ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన జాయింట్ కలెక్టర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా నల్లవాగు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి పాఠశాల నిర్లక్ష్యం వల్ల ఆరోగ్యం క్షీణించి మృతిచెందిన ఘటనపై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పంబల్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఆ విద్యార్థి తల్లిదండ్రులు దారా మంజుల, సుధాకర్ దంపతులు తమ కుమారుడిని కోల్పోయి తీవ్ర మానసిక వేదనలో ఉన్నారు. పాఠశాల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ఘటనకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలి. అప్పట్లో ఆర్డిఓ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు అమలు కాలేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చినప్పటికీ, ఇల్లు ఇప్పటికీ ఇవ్వలేదు” అని పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్
“తప్పకుండా దారా మంజుల, సుధాకర్ దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల తుకారం సంఘ నాయకులు పాల్గొన్నారు
