మహానేతల జయంతి – వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకుల నివాళులు…

మహానేతల జయంతి – వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకుల నివాళులు

వర్ధన్నపేట. (నేటిధాత్రి)

వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి మరియు మాజీ ఉప ప్రధాని,మాజీ హోమ్ మంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఆ మహనీయుల చిత్ర పటాలకు మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ అధ్యక్షుడు అభిడి రాజ్ రెడ్డి, వర్ధన్నపేట టౌన్ ప్రసిడెంట్ మైస సురేష్,ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారులు పూల దండలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ బ్లూ స్టార్ కారణంగా తన సిక్కు బాడీ గార్డ్ చేతిలో 1984 అక్టోబర్ 31 న ఇందిరా గాంధీ మరణించడం జరిగింది.బడుగు బలహీన వర్గాలు, దళితులతో పాటు మైనార్టీలంతా తమ అమ్మను కోల్పోయినట్టుగా బాధపడ్డారు .దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన దివంగత ప్రధాని ఇందిర చిరస్మరణీయురాలు. 1966 లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి అయిన నాటికి దేశములో ఆర్థిక మాంద్యం,పారిశ్రామిక ఉత్పత్తుల పతనం,ఎగుమతులు తగ్గడం,ఆహార ధాన్యాల సంక్షోభం ఏర్పడ్డాయి. వీటితో పాటు బడ్జెట్ డేపిసిట్ పెరగడం,విదేశీ ఆర్థిక సాయంపై ఎక్కువగా ఆధారపడటం వంటివే గాక 1962,1965 నాటి యుద్ధాలు, పాకిస్థాన్,చైనా కూటమి ఏర్పాటులో సైన్యం పై ఖర్చు పెంచడం వంటివి జరిగాయి వర్షాలు లేక కరువు ఏర్పడింది.ధరలు పెరిగాయి,పాలన ఖర్చులు తగ్గించుకోవడం వీలుపడలేదు అయినా యుద్ధ ప్రాతిపదికన ఆహార ధాన్యాలు సేకరించి ప్రజలకు పంచి, వారి ప్రాణాలను కాపాడగలిగారు.1970 లో అనేక దేశాలు ఆయిల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన భారత్ ను మాత్రం ఆ సమస్య నుంచి ఇందిర కాపాడగలిగారు.అదేవిధంగా దేశములోని పేదరికాన్ని ప్రారదోలాడానికి గరిభి హేట్టావో 20 సూత్రాల పథకం ప్రవేశ పెట్టడమే కాకుండా బ్యాంకులన జాతీయకరణ, రాజభరణాలు రద్దు చేసి ఆదూకున్న ఘనత ఇందిర గాంధీ గారిది.
సర్ధార్ వల్లబాయ్ పటే
నిజాం మెడలు వంచి హైద్రాబాద్ సంస్థానాన్ని విముక్తం చేయడంతో పాటు 550 కి పైగా ,సంస్థానాలను దేశంలో విలీనం చేసిన ఉక్కు మనిషి 1948 సెప్టెంబర్ 13 న ఆపరేషన్ పోలో కింద భారత సైన్యం మేజర్ జనరల్ జె.ఎస్.చౌదరి నాయకత్వంలో వేగంగా హైదరాబాద్ వైపునకు మళ్ళింది నిజాం సైన్యం కనీసం పోరాటాన్ని కూడా చూపలేదు కేవలం నాలుగు రోజుల్లో నిజాం ఓటమిని ఒప్పుకొని లొంగిపోయారు. హైద్రాబాద్ రాష్ట్రాన్ని భారత్ లో పటేల్ విలీనం చేయించిన ధీరా శాలి.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్, కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు మరుపట్ల అరుణ, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కుల్ల యాకంతం, ఐనవోలు టెంపుల్ డైరెక్టర్ గుంటి కుమార స్వామి,ఖీమా నాయక్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బచ్చు గంగా ధర రావు,అంగోత్ నాను నాయక్,మాజీ కౌన్సిలర్లు సమ్మెట సుధీర్,తుమ్మల రవీందర్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపెల్లి యాదగిరి,ల్యాబర్తి,కొత్తపెల్లి, అంబేద్కర్ నగర్ ,ఇల్లంద గ్రామ పార్టీ ల అధ్యక్షులు చిదుముల్ల భాస్కర్,తాళ్ళపెల్లి యాదగిరి గౌడ్,సింగపురం ఎలియాస్,ఎద్దు రాజేంద్ర ప్రసాద్,మహిళా నాయకురాండ్లు పాక సుజాత,లింగం రజిత రెడ్డి,పెద్దబోయిన ఉపేంద్ర,గడ్డం సమ్మయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మల్లెపాక సమ్మయ్య,కర్ర శ్రీనివాస్ రెడ్డి,మరుపట్ల సాయికుమార్,దికొండ ఉపేందర్,గంగరాజు, లింగా రాజు,జోగు పరిశారములు,చిటూరి రాజు, భూక్యా మల్లు నాయక్,ఐత సుధాకర్,తుమ్మల కుమారస్వామి,మంద భాస్కర్, దొణికల మధు గౌడ్,బచ్చల స్వామి, తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు…

తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఎర్రగడ్డలోని 71వ .బూతులో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఇందిరా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇందిరాగాంధీ ఆమె దేశానికి చేసిన సేవలు గుర్తుచేస్తూ. ఆమె చేసిన భూ సంస్కరణలు. రాజభరణాలు రద్దు. బ్యాంకుల జాతీయం. హరిత విప్లవం. ఇటువంటి ఎన్నో విప్లవత్మక నిర్ణయాలు ఇందిరా గాంధీ.ఇండియా గా పరిపాలన చేసే ప్రజల మన్ననలు పొంది. అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్షంలో భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ అని. ఈ సందర్భంగా. తెలియజేస్తూ హైదరాబాదులోని ఎర్రగడ్డలోని 71వ . బూతులో. కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు. ఆకునూరి బాలరాజ్. తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్.రాజన్నసిరిసిల్ల జిల్లా. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి గడ్డం మధుకర్. ఏఎంసి. డైరెక్టర్ ఆరెపల్లి బాలు. పొన్నాల పరశురాములు. నరసయ్య. దాసరిబాలరాజు. గుగ్గిళ్ళ భరత్ గౌడ్. ఎడ్ల తిరుపతి. బాలసాని శ్రీనివాస్. గాదరి కిషన్. మీరాల శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే…

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే
బిజెపి.ఆర్ఎస్ఎస్. లకు పోరాటానికి ఎలాంటి సంబంధం లేదు
ఉద్యమ కాలంలో తెల్లదొరల సేవలో ఆర్ఎస్ఎస్. బిజెపి
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం చుక్కయ్య

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపినకమ్యూనిస్టులు నిజాం ప్రభువు, రజాకార్లు భూస్వాములు, జాగీర్దార్ల ఆధీనంలో ఉన్న భూముల్ని స్వాధినం చేసుకుని 10 లక్షల ఎకరాలను పేద ప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులది. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా 1946 నుంచి 1951 వరకు ఎర్రజెండా నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్ట్ లు అమరులయ్యారు. వేలాది గ్రామాలు నిజాం నవాబు పాలన నుంచి విముక్తి పొందాయి. అలాంటి మహోత్తరమైన ప్రజాపోరాటంలో ముస్లింలు సైతం ముఖ్యపాత్ర పోషించారు. అని అన్నారు. పోరాటానికి ఎలాంటి సంబంధంలేని బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లీం పోరాటంగా చిత్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది’ అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు. చుక్కయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ .సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం. సిపిఎం మండల కమిటీ సభ్యులు రామ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.తెలంగాణ సాయుధ పోరాటం వాస్తవాలు వక్రీకరణ పై స్టడీ.సర్కిల్ . ఏం చుక్కయ్యగారు బోధించారు. తెలంగాణ సాయుధ పోరాటం నిజాం పాలనలో తెలం గాణ ప్రాంతం మంత వెట్టి నడిచేదని, భూస్వాములు, పెత్తందార్లు, పటేల్‌. పట్వారీ లకు లొంగి పనిచేయాల్సిన దుస్థితి ఉండేదన్నారు.

 

 

 

దుర్భర పరిస్థితి నుంచి విముక్తి కల్గించి, ప్రజల్ని కాపాడేందుకు 1930లో ఆంధ్రమహాసభ పేరుతో కమ్యూనిస్టులు ప్రజల ముందుకొచ్చారని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ ఐదెకరాల పంటను భూస్వామ్య గుండాలు ఎత్తుకెళ్లేందుకు పూనుకుంటే భీంరెడ్డి నర్సింహారెడ్డి. మల్లు స్వరాజ్యం. కృష్ణమూర్తి. మల్లు వెంకట నరసింహారెడ్డి దళం ఆ పంటను రక్షించి భూస్వామ్య గుండాలను ఎదిరించిన విషయాలను ఆయన వివరించారు. దొడ్డి కొమరయ్య బలిదానం తర్వాత సాయుధ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగిందని, అన్నారు సిపిఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య మాట్లాడుతూ. బాంచన్‌ కాల్మొక్త అన్న ప్రజలు బంధూకులు పట్టి పోరాటంలోకి దూకారని తెలిపారు. సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న సిపిఎం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరిన్ని ఉద్యమాలు నడిపేందుకు పార్టీ శ్రేణులు సిద్దం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కే నారాయణరెడ్డి. మడిగే నాగరాజు. గుండెకారి బాబురావు వరికల్ గోపాల్ రావు .గుండెకారి. చిన్న మహేందర్. కే కవిత.రాజేశ్వర రావు. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version