మహిళా ఉపాధ్యాయులకు సద్దుల బతుకమ్మ రోజే ఎన్నికల శిక్షణ ఇవ్వడం ఏంటీ….

మహిళా ఉపాధ్యాయులకు సద్దుల బతుకమ్మ రోజే ఎన్నికల శిక్షణ ఇవ్వడం ఏంటీ….???

అధికారుల వింత ప్రవర్తన తో బతుకమ్మ ఆడలేక ఆవేదన చెందిన మహిళా ఉపాధ్యాయులు.

ప్రభుత్వం బతుకమ్మ ఆడమని సెలవులిస్తే అధికారులు శిక్షణ ఇవ్వడం ఏంటి..?

ఇది బతుకమ్మ పండుగ స్ఫూర్తికే విరుద్ద్ధం

ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యాన్ని సైతం లెక్కచేయని అధికారులు

అధికారుల తీరు మారాలి.విచక్షణతో ఆలోచించాలి.

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ విమర్శ

కేసముద్రం/ నేటి ధాత్రి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారులైన మహిళా ఉపాధ్యాయులకు సైతం సోమవారం సద్దుల బతుకమ్మ రోజే ఎన్నికల సోమవారంశిక్షణ ఇవ్వడాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, మహిళలందరూ ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ఆయన అన్నారు. ఈ పండుగ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించిందని ఈ క్రమంలోనే మహిళా ఉపాధ్యాయులు అందరూ తమ పుట్టింటికి వెళ్లి పండుగ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలోనే అధికారులు ఉన్నఫలంగా ఎన్నికల శిక్షణ నిర్వహించడం ఏంటి..? అని విమర్శించారు. మహిళా ఉపాధ్యాయులను బతుకమ్మ ఆడనీయకుండా వారిని మనోవేదనకు గురిచేయడం సమంజసం కాదని, ఇది బతుకమ్మ పండుగ స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు.

ఈరోజు తప్ప అధికారులకు వేరే రోజు ఏది అనుకూలంగా కనిపించలేదా..? అని ప్రశ్నించారు.

“దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యనట్లు ” ఉంది అధికారుల ప్రవర్తన అని ఎద్దేవా చేశారు .
అధికారులు విచక్షణతో ఆలోచించి ఉంటే బాగుండేదని, కనీసం ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యాన్ని పరిగణలోకి తీసుకున్నా ఈ శిక్షణ కార్యక్రమం తేదీ మారేదని, మహిళా ఉపాధ్యాయులు నష్టపోయే వారు కాదని, వారు మనోవేదనకు గురయ్యే వారు కాదని ఆయన ఆవేదన వ్యక్తం వారు. సంబంధిత అధికారులు భవిష్యత్తులోనైనా ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలని అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు

ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి..

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టిఏజిఎస్ )

భూపాలపల్లి నేటిధాత్రి

గ్రామ గ్రామాన జెండా పండుగలు నిర్వహించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ ఆదివాసి ప్రజానీకానికి పిలుపునిచ్చారు.
శుక్రవారం మహా ముత్తారం మండల పోలంపల్లి గ్రామంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జెండా పండుగలు గ్రామ గ్రామాన నిర్వహిస్తూ ఆదివాసుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు కలలు పరిరక్షించుకునే విధంగా ప్రతి గ్రామంలోని గ్రామ పెద్దలు మేధావులు ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు యువతీ యువకులు కళాకారులు మేధావులు పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు.
ఐక్యరాజ్యసమితి ఆదివాసి ప్రాంతాల మీద దశాబ్ద కాలం పాటు అధ్యయనం చేసి ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం ఇతర సమాజాలకు భిన్నంగా ఉందని ఏ దేశంలో నైనా పరిపాలకుల విధానాల వల్ల ఆదివాసి మనగడకే ప్రశ్నార్థకం అవుతుందని ఏ దేశంలో నైనా పాలకులు ఆదివాసి అభివృద్ధి పట్ల ఆదివాసి మనుగడను ప్రశ్నార్థకం చేసే విధానాలను అనుసరించవద్దని వారి అభివృద్ధికి దోహదపడాలని సూచించినప్పటికీ, ఆదివాసీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ నిరంతరం ఆదివాసి హక్కుల మీద ఆదివాసి అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పరిపాలన సాగుతుందని అన్నారు కావున ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వాల యొక్క ఆదివాసి వ్యతిరేక విధానాలను ప్రతి ఆదివాసి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంగ ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించినప్పుడే ఆదివాసి సమాజంలో ఉన్న మేధావులుగా ప్రజలందరినీ చైతన్యం చేసి వారు స్వేచ్ఛగా పాల్గొనడానికి అవకాశం ఉంటుందని అలాంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించాలని లేనిపక్షంలో ఆదివాసి వ్యతిరేక ప్రభుత్వాలుగా మిగులుతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మేకల రాజు కాపుల విజయ్ మడకం నిర్మ ,గుంటి అంజలి ,తోట చందన ,గుండాపూ తేజ అశ్విని గుండం రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version