని బిఆర్టీయి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల విద్యా కమిటీ పేరుతో విద్యా సంవత్సర ప్రారంభంలో కమిటీ తీర్మానం ప్రకారం స్కూల్ స్వీపర్లను నియమించుకుందని అప్పటినుండి నేటికీ 9 నెలలు గడిచయాన్నారు. వేసవి సెలవులు వచ్చే సరికి కూడా ఒక్క పైసా రాలేదని విద్యార్థుల సంఖ్య కనుగుణంగా జీరో నుండి 30 మంది విద్యార్థుల సంఖ్య ఉంటే 3 వేలు, 30 నుండి 60 మంది ఉంటే 6 వేలు,60 కి పైగా ఉంటే 12 వేల వేతనాలు వేతనాలు ఇస్తామని నియామకం చేసుకుని ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్న 3000 రూపాయలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నెలల నుండి జీతాలు లేకుండా పనిచేస్తే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని అన్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి జీవో ప్రకారం పెండింగ్ వేతనాలు ఇవ్వకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వర్కర్లు గొర్రె విజయ, రమాదేవి లక్ష్మి, ఖతాజీ మౌనిక, విజయ, సుజాత, పూజిత, బేతం రేణుక, బేబీ ,ఎల్లమ్మ, కనకమ్మ, జయలక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి సిఎండి శ్రీ ఎన్. బలరాం గారు మరియు డైరెక్టర్ (పా) శ్రీ కె. వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు, సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో టీఎస్ పాలీసెట్ – 2025 పరీక్షకు ఉచిత బోధన తరగతులు నిర్వహించబోతున్నాము.
ఈ తరగతులు 2025 ఏప్రిల్ 10 నుండి మే 10 వరకు సింగరేణి పాఠశాలల్లో నిర్వహించబడతాయి.
అర్హులు:
ఎస్ఎస్సి – 2025 పూర్తి చేసిన విద్యార్థులు
ఇతర పాఠశాలల్లో చదువుతున్న సింగరేణి ఉద్యోగుల పిల్లలు
సీట్ల పరిమితి మేరకు బడుగు, బలహీన వర్గాల, నిరుపేద ఎస్ఎస్సి విద్యార్థులు
వివరాలు: టీ.ఎస్ పాలీసెట్ (తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ద్వారా విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి విభాగాల్లో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.
ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు:
లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు
ప్రభుత్వ/ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు
స్వంతంగా పరిశ్రమ/వ్యాపారం స్థాపించి స్వయం ఉపాధి పొందవచ్చు
మరిన్ని వివరాలకు: సమీపంలోని సింగరేణి పాఠశాల మందమర్రి ప్రధానోపాధ్యాయులను సంప్రదించగలరు సెల్ నెంబర్. 98492 15692
కార్యదర్శి సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎస్ సి ఈ ఎస్)
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి.
సోషల్ మీడియా వేదిక గా ప్రచారం నిర్వహించాలి
మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటిదాత్ర
కె.సి.ఆర్ గారి నాయకత్వములో ఏప్రిల్ 27న వరంగల్ లో జరగనున్న బి.ఆర్.ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రన్ని అభివృద్ధి చేశారని మాజి మంత్రి అన్నారు వనపర్తి జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది.ఈ భారీగా వచ్చిన కార్యకర్తలకు నిరంజన్ రెడ్డి గారు దిశ నిర్దేశం చేశారు రజతోత్సవ సభను విజయవంతం చేయుటకు గ్రామగ్రామాన సమావేశాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలను,ప్రజలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. 25.సంవత్సరాల బి.ఆర్.ఎస్ ప్రస్థానాన్ని రజతోత్సవ సభ ద్వారా భావితరాలకు స్పూర్తి కలిగించాలని కోరుకున్నారు. తెలంగాణ ఆస్తి కె.సి.ఆర్ అని 14ఏండ్ల ఉద్యమ చరిత్ర,10ఏండ్ల అధికారంలో తెలంగాణ కె.సి.ఆర్ నాయకత్వములో సుభిక్షంగా మారిందని కొంతమది కుట్రలు కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో అభిమానం తగ్గలేదని అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కె.సి.ఆర్ విలువ బి.ఆర్.ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చింది అని అన్నారు. 20రోజులలో నాయకులు మండల,గ్రామ సమావేశాలు పార్టీ పతాక ఆవిష్కరణ చేసి సభ విజయవంతం చేయుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రజతోత్సవ సభ విజయవంతంతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతు బంధు రైతు రుణ మాఫీ రైతు భరోస,మహిళలకు 2500,తొలం బంగారం,నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలని అన్నారు.రజతోత్సవ సభ విజయవంతంతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు వస్తాయని సకల జనులు బి.ఆర్.