ఘనంగా కాలోజీ జయంతి వేడుకలు
కేసముద్రం/ నేటి దాత్రి
కాలోజీ నారాయణరావు జయంతి వేడుకలను మంగళవారం కేసముద్రం మున్సిపాలిటీలోని విలేజ్ లో శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్రా యాకాంతం గౌడ్ కాలోజీ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ప్రసంగిస్తూ కాలోజీ కవిత్వం, ఆయన సాహిత్య స్ఫూర్తి, సమాజంపై చూపిన ప్రభావం గురించి వివరించారు. నా గొడవ పేరుతో సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా స్పందించిన వ్యక్తి కాళోజీ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.