పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి…

పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు.గురువారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ 1 రాజీవ్ నగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, అధికారులతో కలిసి పారిశుధ్యం, అభివృద్ధి పనుల నిర్వహణను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటి నుండి ప్రతి రోజు చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని, అంతర్గత రహదారులు,మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిబంధనలకు లోబడి త్వరగా ఇల్లు నిర్మించుకునేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఇండ్ల నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.మురుగు కాలువ సమస్య, పట్టణ ఆరోగ్య ఉప కేంద్రంలో నెలకొన్న సమస్యలు, ఇంటి పైనుండి విద్యుత్ తీగలు వెళ్లడంతో నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు జిల్లా అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రజలకు త్రాగునీరు, వీధి దీపాలు,మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…

పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి

ఎంపీఓ శ్రీపతి బాబురావు

జైపూర్,నేటి ధాత్రి:

 

పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిలువలు లేకుండా ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఎంపీఓ శ్రీపతి బాబురావు సూచించారు.ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు,పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.పెగడపల్లి శివారులో చెత్తతో నిండి ఉన్న డ్రైనేజ్ లను శుభ్రం చేపించారు.జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నులు వంద శాతం పూర్తి చేయాలని,ప్రతి ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు ఎంపీఓ శ్రీపతి బాబురావు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జైపూర్ సర్పంచ్ కూన భాస్కర్,పెగడపల్లి సర్పంచ్ రామగిరి రాము,పంచాయతీ కార్యదర్శులు బి.ఉదయ్ కుమార్,శ్రీవాణి సిబ్బంది పాల్గొన్నారు.

వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్…

వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం గ్రామ చర్చ్ ముందు సిసి రోడ్డు పక్కన చెత్తకుండీలో ఉన్న చెత్తను గమనించి గ్రామ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఉప సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ వెంటనే స్పందించి అక్కడి నుంచి చెత్తను తీసేయాలని అక్కడ ఉన్న ప్రజలను ఏ ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామపంచాయతీ కార్మికులకు చెప్పి చెత్తను తీసివేయించడం జరిగింది. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వెంటనే స్పందించి గ్రామ పరిశుభ్ర గురించి ఆలోచించి వెంటనే సంధిస్తున్నారు.

చర్చి ముందు చెత్తను ఉంచకుండా చెత్తకుండీ నిర్మించే ఆలోచనలో ఉన్నారని తెలిపారు గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్న నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగానే గ్రామ పంచాయితీ కార్యదర్శి వీరన్న పటేల్ గారి తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తు.గ్రామపంచాయతీ పరిశుద్ధ కార్మికులలో ప్రతి ఉదయం చెత్త సేకరణ, వివిధ వార్డులతో పాటు ప్రధాన రోడ్డును పరిశుభ్రత చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్ తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు,

పొగ కాలుష్యంతో విద్యార్థులకు పొంచి ఉన్న ప్రమాదం..

పొగ కాలుష్యంతో విద్యార్థులకు పొంచి ఉన్న ప్రమాదం

బ్లూ బర్డ్స్ పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యం

నస్పూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం విద్యానగర్ లోని బ్లూ బర్డ్స్ పాఠశాలలోని సిబ్బంది పాఠశాలలో ఉన్న చెత్తా,చెదారం చెత్తకుండీలో వేయకుండా నిప్పంటించి నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు.పాఠశాల సమీపంలో చెత్తను కాల్చడం వల్ల పొగ కాలుష్యం తరగతి గదిలోకి వ్యాపించి విద్యార్థులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.అలాగే పక్కనే ఉన్న రెండు పాఠశాల గదుల్లోకి పొగ వ్యాపించడంతో చలికాలం దగ్గు,జలుబుతో బాధపడే విద్యార్థులకు కళ్ళ మంటలతో,శ్వాస ఇబ్బందులు కలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు.ఇప్పటికైనా పాఠశాలలోని చెత్త,చెదారం కాల్చి వేయకుండా చెత్తను సేకరించి చెత్త కుండీలో వేయాలని కోరారు.

“వనపర్తి పాత బస్టాండ్‌లో చెత్త సమస్య”

వనపర్తి పాత బస్టాండ్ లో చెత్త

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రం పాత బస్టాండ్ లో చెత్త మురికి కాలువలో మురికి పేరుకుపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు కాల్వలో మురిక పేరుక పోవడం వల్ల దుర్వాసన చెత్త ఉండడం వల్ల ప్రయాణికులకు మలేరియా డెంగీ ఇతర విష జ్వరాలు వచ్చి రోగాల కు గురి అయ్యే అవకాశం ఉన్నదని ప్రయాణికులు తెలిపారు వెంటనే వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ మున్సిపల్ కమిషనర్ ఆర్టీసీ పాత బస్టాండ్ ను సందర్శించి మురికి కాలువను బస్టాండ్ ఆవరణలో ఉన్న చెత్త ను శుభ్రం చేయిoచాలని ప్రజలు కోరుతున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version