ఉర్సే షీరీఫ్ ఫీర్ గైబ్ సాహెబ్ ఉత్సవాల్లో పాల్గొన్న నూతన సర్పంచ్…

ఉర్సే షీరీఫ్ ఫీర్ గైబ్ సాహెబ్ ఉత్సవాల్లో పాల్గొన్న నూతన సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని న్యాల్కల్ గ్రామంలో ఉర్సే షీరీఫ్ ఫీర్ గైబ్ సాహెబ్ జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా ఫీర్ గైబ్ సాహెబ్ ను దర్శించుకున్న ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్ తమ స్నేహితులతో కలిసి ప్రత్యేక దర్శనం చేసి దట్టి పూలమాలలు టెంకాయలు అగార్ బత్తి సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నా యొక్క ఐదు సంవత్సరాల పదవి ఇలాంటి అడ్డంకులు లేకుండా గ్రామ అభివృద్ధి పొందేటట్టు ఆశీర్వాదం ఇవ్వగలరని కోరారు ఈ జాతరకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. పశువుల జాతరలో వేలాది పశువులు తరలిరాగా, కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందన్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి గ్రామ అభివృద్ధికి ఆశీర్వాదాలు కోరుకున్నారు,
తమతో పాటు యువ నాయకులు శశివర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సత్తార్ పాల్గొన్నారు,

గ్రామ అభివృద్ధి నా యొక్క ప్రధాన లక్ష్యం..

గ్రామ అభివృద్ధి నా యొక్క ప్రధాన లక్ష్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, పారదర్శక పాలన, మెరుగైన మౌలిక సదుపాయాలు ( మురికి కాలువలు, తాగునీరు, విద్యుత్), పారిశుధ్యం, మరియు సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్ కట్టుబడి ఉన్నామని. గ్రామ సభలు, ప్రజల భాగస్వామ్యంతో సమస్యలను పరిష్కరిస్తూ, కార్యక్రమాలతో ఆదర్శ గ్రామాలుగా మార్చడమే నా లక్ష్యం అని అన్నారు. ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామపంచాయతీకి రెండు గ్రామాలు ఉండగా ఒకటి తుమ్మనపల్లి రెండవది కె. సంఘం గ్రామం ఉంది అదేవిధంగా మంగళవారం కె. సంఘం గ్రామంలో మురికి కాలువలు పరిశుభ్ర కార్యక్రమం నిర్వహించారు గ్రామాన్ని అభివృద్ధి దిశగా దూసుకెళ్లించి, సమస్యలను ప్రాధాన్యంతో పరిష్కరిస్తానని తెలిపారు.తాగునీరు, మురుగు పనులు, యువతకు అవకాశాలు కల్పించి గ్రామాన్ని మార్పు చూసేలా పనిచేస్తానని అన్నారు. గ్రామస్తులు తమ సమస్యలను వివరించగా, వాటిని పరిష్కరిస్తానని వారు తెలిపారు.
కే.సంఘం గ్రామంలో మాట ఇచ్చిన ప్రకారం రోడ్ల పనులను ప్రారంభించారు పార్టీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి సంఘం కి పార్టీ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి ఎక్స్ ఎంపిటిసి నవాజ్ రెడ్డి తదితరులు ఉన్నారు,

ఉర్సే షీరీఫ్ జాతర: పశువుల సంతలో కోట్ల వ్యాపారం..

ఉర్సే షీరీఫ్ జాతర: పశువుల సంతలో కోట్ల వ్యాపారం

◆-: జోడెడ్లకు @ రూ.3.40 లక్షలు భారీ ధర

◆-: పశువుల జాతర: రూ.5.40 లక్షల వరకు ధరలు, రైతుల ఆనందం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామ శివారులోని దర్గా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక పశువుల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దియోని, ఒంగోలు, కిల్లరి జాతులకు చెందిన ఎద్దులు, కోడెదూడలు, ఆవులు, పాడిగేదెలు అమ్మకానికి రాగా, ధరలు రూ.50 వేల నుంచి రూ.5.40 లక్షల వరకు పలికాయి. ఈ జాతరలో ఉత్తమ పశుపోషకులైన రైతులకు స్థానిక దివంగత అడివప్ప, గిరిజమ్మ జ్ఞాపకార్థం బహుమతులు అందజేశారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల వ్యాపారులు పాల్గొనడంతో పశువుల ధరలు పెరిగాయి. జాతర నిర్వాహణ కమిటీ భద్రత, తాగునీరు, పారిశుద్ద్య ఏర్పాట్లు చక్కగా నిర్వహించింది.

పశుపోషకులకు బసవ అవార్డులు

ప్రముఖ శిల్పి డాక్టర్ హోతి బస్వరాజ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉత్తమ పశు పోషకులకు బసవ అవార్డులు అందజేశారు. గత 19 సంవత్సరాలుగా ఉత్తమ పసుపు సన్మానిస్తున్నట్లు వివరించారు. రైతులను గౌరవించని లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. సల్మాన్ (జంగి), సామెల్ (గోపులారం), రాములు (సిందోల్), గోపాల్ (మనూర్), నాగభూషణం (బొడిమట్టపల్లి), నగేష్ (తుమ్మలపల్లి), సమీర్ (నాగ్వార్), పైజాన్ (హైదరాబాద్) కు చెందిన పశుపోషకులకు ఉత్తమ ధరలు రావడంతో జహీరాబాద్ డీఎస్పీ సైదా, సీఐ శివలింగం స్థానిక నాయకులతో కలిసి బసవ అవార్డులు అందజేశారు.

ఆకర్షణీయంగా పశువులకు అలంకరణ సామాగ్రి

జాతరలో ముఖ్యంగా పశువులకు అలంకరించే వస్తువులు మెడ గంటలు, పూల మాలలు, రంగుల రిబ్బన్లు, పూసల హారాలు, అలంకారపు గొలుసులు, చిన్న జెండాలు, తోరణాలు మెడపట్టి గజ్జెలు, తోక అలంకరణ తాళ్లు, రంగుల కంకణాలు, నల్ల తాళ్లు, ఎర్ర తాళ్లు, వివిధ రకాల రిబ్బన్లతో దుకాణాలు ఆకర్షణీయంగా నిలిచాయి.

ఇష్టారాజ్యంగా ఎర్రరాయి తవ్వకాలు…

ఇష్టారాజ్యంగా ఎర్రరాయి తవ్వకాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: నాల్కల్ మండలం గణేషాపూర్ గ్రామంలో కొందరు అక్రమార్కులు కర్ణాటకకు చెందిన వ్యక్తితో కలిసి ఎర్రరాయి తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తవ్వుతూ, గుంట భూమిని రూ. 10 లక్షలకు లీజుకిస్తూ ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. ఈ అక్రమం అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నా, వారు నోరు మెదపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version