బిట్స్ స్కూల్లోని విద్యార్థినిల పట్ల పిఈటీ అసభ్యకర ప్రవర్తన
మోహన్ నాయక్ కిరణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
ఎస్ఎఫ్ఐ నాయకులు స్కూల్ ముందు నిరసన.
భూపాలపల్లి నేటిధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బిట్స్ స్కూల్ లోనే విద్యార్థి నీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మెసేజ్లు పంపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి టౌన్ కమిటీ ఆధ్వర్యంలో స్కూల్ ముందు నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా టౌన్ అధ్యక్ష కార్యదర్శులు నందకిషోర్ వికాస్ మాట్లాడుతూ. జిల్లా బిట్స్ స్కూల్లోని విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తక్షణమే వారిని విధుల్లో నుంచి తొలగించాలని దాంతోపాటు విద్యార్థినిలను మెసేజ్లు పెట్టి ఇబ్బందికి గురి చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి టౌన్ కమిటీ గా డిమాండ్ చేస్తున్నాము.తాము చదువు చెప్పే విద్యార్థినీల పట్ల విద్యార్థులను టార్గెట్ చేసుకొని వారిని సోషల్ మీడియాలో ఇబ్బందికరమైన మెసేజ్లు పెట్టి ఇబ్బంది గురి చేసిన వారిని తక్షణమే చట్టపరమైన చర్యలు వారిపై తీసుకోవాలని వారు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటన మరొకసారి జరగకుండా చూడాలని కోరారు..
