గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం

గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలి

డి ఎం హెచ్ ఓ అనిత

జైపూర్,నేటి ధాత్రి:

ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో,గ్రామీణ ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.అనిత అన్నారు.మంగళవారం ఆశా డే సందర్భంగా ఆమె జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.మాతా శిశు సంరక్షణ,టీకాల కార్యక్రమాలు,వ్యాధి నివారణ,ఇంటింటి ఫీవర్ సర్వే వివిధ అంశాలపై డాక్టర్ ముస్తఫా తో కలిసి ఆశా వర్కర్లకు అవగాహన కల్పించారు.100% గర్భిణీల నమోదు,టీకాలు ఇవ్వడం, మందుల నిలువలు,తదితర అంశాలను సమీక్షించారు.అనంతరం కేజిబివి పాఠశాలను సందర్శించి,విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.రోజువారి దినచర్యలో యోగా, మెడిటేషన్,శారీరక వ్యాయామం పాటించి శరీరాన్ని దృఢంగా మార్చుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version