కుక్కలు రోడ్లపై హల్ చల్
గొర్రెల మందల తలపిస్తున్న కుక్కల మంద
అధికారులు స్పందించాలంటూ ఉన్న ప్రజలు
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో కేసముద్రం విలేజ్ లో
కుక్కలు వీధి వీధులలో సైరవిహారం చేస్తూ సందు సందులలో గుంపులు గుంపులుగా కలియ తిరుగుతూ దాడి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి, చిన్నపిల్లలను ఇస్తారు చింపినట్టుగా చిన్నారులను చితిమేసిన సంఘటనలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి, అదేవిధంగా రోడ్లపై గ్రామంలో వీధుల వెంట వందల సంఖ్యలో గొర్రెల మందల లాగా విహారం చేస్తూ వచ్చిపోయే వాహనముల వెంట పడుతూ వాహనదారులు కుక్కల దాడిని తప్పించుకునే క్రమంలో భయాందోళనతో బైకులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. అదే క్రమంలో మరణాలు సంభవించే అవకాశం లేకపోలేదు, కానీ అధికారులు చోద్యం చూసినట్టు చూస్తూ అనేక ప్రమాదాలు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు తప్ప కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం.తక్షణమే అధికారులు స్పందించి కుక్కల యొక్క దాడులనుంచి ప్రజలు గురికాకముందే కుక్కలను గ్రామాల నుండి నివారించే చర్యలు చేపట్టాలని లేకపోతే రాబోయే రోజుల్లో కుక్కల సంఖ్య పెరిగి చిన్న పిల్లలు మరియు పెద్దలు కూడా వీధుల్లోకి రావాలంటే రాలేని పరిస్థితి నెలకొంటుందని వెంటనే కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కేసముద్రం ప్రజలు కోరుకుంటున్నారు.