ఉచిత కంటి వైద్య శిబిరం

ఉచిత కంటి వైద్య శిబిరం

 

డాక్టర్ జి.సంజీవరావు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

 

కరకగూడెం:మండలంలోని కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,మారుతి నర్సింగ్ కాలేజ్,లయన్స్ క్లబ్ భద్రాచలం సహకారంతో సికింద్రాబాద్ వారిచే పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ జి.సంజీవరావు పాల్గొని 250 మందిని కంటి పరీక్షలు చేయగా అందులో 60 మందికి శాస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు.అనంతరం రోగులకు ఉచితంగా మందులు అందజేశారు.ఈ సందర్భంగా డా,, సంజీవరావు మాట్లాడుతూ… ఏజెన్సీలోని మారుమూల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం గొప్ప నిర్ణయమని,ప్రజల నుండి మంచి విశేష స్పందన ఉందన్నారు.ఏజెన్సీ ప్రాంతంలోని పేదవారికి ఈ సంస్థ వారు మరెన్నో సేవలందించాలని వారు కోరారు.ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులను,సంయుక్త సంస్థ వారిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు డా,,ఎస్ఎల్ కాంతారావు,రాజిరెడ్డి,ఆదినారాయణ,సూర్యనారయణ,గ్రామస్తులు:గొగ్గల నారాయణ,ఈసం సమ్మయ్య,ఈసం సత్యం,కొమరం లక్ష్మీనర్సు,జోగ దూలయ్య,రామక్రిష్ణ,మారుతి కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నేటి ధాత్రి ఎఫెక్ట్…స్పందించిన మున్సిపల్ అధికారులు

నేటి ధాత్రి ఎఫెక్ట్…స్పందించిన మున్సిపల్ అధికారులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

పారిశుద్ధ్యం పడకేసిందా…?
నేటి ధాత్రి కథనానికి కేసముద్రం మున్సిపాలిటీ అధికారులు పారిశుధ్యం పై స్పందించి తక్షణమే పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టడం జరిగింది

సైడ్ డ్రైనేజీ కాలువ పిచ్చి మొక్కల తొలగింపు చెత్తకుప్పల తొలగింపు మున్సిపల్ కార్మికుల చే పారిశుద్ధ్యం పనులు చేయడం జరిగింది. కథనానికి స్పందించిన అధికారుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version