కార్మికుల ఆరోగ్య సంక్షేమం కోసం బిఎంఎస్ కృషి…

కార్మికుల ఆరోగ్య సంక్షేమం కోసం బిఎంఎస్ కృషి

అధ్యక్షులు యాదగిరి సత్తయ్య

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కార్మికుల ఆరోగ్యం సంక్షేమం కోసం ఈఎస్ఐ డిస్పెన్సరీ,హాస్పిటల్ స్థాపనకు జైపూర్ పవర్ ప్లాంట్ యాజమాన్యం భూమి కేటాయించాలని పవర్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెన్న కేశవుల చిరంజీవి కి బుధవారం మెమోరండం అందించారు.అనంతరం యాదగిరి సత్తయ్య అధ్యక్షులు మాట్లాడుతూ యూనియన్ దీర్ఘకాలిక పోరాటం ఫలితముగా జైపూర్ పవర్ ప్లాంట్ కార్మికులకు ఈఎస్ఐ వైద్య హాస్పిటల్ కేటాయించిన బిఎంఎస్ ఈఎస్ఐ బోర్డు సభ్యులు బిఎంఎస్ కృషి ఫలితమని,తక్షణమే వైద్యం అందుబాటులోకి వచ్చే విధంగా యుద్ధ ప్రాతిపదికన భూమి కేటాయించి వైద్య సేవలు అందించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామన్నారు.జైపూర్ పవర్ ప్లాంట్ సింగరేణి యాజమాన్యం స్థలం కేటాయించాలని,నిర్మాణానికి చర్యలు చేపట్టాలని బిఎంఎస్ చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించిన యాజమాన్యం తక్షణమే చర్యలు చేపట్టే విధంగా కృషి చేస్తామని తెలిపారు.వేలాది మందికి కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు చుట్టుపక్కల ప్రభావిత గ్రామాలకు సంబంధించిన సాగరవేణి ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించుటకు బిఎంఎస్ కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీధర్,జనరల్ సెక్రెటరీ దుస్సా భాస్కర్,ముఖ్య నాయకులు వెంకటేశ్వర్లు,కిషన్ రెడ్డి,సతీష్ పాల్గొనడం పాల్గొన్నారు.

జూలై 9 కార్మిక సమ్మేలో బిఎంఎస్ పాల్గొనదు

జూలై 9 కార్మిక సమ్మేలో బిఎంఎస్ పాల్గొనదు

నస్పూర్,నేటి ధాత్రి:

శ్రీరాంపూర్ ఏరియాలోని నస్పూర్ కార్యాలయం నందు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బి ఎం ఎస్) ఆధ్వర్యంలో నాతాడి శ్రీధర్ రెడ్డి ఏరియా ఉపాధ్యక్షులు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం రోజున జరిగినది.ఈ సందర్భంగా మాట్లాడుతూ..జూలై 9న కొన్ని కార్మిక సంఘాలు రాజకీయ ఉద్దేశాలతో పిలిచిన దేశవ్యాప్త సమ్మెలో భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) పాల్గొనదని స్పష్టం చేశారు.దేశంలో అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త కార్మిక కోడ్‌లుగా రూపుదిద్దిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.వాటిలో వేతనాల కోడ్ 2019 మరియు సామాజిక భద్రత కోడ్ 2020లను బిఎంఎస్ స్వాగతించిందని పేర్కొన్నారు.ఈ కోడ్‌ల ద్వారా అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతన హక్కు,గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత వంటి అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని వివరించారు.ఇతర రెండు కోడ్‌లైన ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020,ఆక్యుపెన్షియల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020లో కొన్ని సవరణలు అవసరమని పేర్కొన్నారు.ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నప్పటికీ,మరింత లోతుగా చర్చించి వీలైనంత త్వరగా సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.రాజకీయ ప్రయోజనాల కోణంలో కొన్ని కార్మిక సంఘాలు జూలై 9 సమ్మెకు పిలుపునిస్తున్నప్పటికీ,బిఎంఎస్ మాత్రం కార్మికుల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తుందని చెప్పారు.అందుకే కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరిచి ఆ సమ్మెలో పాల్గొనరాదని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రాగం రాజేందర్ ఏరియా సెక్రటరీ,ఐలవేణి శ్రీనివాస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ,భూoపల్లి రమేష్ జాయింట్ సెక్రెటరీ,కట్కూరి సతీష్ జాయింట్ సెక్రెటరీ,శాంతం సంపత్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ,గోళ్ళ మహేందర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ,కిరణ్ కుమార్,గోనె రామకృష్ణ ఆర్కే 5 పిట్ సెక్రెటరీ,కుంట రాజు ఆర్కే 7 అసిస్టెంట్ సెక్రటరీ,కొమ్మ బాపు,ఎస్ అండ్ పి సి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి C&MD ని కలిసిన BMS యూనియన్ నాయకులు.

సింగరేణి సి అండ్ ఎండి ని కలిసిన బిఎంఎస్ యూనియన్ నాయకులు

 

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టిపిపి లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సి అండ్ ఎండి కి వినతి పత్రం అందజేసిన నాయకులు
శుక్రవారం రోజున హైదరాబాదులోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ జాతీయ సేఫ్టీ కమిటీ సభ్యులైన కొత్త కాపు లక్ష్మారెడ్డి,బి ఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షులు అయిన యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో సింగరేణి సిఎండి బలరాం నాయక్ కి జైపూర్ ఎస్టిపిపి లో ఉన్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బిఎమ్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ…పవర్ ప్లాంట్ విస్తరణలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించాలని పవర్ ప్లాంట్ లో వివిధ కంపెనీలలో ఐదు సంవత్సరాలు విధులు నిర్వహించిన వివిధ కార్మికులకు వెంటనే పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.పవర్ ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్న వివిధ గ్రామాల మీదుగా కార్మికులకు వెంటనే బస్సు సౌకర్యం కంపెనీ కల్పించాలని కోరారు. డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషన్ హైదరాబాద్ వారి ఒప్పందం ప్రకారం క్యాంటీన్ ను వెంటనే ప్రారంభించి కార్మికులకి అతి తక్కువ ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందచేయాలని తెలియజేశారు.ఈఎస్ఐ హాస్పిటల్ ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు భీమా సౌకర్యంతో పాటు వారి యొక్క కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పులి రాజిరెడ్డి,మండ రమాకాంత్, ప్రధాన కార్యదర్శి దుశ భాస్కర్,బోడకుంట శ్రీధర్, పెద్దిరెడ్డి,కిషన్ రెడ్డి,శివకృష్ణ,కే. సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version