గ్రామ అభివృద్ధి నా యొక్క ప్రధాన లక్ష్యం
జహీరాబాద్ నేటి ధాత్రి:
గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, పారదర్శక పాలన, మెరుగైన మౌలిక సదుపాయాలు ( మురికి కాలువలు, తాగునీరు, విద్యుత్), పారిశుధ్యం, మరియు సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్ కట్టుబడి ఉన్నామని. గ్రామ సభలు, ప్రజల భాగస్వామ్యంతో సమస్యలను పరిష్కరిస్తూ, కార్యక్రమాలతో ఆదర్శ గ్రామాలుగా మార్చడమే నా లక్ష్యం అని అన్నారు. ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామపంచాయతీకి రెండు గ్రామాలు ఉండగా ఒకటి తుమ్మనపల్లి రెండవది కె. సంఘం గ్రామం ఉంది అదేవిధంగా మంగళవారం కె. సంఘం గ్రామంలో మురికి కాలువలు పరిశుభ్ర కార్యక్రమం నిర్వహించారు గ్రామాన్ని అభివృద్ధి దిశగా దూసుకెళ్లించి, సమస్యలను ప్రాధాన్యంతో పరిష్కరిస్తానని తెలిపారు.తాగునీరు, మురుగు పనులు, యువతకు అవకాశాలు కల్పించి గ్రామాన్ని మార్పు చూసేలా పనిచేస్తానని అన్నారు. గ్రామస్తులు తమ సమస్యలను వివరించగా, వాటిని పరిష్కరిస్తానని వారు తెలిపారు.
కే.సంఘం గ్రామంలో మాట ఇచ్చిన ప్రకారం రోడ్ల పనులను ప్రారంభించారు పార్టీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి సంఘం కి పార్టీ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి ఎక్స్ ఎంపిటిసి నవాజ్ రెడ్డి తదితరులు ఉన్నారు,
