అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు..

అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు

సామాజిక సామరస్యంలో యువత భాగ్య స్వాములు కావాలి

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

జైపూర్,నేటి ధాత్రి:

 

రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ ఇందారం లోని మహి ఫంక్షన్ హల్ లో అమరవీరుల త్యాగాలకు నివాళిగా బుధవారం జైపూర్ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం,ఓపెన్ హౌస్ కార్యక్రమం కు అంబర్ కిషోర్ ఝా,ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్ తో కలిసి ఓపెన్ హౌస్,రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. విద్యార్థినీ,విద్యార్థులకు ప్రజా రక్షణ,భద్రత సంబందించిన పోలీసు చట్టాల గురించి, పోలీసు విధులపై,షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, కమ్యూనికేషన్ సిస్టం గురించి ఫింగర్ ప్రింట్ డివైస్ ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్,డాగ్ స్క్వాడ్,ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాలు స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్,ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు సైబర్ నేరాల గురించి పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి,షీటీమ్,భరోసా, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్,తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.పలు ప్రైవేట్‌ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల విద్యార్ధిని, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని ఈకార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ…విధి నిర్వర్తనలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని,వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ చేసేటువంటి సేవా కార్యక్రమాలకు ప్రజలు, యువత సహకరించినప్పుడు పోలీస్ వారి ఉత్సాహం, విశ్వాసం రెట్టింపు అవుతుందన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మారుమూల ప్రాంతంలను పోలీస్ వారు సందర్శించడం,ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడం ఒక పోలీస్ శాఖ తోనే సాధ్యం అవుతుంది తెలిపారు. ఎంతోమంది అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని దేశ రాష్ట్ర అభివృద్ధిలో, సామాజిక సామరస్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని,సంఘవిద్రోక శక్తులు దేశంపై గాని రాష్ట్రం పై దాడీలకు పాల్పడినప్పుడు ఐక్యమత్యంగా ఉండి రక్షించుకోవచ్చు అన్నారు. రాష్ట్ర,దేశ రక్షణ కోసం పోలీస్, ఇతర సెంట్రల్ అర్ముడ్ ఫోర్స్ లలో ఉద్యోగాలను సాధించి రాష్ట్ర దేశ రక్షణ కొరకు దోహదపడటం, సహకరించడం చేయాలనీ కోరారు.రక్తదానం ప్రాణధానంతో సమానమని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా ప్రజల అత్యవసర పరిస్థితి ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి,తల సేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్త దాన శిబిరం లు ఓపెన్ హౌస్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇలాంటి సమయంలో మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో ఉన్న వారికీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
స్నిఫర్ డాగ్స్ తమ ప్రతిభతో ఆకట్టుకోగా,విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంపు,పోలీస్ వ్యవస్థపై సానుకూల దృక్పథం కలిగించే లక్ష్యంతో కమీషనరేట్ పోలీస్ చేపట్టిన ఈ ఓపెన్ హౌస్ విద్యార్థులను ఎంతగానో ఉత్సాహపరిచిందని అన్నారు.
ఈకార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్,శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్,చెన్నూర్ ఇన్స్పెక్టర్ దేవేందర్,చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్,మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.నరేష్, జైపూర్ ఎస్సై శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, భీమారం ఎస్సై లక్ష్మి ప్రసన్న,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version