ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ సంకల్ప్ యాత్ర ప్రారంభం

*ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే నినాదంతో సంకల్ప్ యాత్ర*

*జెండా ఊపి సంకల్ప్ యాత్రను ప్రారంభించిన సిరిసిల్ల టౌన్ ఎస్సై శ్రీకాంత్*

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

 

ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే నినాదంతో సంకల్ప్ యాత్రను చేపడుతున్నట్లు టాటా ఏఐఏ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్స్ కాశ బోయిన వీరస్వామి, కొండ ఆదర్శ్ కుమార్ లు అన్నారు. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం కరీంనగర్ టాటా ఏఐఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప యాత్రను సిరిసిల్ల టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ , ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దిలీప్ లు ప్రారంభించారు. సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ నుండి గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, గోపాల్ నగర్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ పెద్ద బజార్ లలో సంకల్ప్ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రతన్ టాటా ఆశయాల మేరకు ఇండియాలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలనే నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. బిజీగా ఉండే జీవితంలో ఎప్పుడు ఏలాంటి సంఘటనలు జరుగుతాయో ఊహించలేని జీవితంలో బీమా చేసి కుటుంబానికి ధీమా కల్పించాలన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను ప్రతి కుటుంబానికి తెలిపేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ సంకల్ప్ యాత్రను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంకల్ప్ యాత్రలో టాటా ఏఐఏ ట్రైనింగ్ మేనేజర్ వెంకటేష్ వర్మ, అసిస్టెంట్ మేనేజర్స్ చంద్రశేఖర్, శ్రీకాంత్, ప్రవీణ్, పార్ట్నర్ గూడెల్లి రాజు, సిబిఏలు గైని శ్రీకాంత్, దూలం రమేష్, పనస వెంకట్, సీనియర్ బిజినెస్ అసోసియేట్ లీడర్స్ బుర్ర కవిత శ్రీనివాస్, నాగూర్ బి షేక్ ఆరిష్, రామకృష్ణ, రమేష్ లీడర్లు,ఎండిఆర్టి అడ్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

కేసముద్రం లో టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ సర్వీస్ పాయింట్ ప్రారంభం..

కేసముద్రంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీస్ పాయింట్ ప్రారంభం

ఆరోగ్య బీమా తీసుకోండి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొందండి

తక్కువ ప్రీమియంతో… ఒకే పాలసీ తో కుటుంబ మొత్తానికి కవరేజ్ లభిస్తుంది

టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ బ్రాంచ్ మేనేజర్ కే లక్ష్మణ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ భవనం పైన గల మొదటి అంతస్తులో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ఆఫీస్ గణంగా ప్రారంభోత్సవం జరిగింది.
దీనికి ముఖ్య అతిధులుగా టాటా వరంగల్ బ్రాంచ్ మేనేజర్ కె. లక్ష్మణ్ సి బి ఏ జి . వీరేశం , కేసముద్రం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ,రావుల మురళి,అంబటి మహేందర్ రెడ్డి మున్నూరు కాపు రాష్ట్ర కార్యదర్శి చందా గోపి,బాలు నాయక్,సుధాకర్, జాఫర్, తుంపిల్ల వెంకన్న, వీరన్న, ఉపేందర్, టాటా ఎస్ బి ఏ, సత్యం , నగేష్ ,కొండల్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్వవ అనంతరం టాటా లైఫ్ ఇన్స్యూరెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించే మేనేజర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి జీవిత భీమా అనేది తప్పని సరిగా కల్పించాలనే సంకల్పం తో బుధవారం టాటా ఇన్సూరెన్స్ ఆఫీస్ ప్రారంభించటం జరిగినది. అలాగే సీనియర్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానర్ డాక్టర్ మోహన్ నాయక్, వనిత మాట్లాడుతూ కేసముద్రం మండల ప్రజలు, పట్టణ వాస్తవ్యులు అందరూ కూడా ఈ సర్వీసు పాయింట్ ను ఉపయోగించూకోగలరని
తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version