అకాల వర్షంనీకి దెబ్బతిన్న పంటల పరిశీలన.

అకాల వర్షంనీకి దెబ్బతిన్న పంటల పరిశీలన

కొత్తగూడ, నేటిధాత్రి:

 

ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల రాళ్ల వర్షలతో పంట పొలాలను అతలాకుతలం చేసి రైతులను రోడ్డున పడే పరిస్థితి తెచ్చిన ప్రకృతి…
దెబ్బతిన్న పంట పొలాలను చూసి రైతుల కష్టాలను వారి బాధలను దగ్గరగా చూసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు.ధనసరి సీతక్క
తక్షణమే అకాల వర్షాలతో రాళ్ల వానలతో దెబ్బతిన్న మొక్కజొన్న వరి పొలాలను వ్యవసాయ శాఖ చేత పరిశీలన చేసి నష్టపరిహారం వచ్చే విదంగా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పిన మాట ప్రకారం కొత్తగూడ మండలంలోని జంగంవాని గూడెం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారి వినోద్ ఆధ్వర్యంలో సోమవారం రోజు అకాల వర్షాలు రాళ్ల వానలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు… అకాల వర్షాలు రాళ్లవానతో వరి పంట మొక్కజొన్న దెబ్బతిన్న రైతులు వారి వారి ఆధార్ కార్డులు బ్యాంకు వివరాలతో వ్యవసాయ శాఖ అధికారులను కలిసి వారి పంట పొలాలను సర్వే చేపించారు..పంట నష్టపోయిన రైతులందరు వారి వివరాలు ఇచ్చి నష్టపరిహారం పొందగలరని అని ఆయన అన్నారు…

నెక్కొండలో లక్క పురుగుల నుండి కాపాడండి….!

నెక్కొండలో లక్క పురుగుల నుండి కాపాడండి….!

దయచేసి అధికారులు విలేకరులు పట్టించుకోండి

వాట్సాప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు పోస్ట్ లు

తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నెక్కొండ మరియు చుట్టుపక్క గ్రామ ప్రజలు…

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల కేంద్రంగా రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన గోధుమల వల్ల మరియు వ్యవసాయ మార్కెట్ యాడ్ లో ఏర్పాటు చేసిన గోధుమల వల్ల ఏర్పడిన లక్క పురుగుల ద్వారా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని నెక్కొండ మండలానికి చెందిన వాట్సప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు లక్క పురుగుల నుండి నెక్కొండ గ్రామం తో పాటు గుండ్రపల్లి,అమీన్ పేట్, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎలాగైనా అధికారులు మరియు విలేకరులు చొరవ తీసుకొని ఈ విషయం పట్ల స్పందించి లక్క పురుగుల నుండి తమను కాపాడాలని కోరుతూ మెసేజ్ చేయడం గమనార్థం.

నెక్కొండ మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ గోదాంల సముదాయంతో పాటు నెక్కొండ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన గోదాముల వల్ల నెక్కొండ లో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెక్కొండ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఎక్కువగా వాహనదారులు లక్క పురుగుల ద్వారా ప్రమాదాలకు గురి కావడంతో పాటు చెవి, ముక్కు, కను రెప్పల మద్దెలపడడంతో వాహనదారులు ఇబ్బంది పడటం పాటు అనారోగ్యానికి గురవుతున్నారు, అంతేకాక నెక్కొండ స్థానికంగా జీవించే ప్రజలు చర్మవ్యాధులతో పాటు కళ్ళ మంటలతో మరి చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని వెంటనే అధికారులు అప్రమత్తమై సంబంధిత గోదాములను తనిఖీలు చేసి నివారణ చర్యలు చేపట్టి నెక్కొండ ప్రజలను రక్షించాలంటూ పలువురు నెక్కొండ నివాసులు అభిప్రాయపడుతున్నారు.

దొడ్డు బియ్యం కలిపితే లైసన్స్ రద్దు కలెక్టర్.

