పోషణ మాసం ఆరోగ్యం రక్షణే లక్ష్యం
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం టేకుమట్ల అంగన్వాడి కేంద్రంలో లో పోషణ మాసం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ..గర్భిణీ, బాలింతలు,పిల్లలు,కిషోర బాలికలతో పాటుగా ప్రతీ ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.తాజా పండ్లు,కూరగాయలు,పాలు తీసుకోవాలని,రక్త హీనత బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు. పుట్టిన బిడ్డకు 6 నెలల వయసు వచ్చేవరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని కోరారు.అలాగే పిల్లలకు బయటి జంక్ ఫుడ్ కొనివ్వకూడదని,వాటి వల్ల తరచూ అనారోగ్య బారిన పడి ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. పిల్లలు వయసుకు తగిన ఎదుగుదల ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం గర్భిణీ మహిళతో పోషణ మాసం ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణి,అంగన్వాడి టీచర్స్ వరలక్ష్మీ,సునీత,శ్రీవాణి,ఆయా పిల్లలు,గర్భిణీలు,బాలింతలు, తల్లి తండ్రులు పాల్గొన్నారు.