మరిపెడ మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..

మరిపెడ మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మాకులచెరువు, కట్ట ఆధునీకరణ, సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి

నేటిధాత్రి డోర్నకల్ ఆర్సి/మరిపెడ

 

మండల కేంద్రం లోని జిల్లా, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడి, ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,మరిపెడ మండల మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్,ప్రాథమిక మండల పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పట్టణంలోని మాకుల చెరువు ఆధునీకరణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళుతుందని అందులో భాగంగానే మరిపెడ పట్టణంలోని మాకులచెరువు అభివృద్ధి పనులు నిమిత్తం సుమారు రెండు కోట్ల నిధులతో సుందరీకరణ పనులు చేపట్టడం జరిగిందని ఆ యొక్క పనులను వెంటనే పూర్తి చేసి పట్టణ అభివృద్ధికి ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు, అన్ని విద్యాసంస్థలలో చదువుతున్న పిల్లలకు హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్లపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థిని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ వైద్య పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని,అత్యాధునిక పరిజ్ఞానంతో విద్యా బోధనలు ప్రతి సబ్జెక్టు పై పట్టు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు సూచించారు,అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వ అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని నెలవారి షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరికి అందించాలని చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా విద్యను అందించాలని, కేంద్రం పరిధిలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు సామ్, మామ్, ఆరోగ్య వివరాలను నిత్యం క్షేత్రస్థాయిలో గమనిస్తూ వారికి కావలసిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థుల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా కలెక్టర్ పిల్లలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్, పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్, అంగన్వాడీ కేంద్రాలలోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్స్ స్టడీ రూమ్స్ తరగతి గదులు స్టోర్ రూమ్ పరిసరాలను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ క్రిష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ ఆర్. విజయాఆనంద్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version