మున్సిపల్ పన్నులను 100 శాతం వసూలు చేయాలి…

మున్సిపల్ పన్నులను 100 శాతం వసూలు చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపల్ పరిధిలో పన్నులను 100 శాతం వసూలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో కలిసి పన్నుల వసూలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధి కొరకు పన్ను వసూలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలను త్వరితగతిన వసూలు చేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. పన్నుల వసూలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు అందించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వేసవి కాలం అయినందున ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు నిబంధనల ప్రకారం త్వరగా ఇల్లు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

క్రైస్తవుల సమాధుల కోసం రెండు ఎకరాల స్థలం కేటాయింపు…

క్రైస్తవుల సమాధుల కోసం రెండు ఎకరాల స్థలం కేటాయింపు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ఆర్కేపి పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు టి ప్రభుదాసు ఆద్వర్యంలో కార్మిక శాఖ మంత్రి చెన్నూరు శాసనసభ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి క్రైస్తవుల సమాధుల స్థలం కోసం, కమ్యూనిటీ హాల్ కోసం మెమోరాండం ఇవ్వగా స్పందించిన కార్మిక శాఖ మంత్రి మంచిర్యాల జిల్లా కలెక్టర్ తో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ తో మాట్లాడి క్రైస్తవుల సమాధుల కోసం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని డంపు యార్డు పక్కన కొద్ది దూరంలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు ఈ విషయమై వివరణ ఇస్తూ మన మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ 2 ఎకరాల సింగరేణి స్థలాన్ని క్యాతనపల్లి మున్సిపాలిటీ క్రైస్తవుల సమాధుల కోసం సరెండర్ చేశారని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ యొక్క స్థలం చుట్టూ హద్దురాళ్లు ఏర్పాటు చేసి కంచె నిర్మిస్తామని అందులోనే భాగంగా లైటింగ్, నీటి సదుపాయం కల్పిస్తామని ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది కాబట్టి పనులు ఒకదాని తరువాత మరొకటి చేస్తామని అన్నారు.
ఆర్కేపి పాస్టర్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ బీమా సామ్యూల్, సెక్రెటరీ టి జాషువా,
ట్రెజరర్ రవి రఘుయెల్ మంత్రి ని కలుసుకొని క్రైస్తవ సమాజానికి కావలసిన కొన్ని అవసరాలను అడిగినప్పుడు మా కోరిక మేరకు సమాధుల స్థలమును ఏర్పాటు చేసినందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి కి, క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version