ఎస్ వైపు చూస్తారని గౌరవ నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షుడు పలస రమేష్ గౌడ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్, చంద్రశేఖర్ నాయక్,కురుమూర్తి యాదవ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,పార్టీ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్,దిలీప్ రెడ్డి,వనం.రాములు,రాళ్ళ.కృష్ణయ్య,మాణిక్యం,వేణు యాదవ్,వెంకటస్వామి,మాజీ ప్రజాప్రతినిధులు రఘుపతి రెడ్డి,బోర్ల.భీమయ్య,కృష్ణా నాయక్, లక్ష్మమా రెడ్డి, కర్రేస్వామి, రాజశేఖర్,మాజీ కౌన్సిలర్లు బండారు కృష్ణ, పెండం నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్ నాయుడు ,ప్రేమ్ నాథ్ రెడ్డి,సమద్, స్టార్.రహీమ్,ఇమ్రాన్,హేమంత్ ముదిరాజ్,సూర్యవంశం.గిరి జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము,సునీల్ వాల్మీకి మహిళా నాయకురాలు నందిమల్ల.శారద ,నాగమ్మ,జమ్ములమ్మ, సాయిలీలా,కవితా నాయక్ తదితరులు పాల్గొన్నారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు
మాజీ ఎమ్మెల్యే ఓదన్న గారి ఆరోగ్యం బాగుపడాలని ప్రత్యేక పూజలు
మందమర్రి నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ప్రాంతంలో బస్టాండ్ ఏరియా లోని అభయ ఆంజనేయ స్వామి గుడి లో ఎమ్మెల్యే మాజీ విప్ నల్లాల ఓదెలు గారు ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ మంగళవారం రోజున స్థానిక అభయాంజనేయ స్వామి మారుతి నగర్ మందమర్రి బస్టాండ్. ఆలయంలో కాంగ్రెస్ నాయకుడు ఏటూరి సత్యనారాయణ గారు మాజీ మా మాజీ విప్ మాజీ ఎమ్మెల్యే ఓదన్న గారు ఆరోగ్యంగా మహామృత్యుంజయడు గా తిరిగి రావాలని. అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకం, ప్రత్యేక అర్చనలు చేశారు. 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.భక్తులకు ఓదన్న గారి అభిమానులు తీర్థప్రసాదాలను స్వీకరించి మాజీ ఎమ్మెల్యే కోలుకోవాలని వేడుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొద్దిరోజుల నుంచి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ ఉన్నాడు. అరోగ్యం తొందరగా బాగా పాడాలని అభిమానులు కార్యకర్తలు భగవంతుని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరి సత్యనారాయణ తో పాటు ఓదన్న గారి అభిమానులు. ఆ ఏరియా ప్రజలు పెద్దలు అందరూ పాల్గొన్నారు
గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో టూరిజం వాల్ల ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లను వెంటనే ప్రారంభించాలని బీజేవైఎం కళాశాలల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభమైందని పనులు పూర్తయి ఆరు నెలలు కావస్తున్న ఇప్పటివరకు ప్రారంభించడం లేదన్నారు దీంతో కోటగుళ్లకి వచ్చే పర్యాటకులు ముఖ్యంగా మహిళలు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ , టూరిజం శాఖ వారు స్పందించి వెంటనే మరుగుదొడ్లను ప్రారంభించి వాడుకలోకి తేవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి చెలిమల్ల ప్రవీణ్ కుమార్ బీజేవైఎం నాయకులు కర్క అన్వేష్ చరణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 12న అరాఫత్‌లోని జహీరాబాద్ మసీదులో హజ్ యాత్రికుల శిక్షణా శిబిరం.
జహీరాబాద్. నేటి ధాత్రి:
హజ్ యాత్రికుల కోసం ఏప్రిల్ 12వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అరాఫత్ మసీదులో ఒకరోజు శిక్షణ శిబిరం జరుగుతుందని, దీనిలో వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు పాల్గొంటారని అహ్మద్ అడ్వకేట్ తెలిపారు. మహిళలకు ప్రత్యేక బురఖా ఏర్పాటు ఉంటుంది. పాల్గొనేవారికి భోజన ఏర్పాటు ఉంటుంది. ముస్లిం సమాజం యాత్రికులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు ముహమ్మద్ జమీరుద్దీన్, న్యాయవాది ముహమ్మద్ ముయీజుద్దీన్ అలీ, అలీం మక్బూల్ అహ్మద్ వకార్ పటేల్, ముంతాజ్ అహ్మద్, ముయెజ్జిన్ సయ్యద్ ఇబ్రహీం చంద్ ఖాదిర్ మొహ్సిన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామ్ మందిర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
శ్రీరామ్ మందిర్ ఆలయం లో శ్రీ సీతారాముల స్వామి వారికి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ అర్చకులు శాలువాతో వారిని సన్మానించారు.
Temple.
ఈకార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,సత్వార్ సోసైటి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,డా౹౹చంద్రశేఖర్,బి.మల్లికార్జున్,శివాజీ సేన నాయకులు వంశీకృష్ణ గోడ్కే,శ్రీనివాస్ మరియు అర్చకులు,భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.
