మాత శిశు సంరక్షణకు కృషి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…

మాత శిశు సంరక్షణకు కృషి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేయడం ద్వారా మాత శిశు సంరక్షణకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్లా రమ్య,ఆర్.ఎం.ఓ. శ్రీధర్ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం జరుగుతుందని తెలిపారు.శుద్ధమైన త్రాగునీరు, నాణ్యమైన పోషక ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని, వ్యాధులకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.గర్భిణీల వివరాలు నమోదు చేసి సమయానుసారంగా చేసుకోవలసిన వైద్య పరీక్షలు, తీసుకోవలసిన ఆహారం, పాటించవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంపొందించడం జరిగిందని తెలిపారు.ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో ఆరోగ్య ఉప కేంద్రాలు,ప్రాథమిక ఆసుపత్రులు,సామాజిక ఆసుపత్రులు,ప్రభుత్వ ఆసుపత్రులు,పల్లె,పట్టణ దవాఖానాలు,ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలల ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రస్తుతం మాతా శిశు ఆసుపత్రి ఉన్న ప్రాంతంలో వరద నీటి ఇబ్బంది ఉన్నందున త్వరలో పూర్తి కానున్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని,ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు.లక్షెట్టిపేట సామాజిక ఆసుపత్రి, బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని,జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, చెన్నూర్ మండల కేంద్రంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి,పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.గ్రామ,మండల,జిల్లా స్థాయిలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు.ఆశ, ఆరోగ్య కార్యకర్తల నుండి వైద్యుల వరకు గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని,వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం స్టాఫ్ నర్సులు,సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు.ఆసుపత్రికి వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని,స్నేహపూర్వక వాతావరణం లో వైద్య చికిత్స అందించాలని తెలిపారు.అనంతరం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రభుత్వం ప్రజల సంక్షేమం,అభివృద్ధి  దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు 129.25 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి, 23.75 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఘన పోషణ మాస కార్యక్రమం

ఘన పోషణ మాస కార్యక్రమం

సూపర్వైజర్ అరుణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి రూరల్ మండలం పెద్దాపూర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ గర్భిణీలు స్త్రీలు బాలింతలు చిన్న పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంగన్వాడి కేంద్రం నుండి వచ్చిన ఫుడ్డును పిల్లలకు తినిపించాలి దాని ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని అన్నారు అనంతరం అందరితో కలిసి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ విజయలక్ష్మి. వనిత బీ లక్ష్మి రమాదేవి అంగన్వాడి ఆయా రమ ఆశ వర్కర్స్ సుకన్య కోమల గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు

 అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు….

 అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Minister Sandhya Rani) ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శిశు గృహ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డ చనిపోయారనే వార్తలపై మంత్రి సమగ్ర విచారణకు ఆదేశించారు. సిబ్బంది మధ్య వివాదాల కారణంగా బిడ్డకు పాలు పట్టకపోవడమే మృతికి కారణమనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుకుం జారీ చేశారు మంత్రి సంధ్యారాణి.
పసిబిడ్డ మృతికి ఆనారోగ్యమే కారణమని సంబంధిత అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేయాలని మంత్రి ఆదేశించారు. శిశువు మరణానికి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం కారణమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలను వెలికి తీయాలని ఐసీడీఎస్ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం చూపిన వారిని ఉపేక్షించబోమని మంత్రి సంధ్యారాణి వార్నింగ్ ఇచ్చారు.

తల్లి పాల వారోత్సవాలు….

తల్లి పాల వారోత్సవాలు

చిట్యాల, నేటిధాత్రి ;

చిట్యాల మండలంలోని జూకల్ వన్ సెంటర్ల లొ తల్లిపాల వారోత్సవాలొ భాగంగా గర్భవతి, బాలింతల, బరువు ,ఎత్తు చూసి వ్యక్తిగత శుభ్రత లొ భాగంగా ఆరు పద్ధతుల ద్వారా పిల్లలు, తల్లుల చేతులు కడిపించడం జరిగింది గర్భవతి దశనుండి తీసుకోవలసిన ఆహారం ఆరోగ్య ,ప్రభుత్వ హాస్పటల్ డెలివరీ గూర్చి వివరించనైనది . మంగళవారం రోజున ప్రోగ్రాం ఇంటింటా తిరిగి కుటుంబ సభ్యులందరికీ మిగతా టీచర్స్ అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అరుణ , కరుణ,మమత ,రజిత ,సరిత ,విజయలక్ష్మి, టీచర్స్ పాల్గొనడంజరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version