సింగరేణి అవినీతిపై సిట్టింగ్ జడ్జి విచారణ డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

జాతీయ రహదారిపై ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

సింగరేణి అవినీతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి.

భూపాలపల్లి నేటిధాత్రి

బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ మైన్స్‌లలో పనిచేస్తున్న కార్మికులతో కలిసి సింగరేణి పరిరక్షణ కోసం కథం తొక్కడం జరిగింది.
ఈ సందర్భంగా సింగరేణి సంస్థలో జరుగుతున్న అవినీతిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణిలో కొత్త నిబంధనల పేరుతో “సైట్ విజిట్” వ్యవస్థను ప్రవేశపెట్టి, అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నారని ఆరోపించారు.

ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపి, అవినీతికి పాల్పడిన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సింగరేణి అవినీతిపై మా పార్టీ నాయకుడు హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
నిజంగా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి సంబంధాలు లేకపోతే, సీబీఐ విచారణతో పాటు సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలా చేయకపోతే కాంగ్రెస్ బీజేపీ పార్టీల అవినీతి బంధాన్ని ప్రజల ముందు బట్టబయలు చేస్తామని, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను ఎండగడతామని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట్రాణి సిద్దు మాజీ వైస్ చైర్మన్ హరిబాబు గండ్ర హరీష్ రెడ్డి బుర్ర రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

బీబీ చారి అందరి మనసుల్లో నిలిచారు…

బీబీ చారి అందరి మనసుల్లో నిలిచారు

బీబీ చారి మరణంపట్ల కన్నీటిపర్యంతం అయిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన బేతోజు భరత్ కుమార్ చారి (బీబీ చారి) గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. యువకులతో సమానంగా పోటీ పడుతూ,అందరికీ సలహాలు సూచనలు అందిస్తూ,స్నేహపూర్వక స్వభావంతో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా బీబీ చారి అందరి మనసుల్లో నిలిచారు.
ఈ సందర్భంగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.బీబీ చారి పార్టీ కోసం చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

బస్తీ బాట పట్టిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి…

బస్తీ బాట పట్టిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు జంగేడు ప్రాంతంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన బస్తీ బాట కార్యక్రమం
నిర్వహించిచారు ఈ బస్తీ బాట కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వార్డు పరిధిలో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై ప్రజలు వ్యక్తం చేసిన సమస్యలను శ్రద్ధగా విన్న గండ్ర వెంకట రమణా రెడ్డి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, భవిష్యత్తులో కూడా భూపాలపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు శుభాకాంక్షలు…

నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు శుభాకాంక్షలు

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలం ముచ్చినిపర్తి, శాయంపేట మండలం గట్లకానిపర్తి, రేగొండ మండలం నారాయణపురం, భూపాలపల్లి మండలం కొంపల్లి, వజినేపల్లి గ్రామాలలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వారికీ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version