మహాశివరాత్రి జాతరకు విస్తృత ఏర్పాట్లు చేయాలి…

మహాశివరాత్రి జాతరకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

◆-: ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మహాశివరాత్రి జాతర కోసం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బానీ అన్నారు. ఈ నెల 15, 16, 17వ తేదీల్లో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై
ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బానీ మాట్లాడుతూ ఉత్సవాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పకడ్బందీగా. మహాశివరాత్రి జాతరను పండుగగా భావించి భక్తులు సులభంగా, వేగంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. శివ స్వాములకు సులభ దర్శనం జరిగే విధంగా చూడాలని, దర్శన సమయం కూడా అరగంట అదనంగా పెంచాలన్నారు. పుర ప్రముఖులకు గతంలో మాదిరి అందజేసి సులభ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలాని. ప్రస్తుతం భక్తుల కోసం రెండు క్యూలైన్‌ల సిస్టం ఉన్న దృష్ట్యా వీఐపీల కోసం మూడో క్యూలైన్‌ శివరాత్రి లోగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ ప్రాంగణం వద్ద భక్తులకు తాగునీరు, కుర్చీలు, పందిల్ల సౌకర్యం కల్పించాలని. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. బస్టాండ్‌ లో మూత్రశాలలు, తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని. కంట్రోల్‌ రూమ్‌ల వద్ద ప్రజా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి మైకు ద్వారా భక్తులకు తెలియజేసే సౌకర్యం కల్పించాలన్నారు.జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు శాశ్వత సీసీ కెమెరాలను పెట్టాలన్నారు. జాతర విజయవంతం చేసేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలన్నారు. జాతరలో ఆధ్యాత్మికత, భక్తిభావం ఉట్టిపడేలా భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు ఉండాలన్నారు.
మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన ఏర్పాట్లు చేయాలని. భక్తులు స్వామి వారి దర్శనాన్ని వేగంగా, సౌకర్యంగా చేసుకునేలా ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని కోరారు.
మహా శివరాత్రి జాతర సందర్భంగా యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి జాతర సందర్బంగా ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు రాకుండా వలంటీర్‌లను ఏర్పాటు చేయాలని.
అగ్ని మాపక అధికారులు ఆలయ సిబ్బందికి అగ్ని మాపక పరికరాలు వాడే విధానంపై ముందస్తు అవగాహన కల్పించాలని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్య కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు రోజులు తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని నీటి సరఫరా. అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా
నిరంతరం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని.మెరుగైన పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని అన్నారు, అమృత గుండం దగ్గర కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ నుంచి దర్శనానికి వచ్చిన భక్తులను స్నానాలు చేసి బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలన్నారు,

ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు
ఏర్పాట్లు చేయాలని ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బానీ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పవిత్ర రంజాన్ మాసం ప్రశాంతంగా జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఝరాసంగం మండల ఆయా గ్రామీణ ప్రాంతాలు, సైతం అవసరమైన ఏర్పాట్ల కోసం మసీదుల వద్ద విద్యుత్ దీపాలు ఎక్కడైనా, అప్రోచ్ రోడ్డు గుంతల మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని అన్నారు. మసీదుల వద్ద హైమాస్ లైట్, వీధి దీపాల పని తీరు పర్యవేక్షించాలని, మసీదుల వద్ద పారిశుద్ధ్య మురికి కాలువలు నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. మండల అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని పంచాయతి అధికారులను కోరారు. సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలని తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర వ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని విద్యుత్తు అధికారులకు సూచించారు. ఏదేని విద్యుత్తు సమస్య వచ్చినా తక్షణమే స్పందించేందుకు మసీదు పెద్దలకు ఆ ప్రాంతం యొక్క లైన్ మెన్ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచాలని అన్నారు,ఇషా నమాజ్ తర్వాత రాత్రి సమయంలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు.సహర్ (Sehri): సూర్యోదయానికి ముందు వేకువజామున చేసే భోజనం. ఈ సమయంలో విద్యుత్ శాఖ అధికారులకు రంజాన్ సమయాలను తెలియజేసి, ఆ సమయంలో పవర్ కట్స్ చేయకుండా చూడాలని ముందస్తుగా సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మండల ఆయా గ్రామాలలో వంటి ప్రాంతాలలో ఇబ్బందులను నివారించాలని కోరారు.

బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే…

బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ రవాణా సౌకర్యాలు
బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నుండి 79 ప్రత్యేక బస్సులు ఏర్పాటు భక్తులకు మెరుగైన, సురక్షిత ఆర్టీసీ సేవలు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తింపు బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నుండి మేడారం జాతరకు వెళ్లే భక్తుల ప్రయాణ, రవాణా సౌకర్యాలను మెరుగుపరచే ఉద్దేశంతో 79 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి, ఆదివారం రోజున జాతర బస్సు సేవలను ఎమ్మెల్యే ఆర్టీసీ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బెల్లంపల్లి కొత్త బస్టాండ్ వద్ద తగిన సంఖ్యలో బస్సులను అందుబాటులో ఉంచామని తెలిపారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని, మహిళా భక్తులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని స్పష్టం చేశారు.బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు నిరంతరంగా బస్సులు నడుస్తాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మనోజ్, ఏసిపి. రవికుమార్, ఆర్టీసీ ఎండీ రాజశేఖర్,ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్..

సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్..

 

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దిల్‌సుక్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది..

 సంక్రాంతి (Sankranti) పండుగ వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం పల్లె బాట పడుతుంది. ఈ ఏడాది కూడా అదే దృశ్యం పునరావృతమవుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. గడిచిన మూడు రోజుల్లోనే నగరం నుంచి సుమారు 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు తమ స్వగ్రామాలకు తరలివెళ్లారు.

బస్టాండ్ల వద్ద భారీ రద్దీ..

భాగ్యనగరం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధాన కేంద్రాలైన దిల్‌సుక్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయినప్పటికీ.. సమయానికి బస్సులు రాకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బస్టాండ్లలో కిక్కిరిసిన ప్రయాణికులు..

స్వగ్రామాలకు వెళ్లేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో బయలుదేరడంతో బస్టాండ్లన్నీ రద్దీగా మారాయి. టిక్కెట్లు దొరక్క, బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చిన వారైతే.. మరిన్ని తీవ్ర అవస్థలు పడుతున్నారు.

రైళ్లు, బస్సుల్లో ‘నో వేకెన్సీ’..

ప్రయాణికుల డిమాండ్ భారీగా పెరగడంతో రేపటి వరకు బస్సులు, రైళ్లలో అన్ని రిజర్వేషన్లు పూర్తిగా ఫుల్ అయ్యాయి. ఆన్‌లైన్, కౌంటర్ రిజర్వేషన్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నప్పటికీ, ప్రయాణికుల సంఖ్యకు అవి సరిపోవడం లేదు. రేపటి వరకు అన్ని ప్రధాన రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి.

సమయానికి రాని బస్సులు..

సమయానికి బస్సులు రాకపోవడం ప్రయాణికుల సమస్యలను మరింత పెంచుతోంది. షెడ్యూల్ ప్రకారం బస్సులు నడవకపోవడంతో బస్టాండ్లలో గందరగోళం నెలకొంది. కొన్నిచోట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను ప్రశ్నించారు.

అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి..

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రద్దీని నియంత్రించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ..

రిజర్వేషన్లు దొరక్కపోవడంతో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్నే అవకాశంగా తీసుకుని.. ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వాహనాల్లో సీట్లు దొరకని ప్రయాణికులు చేసేదేమీ లేక ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు.. సాధారణ చార్జీల కంటే మూడు రెట్లు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికుల నుంచి రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.

 

ట్రాఫిక్‌తో నరకం..

హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లే ఎగ్జిట్ పాయింట్ల వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్లే పంతంగి టోల్ ప్లాజా, వరంగల్ వైపు వెళ్లే రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తమ ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

 

మూడు రోజుల్లో 30 లక్షల మందికి పైగా..

అధికారిక లెక్కల ప్రకారం, గడిచిన మూడు రోజుల్లో హైదరాబాద్ నగరం నుంచి 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు తరలివెళ్లినట్లు సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version