మహానేతల జయంతి – వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకుల నివాళులు
వర్ధన్నపేట. (నేటిధాత్రి)
వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి మరియు మాజీ ఉప ప్రధాని,మాజీ హోమ్ మంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఆ మహనీయుల చిత్ర పటాలకు మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ అధ్యక్షుడు అభిడి రాజ్ రెడ్డి, వర్ధన్నపేట టౌన్ ప్రసిడెంట్ మైస సురేష్,ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారులు పూల దండలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ బ్లూ స్టార్ కారణంగా తన సిక్కు బాడీ గార్డ్ చేతిలో 1984 అక్టోబర్ 31 న ఇందిరా గాంధీ మరణించడం జరిగింది.బడుగు బలహీన వర్గాలు, దళితులతో పాటు మైనార్టీలంతా తమ అమ్మను కోల్పోయినట్టుగా బాధపడ్డారు .దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన దివంగత ప్రధాని ఇందిర చిరస్మరణీయురాలు. 1966 లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి అయిన నాటికి దేశములో ఆర్థిక మాంద్యం,పారిశ్రామిక ఉత్పత్తుల పతనం,ఎగుమతులు తగ్గడం,ఆహార ధాన్యాల సంక్షోభం ఏర్పడ్డాయి. వీటితో పాటు బడ్జెట్ డేపిసిట్ పెరగడం,విదేశీ ఆర్థిక సాయంపై ఎక్కువగా ఆధారపడటం వంటివే గాక 1962,1965 నాటి యుద్ధాలు, పాకిస్థాన్,చైనా కూటమి ఏర్పాటులో సైన్యం పై ఖర్చు పెంచడం వంటివి జరిగాయి వర్షాలు లేక కరువు ఏర్పడింది.ధరలు పెరిగాయి,పాలన ఖర్చులు తగ్గించుకోవడం వీలుపడలేదు అయినా యుద్ధ ప్రాతిపదికన ఆహార ధాన్యాలు సేకరించి ప్రజలకు పంచి, వారి ప్రాణాలను కాపాడగలిగారు.1970 లో అనేక దేశాలు ఆయిల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన భారత్ ను మాత్రం ఆ సమస్య నుంచి ఇందిర కాపాడగలిగారు.అదేవిధంగా దేశములోని పేదరికాన్ని ప్రారదోలాడానికి గరిభి హేట్టావో 20 సూత్రాల పథకం ప్రవేశ పెట్టడమే కాకుండా బ్యాంకులన జాతీయకరణ, రాజభరణాలు రద్దు చేసి ఆదూకున్న ఘనత ఇందిర గాంధీ గారిది.
సర్ధార్ వల్లబాయ్ పటే
నిజాం మెడలు వంచి హైద్రాబాద్ సంస్థానాన్ని విముక్తం చేయడంతో పాటు 550 కి పైగా ,సంస్థానాలను దేశంలో విలీనం చేసిన ఉక్కు మనిషి 1948 సెప్టెంబర్ 13 న ఆపరేషన్ పోలో కింద భారత సైన్యం మేజర్ జనరల్ జె.ఎస్.చౌదరి నాయకత్వంలో వేగంగా హైదరాబాద్ వైపునకు మళ్ళింది నిజాం సైన్యం కనీసం పోరాటాన్ని కూడా చూపలేదు కేవలం నాలుగు రోజుల్లో నిజాం ఓటమిని ఒప్పుకొని లొంగిపోయారు. హైద్రాబాద్ రాష్ట్రాన్ని భారత్ లో పటేల్ విలీనం చేయించిన ధీరా శాలి.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్, కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు మరుపట్ల అరుణ, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కుల్ల యాకంతం, ఐనవోలు టెంపుల్ డైరెక్టర్ గుంటి కుమార స్వామి,ఖీమా నాయక్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బచ్చు గంగా ధర రావు,అంగోత్ నాను నాయక్,మాజీ కౌన్సిలర్లు సమ్మెట సుధీర్,తుమ్మల రవీందర్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపెల్లి యాదగిరి,ల్యాబర్తి,కొత్తపెల్లి, అంబేద్కర్ నగర్ ,ఇల్లంద గ్రామ పార్టీ ల అధ్యక్షులు చిదుముల్ల భాస్కర్,తాళ్ళపెల్లి యాదగిరి గౌడ్,సింగపురం ఎలియాస్,ఎద్దు రాజేంద్ర ప్రసాద్,మహిళా నాయకురాండ్లు పాక సుజాత,లింగం రజిత రెడ్డి,పెద్దబోయిన ఉపేంద్ర,గడ్డం సమ్మయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మల్లెపాక సమ్మయ్య,కర్ర శ్రీనివాస్ రెడ్డి,మరుపట్ల సాయికుమార్,దికొండ ఉపేందర్,గంగరాజు, లింగా రాజు,జోగు పరిశారములు,చిటూరి రాజు, భూక్యా మల్లు నాయక్,ఐత సుధాకర్,తుమ్మల కుమారస్వామి,మంద భాస్కర్, దొణికల మధు గౌడ్,బచ్చల స్వామి, తదితరులు పాల్గొన్నారు.
