అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం…

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పకీరు గడ్డ అంగన్వాడీ టీచర్ ప్రమీల ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ పోషణ మాస కార్యక్రమం అనేది ఈరోజు అంగన్వాడి సెంటర్లో నిర్వహించడం జరిగింది గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి అంగన్వాడి నుండి ఇచ్చే బొడ్డును పిల్లలకు అరువుగా అందివ్వాలి. దాని ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అంగన్వాడి నుండి వచ్చే పోషణ మాస వస్తువులను ప్రతి ఒక్కటి తీసుకుంటే తల్లి తింటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని తెలిపారు అలాగే
అంగన్వాడి కేంద్రమును ఉపయోగించుకొని మంచి ఆరోగ్యవంతమైన సమాజం కొరకు అందరూ అవసరమైన సేవలు వినియోగించుకోవాలి డెలివరీ అయిన తర్వాత తల్లిపాలు పిల్లలకు
గంటలోపు మూర్రిపాలు పట్టించాలి ఏడవ నెల నుంచి అనుబంధ ఆహారము, తల్లిపాలతో పాటుగా ఇవ్వాలి అని అన్నారు
ఈ కార్యక్రమంలో శోభారాణి ఘటన గర్భిణీలు పిల్ల తల్లులు పాల్గొన్నారు

పోషణ మాసం ఆరోగ్యం రక్షణే లక్ష్యం…

పోషణ మాసం ఆరోగ్యం రక్షణే లక్ష్యం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం టేకుమట్ల అంగన్వాడి కేంద్రంలో లో పోషణ మాసం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ..గర్భిణీ, బాలింతలు,పిల్లలు,కిషోర బాలికలతో పాటుగా ప్రతీ ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.తాజా పండ్లు,కూరగాయలు,పాలు తీసుకోవాలని,రక్త హీనత బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు. పుట్టిన బిడ్డకు 6 నెలల వయసు వచ్చేవరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని కోరారు.అలాగే పిల్లలకు బయటి జంక్ ఫుడ్ కొనివ్వకూడదని,వాటి వల్ల తరచూ అనారోగ్య బారిన పడి ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. పిల్లలు వయసుకు తగిన ఎదుగుదల ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం గర్భిణీ మహిళతో పోషణ మాసం ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణి,అంగన్వాడి టీచర్స్ వరలక్ష్మీ,సునీత,శ్రీవాణి,ఆయా పిల్లలు,గర్భిణీలు,బాలింతలు, తల్లి తండ్రులు పాల్గొన్నారు.

తల్లిపాలు నవజాత శిశువుకు వెలకట్టలేని సంపద

తల్లిపాలు నవజాత శిశువుకు వెలకట్టలేని సంపద…

నేటి ధాత్రి :-

శిశువు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు అందించడం శ్రేష్టకరమని, పిల్లల ఆరోగ్యం, మనుగడ, పోషణ, అభివృద్ధి తో పాటు తల్లి ఆరోగ్యానికి తల్లి పాలే కీలకమని పెద్దకిష్టపురం అంగన్వాడి కార్యకర్త భూక్యా సంత్ర అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా పెద్ద కిష్టాపురం గ్రామపంచాయతీలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంత్ర మాట్లాడుతూ, ఉరుకులు పరుగుల జీవితంతో కొందరు తల్లులకు పాలు పట్టే సమయం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు శ్రేష్టమని, తల్లిపాలు పుట్టిన బిడ్డకు వెంటనే పట్టించాలని దీని ద్వారా ఆ బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు.తల్లి పాలలో మంచి పౌష్టికాలు ఉండి పిల్లవాడు ఎదుగుదలకు మరింత తోడ్పడుతాయని అన్నారు. పిల్లలకు తల్లిపాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయని, దీనివల్ల శిశువుకు ఎటువంటి మానసిక వైకల్యం లేకుండా ఉండడమే కాకుండా తల్లిపాల వల్ల బాలలకు ఎలాంటి ప్రాణాంతక వ్యాధులు దరి చేరవని అన్నారు. అనంతరం సీజనల్ వ్యాధుల పట్ల గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.వీరభద్రం, వేణు కుమార్, రామ, మానస, రమ్య, కళ్యాణి, మమత, రేణుక తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీలో తల్లిపాల పట్ల అవగాహన

అంగన్వాడీలో తల్లిపాల పట్ల అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి:

తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నర్సంపేట -4 అంగన్వాడీ కేంద్రంలో స్థానిక అంగన్వాడీ టీచర్ నల్లభారతి ఆధ్వర్యంలో తల్లిపాల పట్ల తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.సెక్టార్ సూపర్వైజర్ రమ హాజరై మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపు ఇచ్చే పాలను ముర్రుపాలు అంటారని వాటిని త్రాగించడం ద్వారా బిడ్డకు నిరోధకశక్తి వెంటనే అందుతుందని తెలిపారు. ప్రతి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డల ఆప్యాయత పెరగడంతో పాటు ఆరోగ్యవంతమైన బిడ్డను తయారుచేసిన వారవుతారన పేర్కొన్నారు.బిడ్డకు ఆరు నెలలు పూర్తి అయ్యేంతవరకు ఎలాంటి పోతపాలు,సీసాపాలు ఇవ్వవద్దని ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే బాలామృతాన్ని బిడ్డకు తినిపించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ,అంగన్వాడీ టీచర్ గౌసియా, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు భాగ్య,అర్పి రజిత,ఆశ కార్యకర్త రమ,తల్లులు మౌనిక,సువార్త,అనూష,శ్రీలేఖ, అనిత,జ్యోతి, సుమలత,నాగజ్యోతి, సౌమ్య, వజ్రమ్మ, శోభ,రాజా తల్లులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version