పలిమల మహా ముత్తారంలో సివిల్ సర్వీస్ అధికారుల పర్యటన

పలిమల మహా ముత్తారంలో సివిల్ సర్వీస్ అధికారుల పర్యటన

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా పరిధిలోని పలిమెల, మహా ముత్తారాం మండలాల్లో ఈ నెల 8 నుండి 15వ తేది వరకు సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం పర్యతించనున్నందున అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్సోరి నుండి మొత్తం 12 మంది సివిల్ సర్వీసెస్ అధికారులు పర్యటన నిమిత్తం జిల్లాకు రానున్నారని, పలిమెల, మహా ముత్తారం మండలాల్లో వసతి, భోజన సౌకర్యాలు ముందస్తుగా సిద్ధం చేయాలని సూచించారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిశీలన ఉంటుందని సంబంధిత శాఖలు విభాగాలవారీగా నోట్స్ సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల ఫీల్డ్ విజిట్ అనంతరం అధికారులు పర్యటనపై ఫీడ్ బ్యాక్, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కోసం నివేదికలను తయారుచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు

మహముత్తారంలో సమ్మె విజయవంతం

మహముత్తారంలో సమ్మె విజయవంతం

భూపాలపల్లి నేటిధాత్రి

మహాముత్తారం మండల కేంద్రంలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పోలం రాజేందర్ మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని ఈ సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సంపూర్ణ మద్దతును ప్రకటించిందని వారు అన్నారు సమ్మె రోజున గ్రామీణ బందుకు పిలుపునిచ్చింది కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింత దూకుడు అమలు చేస్తుందన్నారు కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడులను ముందుకు తెచ్చింది అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version