ప్రజా సమస్యలపై పోరాడుదాం…
బి జె పి జిల్లా ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంపిటిసి మదన్ నాయక్
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పు నూతల రమేష్, అధ్యక్షతన లక్ష్మి సాయి గార్డెన్స్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీజేపీ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంపీటీసీ మదన్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ, నీళ్లు నిధులు నియామకాల పేరిట ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు ( బి.ఆర్.ఎస్ ) పార్టీ నాయకులు రాబందుల్లా దోసుకుంటే దాదాపు 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తుందని అన్నారు. ప్రజా సమస్యల మీద బిజెపి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేపట్టి, కెసిఆర్ ను గద్దె దించడంలో ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేసారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కేసముద్రం మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఎటువంటి అభివృద్ధి చెందలేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని స్తానిక సంస్థలకు సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించక పొవట వలన గ్రామా పంచాయతిలకు రావలిసిన కోట్లాది రూపాయల కేంద్ర నిధులు మురిగి పోయి గ్రామిణా అభివృద్ది కుంటుపడుతున్నది,
గ్రామపంచయతిల లో పంచాయతి అధికరులకు పరిపాలన భారంవుతన్నది. కావున వెంటనే అన్ని స్తానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసారు.ప్రజా సమస్యల పరిష్కారానికి బిజెపి కార్యకర్తలు పోరాడాలని అన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం కేసముద్రం తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలిగా వెళ్లి కేసముద్రం మండలం లోని వివిధ గ్రామల ప్రజలు ఎదుర్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసారు.
ఈ సందర్భముగ బిజెపి మండల అద్యక్షుడు ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ గత వారం పది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలోని ఉప్పరపల్లి , ఇంటికన్నె , వేంకటగిరి, కాట్రపల్లె, అర్పనపల్లె, మహమూద్పట్నం, తాళ్ళపుసపల్లి, నారయణపురం,అన్నారం, గాంధీ నగరం, సప్పిడిగుట్ట తండ, కోరుకొండపల్లె , మేగ్య తండ,అనేక తండా గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు, రోడ్లపై నీళ్లు నిలవడం, బురద ఏర్పడటం, సీజనల్ వ్యాధుల వ్యాప్తి, డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోవడం, మురుగునీటి నిల్వతో సీజనల్ వ్యాధులు ప్రబలి గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,కేసముద్రం మండలం లోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా సరైన రోడ్డు, రవాణ, విద్యుత్ , మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని. భారీ వర్షాల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా గ్రామాలలో పేరుకు పోయిన మురుగు నీరును తొలగించి , బ్లీచింగ్ పౌడరు చల్లి మరియు అంటువ్యాధులు ప్రబలకుండా నివారించాలని ,మురుగు నీటి కాలువలను శుభ్రపరచాలని, పైప్‌లైన్ వ్యవస్థలను మెరుగుపరచి, గ్రామాలలో పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని. కేసముద్రం మండలం లోని గ్రామాలలో అంటు వ్యాధుల నివారణ కు మండల వైద్య శాఖా అధికారులచే తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు .
కల్వల గ్రామంలో మురుగు నీరు బయటకు పోయే కనీస వసతులు లేక పోవడంతో గ్రామస్థులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని. మెయిన్ రోడ్డు మరియు కాలనీల్లో డ్రైనేజీ లేకకపోవడంతో రోడ్లపైనే మురుగు నీరు, వరద నిరు ప్రవహిస్తోంది. దీంతో ఈగలు, దోమలు ఇళ్లలోకి వస్తుండడంతో అనారోగ్యానికి గురవుతున్నారని. గతంలో సెల్యులైటిస్, బోదకాలు , డెంగ్యూ జ్వరాలతో కల్వల గ్రామంలో బాధపడ్డారని.కావున ఆ గ్రామంలో మెయిన్ రోడ్డు మరియు కాలనీల్లో డ్రైనేజీ నిర్మించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల డిమాండ్ చేసారు.
దీనికి తోడు ఇప్పుడు ఈ గ్రామంలో మనుషుల జనాభా కంటే కోతుల, కుక్కల సంఖ్యనే ఎక్కువగా ఉందని. భయటికి వెళ్ళాలంటేనే జనం భయపడుతున్నారని , గ్రామాల్లో ప్రజల పై కోతులు, కుక్కల దాడులు పెరిగి అనేక మంది ప్రజలు తీవ్ర గాయాల పాలైన సంఘటనలు జరిగాయని,అంతే కాకుండా ఇక్కడ ప్రజలు ఆరుతడి పంటలు సాగు చేయడం వదిలిపెట్టారని. ఇప్పటికే ఇంటి పై కప్పులను ద్వసం చేస్తున్నాయని . గతంలో మనుషులని చూస్తే కోతులు భయపడి పరుగులు తీసేవి. కాని ఇప్పుడు కోతులను, కుక్కలను చూసి మనుషులు భయపడే పరిస్థితి నెలకొంటుందని కావున కేసముద్రం మండలం లోని అన్ని గ్రామాలలో ఉన్న కోతుల, కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాటానికి తగు చర్యలు తీసుకోవాలని బిజేపి మండల శాఖ తరుపున డిమాండ్ చేసారు .
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు బోగోజు నాగేశ్వర చారి,ఉపేందర్ , మండల ఉపాద్యక్షులు కొండపల్లి మహేందర్ రెడ్డి ,నాగరాబోయిన చంద్రకళ, కార్యదర్శి జాటోత్ నరేష్ ,మాల్యాల రాములు, పూర్ణకంటి భాస్కర్ , బండి వెంకన్న ,శ్రీను ,రమేష్ నాయక్ ,సురేష్ నాయక్ ,మంగా వెంకన్న, భుక్య విజయ్ , జంగిటి అనిల్ ,సింగంశెట్టి మధుకర్ , పరకాల మురళీ మైనారిటీ మోర్చా నాయకుడు ఖాసిం తదితరులు పాల్గొన్నారు.