రాజీవ్ యువ వికాస్ పథకం జాడ ఎక్కడ.

రాజీవ్ యువ వికాస్ పథకం జాడ ఎక్కడ

ఎదురుచూస్తున్న… యువత నిరుద్యోగులు

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

 

 

వీణవంక మండల కేంద్రంలో
బిఆర్ఎస్వి సీనియర్ నాయకులు హొల్లాల శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్న ఇదిగో పథకం అదిగో పథకం అని ప్రజలను మోసం చేస్తూ ప్రజా ప్రభుత్వం కాలయాపన గడుపుతూ యువతకు నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస్ పేరుతో దరఖాస్తులు తీసుకొని మూడు నెలలు గడిచిన ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల యువత జేబులు చిల్లుపరిచి ఇన్కమ్,క్యాస్ట్, రెసిడెన్సి సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు గురిచేసి దరఖాస్తులు పెట్టుకొని మూడు నెలలు గడిచిన ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా కాలం వెళ్లబుచ్చుతూ యువతరాన్ని నిరుద్యోగులను నిరాశపరిచే దిశగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని వెంటనే వారు ఇచ్చిన హామీల్లో భాగంగా రాజీవ్ వికాస్ పేరుతో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు .

వికసించకుండానే వాడిపోతున్న రాజీవ్ యువ వికాస్ పథకం.

వికసించకుండానే వాడిపోతున్న రాజీవ్ యువ వికాస్ పథకం

◆ లబ్ధిదారులకు మొండి చేయి చూపిస్తున్న కాంగ్రెస్ సర్కార్

◆ జహీరాబాద్ బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,,ఎమ్మెల్యే కోనింటి మాణిక్ రావు ఆదేశాల మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది.. నాయకులు మాట్లాడుతూ
‘రాజీవ్‌ యువ వికాసం పథకం, కాంగ్రెస్‌ ఇచ్చిన అన్ని హామీల వలె విజయవంతంగా చెత్త బుట్టలోకి చేరిపోయిందని ఈ పథకం అమలు విధానంపై పునరాలోచన చేస్తాం’ అని రాష్ట్ర క్యాబినెట్‌ తెలంగాణ యువతపై ఓ పిడుగును పడేసిందన్నారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 తారీకున రెండు లక్షల మంది అబ్ధిదారులను ప్రకటించి, పథకం మంజూరు పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వట్టి మాటలు అయ్యాయి అన్నారు.. రేవంత్ చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మిన తెలంగాణ యువత సుమారు 16 లక్షల మంది ఈ పథకానికి నమోదు చేసుకున్నారని, రకంలో నమోదు చేసుకోవడానికి ప్రతి ఒక్క యువకుడికి సుమారు 200 నుంచి 300 రూపాయల వరకు ఖర్చు అయిందని అన్నారు .. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఆదాయం కలిగిందని అన్నారు.. నమ్మిన యువకులకు కాంగ్రెస్‌ తన హామీలను పక్కనబెట్టడం ఇదే తొలిసారి కాదు.,బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను రెచ్చగొట్టి ధర్నాలు చేయించిన కాంగ్రెస్‌, తాను అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు. గత కేసీఆర్‌ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెలువరించిన ఉద్యోగాలకు రేవంత్‌ ప్రభుత్వం జాయినింగ్‌ లెటర్లు ఇచ్చి తొలి ఏడాదిలోనే 58 వేల ఉద్యోగాలిచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారని కాంగ్రెస్‌ చేస్తున్న ఇలాంటి మోసపూరిత ప్రకటనలను ప్రజలు, నిరుద్యోగులు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎంతో అర్భాటంతో ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ఊసే లేదు. ఉద్యోగాల కల్పన అంటుంచితే కనీసం స్వయం ఉపాధికి కార్పొరేషన్‌ రుణాలు తీసుకుందామన్నా యువతను మోసగాళ్లుగా చిత్రించి కాంగ్రెస్‌ ఆ పథకాన్ని కూడా ఆపేయడం ఆక్షేపణీయం అన్నారు.. ఎంతో తెలివితో ఆలోచించే తెలంగాణ యువత ఇప్పటికైనా కాంగ్రెస్‌ కపట నాటకాలను గుర్తించాలని. ‘ఒడ్డెక్కే దాన్క ఓడ మల్లన్న ఒడ్డు దాటినాక బోడ మల్లన్న’ అనే రీతిలో వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి సరైన సమయంలో, సరైన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,యువ నాయకులు దీపక్ ,బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు రాకేష్ ,బి ఆర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు ఓంకార్, ఫయాజ్,రోహిత్, శ్రీనాథ్ ,ప్రవీణ్ మెస్సీ,
తదితరులు .పాలుగోన్నారు.

రాజీవ్ యువ వికాస పథకం – పేదలకు అందని ద్రాక్ష!

రాజీవ్ యువ వికాస పథకం – పేదలకు అందని ద్రాక్ష!

సంఘీ ఎలేందర్, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి, వరంగల్ జిల్లా అధ్యక్షులు

వరంగల్, నేటిధాత్రి

 

 

రాజీవ్ యువ వికాస పథకాన్ని సిబిల్ స్కోరు ఆధారంగా అమలు చేయడం వలన అసలు లబ్ధి పొందాల్సిన పేద ప్రజలకు ఇది అందని ద్రాక్షగా మారుతుందన్న ఆవేదనను తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘీ ఎలేందర్ వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే బ్యాంకు బాధితులుగా మారిన ఎంతో మంది పేద కుటుంబాలు గతంలో తీసుకున్న లోన్లు, వాటికి సంబంధించిన చెల్లింపులు కట్టని కారణంగా వారి సిబిల్ స్కోర్ దెబ్బ తినడం జరిగింది. ఇప్పుడు అదే సిబిల్ స్కోర్‌ను రాజీవ్ యువ వికాస పథకానికి అర్హతగా మారుస్తే, దాదాపు 40 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది అన్నారు. ప్రస్తుతం 16.25 లక్షల మంది పథకానికి దరఖాస్తు చేసిన నేపధ్యంలో, ఇంత పెద్ద సంఖ్యలో పేదలు ఈ అవకాశాన్ని కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. పథకం కింద నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడతాయి కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బ్యాంకు అధికారులతో చర్చించి, సిబిల్ స్కోరు వంటి అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది అని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈనెల 14 చివరి గడువు.

రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈనెల 14 చివరి గడువు

ముగుస్తున్న గడువు,పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య

జైపూర్,నేటి ధాత్రి:

 

రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల 14 వరకు ముగుస్తుందని మండల పరిషత్ అధికారులు ప్రకటించారు.దరఖాస్తు సమయం ముగుస్తున్న కొలది, దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు బుధవారం ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించుటకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం ద్వారా ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు రాయితీ రుణాలు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా దరఖాస్తు గడువు దగ్గర పడుతున్నట్లుగా గమనించి, లబ్ధిదారులు ఇప్పటివరకు దరఖాస్తు చేయకపోతే త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ ఈ సందర్భంగా  తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version