తహసిల్దార్ కార్యాలయంలో పరిశుభ్రత లోపం.
#పట్టించుకోని కార్యాలయ సిబ్బంది
#ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసిన దళిత నాయకులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
తహసిల్దార్ కార్యాలయానికి అనునిత్యం అనేక పనుల కోసం మండల ప్రజలు వస్తూ ఉంటారు. ఈ తరుణంలో తహసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో పరిశుభ్రత లోపించడంతో గమనించిన దళిత సంఘాల నాయకులు బట్టు సాంబయ్య, బోట్ల నరేష్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాలు శుభ్రత పాటించాలని ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టగా. దానిని తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది విస్మరించి మండల ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో అర్థమవుతుంది. ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై చెప్పవలసిన అధికారులే కార్యాలయం వద్ద శుభ్రత పాటించకపోతే గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఏదిఏమైనాప్పటికీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై తక్షణమే కలెక్టర్ స్పందించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.