రేషన్ డీలర్లు సన్న బియ్యం లో దొడ్డు బియ్యం కలిపితే లైసన్స్ రద్దు కలెక్టర్

తహసిల్దార్లు రేషన్ షాపులను తనిఖీ చేయాలి

వనపర్తి నేటిదాత్రి :వనపర్తి

 

 

జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ పై పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడా దొడ్డు బియ్యం, సన్న బియ్యం కలిపి పంపిణీ చేయవద్దని సూచించారు. అలాంటి పనులు ఎక్కడైనా చేసినట్లు ప్రజలు ఫిర్యాదులు వస్తే రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు రేషన్ షాపు డీలర్ లైసెన్స్ క్యాన్సల్ చేయడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. తాసిల్దార్లు రేషన్ షాపులను విజిట్ చేసి తనిఖీలు చేయాలన్నారు.
అదేవిధంగా మరికొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం కాబోతోందని, దాన్ని కొనుగోలు కేంద్రాలను కూడా తహసిల్దారులు సందర్శించి పర్యవేక్షణ ఉంచాలన్నారు.
అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల ఎంక్వయిరీ ప్రక్రియ కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈసమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హరిత సేన నియోజకవర్గం మండల కమిటీల నియామకం.

హరిత సేన నియోజకవర్గం, మండల కమిటీల నియామకం

గంగాధర నేటిధాత్రి:

 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నెపథ్యంలో, చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీ సభ్యులను మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వగృహంలో సోమవారం ప్రకటించారు.
మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జిగా మామిడిపెల్లి అఖిల్, గంగాధర మండల అధ్యక్షుడిగా జెలెందర్ రెడ్డి, రామడుగు మండల అధ్యక్షుడిగా బైండ్ల మధు, బోయినిపల్లి మండల అధ్యక్షుడిగా కన్నం సాగర్, మల్యాల మండల అధ్యక్షుడిగా అరుణ్, కొడిమ్యాల్ మండల అధ్యక్షుడిగా ఇంతియాజ్, చొప్పదండి మండల అధ్యక్షుడిగా భక్తు విజయ్ కుమార్ ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ఇనుగుర్తి శ్రీనివాస్, గర్రెపల్లి సతీష్, నూతికడి బోజనరాయణ, కమల్ గౌడ్ తదితరులు నూతన కమిటీకి దిశానిర్దేశం చేశారు. సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించాలి అని, మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి ప్రపంచాన్ని అందించవచ్చని తెలియజేశారు. ఆఖరులో కమిటీ సభ్యులు మొక్కలు నాటడమ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరితసేన సభ్యులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు.

దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు

తల్లి జ్ఞాపకార్థంగా చలివేంద్రం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో తల్లి జ్ఞాపకార్ధంగా పేదల దహార్తి కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన కుమారులు వివరాల్లోకి వెళితే పత్తిపాక గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి విజయలక్ష్మి అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో కృంగి పోయిన ఆ కుటుంబం తల్లి జ్ఞాపకాలు, మధురస్మృతులు మర్చిపోలేని చిట్టి రెడ్డి విజయ్, అజయ్ ఇద్దరు కుమారులు గ్రామంలో తన తల్లి పేరున సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు ఆటోవాలకి, కూలీలకు, ప్రయాణికులు, పేదల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు ప్రతిరోజు 200 నుండి 400 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు అనంతరం విజయలక్ష్మి కుమారుడు చిట్టిరెడ్డి విజయ్ మాట్లాడుతూ మాతల్లి పేరు సేవా కార్యక్రమం చలివేంద్రంతో ఆగేది కాదు అని పేదల పిల్లల చదువు,గ్రామ అభివృద్ధి లో,చిన్నపిల్లల ఆపరేషన్ విషయంలో ఎప్పుడు నేను ముందుంటానని అన్నారు నేను పుట్టిన ఊరు నా కన్న తల్లి తో సమానం అని నా ఊరు రుణం తీర్చుకోవడంలో తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గజ్జి ఐలయ్య,చిట్టి రెడ్డి జంగా రెడ్డి,చల్లరాజిరెడ్డి, మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి, గుర్రం రమేష్, జలంధర్ రెడ్డి, ఉమ్మడి రమేష్, భద్రయ్య నాలుక వెంకటేష్, సురేందర్, అంకెశ్వర మొగిలి, బోయిన అశోక్ బోయిన ఓదెలు బోయిని పైడి, బగ్గి పైడి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలులకు.!

కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలులకు ఆర్డర్ కాపీలు అందజేసిన సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత నలినీకాంత్. 

* సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )*

 

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇల్లంతకుంట బోయినిపల్లె తంగళ్ళపల్లి, ముస్తాబాద్ మండల అధ్యక్షురాలకి ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సునీత రావు, ఇచ్చిన ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు చేసినవారికి ఈరోజు పదవులు ఇవ్వడం జరిగింది ఇల్లంతకుంట మండల అధ్యక్షురాలుగా జ్యోతి గారిని, బోయిన్ పల్లి మండల అధ్యక్షురాలుగా రాజలక్ష్మి గారిని, తంగళ్ళపల్లి మండల అధ్యక్షురాలుగా హారిక రెడ్డిని, ముస్తాబాద్ మండల అధ్యక్షురాలుగా వనిత బ్లాక్ కాంగ్రెస్ మహిళ ప్రెసిడెంట్ రమాదేవి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా సామల రోజా, జిల్లా సెక్రెటరిగా సరితరెడ్డి,

 

Congress President.

జిల్లాకాంగ్రెస్ కార్యలయంలోఈరోజు ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం సభ్యత్వ నమోదులో లక్షకు పైచిలుకు సభ్యత్వాలు చేసి ముందంజలో ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు మహిళలందరూ కూడా ముందుండి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహిళ సాధికారత కోసం కృషి మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే క్రమంలో మహిళలకు అందరికీ సమైక్య సంఘాల నుండి బస్సులు కొనుగోలు చేసి మహిళలకు పెద్ద పీట వేయడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి 200 యూనిట్ల కరెంటు ఉచితం ఆరోగ్యశ్రీ , నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా సంతోషంగా ఉన్నారు ఈ కార్యక్రమంలోamc చైర్మన్ వెలుముల స్వరూప జిల్లా మహిళ కాంగ్రెస్ సినియర్ నాయకరాలు మడుపు శ్రీదేవి, మరియు జిల్లా మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, సుధా, ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి బోయినిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమణారెడ్డి తంగళ్ళపల్లె మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్( టోని) మరియు సిరిసిల్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు పాల్గొన్నారు.

వాటర్ ప్లాంట్ కు భూమి పూజ.

వాటర్ ప్లాంట్ కు భూమి పూజ

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం గ్రామ యువనా యకుడు తీన్మార్ జయ్ చేప డుతున్నటువంటి ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ ఇవ్వడం కోసం వాటర్ ప్లాంట్ గ్రామయువకుల,పెద్దమనుషుల సమక్షంలో భూమిపూజ చేయడం జరిగింది ఊరికి ఉచితంగా సేవచేయడంకోసం వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగు తుంది వాటర్ ప్లాంట్ అయ్యే దాకా గ్రామ ప్రజలు యువకు లు, పెద్దమనుషులు ముఖ్యం గా మహిళలు అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడమైనది.వాటర్ ప్లాంట్ కట్టడం కోసం ఊరి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్న వారు గ్రామంలో పెద్దవారు అయినా వారు ఎవ్వరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి విరాళం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువకులు పెద్దమనుషులు తీన్మార్ జయ్ సదర్ లాల్ భాస్కర్ కిరణ్ కుమార్ స్వామి వేముల రమేష్ రతన్ గణేష్ అమిత్ సునీల్ కృష్ణ జితేందర్ రాకేష్ లక్ష్మణ్ నవీన్ రవీందర్ రెడ్డి నాయక్ అజయ్ తది తరులు పాల్గొన్నారు.

ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.

— ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
• కొనుగోలు కేంద్రం ప్రారంచిన ఎమ్మెల్యే

నిజాంపేట: నేటి ధాత్రి

 

రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనీ మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం కె. వెంకటాపూర్ గ్రామంలో సోమవారం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో రైతులను పట్టించుకున్న నాధుడే దిక్కు లేడనీ నేడు కాంగ్రెస్ హయాంలో నిరుపేదలకు సన్న బియ్యం తో పాటు ముందుగానే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రామాయంపేట మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్” స్కూల్ ప్రారంభించుకోవడం కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందన్నారు. అలాగే ప్రతి గ్రామంలో గల్లి గల్లికి సిసి రోడ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ హేనని కొనియాడారు. అందరి సహకారంతో మండల కేంద్రాన్ని ముందుకు తీసుకువెళ్దామన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, మండల ఇన్చార్జి ఎమ్మార్వో రమ్యశ్రీ, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎంపీడీవో రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు చౌదరి సుప్రభాతారావు, నజురుద్దీన్, పంజా మహేందర్, లింగం గౌడ్, అమర సెనరెడ్డి, సిద్దారములు, గుమ్ముల అజయ్, శ్యామల మహేష్ , వెంకట్ గౌడ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

రాజీవ్ నగర్ మాజీ కౌన్సిలర్ ఔదార్యం.

రాజీవ్ నగర్ మాజీ కౌన్సిలర్ ఔదార్యం.

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

వివరాల్లోకి వెళితే రాజీవ్ నగర్ లో గత కొన్ని ఏళ్లుగా పైప్ లైన్ విదులు నిర్వహిస్తున్న కాదాసు దేవయ్య గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.

Distributed rice.

 

అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన గాజుల ప్రకాష్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతు పది రోజుల క్రితం మృతి చెందాడు.ఇరు కుటుంబాలని పరామర్శించిన వార్డు తాజా మాజీ కౌన్సిలర్ ఒగ్గు ఉమా రాజేశం గారు ఇరు కుటుంబాల కు 50 kg చొప్పున బియ్యం పంపిణీ చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పచ్చునూరి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు తీగల ప్రవీణ్, పార్టీ నాయకులు గొరిట్యాల శ్రీకాంత్,సట్కూరి చిట్టిబాబు, నక్క సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

ఇష్టరాజ్యంగా ఇంటి ఇంటి నెంబర్లు.!

*ఇష్టరాజ్యంగా ఇంటి ఇంటి నెంబర్లు. 
చందానగర్ సర్కిల్ రెవెన్యూ అధికారుల నిర్వాకం బాగోతం*. 

శేర్లింగంపల్లి, నేటి ధాత్రి:

 

శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని చందానగర్ సర్కిల్(21) లో జిహెచ్ఎంసి అధికారుల లీలలు.

సరైన పత్రాలు లేని ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు కేటాయించిన అధికారులు.

విషయం పై అధికారులకు చేరడంతో విచారణకు ఆదేశించిన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి.

విచారణలో అధికారులు అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ.

చందానగర్ డిప్యూటీ కమిషనర్ తో పాటు ఏఎంసీ,టాక్స్ ఇన్స్పెక్టర్ మరియు బిల్ కలెక్టర్ లకు మెమోలు జారీ చేసిన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్.

మండే ఎండలు….. పదిలం ప్రాణాలు.

మండే ఎండలు….. పదిలం ప్రాణాలు

కొన్నేళ్లుగా భయపేడు తున్న వేసవి ఎండల తీవ్రత

ఏప్రిల్ ,మే నెలలో మండే సూర్యుడి భగభగలు తెలిసిందే

ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనాలు

శాయంపేట నేటిధాత్రి:

 

