రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు…

 రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

 

రహదారిపై క్రికెట్ ఆడితే.. తన ఇంట్లోని పిల్లలకు బంతి తగులుతుందంటూ ఒక మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కానిస్టేబుల్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేసి.. దాడి చేశారు.ఇంటి ముందు క్రికెట్ ఆడితే.. బంతి పిల్లలకు తగులుతుందంటూ మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ దంపతులు.. ఆ మహిళలపై దాడి చేశారు. దీంతో బాధితురాళ్లు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా హరినాథ్ విధులు నిర్వహిస్తున్నారు. అతడి భార్య పేరు హారిక. వీరి పిల్లలు.. రహదారిపై క్రికెట్ ఆడేందుకు యత్నించారు.

ఆ క్రమంలో ఇంటి ముందు క్రికెట్ ఆడితే.. తమ ఇంట్లో పిల్లలకు బంతి తగులుతుందంటూ ఆ ప్రాంతంలో నివసిస్తున్న నిర్మల, కల్యాణి అనే మహిళలు అభ్యంతరం చెప్పారు. ఈ విషయాన్ని ఆ పిల్లలు.. తమ తల్లిదండ్రులు హరినాథ్ దంపతులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన వారు.. కల్యాణిపై దాడి చేశారు. దీంతో ఆమె అనంతపురం నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ విషయం తెలుసుకున్న హరినాథ్ భార్య హరిక ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంట్లో ఉన్న కళ్యాణిని బయటకు లాక్కొచ్చి ఆమెపై హరిక దాడి చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. తనపై మరోసారి దాడి చేశారంటూ కల్యాణి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ వద్దకు వారు పురుగుల మందు డబ్బాతో సహా చేరుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

దాంతో ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్, అతడి భార్య హరికపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు.

 అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు….

 అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Minister Sandhya Rani) ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శిశు గృహ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డ చనిపోయారనే వార్తలపై మంత్రి సమగ్ర విచారణకు ఆదేశించారు. సిబ్బంది మధ్య వివాదాల కారణంగా బిడ్డకు పాలు పట్టకపోవడమే మృతికి కారణమనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుకుం జారీ చేశారు మంత్రి సంధ్యారాణి.
పసిబిడ్డ మృతికి ఆనారోగ్యమే కారణమని సంబంధిత అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేయాలని మంత్రి ఆదేశించారు. శిశువు మరణానికి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం కారణమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలను వెలికి తీయాలని ఐసీడీఎస్ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం చూపిన వారిని ఉపేక్షించబోమని మంత్రి సంధ్యారాణి వార్నింగ్ ఇచ్చారు.

అనుచితంగా ప్రవర్తించి.. హతమయ్యాడు..

అనుచితంగా ప్రవర్తించి.. హతమయ్యాడు

 

 

తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకే మెకానిక్‌ ధనుంజయను వరుసకు సోదరుడైన శివయ్య హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లో ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన మెకానిక్‌ పాళ్యం ధనుంజయ హత్య జరిగింది.

ధర్మవరం(అనంతపురం): తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకే మెకానిక్‌ ధనుంజయ(Dhananjaya)ను వరుసకు సోదరుడైన శివయ్య హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లో ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన మెకానిక్‌ పాళ్యం ధనుంజయ హత్య జరిగింది. ఈ కేసులో నిందితుడు శివయ్యను అరెస్టు చేశామని డీఎస్పీ హేమంత్‌కుమార్‌ తెలిపారు. వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో శనివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు తెలిపారు.

 

 

కేతిరెడ్డి కాలనీ ఎల్‌-2లో పాళ్యం శివయ్య, ఎల్‌-3లో అతని పిన్ని కుమారుడు పాళ్యం ధనుంజయ నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ స్నేహంగా ఉంటూ మద్యం సేవించేవారు. శివయ్య భార్యతో ధనుంజయ చెడుగా ప్రవర్తించేవాడు. దీంతో శివయ్య(Shivayya) మందలించాడు. అయినా అతనిలో మార్పురాలేదు.

దీంతో శివయ్య కక్ష పెంచుకుని పథకం ప్రకారం ఈ నెల 21వతేదీ అర్ధరాత్రి ఎల్‌పీ సర్కిల్‌లో బ్రిడ్జి కింద ధనుంజయను సిమెంట్‌ ఇటుకతో బాది చంపేశాడు. నిందితుడిని సీఐ నాగేంద్రప్రసాద్‌, ఎస్‌ఐ కేతన్న, హెడ్‌ కానిస్టేబుళ్లు అప్పస్వామి, శివశంకర్‌, కానిస్టేబుళ్లు రాజప్ప, షాకీర్‌, బయన్న, సుధీర్‌కుమార్‌, రాజన్న శనివారం అరెస్టు చేశారని డీఎస్పీ తెలిపారు.

 రంగంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అనంతపురంలో ఉద్రిక్తం…

 రంగంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అనంతపురంలో ఉద్రిక్తం

 

 

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని ముట్టడించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దుగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించనున్నారనే ముందస్తూ సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఆదివారం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసంతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసులు మోహరించారు. ఆ క్రమంలో ఆ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాల్లో బ్యారికేడ్లను ఉంచారు. మరోవైపు అనంతపురంలోకి ప్రవేశించే జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇంకోవైపు గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. ముందస్తు సమాచారంలో.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు.

అలా చేయకుంటే ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసంతోపాటు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరించింది. బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే.. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ టీడీపీ అధిష్టానాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో అనంతపురంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక అనంతపురం నగరంలో పోలీసులను భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ వాహనదారులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ యాంత్రాంగం చర్యలు చేపట్టింది.

జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఒక ఆడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు సారథ్యంలో కేబినెట్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పలువురు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం పట్ల సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే వీరి వైఖరి కారణంగా విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తడంతో.. వెంటనే నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. అదే విధంగా విమర్శలకు తావివ్వకుండా నడుచుకోవాలంటూ పార్టీ ఎమ్మె్ల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచన చేసినట్లు సమాచారం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version