ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

మంగళవారం జిల్లా ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్, సాధారణ వార్డులు, ఐసీయూ వార్డులు, రోగులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, ఓపి సేవలు, సహాయక కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం అన్ని విభాగాల ప్రధాన వైద్యులతో సమావేశం నిర్వహించారు.

సిబ్బంది ఖచ్చితమైన సమయపాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రోజు రోగులకు వేస్తున్న బెడ్‌షీట్లను మార్చాలని సూచించారు. రోగులకు అందించే ఆహారానికి స్పష్టమైన మెనూ ఏర్పాటు చేయాలని సూచించారు.
వైద్య సేవలపై రోగులు అభిప్రాయాలు చెప్పేందుకు ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం వార్డుల్లో పర్యటించిన కలెక్టర్, చికిత్స పొందుతున్న రోగుల దగ్గరకు వెళ్లి వైద్య సేవలపై స్పందనను అడిగి తెలుసుకున్నారు. రక్షణ చర్యల్లో బాగంగా ఫైర్ ఎస్టింగ్విషర్‌ల గడువు ముగిసినట్లు గుర్తించిన కలెక్టర్, ఇప్పటి వరకు ధృవీకరణ ఎందుకు తీసుకోలేదని పర్యవేక్షకునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సేవలకు సంబంధించిన రికార్డులను భద్రపరచడం కోసం జిల్లా వైద్య శాఖ ఆధీనంలో ఖాళీగా ఉన్న భవనాన్ని వినియోగించాలని సూచించారు. ప్రతి రోజు ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, రోజుకు దాదాపు వెయ్యి మందికిపైగా వైద్యసేవలు అందుకుంటున్నారని పర్యవేక్షకులు డా. రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రసూతి విభాగాన్ని సందర్శించిన కలెక్టర్, ప్రతి నెల 160–180 ప్రసవాలు జరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. అందులో సాధారణ ప్రసవాలు, సిజేరియన్‌ల వివరాలు, ప్రమాదకర కేసులను ఎక్కడికి రిఫర్ చేస్తున్నారన్న అంశాలను కూడా కలెక్టర్ వివరంగా ఆరా తీశారు.
డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ఉపయోగించటం లేదని గుర్తించి, లీకేజీల కారణంగా వినియోగం ఆగిపోయిందని వైద్యులు వివరిగా తెలియజేయగా, వెంటనే మరమ్మతులు చేసి సేవల్లోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, రోగుల భద్రత, నాణ్యమైన వైద్యసేవలు నిర్దేశిత విధానంలో అమలు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆర్ ఎం ఓ దివ్య అని విభాగాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version