ఈ సంవత్సరం ఎండలు బాగానే మండుతున్నాయి రానున్న రోజుల్లో వడదెబ్బ ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇలాంట ప్పుడు ఎండల్లో బయటకు వెళ్లేవారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఇప్పటికి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రానున్న రోజుల్లో మరింత ఎండ వేడి పెరిగే ప్రమాదం ఉంది వేసవికాలం కావడంతో పిల్లలు బయటికి ఆడుకోవ డానికి వెళ్తుంటారు అలాంట ప్పుడు పిల్లలు ఎండ తీవ్రతకు బయటికి రాకుండా ఉండ డానికి తగు జాగ్రత్తలు తీసు కోవాలని చెబుతున్నారు. మామూలుగా నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు వల్ల వడగాల్పులు వస్తుంటాయి దీనివల్ల శరీరంపై ఉన్న శ్వేతా రంధ్రాలు మూసుకుపోయి శరీరంలోని వేడి చెమట బయటకు రాకుండా ఉండిపోతుంది దీంతో శరీరంలో ఎండ తీవ్రత ఎక్కువగా అయ్యి అస్వస్థతకు గురవుతారు. స్పృహ కోల్పో వడం వంటి జరుగుతుంది . నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది అలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక చికిత్స అవసరం చిన్నపిల్లల్లో ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి.

దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన,.!

దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన, శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ నూతన కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ఎ. చంద్రశేఖర్ పాటిల్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న

★ జహీరాబాద్ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్ గారు
★ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఎ చంద్రశేఖర్ గారు

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రంలో నెలకొన్న శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ నూతన కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ఛైర్మెన్ మరియు కమిటీ సభ్యులు సత్కరించిన జహీరాబాద్ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్, మరియు మాజీ మంత్రివర్యులు డాక్టర్ చంద్రశేఖర్.మరియు వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా అండగ ఉండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అని పేర్కొన్నారు.

Sangameshwara Temple.

 

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి,ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా గ్రంథయాల చైర్మన్ అంజయ్య ,మాజీ జిల్లా పరిషత్ ఛైర్మెన్ సునీతా పాటిల్ , జహీరాబాద్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,రామలింగారెడ్డి, కండేం నర్సింలు ,మాక్సూద్,నర్సాసింహ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ,మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్, మాజీ ఎంపిపి దేవదాస్ గారు,మాజీ ఎంపిటిసిలు అశోక్ ,శంకర్ పాటిల్,వైస్ ఎంపిపి షాకిర్ , కాగ్రెస్ నాయకులు హుగ్గేలి రాములు,యువజన జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, మాజీ యువజన జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్,మరియు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తథిదరులు పాల్గొన్నారు.

దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు.

దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు.

తల్లి జ్ఞాపకార్థంగా చలివేంద్రం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో తల్లి జ్ఞాపకార్ధంగా పేదల దహార్తి కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన కుమారులు వివరాల్లోకి వెళితే పత్తిపాక గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి విజయలక్ష్మి అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో కృంగి పోయిన ఆ కుటుంబం తల్లి జ్ఞాపకాలు, మధురస్మృతులు మర్చిపోలేని చిట్టి రెడ్డి విజయ్, అజయ్ ఇద్దరు కుమారులు గ్రామంలో తన తల్లి పేరున సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు ఆటో వాలకి, కూలీలకు, ప్రయాణికులు, పేదల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు ప్రతిరోజు 200 నుండి 400 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు అనంతరం విజయలక్ష్మి కుమారుడు చిట్టిరెడ్డి విజయ్ మాట్లాడుతూ మాతల్లి పేరు సేవా కార్యక్రమం చలివేంద్రంతో ఆగేది కాదు అని పేదల పిల్లల చదువు,గ్రామ అభివృద్ధి లో,చిన్నపిల్లల ఆపరేషన్ విషయంలో ఎప్పుడు నేను ముందుంటానని అన్నారు నేను పుట్టిన ఊరు నా కన్న తల్లి తో సమానం అని నా ఊరు రుణం తీర్చుకోవడంలో తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గజ్జి ఐలయ్య,చిట్టి రెడ్డి జంగా రెడ్డి,చల్లరాజిరెడ్డి, మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి, గుర్రం రమేష్, జలంధర్ రెడ్డి, ఉమ్మడి రమేష్, భద్రయ్య నాలుక వెంకటేష్, సురేందర్, అంకెశ్వర మొగిలి, బోయిన అశోక్ బోయిన ఓదెలు బోయిని పైడి, బగ్గి పైడి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదలందరికీ సన్నబియ్యం అందించడమే.!

