ఎస్టిపిపి ఫారెస్ట్ కాంటాక్ట్ కార్మికులపై ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి వేధింపులు
ఫారెస్ట్ అధికారిణిని వెంటనేబదిలి చేయాలని ధర్నా చేపట్టిన హెచ్ఎంఎస్ యూనియన్
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం ఎస్టిపిపి లో పని చేస్తున్న ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా వేధింపులకు గురవుతున్నారంటూ హెచ్ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు.ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి కార్మికులపై అసభ్య పదజాలంతో దూషణలు చేయడం,పనిలో అనవసర ఒత్తిడులు తీసుకురావడం,వర్షాలు పడితే పని బంద్ చేసి జీతాలు ఇవ్వకపోవడం,పనికి వచ్చినా మాస్టారు ఇవ్వకపోవడం వంటి చర్యలతో కార్మికులు తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు వాపోయారు.ప్రతి రోజు 200-300 మీటర్లు పని చేయాలంటూ భారం మోపుతూ,పని చేయలేని కార్మికులకు వార్నింగ్ లెటర్లు జారీ చేస్తు వేధించడంతో విసిగిపోయిన బాధిత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు.ఈ విషయానికి స్పందించిన సింగరేణి యాజమాన్యం తరఫున జిఎం నర్సింహారావు,డీజిఎం పర్సనల్ కిరణ్ బాబు,ఇతర అధికారులు ధర్నా ప్రదేశానికి వచ్చి కార్మికుల సమస్యలను పరిశీలించి,వాటిని పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు.ధర్నా అనంతరం జనరల్ మేనేజర్ నరసింహారావు కి మెమోరండం అందజేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ విక్రమ్ కుమార్,ఉపాధ్యక్షులు సాయికృష్ణ,చిప్పకుర్తి సంపత్, నవీన్,గోగు మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
