రోగనిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్…

రోగనిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్

నిజాంపేట: నేటి ధాత్రి

 

పసిపిల్లలలో రోగ నిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్ టీకాలు ఉపయోగపడతాయని గ్రామ కార్యదర్శి ఆరిఫ్ అన్నారు. నిజాంపేట మండలం నగరం తండా గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పసి పిల్లలకు టీకాలు, వ్యాక్సినేషన్ ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు బిపి షుగర్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం నిర్మల, అంగన్వాడి టీచర్ స్వప్న ఆశ వర్కర్లు ఉన్నారు.

చిరుధాన్యాలు మొలకెత్తిన గింజలతో సంపూర్ణ ఆరోగ్యం…

చిరుధాన్యాలు మొలకెత్తిన గింజలతో సంపూర్ణ ఆరోగ్యం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల మండలంలోని అందుకు తండ గ్రామ పరిధిలోని పోషణ మాసంలో భాగంగా అందుకు తండా గ్రామపంచాయతీ పరిధిలో ఐదుగురు టీచర్లు ఏర్పాటు చేసిన సమావేశమునకు జయప్రద సూపర్వైజర్ హాజరై ప్రతిరోజు చిరుధాన్యాలతో కూడిన భోజనం, మొలకెత్తించిన గింజలను భుజించి, సేంద్రియ ఎరువులు వాడి, పంటలు పండించాలని, వ్యక్తిగత శుభ్రత ,పరిసరాల పరిశుభ్రత, త్రాగునీరు ప్లాస్టిక్ నివారణ గూర్చి వివరించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, ప్రతాప్ గారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే చిన్ననాటి నుండి క్రమశిక్షణతో పెంచుతూ,మొబైల్స్ కు దూరంగా ఉంచుతూ బయట తిను బండారాలు పిల్లలకు పెట్టకుండా ఇంటిలో తయారు చేసిన సమతుల హారము అందించినప్పుడు అన్ని రంగాలలో రాణిస్తారు అని సూచించారు. ఈ ప్రోగ్రాం లో నలుగురు పిల్లలకు అక్షరాభ్యాసము, ముగ్గురు పిల్లలకు అన్నప్రాసన చేయించి అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ సింగ్ గ అంగన్వాడి టీచర్లు కస్తూరి, రజిత ప్రమీల, మమత, ఉమాదేవి, అనూష ,స్వప్న ,ఏఎన్ఎం లావణ్య, ఆశ వర్కర్స్ ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరైనారు. టీచర్స్ ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ చాలా చాలా, ఉపయోగకరమైనది అని మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ భవన్ రేకుర్తి కంటి హాస్పిటల్ వారి సహకారంతో కంటి టెక్నిషన్ ప్రభాకర్ సారథ్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమంలో మొత్తం ఎనభై రెండు మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ముప్పై నాలుగు మందిని ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి కంటి ధవాఖానకు బస్సులో తీసుకుపోవడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వైస్ గవర్నర్-1 మోర భద్రేషం, అధ్యక్షులు రాపల్లి శ్రీనివాస్, సెక్రెటరీ పాకాల మోహన్, కోశాధికారి గొడుగు అంజి యాదవ్, జోన్ చైర్మన్, కర్ర ప్రభాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్ కర్ర శ్యాం సుందర్ రెడ్డి, డైరెక్టర్స్ ముదుగంటి రాజిరెడ్డి, చాడ దామోదర్ రెడ్డి, కోట్ల మల్లేశం, ఎడవెల్లి రాజిరెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, మూల అనంతరెడ్డి, ఒడ్నాల శ్రీనివాస్, ముదుగంటి చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మెగా మెడికల్ క్యాంప్

మెగా మెడికల్ క్యాంప్

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ మంచిర్యాల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ప్రాంతంలోని పీహెచ్సీ లో మెగా మెడికల్ క్యాంప్ గురువారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యులు ఉచితంగా బీపీ, షుగర్,టీబీ,బ్లడ్,డెంగ్యూ, మూత్ర వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు.తీవ్ర ఆరోగ్య ఇబ్బందులతో ఉన్న పెషేంట్స్ ని అంబులెన్స్ ద్వారా మంచిర్యాలకు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ పూదరి కుమార్, హెచ్ఇ అల్లాడి శ్రీనివాస్, రమేష్ సిహెచ్ఓలు రమేష్, అక్తర్,టీబి ప్రోగ్రాం సూపర్వైజర్ సాయి రెడ్డి, ఐసిటిసి మెంబెర్స్ డా.పద్మశ్రీ ఆర్ బి హెచ్ కే మెడికల్ ఆఫీసర్,డా.మమత, ఎఎన్ఎం లు రజిత,వజ్ర, సునంద,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version