పేదలందరికీ సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యం…
– దేశంలోనే సన్న బియ్యం అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ
– కాంగ్రెస్ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు మొగుళ్ళపల్లి

నేటి ధాత్రి. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాష్టకంగా: చేపట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని మొగుళ్లపల్లి మండలపరిధిలోని పాత ఇ స్సీ పేట గ్రామంలో జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు డీలర్ బొచ్చు లక్ష్మి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా తక్కల్లపల్లి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడీ ఇంటికి సన్నబియ్యం చేరాలన్న గొప్ప సంకల్పంతో చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఉగాది, రంజాన్ పండుగల శుభసందర్భంగా దారిద్రరేఖకు దిగువనున్న పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న గొప్ప ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 2కోట్ల 61లక్షల మందికి పేదలకు తలకు ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తున్నామని తెలిపారు. అందుకు 10600 కోట్లు కేటాయించింది అయినప్పటికీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. .పేదలు దొడ్డు బియ్యం తినలేకపోవడం వలన పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు రీ సైక్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం.
దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. రైతుల శ్రమ ఎక్కడికీ పోదు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల మేరకు రుణమాఫీ చేశాం. 7,625 కోట్ల మేరకు రైతు భరోసా చెల్లించాం. రైతు భరోసా 10 వేల నుంచి 12 వేలకు పెంచిన గొప్ప ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని రైతులను ప్రోత్సాహకాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పలు రైళ్లు నిలపాలని రైల్వే కమర్షియల్.!

పలు రైళ్లు నిలపాలని రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ కు వినతి….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని రవీంద్రఖని రైల్వే స్టేషన్ లో కాజిపేట్ నుండి బల్లార్ష వరకు నడిచే పాస్ట్ ప్యాసింజర్,అండమాన్ -చెన్నై ఎక్స్ప్రెస్, కాగజనగర్ టూ తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్లు రవీంద్రఖని రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేయాలని, రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలనీ మంచిర్యాల రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ కు బిజెపి సీనియర్ నాయకులు అరుముళ్ల పోశం ఆధ్వర్యంలో భాజపా నాయకులు మెమోరండం అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్, బంగారి వేణుగోపాల్, శెట్టి రమేష్ లు పాల్గొన్నారు.

కేసీఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ,.! 

కేసీఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ, స్వపరిపాలన సిద్ధించింది. 

-ప్రజా సంక్షేమమే పరమావధిగా కేసీఆర్ పాలన సాగింది

-విలేకరుల సమావేశంలో చదువు అన్నారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

తెలంగాణ ఆస్తి కేసీఆర్ అని 14ఏండ్ల ఉద్యమ చరిత్ర, 10ఏండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నాయకత్వములో తెలంగాణ సుభిక్షంగా ఉందని, కొంతమది చేసిన కుట్రలు, కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో కేసీఆర్ కు అభిమానం తగ్గలేదని సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షులు చదువు అన్నారెడ్డి అన్నారు. సోమవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో గల తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, కేసీఆర్ విలువ బీఆర్ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చిందన్నారు. నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2500, తులం బంగారం, నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని సకల జనులు బీఆర్ఎస్ వైపు చూస్తారని అన్నారెడ్డి అన్నారు.

రాజన్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా.!

రాజన్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల జయంత్. 

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి)

 

సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం హోరహోరి మధ్య జరిగాయి. నూతన అధ్యక్షుడిగా ఆకుల జయంత్, ఉపాధ్యక్షుడిగా బొడ్డు పరశురాములు, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు మహేందర్, సహాయ కార్యదర్శిగా కంకణాల శ్రీనివాస్, కోశాధికారిగా వంకాయల శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులుగా చౌటపల్లి వెంకటేష్, బుస్స రామనాథం, దుమాల రాము, జంగిలి రాజు, ముండ్రాయి శ్రీనివాస్, పి వేణు కుమారులు గెలుపొందారు.గెలుపొందిన వారికి ఎన్నికల అధికారులు తడుక విశ్వనాథం, కరుణాల భద్రచలం, టీవీ నారయణ లు నియామక పత్రాలు అందజేశారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మృతి…

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మృతి…

నేటి ధాత్రి.

