విద్యుత్ ఘాతానికి గురై మహిళ, ఒక పాడి గేదె మృతి
ఖిల్లా వరంగల్ మండలం జక్కలొద్దీ గ్రామంలో విషాదం
అస్తవ్యస్తంగా వదిలేసిన విద్యుత్ తీగలు ప్రాణాలు తీసిన దుర్ఘటన
నేటి ధాత్రి ఖిలా వరంగల్ :-
వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం జక్కలొద్దీ గ్రామంలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు సంబందించిన వెంచర్ ప్రాంగణంలో నిర్లక్ష్యంగా పడి ఉన్న కరెంటు తీగలు తగిలి గ్రామానికి చెందిన దళిత మహిళ సుక్కమ్మ సంఘటనా స్థలంలోనే విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. అదే సమయంలో సమీపంలో ఉన్న ఒక పాడి గేదె కూడా మృత్యువాత పడింది.స్థానికుల ప్రకారం వెంచర్ ప్రాంతంలో విద్యుత్ తీగలు నెలల తరబడి అస్తవ్యస్తంగా పడివున్నప్పటికీ వెంచర్ నిర్వాహకులు గానీ విద్యుత్ శాఖ అధికారులు గానీ పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల ప్రాణాలకు హానికరమైన పరిస్థితిని అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వదిలేసింది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దళిత మహిళ ప్రాణం పోయిన నేపథ్యంలో గ్రామస్థులు మండిపడుతూ,తక్షణమే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.గ్రామం షాక్లో మునిగిపోయిన వేళ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికుల ఆవేదన, ఆగ్రహంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యం మళ్లీ ఒక అమాయక ప్రాణాన్ని కబళించిందని గ్రామస్థులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
