అల్ ఇండియా కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేషనల్ కోఆర్డినేటర్‌గా నగరాగారి ప్రీతీమ్ నియామకంపై శుభాకాంక్షలు తెలిపిన నరుకుడు వెంకటయ్య
హైదరాబాద్‌లో ప్రీతీమ్ గారిని కలిసిన ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకులు
పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానం
వర్దన్నపేట (నేటిధాత్రి):
తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ & కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నగరాగారి ప్రీతీమ్ గారు ఇటీవల *అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం నేషనల్ కో ఆర్డినేటర్ గా నియమితులైన శుభసందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లోని వారి స్వ గృహములో కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం రాష్ట్ర నాయకులు & వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమందించి శాలువాతో సన్మానించి హృదయపూర్వక హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమములో
వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎస్సీ విభాగం ఇంచార్జి దబ్బెట రమేష్ , ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆర్షం అశోక్ ,ఎస్సీ విభాగం జిల్లా నాయకులు ఆరూరి సాంబయ్య లు పాల్గొనడం జరిగింది.