 

తంగళ్ళపల్లి మండలం కస్బేకట్కూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జూపల్లి సందీప్ రావు మృతి చెందారు తెలిపినారు.

తెలిసిన సమాచారం ప్రకారం కట్కూర్ గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సికింద్రాబాద్లోనియశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 12 గంటల 15 నిమిషాలకు మృతి చెందారనివారి కుటుంబ సభ్యులు తెలియచేశారు.

వారి మరణం పార్టీకి ఎంతో లోటని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు తెలిపారు

కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం.

కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం.

రేషన్ కార్డు లేక.. బడుగు బలహీన వర్గాలు దూరం

511 కొత్త రేషన్ కార్డులు పంపిణీ.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలానికి చెందిన 511 మంది లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా ఒక్క లబ్దిదారుడికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని, రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. రేషన్ కార్డు లేకపోవడం వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందలేదని, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేద ప్రజలు వినియోగించుకోలేక పోయారని అందువల్ల వారు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం లో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో అధికారంలోకి రాగానే.. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. విద్య, వైద్యం, ఉపాధి పైన అధిక శ్రద్ధ చూపిస్తూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అని అన్నారు. గత 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ సాధ్యం కానిది ప్రజా ప్రభుత్వంలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 కేజీల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతుల వద్ద సేకరించిన సన్న వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ప్రజలకే పంచడం నిజంగా విప్లవాత్మక నిర్ణయం ఎమ్మెల్యే అన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని అందరూ తప్పకుండా వాడుకోవాలని ఆయన సూచించారు. మీ బాగుకోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఐఎన్టీయుసి రాములు యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, అవేజ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ ఖాజా పాషా, చిన్న , మోసిన్ , నాయకులు శ్రీనివాస్ యాదవ్, అర్షద్ అలి, కిషన్ నాయక్, గోవింద్ యాదవ్, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, పోతన్ పల్లి మోహన్ రెడ్డి, గోపాల్, చర్ల శ్రీనివాసులు, అజిజ్ అహ్మద్, తులసిరాం నాయక్, మన్యం కొండ నరేందర్ రెడ్డి, , తహసీల్దార్ సుందర్ రాజ్, ఎంపిడిఓ కరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

సీతారాముల కళ్యాణం కన్నుల నిండుగా వైభోగం.

సీతారాముల కళ్యాణం కన్నుల నిండుగా వైభోగం.

* కమనీయ కన్నుల రమణీయ సీతమ్మ తల్లి రామయ్య తండ్రి వరియించిన అపురూప దృశ్యం.

మరిపెడ/కురవి నేటిధాత్రి.

 

 

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని నల్లెల్ల గ్రామపంచాయతీలో కురవి మండల కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్ర గౌడ్ శకుంతల, బండి ఉప్పలయ్య గౌడ్ ఉమా దంపతుల ఆధ్వర్యంలో సీతారాములవారి కల్యాణం వైభవంగా నిర్వహించడం జరిగింది, ప్రతి గ్రామంలో అత్యంత వైభవంగా ప్రతి ఏటా నిర్వహించే వివాహ వేడుక సీతారాముల వివాహ వేడుక అని, సీతారాముల జంట ఎంతోమందికి ఆదర్శం అని, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి మాటకు ఒకరు వింటూ, ఆది దంపతులుగా ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దంపతులు సీతారాములు అని, ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కాంక్షిస్తూ, ప్రతి ఒక్కరు సుఖః సంతోషాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి మల్లయ్య గౌడ్,గౌడ సంఘం అధ్యక్షుడు బండి సుధాకర్ గౌడ్, బండి సైదులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆవుల కందయ్య,మంద వీరన్న,తోట నారాయణ,బండి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version