బస్తీ బాట పట్టిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు జంగేడు ప్రాంతంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన బస్తీ బాట కార్యక్రమం
నిర్వహించిచారు ఈ బస్తీ బాట కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వార్డు పరిధిలో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై ప్రజలు వ్యక్తం చేసిన సమస్యలను శ్రద్ధగా విన్న గండ్ర వెంకట రమణా రెడ్డి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, భవిష్యత్తులో కూడా భూపాలపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
