దళారులను నమ్మి మోసపోవద్దు.

దళారులను నమ్మి మోసపోవద్దు.
నాణ్యత ప్రమాణాలు పాటించాలి.
డిపిఎం యాదయ్య.

నిజాంపేట: నేటి ధాత్రి

 

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించాలని డిపిఎం యాదయ్య అన్నారు. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. 48 గంటలలో రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయని పేర్కొన్నారు. అకాల వర్షాలు ఎప్పుడు సంభవిస్తాయో తెలియదు కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఏం అశోక్, సీసీ వెంకటరాజం, రవీందర్, నిర్వాహకులు బురాని మంగమ్మ, వాణి, రజిత రైతులు ఉడేపు మహేష్, అందే స్వామి, పిట్ల రమేష్ తదితరులు ఉన్నారు.

అకాల వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి తహసిల్దార్ శ్రీనివాస్.

అకాల వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి
తహసిల్దార్ శ్రీనివాస్.

నిజాంపేట: నేటి ధాత్రి

 

అకాల వర్షాలు ఏ సమయంలో సమీపిస్తున్నయో! అర్థం కావడం లేదని రైతులు అకాల వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ శ్రీనివాస్ అన్నారు. నిజాంపేట మండలంలో మాట్లాడుతూ..
రైతులు ఆరుకాలం కష్టించి పండించిన పంట కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారాని కాబట్టి అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకోవాలన్నారు. రైతులు టార్పోలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని సూచించారు

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు…

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు…వర్ధన్నపేట ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ.పత్తి రైతు సోదరులకు
విజ్ఞప్తి.2025- 26 సంవత్సరమునకు గాను ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ. 8110 /- లుగా నిర్ణయించనైనది.రైతు సోదరులు తమ పత్తి సరుకును ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ వారికి అమ్ముటకు గాను జిన్నింగ్ మిల్లుకు తీసుకు వచ్చే ముందే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పత్తి పంట వేసినట్లు నమోదు తప్పని సరిగా చేసుకోవలెను. తర్వాత సీసీఐ వారి కిసాన్ యాప్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని రాగలరు.స్లాట్ బుక్ చేసుకొని వచ్చిన వారి కాటన్ మాత్రమే సీసీఐ వారు కొనుగోలు చేయడం జరుగుతుంది.అలాగే పత్తిని బాగా అరబెట్టి తేమ శాతం 12 % లోపు ఉండే విధంగా చెత్త చెదారం లేకుండా శుభ్రం చేసుకుని తీసుకురాగలరు. ఇలా తీసుకువొచ్చిన వారికి సరైన మద్దతు ధర లభిస్తుంది. పత్తి తేమ శాతం 8 నుండి 12 % లోపు ఉండవలెను. 8 శాతం కన్నా ఎక్కువగా ఉంటే ఒక్కో శాతం పెరిగే కొద్దీ క్వింటాలుకు రూ. 81 రూపాయలు తగ్గును. 12 శాతం కన్నా ఎక్కువగా ఉన్న పత్తిని సీసీఐ వారు కొనుగోలు చెయ్యరు. తదుపరి జిన్నింగ్ మిల్లుకు వచ్చేటపుడు రైతు వెంట ఆధార్ కార్డ్ జీరాక్స్ , పట్టాదారు పాస్ బుక్ జీరాక్స్ మరియు ఆధార్ కార్డుకు లింక్ అయిన సెల్ నంబర్ వెంట తెచ్చుకోగలరు. ఆధారుతో అనుసందానం అయిన బ్యాంకు నందు మాత్రమే మీ యొక్క పత్తి అమ్మిన డబ్బులు జమచేయబడును కావున రైతులు గమనించగలరు.
రైతుల సౌకర్యార్థం పత్తి కొనుగోళ్ల సంబంధిత సేవలకై ఫోన్ నెంబర్ 18005995779 మరియు వాట్సప్ చాట్ సేవలకై 8897281111 లను వినియోగించుకోగలరని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము.
రైతులు తాము ఆరు కాలం కష్టపడి పండించిన పత్తిని మధ్యధళారులకు అమ్ముకొని మోసపోకుండా సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద మాత్రమే అమ్ముకొని మద్దతు ధర పొందగలరని కోరనైనది.

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

వాతావరణ శాఖ సూచన మేరకు రాబోవు మూడు రోజుల పాటు భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రజా రక్షణ చర్యలలో అప్రమత్తంగా ఉండాలని,జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలు,వాగులు, లోతట్టు ప్రాంతాలలో అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న నివాసాలలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. జిల్లాలోని ప్రాజెక్టులు, ఉదృతంగా ప్రవహించే నదులు,వాగుల వద్దకు ఎవరు వెళ్లకూడదని,పోలీసు శాఖ అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల సమీపానికి వెళ్ళకూడదని,రైతులు పొలాలలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, చేపల వేటకు ఎవరు వెళ్లకూడదని,అత్యవసర సమయాలలో మాత్రమే ప్రజలు బయటకు రావాలని తెలిపారు.తక్షణ సహాయం, పునరావాస కేంద్రాల సమాచారం ఇతర వివరాల కొరకు జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ 08736-250501 నంబర్ ఏర్పాటు చేసి, 24 గంటలు తక్షణ సహాయం సేవలు అందుబాటులో ఉంచడం జరిగిందని,జిల్లాలో వరద,ఘటనల సమాచారం ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు అందించాలని తెలిపారు. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటుందని,ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version