దళిత బిడ్డల అభ్యున్నతికి మరియు చదువులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న సంస్థ మాస్…
వర్దన్నపేట (నేటిధాత్రి ):
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బరిగెల కావేరి వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల లో బీటెక్ రెండోవ సంవత్సరం చదువుతుంది.చదువులో ఎంతో ప్రతిభ ఉన్న ఆర్ధికంగా వెనకబడి ఉన్న కుటుంభం తండ్రి లేక ఇద్దరి అమ్మాయిలను చదివిస్తున్న తల్లి.వీరి కుటుంభం నేపథ్యం తెలుసుకున్న డా”విక్రమ్ కుమార్ మహా ఆది సేవ సంస్థ సభ్యులకు తెలియజేయగా ఈ రోజు సంస్థ నుండి విద్యార్థికి కళాశాల ఫీజు మరియు పుస్తకాల అవసరానికి సంస్థ నుండి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా డా’ విజయ్ కుమార్ మాట్లాడుతూ డా బి.ఆర్ అంబేద్కర్ గారి పిలుపైన “పే బ్యాక్ టు థి సొసైటీ” అనే సిద్ధాంతం మీద మాస్ గత 5 సంవత్సరాలుగా దాదాపు 205 మంది మాదిగ జాతి బిడ్డలైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని అలువాల విజయకుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్ సంస్థ సభ్యులు డా”విజయకుమార్,డా సీనపల్లి విక్రమ్ కుమార్,డా”శివ శంకర్,సాఫ్ట్వేర్ సీనపెల్లి హరీష్,గాయాల సుమన్,జోగుల సంపత్,వేల్పుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు…