జాతీయ క్రీడా దినోత్సవం…

జాతీయ క్రీడా దినోత్సవం…

క్రీడాకారులు ధ్యాన్ చంద్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి

మహబూబాబాద్ డి.ఎస్.పి తిరుపతిరావు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

శుక్రవారం కేసముద్రం మున్సిపాలిటీ స్థానిక జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నుండి ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వరకు కేసముద్రం మండల సీనియర్ హాకీ మరియు బాస్కెట్బాల్ క్రీడాకారులు మరియు హై స్కూల్ విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో మేజర్ ధ్యాన్ చంద్ జన్మదిన పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం వన్ కె రన్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కొమ్ము రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాద్ డిఎస్పి తిరుపతిరావు మరియు కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి హాజరై జెండా ఊపి రన్ ప్రారంభించారు.
అనంతరం క్రీడాకారులతో ఉత్సాహంగా రన్ లో ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు పరిగెత్తారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథి మహబూబాద్ డిఎస్పి తిరుపతిరావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆగస్టు 29/ 2012 నుండి ఈ క్రీడా దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నారని క్రీడాకారులు ధ్యాన్ చంద్ స్ఫూర్తిగా తీసుకొని దేశానికి మంచి పేరు తేవాలన్నారు.
గంట సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు మరియు క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్రంలో ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడ పాఠశాలలను ఏర్పాటు, అచ్యునుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు పురస్కారాలతో సత్కరిస్తున్నారని తెలిపారు.కాబట్టి క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి పట్టుదలతో ఆడి ఉన్న శిఖరాలు చేరుకొని మన గ్రామానికి రాష్ట్రానికి దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.
అనంతరం వేం ట్రస్టు ద్వారా జాతీయస్థాయిలో రాణించిన కేసముద్రం చెందిన 10 మంది క్రీడాకారులకు హాకీ మరియు బాస్కెట్బాల్ క్రీడాకారులకు సన్మానం చేయడం జరిగింది, దానితోపాటు 25 వేల విలువైన క్రీడా సామాగ్రి బాస్కెట్బాల్స్ హాకీ స్టిక్స్ బ్యాడ్మింటన్ రాకెట్స్ వాలీబాల్స్ టెన్నికోల్ రింగ్స్ మొదలగునవి వేం ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్ రాజ్, స్థానిక నాయకులు రావుల మురళి,అల్లం నాగేశ్వరరావు, బండారు వెంకన్న, బండారు దయాకర్,సతీష్, కదిర సురేందర్, స్థానిక హెచ్ఎం బి రాజు, ఎంఈఓ కాలేరు యాదగిరి, పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నరసయ్య, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్, దామల్ల విజయ్ చందర్ తో పాటు మండల క్రీడాకారులు మరియు ప్రజా ప్రతినిధులు దాదాపు 200 మంది పాల్గొన్నారు.

క్రీడా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయగలరు…

క్రీడా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయగలరు

క్రీడల జిల్లా అధికారి రఘు

భూపాలపల్లి నేటిధాత్రి

 

జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు 2025 ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన క్రీడల శాఖ రఘు ఆద్వర్యంలో ఈ నెల 29న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీ మీటింగ్ హల్ నందు ఉదయం 11.30 గంటలకి నిర్వహించబడును.
జిల్లాలో నీ క్రీడా సంఘాల సభ్యులు, క్రీడా కారులు, అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు

క్రీడాకారులకు టీ షర్ట్లు బహుకరణ.

క్రీడాకారులకు టీ షర్ట్లు బహుకరణ

నేటిధాత్రి అయినవోలు:-

 

అయినవోలు మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. టోర్నమెంట్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా అయినవోలు మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల నాయకులు పల్లకొండ కుమార్ క్రీడాకారులకు గురువారం టీ షర్టులను బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత క్రీడల్లో నైపుణ్యం సాధించి మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల యువ నాయకులు బొల్లె పెల్లి బిక్షపతి గౌడ్ పల్లకొండ రమేష్ టోర్నమెంట్ నిర్వాహకులు క్రీడాకారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version