హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు

హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు
– బిజెపి పట్టణ అధ్యక్షులు
దుమాల శ్రీకాంత్
సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలను చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే సహించేది లేదని బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భాజాప పట్టణ శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి హిందూ భావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అర్హత లేనిదని బాధ్యత రాహిత్యమని హిందూ సమాజం శాంతిని ప్రేమిస్తుంది కానీ అవమానాన్ని అస్సలు సహించదని అన్నారు. ఇకపై ఎవరైనా హిందూ దేవుళ్ళపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే బిజెపి ఆధ్వర్యంలో అత్యంత తీవ్రంగా ఖండించే చర్యలు చేపడతామన్నారు. హిందూ సమాజ ఏకతను బలంగా ప్రదర్శించడం బిజెపి కార్యకర్తలు ప్రజల నుండి, విస్తృతంగా స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, సీనియర్ నాయకులు గూడూరు భాస్కర్, పట్టణ ఉపాధ్యక్షులు మొర శ్రీహరి, అంకారపు రాజు, కొండ ప్రతాప్,పట్టణ ప్రధాన కార్యదర్శి పల్లికొండ నరసయ్య, మెర్గు శ్రీనివాస్, కొండ నరేష్, అధికార ప్రతినిధులు మోర రవి, వేముల ఆంజనేయులు, చొప్పదండి శ్రీనివాస్, గూడెం సురేష్, సూరం వినయ్, సిద్ధి దేవరాజ్, ఇంజపురి మురళి, గాలి శ్రీనివాస్, చొక్కి శ్రీనివాస్, రచ్చ రాహుల్, వడ్నాల శేఖర్, వెలిశాల అభినయ్, వూరగొండ రాజు, కనకయ్య, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో గేట్ మీటింగ్..

ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో గేట్ మీటింగ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి :

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఐఎన్టియుసి, ఏఐటియుసి, సిఐటియు యూనియన్ల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణిలో ఉద్యోగులకు గ్రాడ్యు టీ ప్రయోజనాలు తగ్గించడం, ట్రేడ్ యూనియన్ హక్కులు కాలరాయడం, సమ్మెలపై ఆంక్షలు విధించడం, 12 గంటల పని విధానాన్ని పెంచడం, భద్రత ప్రమాదాలు పెరగడం, సరైన ప్రక్రియ లేకుండా తొలగింపునకు శ్రీకారం చుట్టడం వంటి పలు అంశాలపై సింగరేణి ముందడుగు వేస్తున్న నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జేఏసి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి సెంట్రల్ కమిటీ మెంబర్ మేకల రాజయ్య, ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు, సిఐటియు ఫిట్ సెక్రటరీ శ్రీకాంత్ , ఉపాధ్యక్షులు వెంకటస్వామి, రఘు, ప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

మీడియాపై దాడులు హేమమైన చర్య…

మీడియాపై దాడులు హేమమైన చర్య

ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

వరంగల్ జిల్లాలోని నమస్తే తెలంగాణ దిన పత్రిక కార్యాలయంపై కొంతమంది దుండగులు బుధవారం దాడి చేయడాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి వారు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పత్రికలపై మీడియాపై జరిగిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించాలి అని అన్నారు. అన్యాయాలను నిష్పక్షపాతంగా సమాజానికి అందించే నాలుగవ స్తంభంగా ఉన్న మీడియాపై కక్షసాధింపు చర్యలు దారుణం అని విమర్శించారు.ప్రశ్నించే గొంతులను అణిచివేతకు గురిచేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.మీడియాపై దాడులకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టి జర్నలిస్టుల సత్తా చాటుతామని హెచ్చరించారు. ప్రభుత్వం,పోలీసు అధికారులు పత్రికా కార్యాలయంపై దాడికి కారకులను చట్టపరంగా శిక్షించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఐక్య జర్నలిస్ట్ లు చిట్ల రమేష్, ఉమేష్,రాజు పటేల్,రమేష్ రెడ్డి,రాజు,నరేష్ స్వెన్, రాయలింగు,వెంకటస్వామి, అంబిలపు శ్రీనివాస్,పడాల సంతోష్,పార్వతి సురేష్, పార్వతి రాజేష్,సిద్దార్థ్,వంశీ తదితరులు పాల్గొన్నారు.

నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు…

నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి ఏ వన్, ఏ టూ గా కేసులు నమోదు చేయడం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడిన పిరికిపంద చర్యగా భావిస్తూ ఖండిస్తున్నామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్ అన్నారు. ఏఐసీసీ ఆదేశానుసారం, టీపీసీసీ పిలుపు మేరకు క్యాతనపల్లి మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం చరిష్మా ను కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత పదేళ్లుగా ఇదే కేసు విచారణలో ఉన్నప్పటికీ ఇందులో ఎటువంటి అవినీతి, అక్రమంగా సంపాదించిన సంపత్తి ఉందన్న నిబంధనలపై నిర్థారణ లేదని ఇప్పటికే పలు న్యాయస్థానాలు స్పష్టం చేశాయని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్ని బహిరంగంగా ప్రజల దృష్టికి తీసుకువస్తామనీ చట్టపరంగా, రాజకీయంగా దీనికి గట్టి ఎదురుదెబ్బ ఇస్తామనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, మాజీ ఎంపీటీసీ పుల్లూరి కళ్యాణ్, మాజీ వార్డు సభ్యులు ఉప్పులపు సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్ , గాండ్ల సమ్మయ్య, బుడిగె శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, బంగారు ప్రసాద్, ఎర్రబెల్లి రాజేష్, బింగి శివకిరణ్, రాజేశం, గండి కుమార్ మహిళా నాయకురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version