ఉపాధి హామీ పథకంలో ఇంకుడు గుంతల నిర్మాణం
ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనవేన కొమురయ్య ఇంటి వద్ద శుక్రవారం ఇంకుడు గుంత నిర్మాణం ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ చేపట్టారు.వారు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు తెలిపారు.ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం వల్ల వర్షపు నీటిని సంగ్రహించడం ద్వారా భూగర్భ జలాలను పునర్దించడానికి సహాయపడుతుంది.గ్రామీణ ప్రాంతాల్లో జీవజల పునరుద్ధరణతో ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని అన్నారు.ఈకార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఏపీవో వెంకటేశ్వరరావు,పంచాయతీ కార్యదర్శి సురేష్,టెక్నికల్ అసిస్టెంట్ శిరీష,ఫీల్డ్ అసిస్టెంట్ సువర్ణ,కాంగ్రెస్ నాయకులు సుమన్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.