ధ్యానం వాకింగ్ చేయాలి జిల్లా జెడ్జి ఎమ్ ఆర్ సునీత. వనపర్తి నేటిదాత్రి :
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాసవి వనిత క్లబ్ వనపర్తి గోల్డ్ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సమావేశము నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా జెడ్జి శ్రీమతి ఎమ్.ఆర్ సునీత లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ బి రజిని డిహెచ్ఎంఓ శ్రీనివాసులు ప్రోగ్రాం ఆఫీసర్ మంజుల న్యాయ వాది ఉత్తరయ్య పాల్గొన్నారు ఈసందర్భంగా జిల్లా జెడ్జి ఎమ్ ఆర్ సునీత మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానం ఉదయం నడక తప్పనిసరిగా చేయాలని ఆరోగ్యం గా ఉంటారని అన్నారు పిల్లలను మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా పిల్లలను గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు ఈ సమావేశంలో వాసవి క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి శ్రీనివాసులు సెక్రెటరీ కే బుచ్చయ్య కోశాధికారి ఏ మధుసూదన్ ఆర్యవైశ్య సంగం కన్వీనర్ పూరి బాలరాజు పట్టణ బీజేపీ మాజి అధ్యక్షులు బచ్చు రాము వనితా క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి సువర్ణ సెక్రెటరీ కొంపల్లి రజిత భార్గవి ఆర్యవైశ్య సంగం పట్టణ అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి సంధ్య మాధవి రాజశేఖర్ నరసింహస్వామి నవీన్ వనపర్తి ఆర్యవైశ్య లు పాల్గొన్నారు.
సిరిసిల్ల సి.పి.ఎం పట్టణ కార్యదర్శి అన్నదాస్ గణేష్
సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )
సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులు గత ఎనిమిది రోజులుగా పవర్ లూమ్ ,వార్పిన్ , వైపని కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరెలకు కూలీ నిర్ణహించాలని సమ్మె చేస్తున్న కార్మికులకు సీపీఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ 24 గంటల నేతన్న దీక్షను విరమింప జేస్తూ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి. అనంతరం అన్నదాస్ గణేష్ మాట్లాడుతూ పట్టణంలోని తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లుకు కండ్లు కనిపించడం లేదా కార్మికుల గోడు వినిపించడం లేదా అని ప్రశ్నించారు.
Workers.
మున్సిపల్ ఎన్నికలలో కార్మికుల ఓట్ల కోసం చేతులు చాచే కౌన్సిలర్లు కార్మికుల వేతనాలు ఇతర సమస్యల పై మాట్లాడకుండా యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.
Workers.
పట్టణంలోని పవర్ లూమ్ కార్మికులు బి.ఆర్.ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇక్కడి కార్మికులు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. పవర్ లూమ్ కార్మికుల కూలీ సమస్యపై స్పందించని తాజా మాజీ కౌన్సిలర్లు వారి పార్టీలపై పట్టణ కార్మిక కుటుంబాలు రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తుంటే బిజెపి నాయకులు మాత్రం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కార్మికుల సమస్యలపై మాట్లాడకుండా యజమానులకు తొత్తులుగా మారి కార్మికుల సమస్యలపై మౌనం వహిస్తున్న పై మూడు పార్టీలు రాజకీయ చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని కార్మిక వర్గం రాబోయే ఎన్నికల్లో వీరికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, మూషం రమేష్, సూరం పద్మ, సిరిమల్ల సత్యం, నక్క దేవదాస్, బెజుగం సురేష్,ఉడుత రవి తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని రెండవ బైపాస్ చంద్రంపేట ఎక్స్ రోడ్ వద్ద ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అధికారిక పర్యటన నిమిత్తం అటుగా వెళుతున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రమాదాన్ని చూసి గాయపడిన యువకులను అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయని, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రంలో నూతన హనుమాన్ సేవ కమిటీ అధ్యక్షులుగా చిలువేరి కనకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కడారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సముద్రాల రమేష్, క్యాషియర్ గా జవ్వాజి అజయ్, కమిటీ మెంబర్ లుగా బొజ్జ తిరుపతి, నీలం ప్రశాంత్, మాడిశెట్టి జయంత్, మండల లక్ష్మణ్, మూల వంశీ, పూరెల్ల రాహుల్, చిట్యాల కమలాకర్, చిట్యాల శివకుమార్, మాడిశెట్టి శ్రీసాయి, బాసరవేణి కళ్యాణ్, కీర్తి కుమార్, బొమ్మరవేణి శ్రీనివాస్ ఈరెళ్ళ అంజయ్య, బసవేణి మధు, ఒంటెల ఆదిత్య రెడ్డి, మామిడి రాజకుమార్, తదితరులను ఎన్నుకున్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.